ఎందుకయ్యా అభిమానుల్లారా ఈ గొడవలు ?
on Jul 5, 2016
ఈ సోషల్ మీడియా వల్ల ఉపయోగం ఏమిటో తెలియదు కానీ.. గొడవలు, లేనిపోని ఇబ్బందులే ఎక్కువగా కనిపిస్తున్నాయి. "సర్దార్ గబ్బర్ సింగ్" విడుదల సమయంలో పవన్ ఇమేజ్ ను డీగ్రేడ్ చేయడానికి మహేష్ అభిమానులు ట్విట్టర్ ను వాడుకొంటే.. "బ్రహ్మోత్సవం" విడుదలయ్యాక ఆ సినిమా డిజాస్టర్ టాక్ ను స్ప్రెడ్ చేయడానికి పవన్ ఫ్యాన్స్ కూడా అదే ప్లాట్ ఫార్మ్ ను వినియోగించుకొన్నారు.
తాజాగా.. "సైమా అవార్డ్" వేడుకల్లో "శ్రీమంతుడు" చిత్రానికిగానూ "బెస్ట్ యాక్టర్" అవార్డ్ అందుకొన్న మహేష్ వేడుకకు హాజరుకాకపోవడంతో.. "Received My Best Actor Trophy" అని ట్వీటాడు. ఇప్పుడు ఈ ట్వీట్ ను పట్టుకొని పవన్ అభిమానులు ఒక రేంజ్ లో ఆడూకొంటున్నారు. "ఆదేమైనా వరల్డ్ కప్పా, ట్రోఫీ" అంటున్నాడు అంటూ పవన్ అభిమానులు ట్విట్టర్ లో ఆడుకోవడం మొదలుపెట్టారు. వెంటనే సీన్ లోకి వచ్చిన మహేష్ అభిమానులు "ఆస్కార్ ట్రోఫీ" అనే పదం ఉందని కూడా తెలియని మందబుద్ధ్ది అభిమానులకు మహేష్ విలువ ఏం తెలుస్తుంది అంటూ ట్వీటడం స్టార్ట్ చేశారు. ఈ గొడవ నిన్న రాత్రిదాకా రచ్చ చేసి ఇక తారాస్థాయికి చేరుతుందనుకొంటున్న సమయంలో ఎవరికివారు సైలెంట్ అయిపోయారు. ఒక పక్క మహేష్ బాబు తన ఫ్యామిలీతో, మరోపక్క పవన్ విదేశాల్లో ఎంజాయ్ చేస్తుంటే.. వాళ్ళ మీద అభిమానం అనే మత్తులో పనికిరాని పైత్యంతో కొట్టుకొంటున్నారు వాళ్ళ సో కాల్డ్ ఫ్యాన్స్!