LATEST NEWS
పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో గత కొంతకాలంగా   ఉత్కంఠను రేకెత్తిస్తున్న తృణమూల్ కాంగ్రెస్ పార్టీ పేరు  ఎన్నికల గుర్తు వివాదం ఇప్పుడు క్లైమాక్స్ కు చేరుకుంది. టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ వర్గం,  తిరుగుబాటు నేత రితబ్రత బెనర్జీ వర్గాల మధ్య ఏర్పడిన  విభేదాలు.. పార్టీ గుర్తు  ఎవరికి దక్కుతుందనే అంశం ఇప్పుడు జాతీయ స్థాయిలో హాట్ టాపిక్ గా మారింది. తాజాగా తృణమూల్ లోని మమతా వర్గం, రితబ్రత వర్గాలకు చెందిన కీలక నాయకులు  ఢిల్లీలో  భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) ఫుల్ బెంచ్ ఎదుట హాజరై తమ వాదనలను బలంగా వినిపించారు. ఇరువర్గాలు కూడా ఈసీఐ విచారణ ముగిసిన తర్వాత తమ వాదనలకే అనుకూలంగా తుది తీర్పు వస్తుందని ధీమా వ్యక్తం చేయడం రాజకీయ వర్గాల్లో ఈ వ్యవహారంపై మరింత  ఆసక్తిని రేకెత్తించింది.  పార్టీ నుంచి బహిష్కరణకు గురైన ఎమ్మెల్యే రితబ్రత బెనర్జీ నేతృత్వంలోని వర్గం గురువారం (సెప్టెంబర్ 16) మధ్యాహ్నం మొదటగా ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించింది. ఈ సమావేశం అనంతరం రితబ్రత మీడియాతో మాట్లాడుతూ, ఎన్నికల సంఘం అధికారులు అడిగిన అన్ని ప్రశ్నలకు తాము   సమాధానాలు ఇచ్చామని స్పష్టం చేశారు. పార్టీ పేరు, అధికారిక గుర్తుపై తమ వద్ద ఉన్న బలమైన వాదనలను కమిషన్ ముందు  ఉంచామని, ఈసీఐపై తమకు సంపూర్ణ నమ్మకం ఉందని, తీర్పు తమ వైపే మొగ్గు చూపుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మరోవైపు, పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తరఫున సీనియర్ న్యాయవాది, ఎంపీ కల్యాణ్ బెనర్జీ ఈసీఐ ఎదుట తమ వాదనలను గట్టిగా వినిపించారు. విచారణ అనంతరం ఆయన మాట్లాడుతూ, ఎన్నికల సంఘం కోరిన అన్ని కీలక పత్రాలను తాము  సమర్పించామని తెలిపారు. తాము సమర్పించిన ఆధారాలు, వాదనల ఆధారంగా అంతిమ నిర్ణయం తమకే అనుకూలంగా వస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు.   ఇంతకు ముందు అంటే సెప్టెంబర్ 12వ తేదీన కూడా ఈసీఐ ఇరు వర్గాల వాదనలను విన్నది. ఆ సమయంలో ఎటువంటి తక్షణ నిర్ణయం తీసుకోకుండా, తదుపరి విచారణ నిమిత్తం కొన్ని అదనపు పత్రాలను సమర్పించాలని ఇరు వర్గాలను ఆదేశించింది. రాజకీయ విశ్లేషకుల అంచనాల ప్రకారం, ఈ వివాదంపై ఈసీఐ ఒకవేళ తుది నిర్ణయం వెలువరించినప్పటికీ, ఈ పోరాటం ఇక్కడితో ముగిసే అవకాశం లేదు. తీర్పు వ్యతిరేకంగా వచ్చిన వర్గం న్యాయపోరాటం కోసం నేరుగా సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.  [Trinamool Congress, West Bengal, Mamata Banerjee, Ritabrata Banerjee, ECI, TMC symbol dispute, Telugu One]
తెలంగాణ రాజకీయాలలో   ట్రబుల్ షూటర్‌గా గుర్తింపు తెచ్చుకున్న మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు, ప్రస్తుతం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  రాజకీయ వ్యూహాల ముందు నిలవలేక సతమతమవుతున్నారన్న చర్చ ఇప్పుడు జోరుగా సాగుతోంది.  ఒకనాడు ప్రత్యర్థుల విమర్శల దాడులను చిటికెలో   చిత్తు చేసే నేర్పు ఉన్న నేతగా నిలిచిన హరీష్ రావు.. ఇప్పుడు ఆత్మరక్షణలో పడినట్లు కనిపిస్తున్నదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   ముఖ్యమంత్రిగా ఉండటం వల్లనే  రేవంత్ రెడ్డి  ఈ స్థాయి దూకుడు ప్రదర్శిస్తున్నారనుకోవడం సరికాదంటున్నారు. గతంలో  అధికారంలో లేని సమయంలో కూడా రేవంత్ రెడ్డి తగ్గేదేలే అన్నట్లుగానే వ్యవహరించారనీ, అప్పట్లో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం రేవంత్ ను ఎన్నో ఇబ్బందులు పెట్టింది.   జైలకు కూడా పంపింది. అయినా  అప్పట్లో ఏ సందర్భంలోనూ రేవంత్ వెనకడుగు వేయలేదు. తన పంథా మార్చుకోలేదు.  అలాంటి పోరాట పటిమ ఉన్న రేవంత్ రెడ్డికి ఇప్పుడు  అధికార బలం,  ప్రభుత్వ యంత్రాంగం చేతిలో ఉండటంతో  అసెంబ్లీ వేదికగానైనా, బయట బహిరంగ వేదికలైనా ఆయన సంధిస్తున్న విమర్శలు, ఆరోపణలు బీఆర్ఎస్ అగ్రనాయకత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఇక బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్.. రేవంత్ దూకుడును అడ్డుకునేందుకు ప్రెస్ మీట్లు, సోషల్ మీడియాను ఆశ్రయించడానికే పరిమితమౌతున్నారు. దీంతో బీఆర్ఎస్ శ్రేణులు రేవంత్ దూకుడును అడ్డుకుంటారని హరీష్ రావు వైపు ఆశగా చూస్తున్నారు.  అయితే హరీష్ రావు కూడా  సీఎం రేవంత్ వ్యూహాత్మక ఎత్తుగడలను తిప్పికొట్టడంలో విఫలమౌతున్నారన్న అభిప్రాయం పరిశీలకుల్లో వ్యక్తమౌతోంది.  హరీష్ రావుపై వ్యక్తిగతంగా ఎటువంటి అవినీతి ఆరోపణలు పెద్దగా లేవు. అయితే.. ఇటీవల తెరపైకి వచ్చిన  మిల్చీ మిల్క్ డెయిరీ వ్యవహారం, ఆ తర్వాత అసెంబ్లీ సాక్షిగా బయటకు వచ్చిన వేల ఎకరాల భూముల చిట్టాలో ఆయన పేరు కూడా ప్రస్తావనకు రావడంతో ఆయన పూర్తిగా ఆత్మరక్షణలో పడిపోయారంటున్నారు.  సీఎం రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా   పక్కా అధికారిక రికార్డులు, సర్వే నంబర్లు, కచ్చితమైన కాలపరిమితులతో కూడిన ప్రభుత్వ ఉత్తర్వులను నేరుగా బయటపెడుతూ బీఆర్ఎస్ అగ్రనేతల సమగ్రతను సూటిగా  ప్రశ్నిస్తున్నారు. గతంలో బీఆర్ఎస్ ను కష్టకాలంలో ఆదుకుంటూ వచ్చిన  సెంటిమెంట్   రేవంత్ దూకుడు ముందు పని చేయడం లేదు.  ఈ పరిణామాలు తెలంగాణ రాజకీయ సమీకరణాల్లో వస్తున్న  మార్పులను స్పష్టంగా తెలియజేస్తున్నాయి. కేవలం వాగ్ధాటికి పరిమితం కాకుండా డాక్యుమెంటెడ్ ఎవిడెన్స్‌లతో ప్రభుత్వం ముందుకు వెళ్తుండటంతో  బీఆర్ఎస్ నేతలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.  [Harish Rao vs Revanth Reddy, Telangana politics, BRS strategy, Revanth Reddy moves, Touble Shooter, Telugu One]
ఆంధ్రప్రదేశ్ లో  ఉపాధ్యాయ నియామకాల ప్రక్రియను   అస్త్రంగా మలచుకుని అధికార కూటమిపై విమర్శలు గుప్పిస్తున్న వైసీపీ తీరుపై పొలిటికల్ సర్కిల్స్ లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి.  ప్రభుత్వ నిర్ణయాలను ఎండగట్టే ప్రయత్నంలో భాగంగా వరుసపెట్టి ఆరోపణలు చేస్తున్నప్పటికీ, ఈ తరహా రాజకీయ వ్యూహం ఏ మేరకు సఫలమవుతుంద అనుమానాలు బలంగా వ్యక్తమౌతున్నాయి. ఒక అబద్ధాన్ని పదే పదే చెబితే . ప్రజా సమస్యలను పక్కనపెట్టి కేవలం ఒకే అంశంపై పదే పదే దృష్టి పెట్టడం వల్ల రాజకీయంగా ఆశించిన ప్రయోజనం దక్కుతుందా? అన్న సందేహాలు వైసీపీయులలోనే వ్యక్తం అవుతున్నాయి.  ఉపాధ్యాయ పోస్టుల భర్తీ ప్రక్రియలో అవకతవకలు జరిగాయంటూ వైసీపీ ఆరోపణలు గుప్పిస్తోంది. అధికారంలో ఉన్న తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న పద్ధతులను ప్రశ్నిస్తూ, సోషల్ మీడియా,  మీడియా సమావేశాల ద్వారా విమర్శలు గుప్పిస్తోంది. డీఎస్సీ నియామకాల్లో పారదర్శకత లోపించిందని, అభ్యర్థుల మార్కులు  పరిశీలనా ప్రక్రియలో గందరగోళం నెలకొందని ఆరోపిస్తున్నది. ఈ అంశాన్ని విడతలవారీగా ప్రజల ముందుకు తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తూ, ప్రభుత్వ తీరును నిలదీసేలా వ్యూహాలు రచిస్తున్నది.. అయితే.. ఈ తరహా నిరంతర ఆరోపణలు క్షేత్రస్థాయిలో ఏ రకమైన ఫలితాలను ఇస్తున్నాయన్న ప్రశ్నకు మాత్రం సంతృప్తికరమైన సమాధానం రావడం లేదు.  వైసీపీ విమర్శలు, ఆందోళనల పట్ల జనబాహుల్యంలో ఎటువంటి ఆసక్తీ కనిపించడం లేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   తెలుగుదేశం కూటమి పార్టీల నేతలు వైసీపీ ఆరోపణలు, విమర్శలకు దీటుగా కౌంటర్లు ఇస్తున్నారు. వైసీపీ హయాంలో   ఉపాధ్యాయ నియామకాలను పట్టించుకోని తీరును ఎత్తి చూపుతున్నారు, ఇప్పుడు ఆ పార్టీ చేస్తున్న విమర్శలు, ఆందోళన పూర్తిగా రాజకీయ దురుద్దేశంతోనే అని ఎదురుదాడికి దిగుతున్నారు.   రాజకీయంగా చూస్తే, వైసీపీ తీరు.. సొంత పార్టీ నేతలు, శ్రేణుల్లోనే గందరగోళం సృష్టిస్తోంది.   ప్రజా సమస్యలపై దృష్టి సారించకుండా కేవలం ఒకే ఒక్క పరీక్షా విధానంపై మాత్రమే గళమెత్తడం వల్ల రాజకీయ ప్రయోజనం అటుంచి.. నష్టం వాటిల్లే ప్రమాదం ఉందన్న ఆందోళన వైసీపీ శ్రేణుల్లో వ్యక్తం అవుతోంది.   అన్నిటికీ మించి డీఎస్సీ నియామక ప్రక్రియపై వైసీపీ ఆరోపణలు, విమర్శలను అధికార యంత్రాంగం కొట్టి పారేస్తున్నది. వైసీపీ విమర్శించిన ప్రతి అంశంపైనా స్పష్టమైన వివరణ అధికారికంగా ఇస్తూ.. నియామక ప్రక్రియపారదర్శకంగా జరిగిందని ఆధారాలతో సహా వివరణ ఇచ్చున్నది.  దీనివల్ల కూడా వైసీపీ డీఎస్సీపై చేస్తున్న విమర్శలు నీరుగారిపోతున్నాయి.  ఇంకా డీఎస్సీ నియామకాలలో అవకతవకలు అంటూ వైసీపీ దానినే పట్టుకు వేళాడితే.. ప్రజాక్షేత్రంలో ఆ పార్టీ మరింత పలుచన అయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   [YS Jagan, Mega DSC controversy, YCP political strategy, AP teacher recruitment, ruling and opposition politics, Telugu One]
