రూ. 45 లక్షల మంగళసూత్రంలో మార్పులు చేయించిన ఐశ్వర్య!
on Aug 9, 2020

హిందూ సంప్రదాయంలో వివాహ తంతులో మంగళసూత్రానికి అత్యంత ప్రాముఖ్యం ఉంటుంది. మంగళసూత్ర ధారణతోటే వివాహం పూర్తయినట్లుగా భావిస్తారు. మాజీ ప్రపంచసుందరి ఐశ్వర్యా రాయ్ గురు చిత్రంలో తన సహనటుడైన అభిషేక్ బచ్చన్‌ను వివాహం చేసుకున్న కొన్ని సంవత్సరాల తర్వాత తన రెండు పొరల మంగళసూత్రంలో మార్పులు చేయించారు.
అభిషేక్‌తో 2007 ఏప్రిల్ 20న వివాహ ప్రమాణాల తతంగం పూర్తయ్యాక తన పేరుకు బచ్చన్ పేరును జోడించారు ఐశ్వర్య. నాలుగేళ్ల తర్వాత 2011 నవంబర్ 16న తమ అందమైన జీవితాల్లోకి ఆరాధ్య అనే ఒక చిన్నారిని స్వాగతించి, తల్లిదండ్రులుగా మారారు. ఐశ్వర్యకు నిండుగా వజ్రాలు పొదిగిన మంగళసూత్రాన్ని కానుకగా ఇచ్చాడు అభిషేక్. దాని విలువ అక్షరాలా రూ. 45 లక్షలు! డైమండ్ పెండెంట్‌తో పొడవుగా, రెండు పొరల సూత్రంతో ఐశ్వర్య మెడకు అది అందంగా అమరిపోయింది.
అయితే కొన్నేళ్ల తర్వాత ఆ మంగళసూత్రాన్ని ఐశ్వర్య సవరించారు. డైమండ్ లాకెట్‌ను అలాగే ఉంచేసి, రెండు పొరలను ఒక పొరగా మార్పించి, పొడవును కూడా తగ్గించేశారు. ఆరాధ్య పుట్టాక మంగళసూత్రం భారీగా ఉండి పాపకు ఇబ్బంది కలిగించకుండా ఉండాలనే ఉద్దేశంతోటే ఆమె దానిలో మార్పులు చేయించిందంటారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



