పవర్ స్టార్ సినిమా టైటిల్ అదేనా?
on Aug 16, 2017
ఓ వైపు అభిమానులేమో... సినిమాపై అంచనాలు పెంచేసుకుంటున్నారు. ఇవేమీ పట్టించుకోకుండా పవర్ స్టారేమో... కూల్ గా సినిమా చేసుకుంటూ పోతున్నాడు. పైగా ఈ సినిమాకు దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ అవ్వడంతో పవర్ స్టార్ అభిమానుల దృష్టి మొత్తం ఏకంగా ‘బాహుబలి’ రికార్డులపైనే ఉంది. సినిమా బాగుండాలే కానీ... పవర్ స్టార్ స్టామినాకు అదేం పెద్ద పని కాదు. అది వేరే విషయం.
ప్రస్తుతం ఈ సినిమా విషయంలో హాట్ టాపిక్ ఏంటంటే.. ‘టైటిల్’. ఈ సినిమాకు ‘గోకుల కృష్ణుడు’ అనే టైటిల్ ఫిక్స్ చేశారని మొన్నటిదాకా ఓ వార్త హల్ చల్ చేసింది. ఆ తర్వాత ‘ఇంజనీర్ బాబు’ అనే టైటిల్ వినిపించింది. ఈ రెండూ కాదూ.. ‘దేవుడే దిగి వచ్చినా’అనే టైటిల్ ని ఈ సినిమాకు ఖరారు చేసేశారు అని ఫిలిం నగర్ వర్గాలు స్పష్టం చేసేశాయి కూడా. అయితే... ఇవేం నిజం కాదని ఇప్పుడు కొత్త టైటిల్ ప్రచారంలోకొచ్చింది. అదే.. ‘రాజు వొచ్చినాడు’.
ఈ సినిమాకు ‘రాజు వొచ్చినాడు’ అనే టైటిల్ నిర్ణయించినట్లు విశ్వసనీయ సమాచారం. మరి ఇదైనా నిజమేనా? అనే విషయం తెలియలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే. పవర్ స్టార్ పుట్టిన రోజు సెప్టెంబర్ 2. అదే రోజున ఈ చిత్రం ఫస్ట్ లుక్ ని టైటిల్ తో సహా విడుదల చేయాలని చిత్ర నిర్మాత రాధాకృష్ణ నిశ్చయించారు. ఆ రోజు అసలు విషయం తేలిపోతుంది. ఇక అప్పట్నుంచి మెగా ఫ్యాన్స్ కి పండగే పండగ. కీర్తి సురేశ్, అను ఇమ్మానియేట్ కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రానికి తమిళ స్టార్ సంగీత దర్శకుడు అనిరుథ్ స్వరాలనందిస్తున్నాడు.
Also Read