అందం, అభినయం భగవంతుడు మీకిచ్చిన వరం.. మహేశ్‌కు చిరు ప్రశంస!
on Aug 9, 2020

ఆగస్ట్ 9 మహేశ్ బర్త్‌డే సందర్భంగా అభిమానుల నుంచే కాకుండా ఫిల్మ్ ఫ్రాటర్నిటీ నుంచి విషెస్ వెల్లువెత్తుతున్నాయి. అనేకమంది ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, భవిష్యత్తులో మరిన్ని శిఖరాలు అందుకోవాలనే ఆకాంక్షను వ్యక్తపరుస్తున్నారు. వీరందరిలో మెగాస్టార్ చిరంజీవి నుంచి మహేశ్ అందుకున్న శుభాకాంక్షలు ప్రత్యేకంగా నిలిచాయి. అవును. సూపర్‌స్టార్ బర్త్‌డేకి మెగాస్టార్ విషెస్ తెలియజేశారు.
తన సోషల్ మీడియా హ్యాండిల్ ద్వారా "అందం, అభినయం భగవంతుడు మీకిచ్చిన వరం. మరెన్నో మరిచిపోలేని పాత్రలు చేయాలనీ, మీ కలలన్ని నెరవేరాలని కోరుకుంటూ, Happy Birthday @urstrulyMahesh.. May you have a Wonderful year ahead!" అని ట్వీట్ చేశారు చిరంజీవి.

మొదట్నుంచీ ఆ ఇద్దరి మధ్య సన్నిహిత అనుబంధం ఉంటూ వస్తోంది. 2020 జనవరిలో 'సరిలేరు నీకెవ్వరు' మూవీ ప్రి రిలీజ్ ఈవెంట్‌కు చీఫ్ గెస్ట్‌గా వచ్చి మహేశ్‌ను చిరంజీవి ఆశీర్వదించిన విషయం తెలిసిందే. ఇప్పుడు మరోసారి మహశ్‌పై తనకున్న వాత్సల్యాన్నీ, అనుబంధాన్నీ చాటుకున్నారు చిరంజీవి. అందులో "అందం, అభినయం భగవంతుడు మీకిచ్చిన వరం" అనే మాటలు ఆయన నుంచి రావడంతో అందరూ హర్షిస్తున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



