స్పీల్బర్గ్, జాన్ విలియమ్స్ జోడీ 10 గ్రేటెస్ట్ మూవీస్
on Aug 9, 2020
సినిమా హిస్టరీలో సుదీర్ఘ కాలం పనిచేసే, లేదా ఎక్కువ సినిమాలకు పనిచేసే జోడీలు అరుదుగా కనిపిస్తుంటారు. అలాంటి వారిలో మరింత అరుదైన జోడీ స్టీవెన్ స్పీల్బర్గ్, జాన్ విలియమ్స్. స్టీవెన్ స్పీల్బర్గ్ గురించి ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులకు తెలుసు. హాలీవుడ్ గ్రెటెస్ట్ డైరెక్టర్స్‌లో ఆయన ఒకరు. ఇక.. జాన్ విలియమ్స్ టాప్ మోస్ట్ మ్యూజిక్ కంపోజర్స్‌లో ఒకరు. 1974లో 'ద సుగర్ల్యాండ్ ఎక్స్‌ప్రెస్' మూవీతో మొదలైన వారి కలయిక 2017లో వచ్చిన 'ద పోస్ట్'' దాకా కొనసాగుతూ వచ్చింది. తమ కెరీర్లో అనేక అవార్డులను సొంతం చేసుకున్న ఆ ఇద్దరూ కలిసి కొన్ని ముఖ్యమైన, ప్రభావవంతమైన చిత్రాలకు పనిచేశారు. వాటిలో జురాసిక్ పార్క్, రైడర్స్ ఆఫ్ ద లాస్ట్ ఆర్క్, సేవింగ్ ప్రైవేట్ ర్యాన్, క్యాచ్ మి ఇఫ్ యు కెన్ వంటి క్లాసిక్స్ ఉన్నాయి.
స్టీవెన్ స్పీల్బర్గ్ తీసిన దాదాపు 30 భిన్నమైన ప్రాజెక్టులకు లెజెండరీ మ్యూజిక్‌ను అందించారు జాన్ విలియమ్స్. మ్యూజిక్‌ను కంపోజ్ చేయడంలో ఆయన అప్రోచ్ చాలా భిన్నంగా ఉంటుందనే పేరు తెచ్చుకున్నారు. 'ఇ.టి', 'క్లోజ్ ఎన్కౌంటర్స్ ఆప్ ద థర్డ్ కైండ్' లాంటి సైన్స్ ఫిక్షన్ అడ్వెంచర్స్, 'షిండ్లర్స్ లిస్ట్', 'లింకన్' లాంటి పీరియడ్ డ్రామాలు దాకా భిన్న జానర్లకు ఆయన అద్భుతమైన సంగీతాన్ని అందించారు.
వాటన్నింటిలో జాన్ విలియమ్స్ ద బెస్ట్ మ్యూజిక్ ఇచ్చిన పది స్టీవెన్ స్పీల్బర్గ్ మూవీస్...
1. జాస్ (1975)
2. క్లోజ్ ఎన్కౌంటర్స్ ఆఫ్ ద థర్డ్ కైండ్ (1977)
3. రైడర్స్ ఆఫ్ ద లాస్ట్ ఆర్క్ (1981)
4. ఇ.టి. ద ఎక్స్ట్రా-టెర్రెస్ట్రియల్ (1982)
5. జురాసిక్ పార్క్ (1993)
6. షిండ్లర్స్ లిస్ట్ (1993)
7. సేవింగ్ ప్రైవేట్ ర్యాన్ (1998)
8. క్యాచ్ మి ఇఫ్ యు కెన్ (2002)
9. వార్ ఆఫ్ ది వరల్డ్స్ (2005)
10. లింకన్ (2012)
Also Read