Facebook Twitter
కడలి తల్లి

కడలి తల్లి

- మనోహర్

పోగతేలిన కన్నుల కాంతిలేక
కొసలు సాగిన కురులకు నునెలేక
మలిన మెరుగని ఎదకప్ప బట్టలేక
బిక్కవోయిన మోముతో, దిక్కులేక
తిరుగాడుతున్న ఓ చిట్టి తల్లి
ఏ తల్లి కడుపు పండిన పంటనీవు?
బెదరి చూచెడి నీ చూపు చదువలేక
మమత కోరెడు నీ మనసు నర యలేక
పట్టేడన్నము పెట్టి నీ బోజ్జనింపలేక
పదులు,వందలు,వేలుగా సాగిపోవు
ఈ మర మనుష్యుల జన్మలెందుకమ్మ?
ఎదుట కన్పించు చిన్నారి దేవత
నిన్ను గుర్తించలేక గుళ్ళో గంటకొట్టి
ముడుపు చెల్లించు మూర్ఖుల బూజు దులిపి
కళ్ళు తెరిపించ నెవరి తరము తల్లి
మేధపదు నెక్కి గుండెలు బండబారి
బ్రతుకు విలువలు దిగజారి పతనమైన
పాడు మనుష్యలమధ్య నీ వుండలేవు
రమ్ము,నా శీతల లహరుల నుయ్యాలలూతు
నా ప్రేమ సుడులలో నిన్ను పోడువుకొందు