Facebook Twitter
నేను - నా నీడ

నేను - నా నీడ

- సి. భవానీ

 



పుట్టింది మొదలు ప్రయాణం మరణం వైపే
ఈ నిజం తెలిసినా
చావటం అంటే ఎవరికీ ఇష్టముంటుంది ?

వాస్తవం రుచిగా ఉండదు
మరణాలు, అంత్య క్రియలు బాల్యం లో పజిల్స్
కాల సూత్రం దారి పొడుగునా
వేలాడే మృత్యువుని చూసినపుడు
పారిపోవాలనే విఫలయత్నం
యవ్వన కధల్లో దాని ఊసుండదు
వ్రుద్దాప్యం గంట మోగేదాకాఅది గుర్తురాదు
ఒక అనారోగ్య అనుభవం
మిగిల్చేది అదే స్పృహ!

ఎవరికైనా
పుట్టకముందు 'నేను' ఎక్కడ?
పుట్టాక అంతా ' నేనే' కదా!
ముందు వెనక ఒక తరానికి తప్ప
నామరూపాలు లేని జీవితంలో
నిరంతరం నీడలా వెంట నడుస్తూ
'నేను'లేనప్పుడు కూడా ఉండేది నీడే!