Home

»

Latest News

విశ్వంభర vs కాకా: డైరెక్టర్ వశిష్ఠ షాకింగ్ ట్వీట్.!

Sep 18, 2026 11:32AM

2027 సంక్రాంతి పోరు చిరంజీవి వర్సెస్ చిరంజీవిగా మారే అవకాశముందని వార్తలొస్తున్నాయి. 'కాకా' సినిమా విడుదల తేదీ అధికారికంగా ఖరారైంది. జనవరి 13న ఈ సినిమాను థియేటర్లలోకి తీసుకొస్తున్నట్లు నిర్మాతలు స్పష్టం చేశారు. అదే సమయంలో 'విశ్వంభర' కూడా సంక్రాంతి బరిలోనే నిలుస్తుందని ప్రచారం జరుగుతోంది. అయితే విశ్వంభర రిలీజ్ డేట్‌పై మేకర్స్ నుంచి ఇంకా ఎలాంటి అఫిషియల్ అనౌన్స్‌మెంట్ రాలేదు. ఈ సందేహాల నడుమ, దర్శకుడు వశిష్ఠ సోషల్ మీడియాలో పెట్టిన ఒక డివోషనల్ అండ్ మిస్టీరియస్ పోస్ట్ ఇప్పుడు నెట్టింట చర్చనీయాంశంగా మారింది.

దర్శకుడు వశిష్ఠ ఒక శివ ప్రవచనం వీడియోను పంచుకుంటూ.. "శ్వాస నాది, శాసనం నీది.. ఆశ నాది, పాశం నీది.. ఆత్మ నాది, ఆట నీది.. ఎంత మాయగాడివయ్యా! ఓం నమః శివాయ!!! ఇందుకేనా నిన్ను ‘విశ్వంభరుడు’ అని పిలిచేది? సర్వం శివం.. ఓం నమః శివాయ!!" అని ఒక గూస్‌బమ్స్ తెప్పించే క్యాప్షన్ జత చేశారు. రిలీజ్ డేట్‌పై అభిమానుల్లో గందరగోళం నెలకొన్న తరుణంలో వశిష్ఠ పెట్టిన ఈ పోస్ట్ చూసి మెగా ఫ్యాన్స్ రకరకాల అంచనాలు వేస్తున్నారు.

గ్రాఫిక్స్‌కి ప్రాధాన్యమున్న సోషియో ఫాంటసీ కథతో 'విశ్వంభర' చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. ఈ సినిమాలో త్రిష, ఆషికా రంగనాథ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అయితే వీఎఫ్‌ఎక్స్ వర్క్ వల్ల సినిమా విడుదల పలుమార్లు వాయిదా పడుతూ వచ్చింది. ఇప్పుడు సంక్రాంతికి రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

మరి ఒకే సంక్రాంతి సీజన్‌లో 'కాకా', 'విశ్వంభర' రెండూ వస్తాయా లేక విశ్వంభర సరికొత్త డేట్‌తో సోలోగా బాక్సాఫీస్ దాడికి దిగుతుందా అనేది వేచి చూడాలి.

 

 

 

[Vishwambhara vs Kaaka, Vishwambhara Release Date, Kaaka Release Date, Vishwambhara Sankranti Release, Kaaka vs Vishwambhara, Megastar Chiranjeevi, Director Vassishta, Telugu Film News, Telugu News]

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com