Facebook Twitter
చీకటి

 హైకూలు


                                         
- డా. ఎ. రవీంద్రబాబు


చీకటి
పహరా కాస్తుంది
హృదయం
కొవ్వొత్తి కదా...
 
అక్షరాలు
నిద్రిస్తున్నాయి
మనుషులు ఉషాగానాన్ని
ఆలపించేదెప్పుడో....
    
ఎదురు చూపు
ఎడారి వాన
విచ్చిన మల్లెలు
నువ్వూ నేను

తలుపు తీస్తే
లక్ష రేకులు విచ్చుకుంటాయి
తలుపు మూస్తే
లక్ష రేణువులు ఉద్యమిస్తాయి

గడ్డిపూలు
అగరొత్తుల వాసన    
శిశిరానికి చివర
కురుస్తున్న హిమం

కలం కాంతికి
పక్షిపాట తెలుసు
పానుపు విరహం తెలుసు
ఎరుపెక్కిన చిగురూ తెలుసు

సరే.... పదా...
నడుద్దాం...
కాలానికి అటు ఇటు
భార్యాభర్తల్లా...