సెకండ్ లిస్ట్‌లో టాలీవుడ్ మోస్ట్ వాంటేడ్ హీరో..?
on Jul 17, 2017

టాలీవుడ్‌లో డ్రగ్స్ రాకెట్ రేపిన కలకలం అంతా ఇంతా కాదు.. డ్రగ్ డీలర్ కెల్విన్, జీశాన్‌ల ఫోన్ల డేటాతో పాటు మరికొందరి కాల్ డేటాని విశ్లేషించిన అధికారులు మొదటి విడతగా 12 మంది ప్రముఖులకు నోటీసులు జారీ చేశారు. ఇక ఎప్పటి నుంచో డ్రగ్స్ వాడటం, సరఫరా చేస్తున్న కొందరు బడా పారిశ్రామిక వేత్తలు, రాజకీయ నాయకులు, వారి పిల్లల గుట్టును ఆధారాలతో సహా సేకరించింది. ఈ నేపథ్యంలో రెండో విడతలో పెద్ద బాంబు పేల్చేందుకు అకున్ సబర్వాల్ బృందం రెడీ అవుతోందని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈసారి పెద్ద చేపకు నోటీసులు ఇవ్వబోతోందట. అలనాటి అగ్రకథానాయకుని వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన ఆ యువనటుడు ప్రస్తుతం స్టార్ హీరోగా చలామణి అవుతున్నాడు. అన్నట్లు ఆ హీరో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రెండు సినిమాల్లో నటించాడని ఫిలింనగర్ టాక్.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