తెలంగాణ రాజకీయాల్లో భూ వివాదాలు మరోసారి తారస్థాయికి చేరాయి. రాష్ట్రంలో అధికార కాంగ్రెస్ పార్టీకి, ప్రధాన ప్రతిపక్షమైన భారత్ రాష్ట్ర సమితికి   మధ్య మాటల యుద్ధం  ముదిరింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల అసెంబ్లీ వేదికగా మాజీ సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యుల భూ ఆక్రమణలంటూ చేసిన సంచలన వ్యాఖ్యలు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్‌పై గులాబీ పార్టీ  మండిపడింది. ప్రభుత్వ వైఫ్యాలను కప్పిపుచ్చుకునేందుకే కాంగ్రెస్ పెద్దలు ఇలాంటి నిరాధార ఆరోపణలు చేస్తున్నారని  ఎదురుదాడికి దిగింది. అయితే  అసంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి ఆన్ రికార్డ్ యటపెట్టిన భూముల వివరాలతో బీఆర్ఎస్ డిఫెన్స్ లో పడినట్లే కనిపిస్తోంది. ఆ పార్టీ చేస్తున్న ఎదురుదాడి ఆత్మరక్షణ యత్నంగా కనిపిస్తోందే తప్ప ప్రజలను నమ్మించడంలో విఫలమైంది. మామూలుగా సాధారణంగా రాజకీయాల్లో ప్రత్యర్థులపై విమర్శలు చేయడం వేరు.. సాక్షాత్తూ అసెంబ్లీ వేదికగా  సర్వే నంబర్లు, విస్తీర్ణాల ఆధారంగా లెక్కలు బయటపెట్టడం వేరు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అదే పని చేశారు.   ధరణి పోర్టల్‌ను అడ్డం పెట్టుకుని పేద రైతుల భూములను లాక్కున్నారని, దీని వెనుక పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయని సీఎం అన్నారు. ప్రాథమిక సమాచారం ఆధారంగానే ఈ వివరాలు బయటపెడుతున్నామని, పూర్తి స్థాయి ఫోరెన్సిక్ ఆడిట్,  లోతైన విచారణ జరిగితే మరిన్ని నిజాలు వెలుగులోకి వస్తాయని రేవంత్ రెడ్డి చెప్పారు.   ఈ నేపథ్యంలోనే అసెంబ్లీ వేదికగా రేవంత్ వెల్లడించిన వివరాలను ఖండిస్తూనే.. కేసీఆర్ కుటుంబం ఆ భూములన్నీ నిజమే, వాటిని  మేం దాచిపెట్టిందేమీ లేదు, ఎన్నికల అఫిడవిట్లలో స్వయంగా పొందుపరిచినవే అని చెప్పుకుంటోంది. అవన్నీ తమకు తరతరాలుగా వస్తున్న వేల ఎకరాల వారసత్వ భూములున్నాయనీ, తమది జమీందారీ నేపథ్యమని చెప్పుకుంటోంది. అయితే.. ఇక్కడ కేసీఆర్ కుటుంబం మరీ ముఖ్యంగా కేసీఆర్ చిన్న లాజిక్ మరిచిపోయారు. 1973 నాటి భూమి పరిమితి చట్టం  ప్రకారం ఉమ్మడి కుటుంబానికి మెట్ట భూమి 52 ఎకరాలు, కొన్ని ప్రత్యేక సందర్భాల్లో 54 ఎకరాలు మించి ఉండటానికి లేదన్న విషయాన్ని ఆయన ఉద్దేశపూర్వకంగానో లేదా నిజంగానే అయినా మరచిపోయారు.  దీంతో కల్వకుంట్ల కుటుంబం, బీఆర్ఎస్ రేవంత్ ఆరోపణలను తిప్పి కొట్టే ప్రయత్నం పెద్దగా ఫలిచడం లేదని పరిశీలకులు అంటున్నారు.   ఇక పోతే ఆ ఆరోపణల తీవ్రతను తగ్గిండానికి, ప్రస్తుతానికి తప్పించుకోవడానికి కేటీఆర్ పొలిటికల్ అస్త్రంగా సిట్టింగ్ జడ్డి విచారణ అంటూ సవాల్ చేస్తున్నారు.  అయితే..  సిట్టింగ్ జడ్జి విచారణ డిమాండ్ అనేది సమస్యను పక్కదారి పట్టించే, పాతచింతకాయపచ్చడి వ్యూహంగా పరిశీలకులు అభివర్ణిస్తున్నారు.  కేటీఆర్ డిమాండ్ కేవలం కాలయాపనకే తప్ప.. రేవంత్ రెడ్డి ఆరోపణలకు సమాధానం కాదని అంటున్నారు.  అన్నిటికంటే ప్రధానంగా... ఆ భూములు తమవేననీ, వాటిని చట్టబద్ధంగా కొన్నామనీ చెప్పుకుంటున్న కేటీఆర్   భూములు ఎవరి హయాంలో, ఎంత ధరకు  కొన్నారు అన్న వివరాలను వెల్లడించాల్సి ఉంది.  వాటిని కొనుగోలు చేయడానికి వెచ్చించిన నిధులు, అవి వచ్చిన మార్గం, దాని మూలాలు అన్నీ వివరించాల్సిన అవసరం ఉంది. అది వదిలేసి.. వ్యక్తిగత దూషణలు, ప్రత్యారోపణలు చేయడం వల్ల ఉపయోగం ఉండదు. ప్రత్యారోపణలు, వ్యక్తిగత దూషణలు ప్రజలలో కల్వకుంట్ల కుటుంబ వాదనను బలహీన పరుస్తాయో తప్ప మరో ప్రయోజనం ఉండదని పరిశీలకులు అంటున్నారు.  అన్నిటికీ మించి అవి వారసత్వ భూములు అన్న ఒక్క మాటతో ఈ వివాదాన్ని ముగించేయడం కల్వకుంట్ల కుటుంబానికి అంత తేలిక కాదు. ఏది ఏమైనా అసెంబ్లీ వేదికగా రేవంత్ రెడ్డి సృష్టించిన ‘భూ’ కంపం కేసీఆర్ కుటుంబాన్ని, అలాగే బీఆర్ఎస్ పార్టీనీ ఆత్మరక్షణలో పడేసిందన్నది మాత్రం ఎవరూ కాదనలేని వాస్తవమని చెప్పాలి.  [Revanth Reddy, KCR Family Lands, BRS Counter Attack, Telangana Politics, Dharani Portal Row]
వైద్య రంగంలో జరిగే చిన్నపాటి తప్పులు ఒక్కోసారి మనుషుల జీవితాలనే తీవ్రంగా మార్చేస్తుంటాయి. అలాంటి ఒక విషాదకరమైన సంఘటన బెక్కీ జోన్స్ అనే మహిళ జీవితంలో చోటుచేసుకుంది. 2012లో ఆమె తీవ్రమైన మైగ్రేన్ తలనొప్పితో బాధపడుతూ ఆసుపత్రికి వెళ్లారు. వైద్యులు ఆమెకు బ్రెయిన్ స్కాన్ నిర్వహించగా మెదడులో ఒక పెద్ద మచ్చ కనిపించింది. ఆ మచ్చను చూసి అది ప్రమాదకరమైన బ్రెయిన్ ట్యూమర్ అని, ప్రాణాంతక క్యాన్సర్ అని వైద్యులు నిర్ధారించారు. చికిత్స వెంటనే ప్రారంభించకపోతే ప్రాణాలకే ముప్పు వాటిల్లుతుందని పదే పదే హెచ్చరించడంతో, ఆమె కీమోథెరపీ తీసుకోవడం ప్రారంభించారు. అది ఒక ఏడాది కాదు, రెండేళ్లు కాదు.. ఏకంగా 11 ఏళ్ల పాటు సుదీర్ఘంగా కొనసాగింది. కొద్ది నెలల వ్యవధిలోనే ముగియాల్సిన మానసిక, శారీరక వేదన ఆమె జీవితంలో దాదాపు దశాబ్ద కాలానికి పైగా నిత్యకృత్యమైంది. కీమోథెరపీ వల్ల కలిగే తీవ్రమైన పార్శ్య ప్రభావాలు, వెంట్రుకలు రాలిపోవడం, వికారంగా ఉండటం, శరీరం బలహీనపడటం వంటి నరకయాతనను ఆమె ప్రతిరోజూ అనుభవించారు. చికిత్స ఆపేస్తే ఎక్కడ క్యాన్సర్ తిరగబెట్టి తన ప్రాణాలను తీస్తుందో అనే భయంతోనే ఆమె 11 ఏళ్ల పాటు ఆ నరకాన్ని భరిస్తూ వచ్చారు. అయితే 2025లో ఆమె వైద్య రిపోర్టులను కొందరు న్యూరోసర్జన్లు మరియు రేడియాలజిస్టులు మరొకసారి క్షణ్ణంగా పరిశీలించినప్పుడు అసలు షాకింగ్ నిజం వెలుగులోకి వచ్చింది. బెక్కీ జోన్స్‌కు అసలు ఎప్పుడూ బ్రెయిన్ క్యాన్సరే లేదని వైద్యులు తేల్చి చెప్పారు. స్కాన్‌లో కనిపిస్తున్న మచ్చ క్యాన్సర్ ట్యూమర్ కాదని, అది  ట్యూమర్‌ఫ్యాక్టివ్ డిమైలినేషన్  అనే అరుదైన నాడీ సంబంధిత సమస్య అని స్పష్టం చేశారు. నరాల పొర దెబ్బతినడం వల్ల వచ్చే ఒక రకమైన వాపు కారణంగా అది స్కాన్‌లో చూడటానికి హానికరమైన ట్యూమర్‌లా కనిపించిందని వివరించారు. ఈ నిజం తెలుసుకున్న బెక్కీ జోన్స్‌కు ఉపశమనం లభించడం కంటే తీవ్రమైన దిగ్భ్రాంతి, వేదన మిగిలాయి. తన జీవితంలోని అమూల్యమైన 11 సంవత్సరాల కాలాన్ని, ఆరోగ్యాన్ని కేవలం ఒక తప్పుడు వైద్య నిర్ధారణ వల్ల అనవసరంగా కోల్పోయానని ఆమె కన్నీటిపర్యంతమయ్యారు.  నాకు అసలు బ్రెయిన్ ట్యూమరే లేదు, పదేళ్లకు పైగా ఏ కారణం లేకుండానే నరకాన్ని అనుభవించాను  అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సంఘటన అరుదైన లేదా క్లిష్టమైన వైద్య పరీక్షలు ఎదురైనప్పుడు సెకండ్ ఒపినియన్ ఎంత కీలకమో అందరికీ కన్నువిప్పు కలిగిస్తోంది.     [ Becky Jones, Medical Misdiagnosis, Brain Tumor, Tumefactive Demyelination, Brain Scan, Chemotherapy, Neurology, Neurosurgery, Radiology, Second Opinion ]
ALSO ON TELUGUONE N E W S
