Home » కథలు » దుంగరాజు కొంగరాజుFacebook Twitter Google
దుంగరాజు కొంగరాజు

దుంగరాజు కొంగరాజు

 


అనగనగా ఒక అడవిలో ఒక చెరువు ఉండేది. ఆ చెరువులో చాలా కప్పలుండేవి. అవన్నీ ఒకరోజున అనుకున్నాయి. "ఈ చెరువుకు ఒక రాజు ఉంటే ఎంత బాగుంటుంది?!" అని. అట్లా అనుకొని, అవన్నీ దేవుడిని ప్రార్థించాయి: "మాకో రాజుని ఇవ్వు దేవుడా" అని. "కప్పలన్నీ బాగా ఆడుకునేందుకు బాగుంటుంది కదా" అని, దేవుడు ఒక దుంగని చెరువులోకి విసిరేసి "మీ రాజు ఈయనే" అన్నాడు. 

కప్పలన్నీ దుంగరాజు మీదికి గెంతి, తైతక్కలాడాయి. దుంగరాజు కదల్లేదు; మెదల్లేదు. కప్పలన్నిటినీ చక్కగా ఆడుకోనిచ్చాడు.  అయితే దుంగరాజు వల్ల కప్పలకి సంతోషం కలగలేదు- " ఈ మహరాజు వట్టి మొద్దులా ఉన్నాడు- ఈయన ఒద్దు మనకు- చురుకుగా ఉండే రాజైతేనే బాగుంటుంది" అని కప్పలన్నీ మళ్ళీ దేవుణ్ణి వేడుకున్నాయి. "నిజంగానా?! చురుకైన రాజే కావాలా?" అడిగాడు దేవుడు. "ఔను స్వామీ!‌

 

ఇలా మొద్దులాగా పడి ఉండే రాజు బాలేదు" అన్నై కప్పలు. "సరే, అయితే!మీకు కావలసింది ఇదిగో- ఇలాంటి రాజే!" అని దేవుడు ఒక కొంగని చెరువులోకి వదిలాడు. ఈ కొంగరాజు చురుకుగా కప్పలమీద పడి ఒక్కొక్క కప్పనే తినటం మొదలు పెట్టాడు. చూస్తూండగానే చెరువులోని కప్పలన్నీ తరిగిపోయాయి. మిగిలిన కప్పలన్నీ చాలా దు:ఖించాయి- 'చక్కని దుంగరాజుని ఇస్తే ఎంచక్కా సంతోషించక, ఇట్లాంటి రాజుని కొని తెచ్చుకున్నామేమి?' అని . 

- కొత్తపల్లి.ఇన్ వారి సౌజన్యంతో

మీర్జాపురాన్ని విజయుడు అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. అతడు మంచి రాజే
Feb 15, 2018
పులులు చాలా ప్రమాదకరమైనవి. ప్రమాదకరమైన వాటితో ఆడుకునేవాళ్లను అజ్ఞానులే అనాలి. అయితే తెలివిలేకగానీ, అహంకారంతోటిగానీ
Feb 7, 2018
చాలా ఏళ్ళ క్రితం పశువులు, జంతువులు అన్నీ‌ అడవుల్లోనే పెరిగేవి. క్రూర జంతువులు వాటిని చంపేవి.
Jan 27, 2018
అనగనగా ఒక ఊరిలో ఒక రాజు ఉండేవాడు. అతనికి ఒకభార్య. వాళ్ళకు ఎన్నిరోజులైనా పిల్లలు కలుగలేదు.
Jan 25, 2018
మన దేశం జన్మనిచ్చిన అనేకమంది తత్వవేత్తలలో ఎన్నదగినవారు, ఆదిశంకరాచార్యులవారు.
Jan 20, 2018
అనగనగా ఓ అడవిలో తోడేలు ఒకటి ఉండేది. అమాయకంగా ఉండే జంతువులను నమ్మించి మోసం చేస్తుండేది అది.
Jan 18, 2018
చంద్రపురం న్యాయాధికారి శాంతన్న చాలా మంచివాడు, తెలివి తేటలు గలవాడున్నూ.
Jan 17, 2018
అనగనగా ఒక ఊళ్లో ఇద్దరు అన్నదమ్ములు ఉండేవాళ్ళు. వాళ్ళకొక అందమైన చెల్లెలు ఉండేది.
Jan 10, 2018
ఒక ఊరికి చివర్లో రైతు ఉండేవాడు. ఆయన ఇల్లును ఆనుకుని దట్టమైన అడవి ఉండేది. రైతు దగ్గర ఒక కోడిపుంజు ఉండేది.
Jan 6, 2018
అది ఒక పల్లెటూరు. ఆ ఊళ్లో అందరూ శాంతి సౌఖ్యాలతో, సమ భావంతో, కలిసి మెలిసి జీవించేవాళ్లు.
Jan 5, 2018
TeluguOne For Your Business
About TeluguOne