Facebook Twitter
నీ చూపు మాపైన ప్రసరించు సాయీ

నీ చూపు మాపైన ప్రసరించు సాయీ

- డాక్టర్. రాధాశ్రీ

 

నీ చూపు మాపైన ప్రసరించు సాయీ!
నీ రూపు మదినిల్పి నడిపించు సాయీ !!

మహారాష్ట్ర రాజ్యాన ఆషిరిడినగరాన
మేటిగా కొలువైన ఓ సాయిబాబా
కోటను కోట్లాది నిజభక్త వర్యుల
మదిలోన నెలవైన మా సాయి దేవా!

కోరగనే కోరికల తీర్చేటి స్వామీ
కోరకనె భాదలను తొలగించు స్వామీ
నీ చరణ సుమయుగము చూపించరాదా
నీ కరుణలో ఒలలాడించరాదా !

పాపాల కుపాల పడియున్న ప్రజలకు
చేయూత నందించి రక్షించు సాయీ
కలుషాత్ములను కూడా కరుణాత్ములను చేసి
లోకాన శోకాన్ని పోకార్చు సాయీ !!