Nani's The Paradise is in the final stages of post production preparing for a grand release on 24th September. He met Anirudh Ravichander at his studio who is busy in final mixing sessions with director Srikanth Odela. The trio is making sure the film sounds as spectacular as it visually looks. Nani and his team have introduced a very interesting concept to describe their hard work. They announced that the three dragons are too mainstream for their unique style. Instead, they boldly proclaimed, "Welcome to the era of three crows." The trio wore three meticulously designed The Paradise jackets to take excitement to next level. The trio is functioning with extreme intensity in the recording studio. To highlight their absolute focus, they stated they are blood thirsty crows working tirelessly to give the best. Their relentless effort in the final mixing suite is building incredible excitement among movie lovers. The movie is produced by Sudhakar Cherukuri with highest budget ever for a Nani film. Kayadu Lohar is playing the female lead with Keerthy Suresh in a special song. Mohan Babu, Sonali Kulkarni, Raghav Juyal are playing prominent roles in this revolutionary saga based in 1980's Secunderabad.  Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
న్యాచురల్ స్టార్ నాని, డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్ లో వస్తున్న మూవీ 'ది ప్యారడైజ్'. సెప్టెంబర్ 24న విడుదల కానున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. నాని కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ రాబట్టడం ఖాయమని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఆ అంచనాలకు తగ్గట్టుగానే ఓవర్సీస్ బుకింగ్స్ నెక్స్ట్ లెవెల్ లో ఉన్నాయి. 'ది ప్యారడైజ్' మూవీ ఓవర్సీస్ ప్రీ-సేల్స్ నంబర్స్ చూసి ట్రేడ్ వర్గాలు సైతం ఆశ్చర్యపోతున్నాయి. ఇప్పటికే నార్త్ అమెరికా ప్రీమియర్స్ అడ్వాన్స్ బుకింగ్స్ $450,000 మార్కును దాటేసి సంచలనం సృష్టించాయి. టోటల్ ఓవర్సీస్ ప్రీ-సేల్స్ ఏకంగా 5,50,000 డాలర్ల మైలురాయిని దాటేసింది. ట్రేడ్ అంచనా ప్రకారం ఈ సినిమా ప్రీమియర్స్ అండ్ ఫస్ట్ డే కలిపి దాదాపు 2 మిలియన్ డాలర్ల గ్రాస్ ఓపెనింగ్ దిశగా దూసుకెళ్తోంది. ఈ సినిమాకి సెన్సార్ బోర్డు నుంచి ‘A’ సర్టిఫికేట్ లభించింది. 2 గంటల 49 నిమిషాల నిడివితో వస్తున్న ఈ చిత్రం, హై-వోల్టేజ్ యాక్షన్, ఎమోషన్స్, అదిరిపోయే విజువల్స్‌తో ప్రేక్షకులకు గొప్ప అనుభూతిని ఇవ్వబోతోందని తెలుస్తోంది. ఈ సినిమాలో హీరోయిన్ గా కయదు లోహర్ నటిస్తుండగా, కలెక్షన్ కింగ్ మోహన్ బాబు, రాఘవ్ జుయల్, సంపూర్ణేష్ బాబు తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. వరల్డ్ వైడ్ గా రూ.100 కోట్లకు పైగా థియేట్రికల్ బిజినెస్ చేసిన ‘ది ప్యారడైజ్’ మూవీ.. రూ.200 కోట్ల గ్రాస్ టార్గెట్ తో బాక్సాఫీస్ బరిలో దిగుతోంది. ఓవర్సీస్ బుకింగ్స్ కి ఈ రేంజ్ రెస్పాన్స్ ఉందంటే.. ఇక తెలుగు రాష్ట్రాల్లో ఏ రేంజ్ రెస్పాన్స్ ఉంటుందనే ఆసక్తి నెలకొంది.  https://x.com/PrathyangiraUS/status/2100832537555960065       [The Paradise USA Pre Sales, Paradise North America Pre Sales, Paradise Overseas Box Office, Nani Paradise Movie, The Paradise, Natural Star Nani, Srikanth Odela, Anirudh Ravichander, Kayadu Lohar, Telugu Film News]  
మాస్ మహారాజా రవితేజ నటించిన తాజా సంచలన చిత్రం ‘ఇరుముడి’ బాక్సాఫీస్ వద్ద విజయం సాధించిన తర్వాత ఇప్పుడు డిజిటల్ తెరపై అలరించేందుకు వచ్చేసింది. బాక్సాఫీస్ వద్ద ఊహించని రేంజ్‌లో కలెక్షన్ల వర్షం కురిపించిన ఈ సినిమా.. ఇప్పుడు ఓటీటీలోనూ సంచ‌ల‌నం సృష్టిస్తోంది. స్ట్రీమింగ్ మొద‌లైన కొద్ది గంట‌ల్లోనే రికార్డు స్థాయిలో వ్యూస్ రావ‌డం ఈ సినిమాకి ఉన్న స్టామినాకు నిద‌ర్శ‌నం అంటున్నారు సినీ ప్రేమికులు.  నెట్‌ఫ్లిక్స్ వేదికగా ఈ చిత్రం స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగులోనే కాకుండా ఇతర దక్షిణాది భాషల్లో కూడా ఈ ఎమోషనల్ యాక్షన్ డ్రామా అందుబాటులో ఉండటం విశేషం. థియేటర్లలో చూడటం మిస్సయిన అభిమానులు, మూవీ లవర్స్ ఇప్పుడు డిజిటల్ స్క్రీన్స్ పై ఈ సినిమాను చూసేందుకు ఆస‌క్తి చూపిస్తుండ‌డంతో వ్యూస్ విప‌రీతంగా పెరుగుతున్నాయి.  మొద‌టి రోజే ఈ స్థాయి రెస్పాన్స్ రావ‌డం అంద‌రికీ ఆశ్చర్యాన్ని క‌లిగిస్తోంది. ఎందుకంటే థియేట‌ర్ల‌లో ఇప్ప‌టికే కొన్ని ల‌క్ష‌ల మంది సినిమాను చూసి ఉంటారు. అయిన‌ప్ప‌టికీ అదే స్థాయిలో ఓటీటీకి వ్యూస్ రావ‌డం అనేది విశేషం.  ఈ చిత్రంలో రవితేజ ‘త్రినాథరావు’ అనే ఆటో డ్రైవర్ పాత్రలో అద్భుతమైన నటనను కనబరిచారు. ఉత్తరాంధ్ర నేపథ్యంతో సాగే ఈ కథలో తండ్రీకూతుళ్ల అనుబంధం ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. తన కుమార్తె మణెమ్మ (నక్షత్ర) ఎదుర్కొన్న ఒక క్లిష్టమైన సమస్య కోసం తండ్రిగా త్రినాథరావు చేసిన పోరాటమే ఈ చిత్ర ముఖ్య ఇతివృత్తం. కథానాయికగా ప్రియా భవానీ శంకర్ మెరవగా, కీలక పాత్రలో సీనియర్ నటుడు సాయికుమార్ తనదైన శైలిలో ఆకట్టుకున్నారు. భావోద్వేగ సన్నివేశాలతో పాటు సామాజిక అంశాన్ని సమర్థవంతంగా తెరకెక్కించడంలో దర్శకుడు విజయం సాధించారని సినీ విశ్లేషకులు ప్రశంసించారు. బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం ఏకంగా రూ. 250 కోట్లకు పైగా వసూళ్లు సాధించి రవితేజ కెరీర్‌లోనే రికార్డు హిట్‌గా నిలిచింది. థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శించబడుతున్న సమయంలోనే ఓటీటీలోకి అడుగుపెట్టడం విశేషం. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ మూవీ డిజిటల్ ఎంట్రీపై విపరీతమైన బజ్ నెలకొంది. నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ అయిన కొద్ది గంటల్లోనే విశేష ఆదరణ లభిస్తోందని, రవితేజ మార్క్ పర్‌ఫార్మెన్స్ ఓటీటీ వీక్షకులను కూడా కట్టిపడేస్తుందని కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈ డిజిటల్ విడుదల ద్వారా ‘ఇరుముడి’ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రేక్షకులు ఆస్వాదిస్తున్నారు. మరి ఈ వీకెండ్‌లో హోమ్ ఎంటర్‌టైన్‌మెంట్ కోసం ఎదురుచూసే వారికి ఈ సినిమా ఒక సరైన ఎంపిక అని చెప్పవచ్చు.     [Ravi Teja Irumudi Movie, Irumudi OTT Release, Irumudi Netflix Streaming, Ravi Teja Irumudi OTT Rights, Telugu OTT Release Updates]
తేజ సజ్జా హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో 2020లో వచ్చిన సూపర్ హిట్ మూవీ 'జాంబీ రెడ్డి'. ఇప్పుడు ఈ సూపర్ హిట్ ప్రాంచైజీ నుంచి సీక్వెల్‌గా 'జాంబీ రెడ్డి 2' రాబోతోంది. కన్నడ రియల్ స్టార్ ఉపేంద్ర ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తుండటం విశేషం. నేడు(సెప్టెంబర్ 18) ఉపేంద్ర పుట్టినరోజు సందర్భంగా తాజాగా టీమ్ ఒక మైండ్ బ్లాకింగ్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేసింది. ఈ పోస్టర్ చూసిన ప్రతీ ఒక్కరూ షాక్ అవుతున్నారు. చెట్టు కొమ్మకు తలకిందులుగా వేలాడుతూ, చేతిలో వెరైటీ ఆయుధాన్ని పట్టుకుని, భయంకరమైన రా అండ్ రస్టిక్ అవతార్‌లో ఉపేంద్ర కనిపిస్తున్న తీరు సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. "ప్రపంచాన్ని తలకిందులు చేయడానికి సిద్ధంగా ఉన్నాం" అంటూ పోస్టర్‌పై ఉన్న ట్యాగ్‌లైన్ ఈ సినిమాలో ఉండబోయే వైవిధ్యమైన కంటెంట్ కి అద్దం పడుతోంది. ఉపేంద్ర అంటేనే డిఫరెంట్ కంటెంట్ కి, డిఫరెంట్ గెటప్స్ కి పెట్టింది పేరు. ఆలాంటి యాక్టర్ 'జాంబీ రెడ్డి 2'లో భాగం కావడంతో మరింత ఆసక్తి నెలకొంది. ఈ సినిమాలో మునుపెన్నడూ చూడని ఒక కొత్త రకమైన మ్యాడ్‌నెస్, మాస్ అవతార్‌ను చూపించబోతున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.  సుపర్ణ్ వర్మ దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తోంది. ప్రశాంత్ వర్మ క్రియేటర్ గా వ్యవహరిస్తున్నారు. గౌరహరి సంగీతం అందిస్తున్నారు.  https://x.com/peoplemediafcy/status/2100828225991790890       [Zombie Reddy 2 NXT LVL, Upendra Birthday Poster, Zombie Reddy 2 Movie, Upendra First Look, Zombie Reddy 2, Real Star Upendra, Teja Sajja, Prasanth Varma, People Media Factory, Telugu Film News]  
