Home

»

Latest News

ఇదెక్కడి పోస్టర్ మావ: 'జాంబీ రెడ్డి 2' ఫస్ట్ లుక్.. తలకిందులుగా వేలాడుతూ ఉపేంద్ర రచ్చ.!

Sep 18, 2026 12:20PM

తేజ సజ్జా హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో 2020లో వచ్చిన సూపర్ హిట్ మూవీ 'జాంబీ రెడ్డి'. ఇప్పుడు ఈ సూపర్ హిట్ ప్రాంచైజీ నుంచి సీక్వెల్‌గా 'జాంబీ రెడ్డి 2' రాబోతోంది. కన్నడ రియల్ స్టార్ ఉపేంద్ర ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తుండటం విశేషం. నేడు(సెప్టెంబర్ 18) ఉపేంద్ర పుట్టినరోజు సందర్భంగా తాజాగా టీమ్ ఒక మైండ్ బ్లాకింగ్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేసింది.

ఈ పోస్టర్ చూసిన ప్రతీ ఒక్కరూ షాక్ అవుతున్నారు. చెట్టు కొమ్మకు తలకిందులుగా వేలాడుతూ, చేతిలో వెరైటీ ఆయుధాన్ని పట్టుకుని, భయంకరమైన రా అండ్ రస్టిక్ అవతార్‌లో ఉపేంద్ర కనిపిస్తున్న తీరు సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. "ప్రపంచాన్ని తలకిందులు చేయడానికి సిద్ధంగా ఉన్నాం" అంటూ పోస్టర్‌పై ఉన్న ట్యాగ్‌లైన్ ఈ సినిమాలో ఉండబోయే వైవిధ్యమైన కంటెంట్ కి అద్దం పడుతోంది.

ఉపేంద్ర అంటేనే డిఫరెంట్ కంటెంట్ కి, డిఫరెంట్ గెటప్స్ కి పెట్టింది పేరు. ఆలాంటి యాక్టర్ 'జాంబీ రెడ్డి 2'లో భాగం కావడంతో మరింత ఆసక్తి నెలకొంది. ఈ సినిమాలో మునుపెన్నడూ చూడని ఒక కొత్త రకమైన మ్యాడ్‌నెస్, మాస్ అవతార్‌ను చూపించబోతున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. 

సుపర్ణ్ వర్మ దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తోంది. ప్రశాంత్ వర్మ క్రియేటర్ గా వ్యవహరిస్తున్నారు. గౌరహరి సంగీతం అందిస్తున్నారు. 

 

 

 

[Zombie Reddy 2 NXT LVL, Upendra Birthday Poster, Zombie Reddy 2 Movie, Upendra First Look, Zombie Reddy 2, Real Star Upendra, Teja Sajja, Prasanth Varma, People Media Factory, Telugu Film News]

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com