Facebook Twitter
డబ్బు - వి. శ్రీనివాస్

డబ్బు


- వి. శ్రీనివాస్

 

 

ఆత్మ వుండడానికి మనిషినికాను

నేను-శాసించే నిర్జీవాన్ని

నిన్ను నడిపించే యంత్రాన్ని

ఏ అధికారానికీ నేను గులామ్ కాను

 

సృష్టికర్తతో సలాంకొట్టించుకునే నవాబును

మనిషి సృష్టించిన మత్తును నేను

నేను లేని చోటులేదు

నన్ను తలచని నాధుడు లేడు

 

అన్నింటిలో నేనే

ఆకలిలో నేనే

చీకటిలో నేనే- వెలుతురులో నేనే

నసులో నేనే-మాటలతో నేనే

 

నీలోనూ నేనే-

నాలోనూ నేనే-

నాలో ఈజగమంతా వుంది

వుండి తీరుతుంది.

 

నా పేరే ధనం.

నా పేరే డబ్బు.