భారత యువ క్రికెటర్ పృథ్వీ షా, అలాగే టాలీవుడ్ యంగ్ యాక్ట్రెస్ ఆకృతి అగర్వాల్ జంట గురించి ప్రస్తుతం నెట్టింట ఒక సంచలన వార్త చక్కర్లు కొడుతోంది. ఈ ఏడాది ఎంతో అంగరంగ వైభవంగా నిశ్చితార్థం చేసుకున్న ఈ జోడీ, ఇప్పుడు తమ బంధానికి ముగింపు పలికినట్లు అధికారికంగా ప్రకటించి అభిమానులకు పెద్ద షాక్ ఇచ్చింది. తాజాగా నటి ఆకృతి అగర్వాల్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా ఒక ప్రకటన విడుదల చేస్తూ ఈ విడిపోతున్న విషయాన్ని ధృవీకరించారు. ఇద్దరి జీవిత లక్ష్యాలు, ఆలోచనలు వేర్వేరుగా ఉండటంతోనే మున్ముందుకు కలిసి ప్రయాణించడం సాధ్యపడదని భావించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె వివరించారు. పరస్పరం గౌరవం ఉన్నప్పటికీ, విడివిడిగా తమ పయనాన్ని కొనసాగించడమే శ్రేయస్కరమని పేర్కొన్నారు. మరొకవైపు ఈ విషయాన్ని ఆకృతి పోస్ట్ చేసిన కొద్ది సేపటికే, పృథ్వీ షా తన సోషల్ మీడియా ఖాతాలోని దాదాపు అన్ని ఫొటోలను డిలీట్ చేయడం గమనార్హం. 2016 నాటి ఒకే ఒక్క పాత పోస్ట్‌ను మాత్రమే ఉంచి మిగిలిన అన్నిటినీ తొలగించిన అతడు, ఎంగేజ్‌మెంట్ క్యాన్సిలేషన్‌పై నేరుగా ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. గతంలో కూడా ఈ జంట మధ్య మనస్పర్థలు వచ్చాయనే ప్రచారాలు జరిగాయి. కొన్ని నెలల క్రితం బ్రేకప్ రూమర్స్ వైరల్ అయినప్పటికీ, అప్పట్లో అవన్నీ కేవలం అపోహలేనని ఆకృతి కొట్టిపారేశారు. అయితే ఆ రూమర్స్ వచ్చిన అతి తక్కువ కాలంలోనే ఇప్పుడు నిజంగానే తమ ఎంగేజ్‌మెంట్ క్యాన్సిల్ అయిందని ప్రకటించడంతో ఫ్యాన్స్ తీవ్ర ఆశ్చర్యానికి గురవుతున్నారు. కెరీర్ విషయానికొస్తే, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్‌గా విశేష ప్రజాదరణ పొందిన ఆకృతి అగర్వాల్ ‘త్రిముఖ’ అనే చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమైంది. ఇక మరోపక్క పృథ్వీ షా తన ఫిట్‌నెస్ సమస్యల కారణంగా అంతర్జాతీయ క్రికెట్‌కు కొద్దికాలంగా దూరమై ప్రస్తుతం దేశవాళీ టోర్నీలపైనే దృష్టి సారించాడు. ఈ షాకింగ్ న్యూస్‌పై ప్రస్తుతం సోషల్ మీడియాలో నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఇద్దరూ తమ తమ రంగాల్లో సక్సెస్ సాధించి ముందుకు సాగాలని కామెంట్లు పెడుతున్నారు. ఈ బ్రేకప్ వార్తల అనంతరం ఆకృతి అగర్వాల్ తన తదుపరి సినిమా ప్రాజెక్టులతో బిజీ కానుండగా, పృథ్వీ షా త్వరలోనే మళ్లీ ఫామ్‌లోకి వచ్చి క్రికెట్ మైదానంలో పునరాగమనం చేస్తారని ఆశిస్తున్నారు.       [Prithvi Shaw, Akriti Agarwal Engagement, Prithvi Shaw Breakup, Akriti Agarwal Telugu Actress, Celebrity Breakup News Telugu]
విజయ్ దేవరకొండ, రశ్మిక మందన్న జంటగా నటిస్తున్న పాన్ ఇండియా మూవీ "రణబాలి". ఈ సినిమాకు రాహుల్ సంకృత్యన్ దర్శకత్వం వహిస్తున్నారు. టీ సిరీస్ సమర్పణలో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ హ్యూజ్ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. 19వ సెంచరీ నేపథ్యంతో 1854 నుంచి 1878 మధ్య బ్రిటీష్ పాలనా కాలంలో జరిగిన యదార్థ చారిత్రక సంఘటనల ఆధారంగా "రణబాలి" సినిమా రూపొందుతోంది. దసరా కానుకగా అక్టోబర్ 16న ఈ సినిమా థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది.  'రణబాలి' ఫస్ట్ సింగిల్ 'ఏందయ్యా సామీ..' ఫుల్ సాంగ్ రిలీజ్ డేట్ ను తాజాగా అనౌన్స్ మెంట్ చేశారు మేకర్స్. ఈ నెల 21న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ పాటను విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు. విజయ్, రశ్మిక పెళ్లి సందర్భంగా రిలీజ్ చేసిన 'ఏందయ్యా సామీ..' సాంగ్ ప్రోమో హ్యూజ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. ఇప్పుడీ ఫుల్ వెర్షన్ సాంగ్ కోసం ఆడియెన్స్ వేచి చూస్తున్నారు.  విజయ్ దేవరకొండ, రశ్మిక మందన్న వివాహం తర్వాత కలిసి నటిస్తున్న సినిమాగా అటు వారి ఫ్యాన్స్ లోనూ, ఇటు మూవీ లవర్స్ లోనూ "రణబాలి" సినిమా ఆసక్తి కలిగిస్తోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకొని, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. రీసెంట్ గా రిలీజ్ చేసిన టీజర్ ఈ మూవీపై అంచనాలు మరింతగా పెంచేసింది. https://x.com/MythriOfficial/status/2100806731794383167       [Ranabaali First Single Endhayya Saami, Endhayya Saami Full Song, Endhayya Saami Song Ranabaali, Ranabaali Movie Song, Ranabaali Release Date, Vijay Deverakonda, Rashmika Mandanna, Rahul Sankrityan, Mythri Movie Makers, Telugu Film News]  
2027 సంక్రాంతి పోరు చిరంజీవి వర్సెస్ చిరంజీవిగా మారే అవకాశముందని వార్తలొస్తున్నాయి. 'కాకా' సినిమా విడుదల తేదీ అధికారికంగా ఖరారైంది. జనవరి 13న ఈ సినిమాను థియేటర్లలోకి తీసుకొస్తున్నట్లు నిర్మాతలు స్పష్టం చేశారు. అదే సమయంలో 'విశ్వంభర' కూడా సంక్రాంతి బరిలోనే నిలుస్తుందని ప్రచారం జరుగుతోంది. అయితే విశ్వంభర రిలీజ్ డేట్‌పై మేకర్స్ నుంచి ఇంకా ఎలాంటి అఫిషియల్ అనౌన్స్‌మెంట్ రాలేదు. ఈ సందేహాల నడుమ, దర్శకుడు వశిష్ఠ సోషల్ మీడియాలో పెట్టిన ఒక డివోషనల్ అండ్ మిస్టీరియస్ పోస్ట్ ఇప్పుడు నెట్టింట చర్చనీయాంశంగా మారింది. దర్శకుడు వశిష్ఠ ఒక శివ ప్రవచనం వీడియోను పంచుకుంటూ.. "శ్వాస నాది, శాసనం నీది.. ఆశ నాది, పాశం నీది.. ఆత్మ నాది, ఆట నీది.. ఎంత మాయగాడివయ్యా! ఓం నమః శివాయ!!! ఇందుకేనా నిన్ను ‘విశ్వంభరుడు’ అని పిలిచేది? సర్వం శివం.. ఓం నమః శివాయ!!" అని ఒక గూస్‌బమ్స్ తెప్పించే క్యాప్షన్ జత చేశారు. రిలీజ్ డేట్‌పై అభిమానుల్లో గందరగోళం నెలకొన్న తరుణంలో వశిష్ఠ పెట్టిన ఈ పోస్ట్ చూసి మెగా ఫ్యాన్స్ రకరకాల అంచనాలు వేస్తున్నారు. గ్రాఫిక్స్‌కి ప్రాధాన్యమున్న సోషియో ఫాంటసీ కథతో 'విశ్వంభర' చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. ఈ సినిమాలో త్రిష, ఆషికా రంగనాథ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అయితే వీఎఫ్‌ఎక్స్ వర్క్ వల్ల సినిమా విడుదల పలుమార్లు వాయిదా పడుతూ వచ్చింది. ఇప్పుడు సంక్రాంతికి రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. మరి ఒకే సంక్రాంతి సీజన్‌లో 'కాకా', 'విశ్వంభర' రెండూ వస్తాయా లేక విశ్వంభర సరికొత్త డేట్‌తో సోలోగా బాక్సాఫీస్ దాడికి దిగుతుందా అనేది వేచి చూడాలి. https://x.com/DirVassishta/status/2100797197642268776       [Vishwambhara vs Kaaka, Vishwambhara Release Date, Kaaka Release Date, Vishwambhara Sankranti Release, Kaaka vs Vishwambhara, Megastar Chiranjeevi, Director Vassishta, Telugu Film News, Telugu News]  
  మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ఏం చేసినా అందులో వైవిధ్యం అనేది ఉండటం పక్కా. సామాజిక సేవ పరంగా కూడా ఆ వైవిధ్యాన్ని ప్రదర్శించడంలో  ఏ మాత్రం వెనుకాడడు. అందుకు  ఈ రోజు జరుగుతున్న భారత ప్రధాని నరేంద్ర మోదీ పుట్టినరోజు సాక్ష్యం. సినీ, రాజకీయ, సామాజిక ప్రముఖులు మోదీకి జన్మదిన శుభాకాంక్షలు అందజేస్తున్నారు. అయితే  చరణ్ మాత్రం కేవలం శుభాకాంక్షలకే పరిమితం కాకుండా, సమాజానికి మేలు చేకూరే ఒక అద్భుతమైన సామాజిక కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. దేశాభివృద్ధిలో మహిళా సాధికారతే కీలకమని నమ్ముతున్న చరణ్, మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని చేపట్టిన ఒక బృహత్తర ప్రకటన ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో  ట్రెండ్ అవుతోంది. మోదీ నిరంతరం దేశం కోసం చేస్తున్న నిస్వార్థ సేవలు, వికసిత్ భారత్ సాధన కోసం ఆయన చూపుతున్న దూరదృష్టి తనకు ఎంతగానో స్ఫూర్తినిచ్చాయని రామ్ చరణ్ తెలిపారు. ఈ స్ఫూర్తితోనే బిజెపి ప్రారంభించిన ‘సేవా సంకల్ప్ అభియాన్’ అనే మహత్తర కార్యక్రమంలో తాను కూడా భాగస్వామిని అవుతున్నట్లు అధికారికంగా వెల్లడించారు. ఈ అభియాన్ లో భాగంగా రామ్ చరణ్ ఒక కీలకమైన హామీ ఇచ్చారు. రాబోయే కొద్ది నెలల్లో సరిగ్గా 1000 మంది మహిళలకు ఉచితంగా స్కిల్ డెవలప్‌మెంట్ (నైపుణ్యాభివృద్ధి) శిక్షణ అందించనున్నట్లు ప్రకటించాడు.     Also read: సూర్య కొత్త మూవీ టీజర్ వచ్చేసింది: రామాయణకి పోటీ తప్పదా!  ఈ 1000 మంది మహిళలకు ఇచ్చే నైపుణ్య శిక్షణ వల్ల వారు స్వయం ఉపాధి అవకాశాలను పొంది తమ జీవితాల్లో కొత్త వెలుగులు నింపుకోగలుగుతారు. కేవలం సోషల్ మీడియా వేదికగా విష్ చేసి ఊరుకోకుండా, ఏకంగా 1000 మంది మహిళల జీవితాలను మార్చే దిశగా అడుగులు వేయడం చరణ్ యొక్క ఉదారతకు, సామాజిక బాధ్యతకి  అద్దం పడుతోంది.       [Ram Charan, Modi, Upasana, Ram charan Joins Seva Sankalp Abhiyan Pledges Skill Development,Seva Sankalp Abhiyan, Telugu Cinema, Telugu Cinema News, Tollywood, Tollywood News]  
    హిట్టు నా ఇంటి పేరు.. సూపర్ హిట్ నా ఒంటి పేరు అంటూ కరుప్పు( వీరభద్రుడు), విశ్వనాధ్ అండ్ సన్స్ తో  సూర్య ఫామ్ లో ఉన్న విషయం తెలిసిందే. రాబోయే మూవీ కూడా అదే  ఫామ్ ని కంటిన్యూ పక్కా అంటూ అప్ కమింగ్ మూవీ 'సీన్' తో రాబోతున్నాడు. అవును 'జితు మాధవన్' దర్శకత్వంలో చేస్తున్న సూర్య 47వ చిత్రానికి  'సీన్' (Scene) అనే  టైటిల్‌ని  ఖరారు చేస్తూ చిత్రబృందం ఒక గ్లింప్స్ టీజర్‌ ని కాసేపటి క్రితం విడుదల చేసింది.  సుమారు నిమిషం 15 సెకన్లు ఉన్న టీజర్  చూస్తుంటే  సూర్య క్యారక్టర్ ఊహించని షేడ్స్ లో సాగబోతుందనే విషయం అర్ధమవుతూ ఉంది. పక్కా  యాక్షన్ ఎంటర్ టైనర్ అనే విషయం తెలుస్తుండటంతో ఈ సారి గత రెండు చిత్రాలకి భిన్నంగా సరికొత్త సూర్య మెస్మరైజ్ చేయడం పక్కా. సూర్య సొంత నిర్మాణ సంస్థ '2D ఎంటర్‌టైన్‌మెంట్స్' మరియు కొత్తగా స్థాపించిన 'ఝగరం స్టూడియోస్' బ్యానర్లపై జ్యోతిక, సూర్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. నజ్రియా నజీమ్, 'ప్రేమలు' ఫేమ్ నాస్లేన్, ఆనంద్ రాజ్, జాన్ విజయ్ మరియు ప్రముఖ యూట్యూబర్ రాజ్ ప్రియన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. టైటిల్ టీజర్ విడుదలైన కేవలం కొద్ది సమయంలోనే యూట్యూబ్‌లో 15 మిలియన్లకు పైగా డిజిటల్ వ్యూస్ దాటేసి సోషల్ మీడియాలో విశేషంగా ట్రెండ్ అవుతోంది. Also Read: భూఆరోపణలపై సరికొత్త ట్విస్ట్: ఇక వాళ్ళకి నిద్ర ఉండదు మలయాళ చిత్రసీమలో తన సరికొత్త మ్యూజిక్‌తో సంచలనాలు సృష్టించిన సుషిన్ శ్యామ్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. సుషిన్ కి మొదటి తమిళ చిత్రం కావడంతో ఆడియో లవర్స్ మరియు అభిమానులలో భారీ అంచనాలు నెలకొన్నాయి దీపావళి కానుకగా నవంబర్ 6, న  రిలీజ్ కానుంది. రామాయణ పార్ట్ 1  కూడా అదే రోజు వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది. ఇండియా వైడ్ గా మాత్రం 8 న రిలీజ్. ఈ నేపథ్యంలో ఇప్పుడు సీన్ vs  రామాయణ గా పిలుచుకోవాల్సిన పరిస్థితి. ఫాహద్ ఫాజిల్ తో 'ఆవేశం' తెరకెక్కించి 150 కోట్ల మార్కుని అందుకున్న జితు మాధవన్ దర్శకుడు.       [Scene Teaser, Suriya, Jithu Madhavan, Nazriya Nazim, Naslen, Telugu Cinema, Telugu Cinema News, Tollywood, Tollywood News]  
భారత ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా శుభాకాంక్షల వెల్లువ కురుస్తోంది. రాజకీయ, సినీ, క్రీడా ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా ఆయనకు విష్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే టాలీవుడ్ సినీ దిగ్గజాలు, అగ్ర కథానాయకులు ప్రధానికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయన సేవలను కొనియాడారు. మెగాస్టార్ చిరంజీవి, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, సూపర్ స్టార్ మహేష్ బాబు, కింగ్ అక్కినేని నాగార్జున తదితర ప్రముఖులు ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ప్రధాని మోదీ ప్రజాసేవను, దేశాభివృద్ధి పట్ల ఆయనకున్న అంకితభావాన్ని ప్రశంసించారు. మెగాస్టార్ చిరంజీవి పోస్ట్ .. నవభారత నిర్మాణంలో ప్రధాని చూపుతున్న క్రమశిక్షణ, దూరదృష్టి ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. దేశాన్ని ఆత్మనిర్భర్ భారత్ దిశగా నడిపిస్తున్న ఆయనకు నిండు నూరేళ్ల ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. పవన్ కళ్యాణ్ సుదీర్ఘ సందేశాన్ని ఇస్తూ.. గత పాతిక సంవత్సరాలుగా ప్రజాసేవకే అంకితమైన మోదీ నాయకత్వం ఎంతో ఆదర్శవంతమైనదని కొనియాడారు. భారత ప్రాభవాన్ని ప్రపంచ స్థాయిలో పెంపొందించడంలో ప్రధాని కృషి అపూర్వమని పవన్ విష్ చేశారు. సూపర్ స్టార్ మహేష్ బాబు ఎక్స్‌లో స్పందిస్తూ.. "ఎప్పుడూ విశ్రమించకుండా, నిరంతరం దేశ సంక్షేమమే పరమావధిగా శ్రమించే మహోన్నత నాయకుడు ప్రధాని మోదీ" అని కొనియాడారు. ఆయన స్ఫూర్తి ప్రతి భారతీయుడిలో నిండుగా ఉందని విష్ చేశారు. కింగ్ అక్కినేని నాగార్జున సైతం ప్రధాని మోదీకి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ, దేశాన్ని మరింత ప్రగతి పథంలోకి తీసుకెళ్లడానికి ఆయనకు భగవంతుడు మరింత శక్తిని ఇవ్వాలని ఆకాంక్షించారు. ప్రధాని మోదీకి టాలీవుడ్ స్టార్స్ శుభాకాంక్షలు తెలిపిన పోస్టులు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. అభిమానులు, నెటిజన్లు ఈ పోస్టులను రీట్వీట్ చేస్తూ ప్రధానికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఆ ఒపీనియన్ పోల్ ఫలితాలు నిజంగా నిజం అయితే, కేరళలో మళ్ళీ సీపీఎం సారధ్యంలోని వామపక్ష కూటమి అధికారంలోకి వస్తుంది. ఇదే ఆ అద్భుతం. ఎందుకంటే, గత నాలుగు దశాబ్దాలలో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే కూటమి వరసగా రెండవసారి అధికారంలోకి వచ్చిన చరిత్ర లేనే లేదు. ఒక సారి ఎల్డీఎఫ్ అధికారంలోకి వస్తే ఐదేళ్ళ తర్వాత కాంగ్రెస్ సారధ్యంలోని ఐక్య ప్రజాస్వామ్య కూటమి(యూడీఎఫ్) అధికారంలోకి రావడం, దేవభుమిలో దైవ నిర్ణయమా అన్నట్లుగా ప్రతి ఎన్నికల్లోనూ అధికారం చేతులు మారుతూ వస్తోంది. అలాంటిది, ఈసారి ఒపీనియన్ పోల్స్ నిజమై వరసగా రెండవసారి వామపక్ష కూటమి అధికారంలోకి వస్తే, అది చరిత్రే అవుతుంది. ఇక ఒపీనియన్ పోల్స్ విషయానికి వస్తే, జాతీయ న్యూస్ ఛానెల్ ఏబీపీ, సీ ఓటర్ సంస్థలు సంయుక్తంగా ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఈ సర్వే ప్రకారం, 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో వామపక్ష కూటమికి 83 నుంచి  91 స్థానాలు, యూడీఎఫ్ కూటమికి 47 నుంచి 55 స్థానాలు మాత్రమే దక్కుతాయని తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో ఇలా జాతకాలు తిరగబడడంపై సోషల్ మీడియాలో,’లెగ్ మహిమ’ లాంటి జోక్స్  ట్రోలవుతున్నాయి. అయితే 2016లో జరిగిన ఎన్నికల్లో కేవలం 47 సీట్లకే పరిమితం అయిన కాంగ్రెస్’కు ఈసారి ఒకటీ అరా సీట్లు ఎక్కువస్తే, రావచ్చును. అదే కాంగ్రెస్’కు కాసింత ఊరట. అదలా ఉంటే, పశ్చిమ బెంగాల్లో సైతం పట్టు సాధించిన బీజేపే, కేరళలో మాత్రం పట్టు కాదు కదా, పట్టుమని పది సీట్లు తెచ్చుకునే స్థితిలో లేదు. నిజానికి, దేశంలో బీజేపీకి అసలు ఏ మాత్రం మింగుడు పడని రాష్ట్రాలు ఎవైన ఉన్నాయంటే కేరళ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల  పేర్లే ప్రముఖంగా వినిపిస్తాయి. ఈ సారి కూడా కమల దళం కేరళలో కాలు పెట్టె పరిస్తి లేదని సర్వే ఫలితాలు చెపుతున్నారు. ఎప్పటిలానే ఇప్పడు కూడా  బీజేపీకి సున్నా నుంచి రెండు సీట్లు వచ్చే అవకాశం ఉందని, సర్వేస్వరుల అభిప్రాయంగా ఉంది. కేరళలో మొత్తం 140 స్థానాలకు ఏప్రిల్ 6 తేదీన ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది. మే 2 తేదీన ఫలితాలు వెలువడతాయి. కేరళ ఎలక్షన్ పై యావత్ దేశం ఆసక్తి కనబరుస్తోంది.    
