Facebook Twitter
తిమింగలం - శారదా అశోకవర్దన్

తిమింగలం


- శారదా అశోకవర్దన్

 

మట్టి ప్రమిదలో నూనెపోసి

చుట్టూ దీపాలు వెలిగించకపోయినా ఫరవాలేదు

విద్యుత్ దీపాలు తోరణాల్లా వెలిగించి

వినోదాలు చేసుకోకపోయినా నష్టం లేదు

మనసు నిండా మమతా దీపాలు వెలిగించుకుంటే చాలు

చీకటి ఊహలు ఛిద్రమైపోతాయి

సూర్యుడి బాణాలకి విచ్చుకున్న

పత్తికాయల్లా పగిలిపోతాయి

పాపిగా మారి దుర్మార్గాన్ని పెంచుకుంటే

అంతా పోగొట్టుకున్నట్టే

గుట్టలుగా పెరిగిన పాపాల తుట్టలు

నిన్నే కాటేస్తాయి!

పచ్చని పంట చేలలో మంటలు రేపి

మరుభూములుగా మార్చకు

బతుకులకు చితులు పేర్చి

ఏదో సాధించానని అనుకోను!

చంపుతూ బతకాలన్న బ్రాంతిని వదులుకో

నిజం నీ బ్రాంతిని తిమింగలమై చీలుస్తూ

నిన్నే మింగేస్తుందొక రోజు

దేముదివై నిలిచిపోవాలనే

పిచ్చి కోరిక మానుకో

మనిషితనాన్ని పెంచుతూ మనిషిలా బతకాలని కోరుకో!

తీపి చేదుల జీవితంలో - వట్టి తీపినే ఆరగించాలనుకోకు

చేదునే తీపిగా మార్చుకోవడం నేర్చుకో