నందిని రెడ్డి మళ్ళీ కాపీ కొట్టేసిందా..?
on May 7, 2015

టాలీవుడ్ లో గత కొంతకాలంగా సద్దుమణిగిన కథల కాపీ గోల మళ్ళీ మొదలైంది. ప్రస్తుతం టాప్ పొజిషన్ అనుభవిస్తున్న డైరెక్టర్లంతా గతంలో ఈ కాపీ గోలను ఎదుర్కున్నవారే. వారిలో కొంతమంది కథలకు పరిహారం చెల్లించగా, మరికొంతమందిపై ఆరోపణలు నిరూపితం కాలేకపోయాయి. అయితే తాజాగా హనుమాన్ అనే కొత్త దర్శకుడు మంచు విష్ణుకు ఓ స్టొరీ వినిపించి గ్రీన్ సిగ్నల్ సాధించాడు. ఈ సినిమా త్వరలో సెట్స్ పైకి వెళ్ళాల్సివుండగా, సడన్ ఇతను రచయితల సంఘంలో తన కథను నందిని రెడ్డి అనే దర్శకురాలు కొట్టేసి, సినిమా తీయడానికి రెడీ అవుతుందని ఫిర్యాదు చేశాడు. ఇక్కడ మరో విశేషమేమిటంటే నందిని రెడ్డి సినిమాను నిర్మించే నిర్మాతకు ఇతను గతంలోనే ఈ కథను వినిపించాడట. అయితే నందిని రెడ్డి మాత్రం ఈ కథతో హనుమాన్ కి ఎలాంటి సంబంధం లేదని అంటున్నారు. మొత్తానికి ఇప్పుడు ఈ విషయం దాసరి దగ్గరకి వెళ్ళిందట. అలాగే నందిని రెడ్డి గతంలో తన జబర్దస్త్’ సినిమాని ఓ హిందీ సినిమాని మక్కీకి మక్కీ కాపీకొట్టిన విషయం ఇండస్ట్రీ వర్గాలకు తెలిసిందే. సదరు సినిమా నిర్మాత కేసు వేయడంతో భారీగా పరిహారం చెల్లించారని కూడా అన్నారు. ఇప్పుడు మళ్ళీ ఆమె మరోసారి ‘కాపీ’ ఉదంతంతో వార్తల్లోకి వచ్చారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