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఓటరు తీర్పుకు వెళుతున్నా, అందరి దృష్టి, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల ఏలుబడిలో ఉన్న ఉభయ తెలుగు రాష్ట్రాలు, మరీ ముఖ్యంగా ఇప్పటికే బీజేపీ కన్నుపడిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీల దుష్టి  మాత్రం పశ్చిమ బెంగాల్ పైనే వుంది.  పశ్చిమ బెంగాల్లో ‘అద్భుతం’ జరిగి బీజేపీ విజయం సాధిస్తే, ఇక  కమల దళం ఫోకస్, తెలంగాణకు షిఫ్ట్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఈ నేపధ్యంలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయంలో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. బెంగాల్లో బీజేపీ గెలిస్తే, ఇప్పటికే అంతర్గత కుటుంబ కలహాలతో సతమతవుతున్న తెరాస నాయకత్వానికి మరిన్నితిప్పలు తప్పవన్న మాట అంతఃపుర వర్గాలలో సైతం వినవస్తోంది.  పశ్చిమ బెంగాల్’లో ఎలాగైతే కమలదళం ఓ వంక తమ ట్రేడ్ మార్క్, హిందుత్వ రాజకీయాలు సాగిస్తూ, మరో వైపు నుంచి ‘ఆకర్ష్’ అస్త్రంతో అధికార పార్టీని నిర్వీర్యం చేసిన విధంగానే, ఇక్కడ కూడా ఫిరాయింపులను ప్రోత్సహింఛి పార్టీని నిట్టనిలువునా చీల్చే ప్రమాదాన్ని కొట్టివేయలేమని పార్టీ వర్గాలు కూడా అనుమానం వ్యక్త పరుస్తున్నాయి.  ఇప్పటికే తెలంగాణ  బీజేపీ నాయకులు 30 మంది తెరాస ఎమ్మెల్యేలు తమ టచ్ లో ఉన్నారని బెదిరిస్తున్నారు.అది నిజం అయినా కాకపోయినా..తెరాసలో అసంతృప్తి అగ్గి రగులుతోందనేది మాత్రం ఎవరూ కాదనలేని నిజం. అంతే కాకుండా రాష్ట్రానికి వచ్చిన కేంద్రనాయకులు ఎవరిని పలకరించినా, నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని ఎలాంటి సషబిషలు లేకుండా కుండబద్దలు కొడుతున్నారు.అందుకే, బెంగాల్లో బీజేపీ గెలిస్తే.. అనే ఊహా కూడా  గులాబీ గూటిలో గుబులు పుట్టిస్తోంది. అయితే, బెగాల్’లో బీజేపీ గెలిస్తే ఒక్క తెలంగాణలోనే కాదు, దేశ రాజకీయ వాతావరణంలోనే పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  అలాగే,  దేశ ముఖ చిత్రంలో కూడా పెను మార్పులు తప్పవని అంటున్నారు. అయితే రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరూహించెదరు..
మన భారతీయ వంటింట్లో నిత్యం ఉపయోగించే సుగంధ ద్రవ్యాలలో వెల్లుల్లి అత్యంత విశిష్టమైన స్థానాన్ని కలిగి ఉంది. కేవలం వంటకాలకు అద్భుతమైన రుచిని, మంచి సువాసనను అందించడానికి మాత్రమే కాకుండా, అనేక రకాల తీవ్రమైన ఆరోగ్య సమస్యల నుండి మన శరీరాన్ని కాపాడటంలో వెల్లుల్లి ఒక దివ్యౌషధంలా పనిచేస్తుందని పురాతన ఆయుర్వేద వైద్యం నుండి నేటి ఆధునిక వైద్య శాస్త్రం వరకు స్పష్టం చేస్తున్నాయి. నిత్యం ఉదయాన్నే పరగడుపున వెల్లుల్లి రెబ్బలను తీసుకోవడం వల్ల లేదా మన రోజువారీ ఆహారంలో దీనిని భాగం చేసుకోవడం వల్ల అపారమైన ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి. ముఖ్యంగా మన శరీరంలో అత్యంత కీలకమైన గుండె మరియు నాడీ వ్యవస్థల పనితీరును అద్భుతంగా మెరుగుపరచడంలో వెల్లుల్లి వహించే పాత్ర అనితరసాధ్యమైనది. మానవ శరీరంలో నాడీ వ్యవస్థ అత్యంత ప్రాధాన్యమైనది. శరీరంలోని అన్ని అవయవాల సమాచార మార్పిడికి, మెదడు చురుగ్గా పనిచేయడానికి నాడీ వ్యవస్థ ఆరోగ్యంగా ఉండటం ఎంతో అవసరం. వెల్లుల్లిలో పుష్కలంగా లభించే  అల్లిసిన్  అనే అత్యంత శక్తివంతమైన సమ్మేళనం, విటమిన్ B6 మరియు వివిధ రకాల యాంటీఆక్సిడెంట్లు నాడీ వ్యవస్థకు గొప్ప రక్షణ కవచంలా నిలుస్తాయి. ఇవి నరాల బలహీనతను నివారించడమే కాకుండా, నాడుల కణజాలంపై ఒత్తిడి పడకుండా కాపాడుతాయి. క్రమం తప్పకుండా వెల్లుల్లిని తీసుకోవడం వల్ల మెదడులో రక్తప్రసరణ శరవేగంగా మెరుగుపడుతుంది. దీని ఫలితంగా నాడీ వ్యవస్థ పునరుజ్జీవనం పొంది, వయస్సు పెరిగే కొద్దీ వచ్చే జ్ఞాపకశక్తి లోపం, ఆల్జీమర్స్ మరియు పార్కిన్సన్స్ వంటి ప్రమాదకరమైన నరాల సంబంధిత వ్యాధుల బారిన పడకుండా మనల్ని కాపాడుతుంది. అంతేకాకుండా, ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది ప్రజలను బలితీసుకుంటున్న గుండె సంబంధిత సమస్యలకు వెల్లుల్లి ఒక అద్భుతమైన నివారణిగా పనిచేస్తుంది. వెల్లుల్లి రక్తంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ (LDL) స్థాయిలను గణనీయంగా తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఇది రక్తనాళాలలో కొవ్వు పేరుకుపోకుండా నిరోధించి, రక్తప్రసరణను నార్మల్ చేస్తుంది. రక్తపోటు (బిపి) తో బాధపడేవారికి వెల్లుల్లి ఒక సహజసిద్ధమైన మందులా పనిచేస్తుంది. వెల్లుల్లిలోని నైట్రిక్ ఆక్సైడ్ మరియు హైడ్రోజన్ సల్ఫైడ్ రక్తనాళాలను సడలించి, రక్తపోటును నియంత్రణలో ఉంచుతాయి. దీనివల్ల గుండెపై పడే అధిక ఒత్తిడి తగ్గి, గుండెపోటు (హార్ట్ ఎటాక్) మరియు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే ప్రమాదం చాలా వరకు తగ్గుతుంది. ఇక వెల్లుల్లిలోని యాంటీ ఇన్ఫ్లమేటరీ మరియు యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు శరీరంలో నిరోధక శక్తిని రెట్టింపు చేస్తాయి. సీజనల్ వ్యాధులైన జలుబు, దగ్గు, గొంతు నొప్పి నుండి తక్షణ ఉపశమనాన్ని ఇస్తాయి. జీర్ణ వ్యవస్థను వేగవంతం చేసి, కడుపులో గ్యాస్ మరియు ఉబ్బరం సమస్యలను నివారిస్తాయి. రోజువారీ జీవితంలో గుండె ఆరోగ్యాన్ని పటిష్టం చేసుకోవడానికి, నాడీ వ్యవస్థను చురుగ్గా మార్చుకోవడానికి ప్రతిరోజూ రెండు వెల్లుల్లి రెబ్బలను ఆహారంలో చేర్చుకోవడం శ్రేయస్కరం.     [ Garlic, Garlic Benefits, Allicin, Heart Health, Nervous System, Brain Health, LDL Cholesterol, Blood Pressure, Antioxidants, Immunity ]  
మన అనునిత్య జీవితంలో శీతోష్ణస్థితిలో వచ్చే మార్పులు, పెరిగే వాయు కాలుష్యం, అధిక వేడి, విపరీతమైన చెమట, అలర్జీలు మరియు బ్యాక్టీరియల్ సంక్రమణల వల్ల చర్మంపై తీవ్రమైన దురద, ఎర్రటి మచ్చలు, దద్దుర్లు మరియు మంట రావడం అత్యంత సాధారణ సమస్యగా మారింది. చర్మంపై దద్దుర్లు వచ్చినప్పుడు నిరంతరం గోకడం వల్ల ఆ ప్రదేశంలో చర్మం మరింతగా దెబ్బతిని, రక్తస్రావం జరగడమే కాకుండా ఇన్ఫెక్షన్ ఇతర శరీర భాగాలకు వ్యాపించే ప్రమాదం ఎంతైనా ఉంది. సాధారణంగా ఈ సమస్య నుంచి తక్షణ ఉపశమనం పొందేందుకు మనలో చాలామంది మార్కెట్లో దొరికే రసాయనాలతో కూడిన క్రీములు లేదా అలోపతి మందులను ఆశ్రయిస్తుంటారు. అయితే వీటివల్ల తాత్కాలికంగా ఉపశమనం లభించినప్పటికీ, సుదీర్ఘకాలంలో చర్మం తన సహజత్వాని కోల్పోయే అవకాశం ఉంది. కానీ, మన పూర్వీకులు శతాబ్దాలుగా ఉపయోగిస్తున్న సహజ సిద్ధమైన, ఇంట్లోనే లభించే దివ్యౌషధం పటిక బెల్లం (మిశ్రీ) అని ఆయుర్వేద నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఆయుర్వేద వైద్య శాస్త్రంలో పటిక బెల్లానికి అత్యంత విశిష్టమైన స్థానం ఉంది. దీనిలో ఉండే అద్భుతమైన శీతలీకరణ (కూలింగ్) గుణాలు మరియు యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ శక్తులు చర్మానికి అత్యంత వేగవంతమైన ఉపశమనాన్ని అందిస్తాయి. చర్మంపై తీవ్రమైన దురద, మంట, బాహ్య దద్దుర్లు లేదా తామర వంటి సమస్యలు వేధిస్తున్నప్పుడు పటిక బెల్లాన్ని సరిగ్గా ఉపయోగించడం ద్వారా ఆశ్చర్యకరమైన ఫలితాలను పొందవచ్చు. ఇది చర్మంపై ఉండే హానికర బ్యాక్టీరియాను సంపూర్ణంగా నశింపజేసి, చర్మ కణాలను శాంతపరుస్తుంది. ప్రతికూల అలర్జీల వల్ల కలిగే తీవ్రమైన అసౌకర్యాన్ని తగ్గించి, చర్మానికి తక్షణ పునరుజ్జీవనాన్ని అందించడంలో పటిక బెల్లం పరమౌషధంగా పనిచేస్తుంది. ఈ పటిక బెల్లం నివారణా పద్ధతిని ఇంట్లోనే అత్యంత సులభంగా తయారుచేసుకోవచ్చు. ముందుగా నాణ్యమైన పటిక బెల్లాన్ని తీసుకుని మెత్తటి పౌడర్‌లా తయారుచేసుకోవాలి. ఈ పటిక బెల్లం పొడికి సమాన నిష్పత్తిలో కొబ్బరి నూనె లేదా స్వచ్ఛమైన ఆవు నెయ్యి లేదా రోజ్ వాటర్ (పన్నీరు) కలిపి మెత్తని