టాలీవుడ్ "మత్తు" వదిలిస్తోన్న భరత్ రాజు..?
on Jul 15, 2017

తెలుగు చిత్ర పరిశ్రమలో డ్రగ్స్ రాకెట్ సృష్టిస్తున్న ప్రకంపనల ధాటికి ఎన్నో ఏళ్లుగా తెర వెనుక జరుగుతున్న చీకటి వ్యవహారాలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి. గత కొంతకాలంగా టాలీవుడ్‌లో డ్రగ్స్ వినియోగం జరుగుతున్నప్పటికీ అది బయటపడకుండా సినీ పెద్దలు పకడ్బంధీగా వ్యవహరించారని గుసగుసలు వినిపిస్తున్నాయి..ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం డ్రగ్స్ రాకెట్‌పై సీరియస్ అవ్వడం..వెంటనే అకున్ సబర్వాల్ నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని రంగంలోకి దించడం జరిగిపోయింది..దర్యాప్తులో భాగంగా 12 మంది సినీ ప్రముఖులకు సిట్ నోటీసులు జారీ చేసింది. అయితే ఇంత త్వరగా సిట్‌కు ఆధారాలు లభించడానికి..ఈ డొంకంతా కదలడానికి కారణం ఒక చనిపోయిన వ్యక్తి. అవును సరిగ్గా కొద్ది రోజుల కిందట రవితేజ సోదరుడు భరత్ రోడ్డు ప్రమాదంలో మరణించాడు..యాక్సిడెంట్ స్పాట్‌లో దొరికిన భరత్ మొబైల్‌లోని కాల్‌డేటా, వాట్సాప్ మేసేజ్‌లను పరిశీలించిన పోలీసులకు డ్రగ్స్ సప్లయర్స్, డ్రగ్స్ వాడుతున్న సినీ ప్రముఖుల వివరాలు లభించాయని అందుకే అంత త్వరగా నోటీసులు ఇవ్వగలిగారని ఫిలింనగర్‌లో చర్చించుకుంటున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



