సమంత మహేష్ గురించిన ట్వీట్ డిలీట్ చేసింది..!
on May 23, 2016
సమంత ట్విట్టర్లో పోస్ట్ చేసేముందు పెద్దగా ఆలోచించదు. తీరా పోస్ట్ చేసేసిన తర్వాత నష్ట నివారణ చర్యగా ట్వీట్లు డిలీట్ చేస్తుంటుంది. గతంలో మహేష్ నేనొక్కడినే పోస్టర్ పై ముందు వెనుకలు ఆలోచించకుండా ట్వీట్ చేసి మహేష్ ఫ్యాన్స్ తో ఘోరంగా తిట్లు తినాల్సి వచ్చింది. ఆ దెబ్బకు చాలా కాలం పాటు ట్విట్టర్ ను వాడను కూడా లేదు ఈ భామ. తాజాగా తను నటించిన బ్రహ్మోత్సవానికి సంబంధించి మరో ట్వీట్ ను డిలీట్ చేసింది. సినిమా విడుదలకు ముందునుంచే బాలాత్రిపురమణి సాంగ్ తన ఫేవరెట్ అని చెబుతూ వస్తున్న సమంత, తన ట్విట్టర్లో కూడా అలాగే పోస్ట్ చేసింది. అయితే సినిమా రిలీజైన తర్వాత ఫ్లాప్ టాక్ రావడం, ఆ పాటలోని స్టెప్ నవ్వుల పాలు కావడంతో, తన ట్వీట్ ను డిలీట్ చేసేసింది స్యామ్. పైగా సూపర్ స్టార్ ఎట్ హిజ్ బెస్ట్ ఎవర్ అని కూడా ట్వీట్ లో ఉండటంతో, దాన్ని ఫ్యాన్స్ ఒకవేళ వెటకారంగా అర్ధం చేసుకుంటే, ప్రాబ్లెమ్స్ తప్పవని భావించిందో ఏమో గానీ, ఆ ట్వీట్ ను తీసేసింది. ఈ వేసవిలో సమంతవి నాలుగు సినిమాలు రిలీజ్ కాగా, వాటిలో తేరీ, 24 మంచి విజయాన్ని సాధించాయి. బ్రహ్మోత్సవం మాత్రం ఆమె కెరీర్లోనే భారీ డిజాస్టర్ గా నిలిచింది. ఇక ఇప్పుడు సమంత ఆశలన్నీ నితిన్ తో రాబోయే అ..ఆ సినిమాపైనే ఉన్నాయి.