పేస్ట్‌లా సిద్ధం చేసుకోవాలి. చర్మంపై తీవ్రమైన దురద, మంట లేదా ఎరుపు ఉన్న భాగాలను ముందుగా గోరువెచ్చని నీటితో పరిశుభ్రంగా తుడిచి ఆరబెట్టాలి. అనంతరం తయారుచేసుకున్న ఈ పటిక బెల్లం మిశ్రమాన్ని ప్రభావిత ప్రాంతంలో సజావుగా పూయాలి. ఇలా పూసిన తర్వాత కనీసం 15 నుండి 20 నిమిషాల పాటు దానిని చర్మంపై అలాగే ఆరనివ్వాలి. పటిక బెల్లంలోని చల్లదనపు గుణాలు చర్మ లోతుల్లోకి ఇంకి, కణాల మంటను మరియు దురదను క్షణాల్లో ఉపశమనం చేస్తాయి. ఆ తర్వాత చల్లటి నీటితో ఆ ప్రాంతాన్ని మెల్లగా కడిగి శుభ్రం చేసుకోవాలి. ఈ సహజ సిద్ధమైన పటిక బెల్లం చికిత్సను ప్రతిరోజూ రెండు నుండి మూడు సార్లు క్రమం తప్పకుండా పాటిస్తే, తీవ్రమైన దురద సమస్య కేవలం కొన్ని రోజుల్లోనే శాశ్వతంగా నయమవుతుంది. దీనివల్ల చర్మంపై ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేదా రసాయనాల దుష్ప్రభావాలు ఉండవు. ఎటువంటి ఖర్చు లేని, మన వంటింట్లోనే దొరికే ఈ సులువైన ఆయుర్వేద చికిత్సను పాటించడం ద్వారా రసాయన క్రీముల బారిన పడకుండా మన చర్మాన్ని అత్యంత ఆరోగ్యకరంగా, కోమలంగా మరియు ప్రశాంతంగా కాపాడుకోవచ్చు.     [ Skin Rash, Skin Itching, Misiri, Ayurveda, Natural Skin Care, Skin Allergies, Skin Inflammation, Bacterial Infection, Coconut Oil, Traditional Remedies ]
ప్రపంచవ్యాప్తంగా వ్యాపిస్తున్న దీర్ఘకాలిక వ్యాధుల్లో మధుమేహం మరియు దాని వల్ల వచ్చే కిడ్నీ సంబంధిత సమస్యలు అత్యంత ప్రమాదకరంగా మారుతున్నాయి. టైప్ 1 మరియు టైప్ 2 మధుమేహంతో బాధపడుతున్న రోగులలో దాదాపు 40 శాతం మందికి డయాబెటిక్ కిడ్నీ డిసీజ్ (డికెడి) వచ్చే అవకాశం ఉందని వైద్య గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఈ వ్యాధి ముదిరితే మూత్రపిండాలు పూర్తిగా విఫలమై, రోగులు డయాలసిస్ లేదా ఆర్గాన్ ట్రాన్స్‌ప్లాంటేషన్ పద్ధతులపై మాత్రమే ఆధారపడాల్సి వస్తుంది. అయితే ఈ క్లిష్టమైన సమస్యకు పరిష్కారంగా వైద్య పరిశోధకులు సరికొత్త కాండకణాల (స్టెమ్ సెల్) థెరపీని కనుగొన్నారు. ఈ వినూత్న పరిశోధన మధుమేహ బాధితులకు, ముఖ్యంగా కిడ్నీ వైఫల్యంతో పోరాడుతున్న వారికి ఒక కొత్త ఆశల కిరణాన్ని అందిస్తోంది. మూత్రపిండాలలో ఉండే చిన్నపాటి రక్తాన్ని వడబోసే ఫిల్టర్లను  గ్లోమెరులి  అని పిలుస్తారు. మధుమేహం కారణంగా రక్తంలో చక్కెర స్థాయిలు సుదీర్ఘకాలం పాటు ఎక్కువగా ఉన్నప్పుడు, ఈ గ్లోమెరులి తీవ్రంగా దెబ్బతింటాయి. దీనివల్ల రక్తాన్ని సరిగ్గా వడబోసే సామర్థ్యాన్ని కిడ్నీలు కోల్పోతాయి. ప్రస్తుతం అందుబాటులో ఉన్న సాంప్రదాయ వైద్య చికిత్సలు కేవలం వ్యాధి తీవ్రతను కాస్త నెమ్మదింపజేయడానికి మాత్రమే ఉపయోగపడతాయి తప్ప, దెబ్బతిన్న కిడ్నీ కణజాలాన్ని తిరిగి బాగు చేయలేవు. కానీ, నూతనంగా అభివృద్ది చేసిన ఈ స్టెమ్ సెల్ విధానం ద్వారా మూత్రపిండాల కణాలను పునరుద్ధరించడం (రీజనరేషన్) సాధ్యమవుతుందని శాస్త్రవేత్తలు ప్రాథమిక ప్రయోగాల ద్వారా నిరూపించారు. ఈ పరిశోధనలో భాగంగా శాస్త్రవేత్తలు  మెసెంకిమల్ స్టెమ్ సెల్స్  (ఎమ్‌ఎస్‌సి) ను ఉపయోగించారు. ఇవి శరీరంలోని దెబ్బతిన్న కణజాలాన్ని పునరుత్పత్తి చేయడంతో పాటు తీవ్రమైన వాపును (ఇన్‌ఫ్లమేషన్) తగ్గించడంలో అద్భుతమైన పాత్ర పోషిస్తాయి. పరిశోధనాత్మక ప్రయోగాల్లో ఈ కాండకణాలను అందించినప్పుడు, మూత్రపిండాల ఫిల్ట్రేషన్ రేటు గణనీయంగా మెరుగుపడిందని మరియు మూత్రంలో ప్రోటీన్ లీకేజ్ (అల్బుమినూరియా) దాదాపు 35 నుండి 50 శాతం వరకు తగ్గిందని సైంటిస్టులు తమ నివేదికలో స్పష్టం చేశారు. ఇది మూత్రపిండాలు మళ్లీ సాధారణ స్థితికి చేరుకోవడానికి సంకేతంగా భావించవచ్చు. అంతేకాకుండా, ఈ స్టెమ్ సెల్ చికిత్స దెబ్బతిన్న గ్లోమెరులి కణాలను తిరిగి నిర్మించడంలో సహాయపడటమే కాకుండా, కొత్త రక్తనాళాల ఏర్పాటును (యాంజియోజెనెసిస్) ప్రోత్సహిస్తుందని అధ్యయనాలు వెల్లడించాయి. దీనివల్ల కిడ్నీలకు రక్తప్రసరణ మెరుగై, క్షీణించిన కణాలు మళ్లీ సజీవంగా మారతాయి. ఇప్పటివరకు జరిగిన ప్రీ-క్లినికల్ ట్రయల్స్ మరియు ప్రాథమిక మానవ ప్రయోగాలలో ఈ థెరపీ అత్యంత సురక్షితమైనదని తేలింది. సాంప్రదాయ చికిత్సలతో పోలిస్తే ఇది అత్యంత సమర్థవంతంగా పనిచేస్తూ కిడ్నీ వైఫల్యాన్ని అడ్డుకుంటోంది. ఈ విప్లవాత్మక స్టెమ్ సెల్ సాంకేతికత అందుబాటులోకి వస్తే, డయాబెటిక్ కిడ్నీ డిసీజ్ రోగులకు వారానికి పలుమార్లు చేసుకునే వేదనతో కూడిన డయాలసిస్ ప్రక్రియ నుండి మరియు కిడ్నీ మార్పిడి కోసం సంవత్సరాల తరబడి వేచి చూడాల్సిన అవసరం నుండి శాశ్వత ఉపశమనం లభిస్తుంది. వైద్య రంగంలో ఈ ఆవిష్కరణ ఒక కొత్త అధ్యాయానికి నాంది పలికిందని, రాబోయే రోజుల్లో విస్తృత స్థాయిలో అందుబాటులోకి వస్తే మిలియన్ల మంది మధుమేహ బాధితుల జీవితాలలో వెలుగులు నింపుతుందని అంతర్జాతీయ వైద్య నిపుణులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.     [ Diabetes, Diabetic Kidney Disease, Kidney Health, Stem Cell Therapy, Mesenchymal Stem Cells, Kidney Failure, Glomeruli, Albuminuria, Regenerative Medicine, Diabetes Research ]
నీలిబృంగాది తైలం పూర్వకాలం నుండి ఆయుర్వేదంలో జుట్టు సంరక్షణకు ఉపయోగించే  ఒక అద్భుతమైన మూలికా నూనెగా పేరుగాంచింది. నేటి కాలంలో పెరిగిన కాలుష్యం, మానసిక ఒత్తిడి,  జీవనశైలి సరిగా లేకపోవడం,  రసాయన ఉత్పత్తుల వాడకం వల్ల అనేక రకాల జుట్టు సమస్యలు వస్తున్నాయి. ఇలాంటి సమస్యలన్నింటికీ నీలిబృంగాది తైలం ఒక సహజసిద్ధమైన పరిష్కారంగా పనిచేస్తుంది. ఈ నూనె గురించి మరింత వివరంగా తెలుసుకుంటే.. నూనె తయారీలో వాడే పదార్థాలు.. ఈ నూనె తయారీలో నీలి, భృంగరాజ్ లేదా గుంటగలగర, ఆమ్లా లేదా ఉసిరి, శతక్రాంత, అజక్షీర అంటే మేక పాలు, మహిష క్షీర అంటే  బర్రె పాలు, గోక్షీర అంటే ఆవు పాలు,  మరియు కొబ్బరి పాలు లేదా నువ్వుల నూనె వంటి శక్తివంతమైన ఆయుర్వేద మూలికలు మరియు పాలను ఉపయోగిస్తారు. ఈ పదార్థాల కలయిక జుట్టుకు , కుదుళ్లకు కావలసిన సమగ్ర పోషణను అందిస్తుంది. ప్రయోజనాలు.. నీలిబృంగాది తైలం క్రమం తప్పకుండా వాడటం వల్ల జుట్టు రాలడం చాలా  తగ్గుతుంది. ఇది కుదుళ్లను దృఢంగా మార్చి, కొత్త జుట్టు పెరగడానికి సహాయపడుతుంది. ఈ నూనెలో ఉండే నీలి , భృంగరాజ్ మూలికలు జుట్టు సహజ రంగును కాపాడటంలో విశేషంగా తోడ్పడతాయి. చిన్న వయస్సులోనే వచ్చే తెల్ల జుట్టు సమస్యను నివారించడంలో , జుట్టును ఒత్తుగా, నల్లగా ఉంచడంలో ఇది ప్రముఖ పాత్ర వహిస్తుంది. జుట్టు పెరగడమే కాకుండా, తలలో వచ్చే చుండ్రు , దురద సమస్యలను తగ్గించడంలో కూడా ఇది ఎంతో ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఇందులో ఉండే యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు స్కాల్ప్ ను ఆరోగ్యంగా ఉంచుతాయి. కుదుళ్లలో రక్తప్రసరణను మెరుగుపరచి, వెంట్రుకలు చిట్లడాన్ని , పొడిబారడాన్ని అడ్డుకుంటాయి. ఈ తైలం కేవలం జుట్టుకే కాకుండా మానసిక ప్రశాంతతకు కూడా తోడ్పడుతుంది. ఇందులో ఉండే చలవ చేసే గుణం వల్ల రాత్రి పూట ఈ నూనెతో తలకు మర్దన చేసుకుంటే ఒత్తిడి తగ్గి, మంచి నిద్ర పడుతుంది. కంటి అలసటను తగ్గించి, శిరోభారాన్ని ఉపశమనం చేయడంలో ఇది సహాయపడుతుంది. ఎలా వాడాలి?  ఈ నూనెను వాడే విధానం కూడా చాలా సులభం. కొద్దిగా తైలాన్ని తీసుకుని కుదుళ్లకు బాగా పట్టించి, మునివేళ్ళతో  సున్నితంగా మర్దన చేయాలి. కనీసం అర గంట నుండి గంట సేపు ఉంచుకున్న తర్వాత మెత్తటి సీకాయ లేదా మైల్డ్ ఆయుర్వేద షాంపూతో తలస్నానం చేయాలి. వారానికి రెండు నుండి మూడు సార్లు ఈ నూనెను ఉపయోగించడం వల్ల మంచి ఫలితాలు కనిపిస్తాయి.  సహజమైన పద్ధతిలో జుట్టును ఆరోగ్యంగా, దృఢంగా , అందంగా మార్చుకోవడానికి నీలిబృంగాది తైలం చాలా మంచి ఎంపిక.                        *రూపశ్రీ.  
