Home

»

Latest News

రామ్ చరణ్ గొప్ప మనసు: ఆ వెయ్యి మంది మహిళలకి ఎంత ఇస్తున్నాడో తెలుసా!

Sep 17, 2026 9:50PM

 

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ఏం చేసినా అందులో వైవిధ్యం అనేది ఉండటం పక్కా. సామాజిక సేవ పరంగా కూడా ఆ వైవిధ్యాన్ని ప్రదర్శించడంలో  ఏ మాత్రం వెనుకాడడు. అందుకు  ఈ రోజు జరుగుతున్న భారత ప్రధాని నరేంద్ర మోదీ పుట్టినరోజు సాక్ష్యం.


సినీ, రాజకీయ, సామాజిక ప్రముఖులు మోదీకి జన్మదిన శుభాకాంక్షలు అందజేస్తున్నారు. అయితే  చరణ్ మాత్రం కేవలం శుభాకాంక్షలకే పరిమితం కాకుండా, సమాజానికి మేలు చేకూరే ఒక అద్భుతమైన సామాజిక కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. దేశాభివృద్ధిలో మహిళా సాధికారతే కీలకమని నమ్ముతున్న చరణ్, మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని చేపట్టిన ఒక బృహత్తర ప్రకటన ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో  ట్రెండ్ అవుతోంది. మోదీ నిరంతరం దేశం కోసం చేస్తున్న నిస్వార్థ సేవలు, వికసిత్ భారత్ సాధన కోసం ఆయన చూపుతున్న దూరదృష్టి తనకు ఎంతగానో స్ఫూర్తినిచ్చాయని రామ్ చరణ్ తెలిపారు. ఈ స్ఫూర్తితోనే బిజెపి ప్రారంభించిన ‘సేవా సంకల్ప్ అభియాన్’ అనే మహత్తర కార్యక్రమంలో తాను కూడా భాగస్వామిని అవుతున్నట్లు అధికారికంగా వెల్లడించారు. ఈ అభియాన్ లో భాగంగా రామ్ చరణ్ ఒక కీలకమైన హామీ ఇచ్చారు. రాబోయే కొద్ది నెలల్లో సరిగ్గా 1000 మంది మహిళలకు ఉచితంగా స్కిల్ డెవలప్‌మెంట్ (నైపుణ్యాభివృద్ధి) శిక్షణ అందించనున్నట్లు ప్రకటించాడు.

 

 


Also read: సూర్య కొత్త మూవీ టీజర్ వచ్చేసింది: రామాయణకి పోటీ తప్పదా!

 ఈ 1000 మంది మహిళలకు ఇచ్చే నైపుణ్య శిక్షణ వల్ల వారు స్వయం ఉపాధి అవకాశాలను పొంది తమ జీవితాల్లో కొత్త వెలుగులు నింపుకోగలుగుతారు. కేవలం సోషల్ మీడియా వేదికగా విష్ చేసి ఊరుకోకుండా, ఏకంగా 1000 మంది మహిళల జీవితాలను మార్చే దిశగా అడుగులు వేయడం చరణ్ యొక్క ఉదారతకు, సామాజిక బాధ్యతకి  అద్దం పడుతోంది.

 

 

 

[Ram Charan, Modi, Upasana, Ram charan Joins Seva Sankalp Abhiyan Pledges Skill Development,Seva Sankalp Abhiyan, Telugu Cinema, Telugu Cinema News, Tollywood, Tollywood News]
 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com