Home

»

Latest News

ఒకవేళ బాహుబలి-2 రిజల్ట్ తీరుమారైతే..!

Dec 20, 2016 12:12PM

తన ఇన్నేళ్ల కెరీర్‌లో రాజమౌళి బ్లాక్ బస్టర్లు తీయడం తప్ప ఒక్క ఫ్లాప్ కొట్టిన సందర్భం లేదు. బాహుబలి మొదటి భాగం ఎన్ని సెన్సేషన్స్ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. భారతదేశం మొత్తం "కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు "లాంటి అనేక ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలని బాహుబలి-2 కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తొంది. ఇప్పటికే బాహుబలి-2 ట్రేడ్ పండితులను సైతం నివ్వెరపరిచే బిజినెస్ చేస్తోంది. బాహుబలిని మించి రెండో పార్ట్ బాక్సాఫీస్ పరంగా కూడా రికార్డు బద్దలుకొడుతుందని ఆశిస్తున్నారు. ఇది జరగదు..జరగకూడదనే అనుకుందాం.. అయితే ఒకవేళ బాహుబలి-2 ఫ్లాప్ అయితే గనుక పరిస్థితులు ఎలా ఉండవచ్చు. ఒకసారి విశ్లేషిద్దాం..

* ఒకప్పుడు..ఇప్పుడు రాజమౌళిని ఒక లెజండరీ దర్శకుడిగా కొనియాడిన వాళ్లే తను చేసిన తప్పులను వెతకడం మొదలుపెడతారు. అసలు ఆయనకు అంత సీన్ ఉందా అనే వాళ్లు లేకపోలేరు.

* అసలు మంచి రచయితలు, మంచి టెక్నీషియన్స్ లేకపోయుంటే రాజమౌళి అంత గొప్ప సినిమాలు చేసేవాడా..? అన్నా అనొచ్చు.

* అసలు తెలుగు సినిమాను ప్రపంచానికి పరిచయం చేసిందే రాజమౌళి..ఇప్పుడు వందకోట్లు అంటే పెద్ద విశేషం కాదు అనే పరిస్థితికి వచ్చింది అంటే కారణం రాజమౌళి. కానీ బాహుబలి-2 రిజల్ట్ తీరుమారైతే తెలుగు సినిమా మార్కెట్ ఎంటో కనీసం ఊహించుకోలేం. డిస్ట్రిబ్యూటర్లు పెద్ద మొత్తంలో డబ్బులు ఇన్వెస్ట్ చేయడానికి జంకొచ్చు.

* పెద్ద నిర్మాతలు , భారీ బడ్జెట్‌ సినిమాల జోలికి వెళ్లకపోవచ్చు. అసలు రాజమౌళి భారీ బడ్జెట్‌తో తీద్దామనుకున్న తన డ్రీమ్ ప్రాజెక్ట్ మహాభారతం ఇప్పట్లో ఉండే ప్రసక్తి లేకపోవచ్చు. అసలు ఇది ఎప్పటికీ జరగకపోవచ్చు.

* ఎప్పుడు..ఎక్కడ తెలుగువాళ్లు  తప్పుచేస్తారా.. వాళ్లని ఏకీపారేద్దాం అనుకునే పక్క రాష్ట్ర మీడియా ఈ సదావకాశాన్ని పూర్తిగా సద్వినియోగపరుచుకోవచ్చు. ఈ సినిమా చేయడానికా ఇంత టైం తీసుకున్నాడు అని కథల మీద కథలు రాయొచ్చు. 

* ఇవన్నీ పక్కకుపెడితే ఒకటి మాత్రం వాస్తవం రాజమౌళి హిట్టు కొట్టినా..ఫ్లాప్ తీసినా హైదరాబాద్ నుంచి ముంబై వరకు అందరు హీరోలు ఈ అగ్రదర్శకుడితో జట్టుకట్టడానికి ఎప్పటికీ క్యూలో ఉంటారు. 

ఇది సరదా కోసం చేసింది..ఎవరి మనోభావాలను కించపరచడానికి చేసింది కాదు. బాహుబలి-2 హిట్టయ్యి తెలుగు వారందరికీ గర్వకారణంగా నిలవాలని కోరుకుందాం.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com