టైఫాయిడ్ వచ్చిన తర్వాత ఆరోగ్యం విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? జీర్ణక్రియ సక్రమంగా ఉండేందుకు ఎలాంటి ఆహారం తీసుకోవాలి? ఈ విషయాల గురించి యునాని వైద్య నిపుణురాలు డాక్టర్ ఎస్.జి.వి. సత్య ఈ వీడియోలో వివరిస్తున్నారు. ముఖ్యంగా చెన్నంగాకు  ( కసువింద, కసుంధి ఆకులు)   గురించి, వీటిని చట్నీ, పొడి లేదా కూర రూపంలో తీసుకోవడం గురించి డాక్టర్ సత్య వివరించారు. టైఫాయిడ్ తర్వాత జీర్ణక్రియకు సంబంధించిన సమస్యలు, తీసుకోవాల్సిన ఆహారం, ఆరోగ్య జాగ్రత్తల గురించి ఈ వీడియోలో తెలుసుకోవచ్చు. టైఫాయిడ్‌కు సంబంధించిన ఆహారపు అలవాట్లు, చెన్నంగాకు ఉపయోగాలు, జీర్ణక్రియకు సంబంధించిన డాక్టర్ సూచనలు తెలుసుకోవాలంటే పూర్తి వీడియోను చూడండి. గమనిక: ఈ వీడియోలోని సమాచారం ఆరోగ్య అవగాహన కోసం మాత్రమే. టైఫాయిడ్ వంటి అనారోగ్య పరిస్థితుల్లో వైద్యుల సలహా మేరకు చికిత్స తీసుకోవాలి. మందులను వైద్యుల సూచన లేకుండా ఆపకండి. మీ ఆరోగ్య సమస్య ఏదైనా... మా హెల్త్ యూట్యూబ్ ఛానల్‌లో సీనియర్ డాక్టర్స్ చెప్పిన సలహాలు... సూచనలు ఉన్నాయి. మా యూట్యూబ్ ఛానల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 👉 TeluguOne Health (సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!)
అమరాంత్ సీడ్స్.. తోటకూర గింజలు లేదా రాజ్‌గిరా అని వీటిని పిలుస్తారు. ఇవి ఇటీవల కాలంలో సూపర్ ఫుడ్‌గా విపరీతమైన ప్రజాదరణ పొందుతున్నాయి. ప్రాచీన కాలం నుండి మన సాంప్రదాయ ఆహారంలో భాగమైన ఈ గింజలు, ఆధునిక ఆరోగ్య నిపుణుల ప్రశంసలు అందుకుంటున్నాయి. మన నిత్య జీవితంలో తోటకూరను ఆకుకూరగా ఎంతగా ఉపయోగిస్తామో, దాని గింజలలో ఉన్న పోషక విలువలు కూడా అంతకంటే ఎక్కువే. సాధారణంగా కనిపించే ఈ చిన్న గింజలను ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల శరీరంలో అద్భుతమైన మార్పులు కనిపిస్తాయి. అవేంటో తెలుసుకుంటే.. అమరాంత్ సీడ్స్ అంటే.. అమరాంత్ సీడ్స్ అనేది 'అమరాంథస్' అనే మొక్క నుండి లభించే గింజలు. తెలుగులో వీటిని తోటకూర గింజలు అని పిలుస్తారు. ఉత్తర భారతదేశంలో వీటిని 'రాజ్‌గిరా' లేదా 'రామ్‌దానా' అని అంటారు. అమరాంత్ గింజలను ధాన్యాల జాబితాలో చేర్చినప్పటికీ, వృక్షశాస్త్రం ప్రకారం ఇవి నిజానికి సూడోసిరియల్స్ గా పిలుస్తున్నారు. అంటే బియ్యం, గోధుమల లాగా కాకుండా, ఇవి ఆకుకూరల జాతికి చెందిన గింజలు. అందుకే వీటిలో ఇతర సాధారణ ధాన్యాల కంటే పోషకాలు ఎంతో ఎక్కువగా ఉంటాయి. ఇందులో గ్లూటెన్ ఉండకపోవడం వల్ల ఇది గ్లూటెన్ అలర్జీ ఉన్నవారికి సురక్షితమైన ప్రత్యామ్నాయంగా మారుతుంది. ఆరోగ్యానికి అమరాంత్ సీడ్స్ చేసే మేలు.. పోషకాల గని: అమరాంత్ గింజలలో శరీరానికి కావలసిన అత్యంత ముఖ్యమైన విటమిన్లు , ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇందులో క్యాల్షియం, మెగ్నీషియం, ఐరన్, ఫోస్ఫరస్ , పోటాషియం సమృద్ధిగా లభిస్తాయి. ముఖ్యంగా ఎముకల ఆరోగ్యానికి అవసరమైన క్యాల్షియం ఇతర ధాన్యాలతో పోలిస్తే ఇందులో చాలా ఎక్కువగా ఉంటుంది. ప్రొటీన్: సాధారణంగా వృక్ష సంబంధిత ఆహారాలలో అన్ని రకాల అమైనో ఆసిడ్లు లభించడం చాలా అరుదు. కానీ అమరాంత్ లో శరీరానికి అవసరమైన తొమ్మిది రకాల అవసరమైన అమైనో ఆసిడ్లు ఉంటాయి. ముఖ్యంగా 'లైసిన్' అనే అమైనో ఆసిడ్ ఇందులో ఉండటం వల్ల ఇది శరీరంలో ప్రొటీన్ శోషణకు ఎంతగానో తోడ్పడుతుంది. శాఖాహారులకు, కండరాల పుష్టిని కోరుకునే వారికి ఇది సరైన పోషకాహారం. జీర్ణవ్యవస్థ మెరుగుదల: అమరాంత్ గింజలలో  ఫైబర్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది జీర్ణక్రియను వేగవంతం చేసి మలబద్ధకం సమస్యను నివారిస్తుంది. అలాగే ప్రేగుల ఆరోగ్యాన్ని కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఫైబర్ ఎక్కువ సమయం కడుపు నిండిన భావనను కలిగిస్తుంది కాబట్టి, అతిగా తినే అలవాటు తగ్గుతుంది. గుండె ఆరోగ్యం , కొలెస్ట్రాల్ నియంత్రణ: అమరాంత్ లో ఉండే సహజ నూనెలు , ఫైబర్ రక్తంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ (LDL) స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయి. ఇందులో ఉన్న యాంటీఆక్సిడెంట్లు గుండె నాళాల్లో పూడికలు ఏర్పడకుండా నిరోధించి, రక్తప్రసరణను నార్మల్ గా ఉండేలా చేస్తాయి. తద్వారా రక్తపోటు నియంత్రణలో ఉండి గుండె జబ్బుల ముప్పు తగ్గుతుంది. బరువు తగ్గడానికి: బరువు తగ్గాలనుకునే వారికి అమరాంత్ సీడ్స్ చక్కని ఎంపిక. తక్కువ క్యాలరీలు, అధిక ప్రొటీన్ , పీచు పదార్థం కలిగి ఉండటం  వల్ల శరీర జీవక్రియ రేటు అంటే మెటబాలిజం  పెరుగుతుంది. కొవ్వును కరిగించే ప్రక్రియ వేగవంతమై, ఆరోగ్యకరమైన రీతిలో బరువు తగ్గడానికి ఇది దోహదపడుతుంది. డయాబెటిస్ నియంత్రణ: ఈ గింజలలో ఉన్న గ్లైసెమిక్ ఇండెక్స్ సాధారణ ధాన్యాల కంటే తక్కువగా ఉంటుంది. దీని వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు ఒక్కసారిగా పెరగకుండా క్రమబద్ధంగా ఉంటాయి. మధుమేహ వ్యాధిగ్రస్తులు తమ రోజువారీ ఆహారంలో అమరాంత్ ను చేర్చుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుకోవచ్చు. వ్యాధి నిరోధక శక్తి.. అమరాంత్ లో స్క్వాలేన్ , లోనాఫిన్ వంటి శక్తివంతమైన సమ్మేళనాలు  ఉంటాయి. ఇవి శరీరంలో  ఇన్ఫ్లమేషన్ తగ్గించడమే కాకుండా, క్యాన్సర్ కణాల పెరుగుదలను అడ్డుకోవడంలో తోడ్పడతాయి. శరీర కణజాలాన్ని రక్షించే యాంటీఆక్సిడెంట్లు రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తాయి. ఆహారంలో అమరాంత్ సీడ్స్ ఎలా తీసుకోవాలి? అమరాంత్ సీడ్స్ ని వివిధ రకాలుగా ఆహారంలో భాగం చేసుకోవచ్చు. వీటిని వేయించి, పాప్‌కార్న్ లాగా మార్చి పాలు లేదా తేనెతో కలిపి ఉదయపు అల్పాహారంగా తీసుకోవచ్చు. వరి అన్నం లాగే వీటిని ఉడికించి తీసుకోవచ్చు లేదా ఉప్మా రూపంలో వండుకోవచ్చు. అమరాంత్ గింజలను పిండిగా తయారుచేసి  గోధుమ పిండితో కలిపి రొట్టెలు, చపాతీలు తయారు చేసుకోవచ్చు. పాయసం లేదా పానీయాలలో ఉడకబెట్టిన అమరాంత్ గింజలను చేర్చి పౌష్టికాహారంగా తీసుకోవచ్చు. సలాడ్లు లేదా సూప్‌లలో వేయించిన అమరాంత్ గింజలను పైన చల్లుకోవడం ద్వారా పోషక విలువలతో పాటు రుచిని పెంచుకోవచ్చు.                      *రూపశ్రీ.