చిరు 151 "ఉయ్యాలవాడ" కాదా..?
on Jul 17, 2017
.jpg)
తొమ్మిదేళ్ల విరామం తర్వాత తెలుగు తెరకు రీఎంట్రి ఇచ్చినా తనలో వాడివేడి ఏమాత్రం తగ్గలేదని నిరూపించారు మెగాస్టార్ చిరంజీవి. ఆయన నటించిన ఖైదీ నెం.150 రికార్డులను తిరగరాసింది..దీంతో చిరు 151వ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అందుకు తగ్గట్టుగా సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో రాయలసీమకు చెందిన స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితగాథను తెరకెక్కించేందుకు చిరు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు.. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పూర్తవ్వగా..నటీనటుల ఎంపిక జరుగుతోంది..వీలైనంత త్వరగా సినిమాను సెట్స్ మీదకు తీసుకువెళ్లాలని సురేందర్ రెడ్డి భావిస్తున్నాడు.
సరిగ్గా ఇలాంటి టైంలో ఈ మూవీకి సంబంధించిన న్యూస్ ఒకటి ఫిలింనగర్ సర్కిల్స్‌లో జోరుగా చక్కర్లు కొడుతోంది. సినిమాకు ముందు నుంచి అనుకుంటున్న ఉయ్యాలవాడ నరసింహారెడ్డి టైటిల్‌కు బదులు మహావీర అనే టైటిల్‌ను పెట్టబోతున్నరన్నది ఆ వార్త సారాంశం. భారీ బడ్జెట్‌తో.. తెలుగుతో సహా ఇతర భాషల్లో సినిమాను రూపొందిస్తుండటంతో అన్ని భాషలకు సెట్ అయ్యేలా ఒకే టైటిల్ పెడితే బాగుంటుందనే ఆలోచనలో చిత్ర యూనిట్ ఉందంటున్నారు సినీ జనాలు.. అయితే ఇప్పటికే ఉయ్యాలవాడ జనాల్లోకి బాగా చొచ్చుకెళ్లిపోయింది. మరి ఇలాంటి సమయంలో టైటిల్ మారిస్తే అభిమానుల నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో వేచి చూడాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



