తెలుగు రాష్ట్రాల సత్తా చూపించిన బాహుబలి
on Jul 21, 2015
తెలుగు సినిమా ఇండస్ట్రీకి తెలుగు సినీ ప్రేక్షకుల సత్తా తెలిసొచ్చేలా చేసింది బాహుబలి. ఓవర్సీస్, కర్ణాటక, ఇతర రాష్ట్రాలతో సంబంధం లేకుండా సరైన సినిమా పడితే కేవలం మన తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 100 కోట్ల కలెక్షన్లు రాబట్టడం అంతా కష్టమేమి కాదని నిరూపించబోతుంది బాహుబలి.
బాలీవుడ్ లాగే టాలీవుడ్ లో కూడా త్వరలో మనం 100 కోట్ల రికార్డ్ లను మన రాష్ట్రాలలోనే ఎక్కువగా వినే అవకాశం వుంది. దానికి నిదర్శనం బాహుబలి టోటల్ రన్ లో కేవలం మన రాష్ట్రాలలో 100 కోట్లు రాబట్టబోతుంది. నైజాం నుంచి 35-40 కోట్లు వచ్చే అవకాశం వుండగా, ఆంధ్రా నుంచి 40-45 కోట్లు, సీడెడ్ నుంచి 20 కోట్లు వచ్చే అవకాశం వుంది.
బాలీవుడ్ లో సాధారణ కంటెంట్ వున్న సినిమానే 100 కోట్ల గ్రాస్ ని ఈజీగా కలెక్ట్ చేస్తోంది. అలాంటి సినిమాలని వారు సూపర్ హిట్ లుగా అనౌన్స్ చేస్తుంటారు. అచ్చం ఇలాగే తెలుగు ఇండస్ట్రీకి కూడా త్వరలో మంచి రోజులు రాబోతున్నాయి. కానీ అదంతా మన దర్శక దిగ్గజాల చేతుల్లోనే వుంది. వారు చేయాల్సిందల్లా తెలుగు అభిమానులకు కొత్తదనం, మంచి కథ విలువలు, క్వాలిటీ ప్రొడక్షన్ వాల్యూస్ వున్న సినిమాలను అందించడమే.