Home » కథలు » బలవంతుని గర్వభంగంFacebook Twitter Google
బలవంతుని గర్వభంగం

బలవంతుని గర్వభంగం

 


ఒకనాడు ఒక బలవంతుడు సోము దగ్గరకు వచ్చి ఇలా అన్నాడు. ’ప్రపంచంలో నువ్వు తెలివైన వాడివి, నేను బలమైన వాడిని. నా ఉద్దేశం ప్రకారం మనుషులకు బలం కావాలి తప్ప, తెలివి తేటలతో పనిలేదు. అందువల్ల, నువ్వు, నేను తలపడక తప్పదు. నువ్వు గొప్పో, నేను గొప్పో ఈ రోజున తేలిపోవలసిందే.

 

సోము బలవంతుడిని ఒకసారి తేరిపార చూశాడు. "నీ బలమెంత?" అని అడిగాడు. "నేను ఒక చేతితో ఒక టన్ను బరువును ఎత్తి సులభంగా ఈ ప్రహరీ గోడ పైనుండి పట్టణం మధ్యకు విసిరివేయగలను" అని బలవంతుడు సమాధానమిచ్చాడు గర్వంగా. "నాకు నమ్మకం కలగటంలేదు" నెమ్మదిగా అన్నాడు సోము "అయితే నా బలాన్ని నీ ముందే నిరూపిస్తాను. ఏ బల పరీక్షకైనా నేను తయారు." అన్నాడు బలవంతుడు.  


"సరే, అయితే నీకొక చిన్న బలపరీక్ష పెడతాను. అందులో నెగ్గితే నువ్వు ప్రపంచంలోకెల్లా గొప్పవాడివని అంగీకరిస్తాను" అని సోము బలవంతుడిని ప్రహరీ గోడ దగ్గరకు తీసుకెళ్లాడు. తన జేబులో ఉన్న సిల్కు రుమాలును బలవంతుని చేతిలో పెట్టి, " దీన్ని ఈ ప్రహరీ గోడ అవతలికి విసిరి చూపించు చాలు" అన్నాడు.

 

బలవంతుడు నవ్వుకుంటూ జేబు రుమాలును విసిరేశాడు. అది ప్రహరీ గోడను దాటలేదు. సోము అప్పుడు ఆ రుమాలును తీసుకొని, దానిలో ఒక చిన్న రాయిని కట్టి, దాన్ని ప్రహరీగోడ అవతలికి సులభంగా విసిరేశాడు. బలవంతుడు సిగ్గుతో తలదించుకొని, తన ఓటమిని అంగీకరించాడు. "బలం, తెలివి రెండూ గొప్పవే, ఈ ప్రపంచంలో మనిషికి రెండూ అవసరమే. ఏది లేకున్నా పరాజయం తప్పదు" అని అతన్ని ఊరడించాడు సోము.

- కొత్తపల్లి.ఇన్ వారి సౌజన్యంతో

తాళ్లరేవులో గోపాలుడనే యువకుడు ఒకడు, పశువులు కాస్తూ ఉండేవాడు. చిన్నతనంనుండీ అదే పనిలో ఉండటం వల్లనో
Mar 15, 2018
అనగనగా అమెరికాలో ఎప్పుడూ‌ పచ్చగా ఉండే అడవి ఒకటి ఉండేది. ఆ అడవిలో చాలా ఓక్ చెట్లు ఉండేవి.
Mar 10, 2018
రాఘవపురంలో నివసించే సూరయ్య కుటుంబాన్ని చాలా జాగ్రత్తగా చూసుకునేవాడు. ఆయనకు ఒకే కూతురు.
Mar 6, 2018
కోగిర అడవిలో ఒక మర్రి చెట్టు ఉండేది. ఆ చెట్టు కొమ్మల్లో‌ గూడు కట్టుకొని కాకి ఒకటి నివసిస్తూ ఉండేది.
Mar 5, 2018
ప్రవీణుడు ఒక రాజ కుమారుడు. వయసు ఆరేళ్ళే. అయినా అల్లారు ముద్దుగా పెరగటం వల్లనో ఏమో,
Feb 26, 2018
మల్లేశు, సీతాలు చాకలి పని చేసేవాళ్ళు. వాళ్లకు ఒక గాడిద ఉండేది. దాని పేరు గుడ్డూ.
Feb 24, 2018
బ్రహ్మదత్తుడు కాశీ రాజ్య పీఠాన్ని అధిరోహించకముందు యువరాజుగా విలాస జీవితాన్ని గడుపుతూ ఉండేవాడు.
Feb 21, 2018
మీర్జాపురాన్ని విజయుడు అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. అతడు మంచి రాజే
Feb 15, 2018
పులులు చాలా ప్రమాదకరమైనవి. ప్రమాదకరమైన వాటితో ఆడుకునేవాళ్లను అజ్ఞానులే అనాలి. అయితే తెలివిలేకగానీ, అహంకారంతోటిగానీ
Feb 7, 2018
చాలా ఏళ్ళ క్రితం పశువులు, జంతువులు అన్నీ‌ అడవుల్లోనే పెరిగేవి. క్రూర జంతువులు వాటిని చంపేవి.
Jan 27, 2018
TeluguOne For Your Business
About TeluguOne