
హిట్టు నా ఇంటి పేరు.. సూపర్ హిట్ నా ఒంటి పేరు అంటూ కరుప్పు( వీరభద్రుడు), విశ్వనాధ్ అండ్ సన్స్ తో సూర్య ఫామ్ లో ఉన్న విషయం తెలిసిందే. రాబోయే మూవీ కూడా అదే ఫామ్ ని కంటిన్యూ పక్కా అంటూ అప్ కమింగ్ మూవీ 'సీన్' తో రాబోతున్నాడు. అవును 'జితు మాధవన్' దర్శకత్వంలో చేస్తున్న సూర్య 47వ చిత్రానికి 'సీన్' (Scene) అనే టైటిల్‌ని ఖరారు చేస్తూ చిత్రబృందం ఒక గ్లింప్స్ టీజర్ ని కాసేపటి క్రితం విడుదల చేసింది.
సుమారు నిమిషం 15 సెకన్లు ఉన్న టీజర్ చూస్తుంటే సూర్య క్యారక్టర్ ఊహించని షేడ్స్ లో సాగబోతుందనే విషయం అర్ధమవుతూ ఉంది. పక్కా యాక్షన్ ఎంటర్ టైనర్ అనే విషయం తెలుస్తుండటంతో ఈ సారి గత రెండు చిత్రాలకి భిన్నంగా సరికొత్త సూర్య మెస్మరైజ్ చేయడం పక్కా. సూర్య సొంత నిర్మాణ సంస్థ '2D ఎంటర్‌టైన్‌మెంట్స్' మరియు కొత్తగా స్థాపించిన 'ఝగరం స్టూడియోస్' బ్యానర్లపై జ్యోతిక, సూర్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. నజ్రియా నజీమ్, 'ప్రేమలు' ఫేమ్ నాస్లేన్, ఆనంద్ రాజ్, జాన్ విజయ్ మరియు ప్రముఖ యూట్యూబర్ రాజ్ ప్రియన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. టైటిల్ టీజర్ విడుదలైన కేవలం కొద్ది సమయంలోనే యూట్యూబ్‌లో 15 మిలియన్లకు పైగా డిజిటల్ వ్యూస్ దాటేసి సోషల్ మీడియాలో విశేషంగా ట్రెండ్ అవుతోంది.
Also Read: భూఆరోపణలపై సరికొత్త ట్విస్ట్: ఇక వాళ్ళకి నిద్ర ఉండదు
మలయాళ చిత్రసీమలో తన సరికొత్త మ్యూజిక్‌తో సంచలనాలు సృష్టించిన సుషిన్ శ్యామ్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. సుషిన్ కి మొదటి తమిళ చిత్రం కావడంతో ఆడియో లవర్స్ మరియు అభిమానులలో భారీ అంచనాలు నెలకొన్నాయి దీపావళి కానుకగా నవంబర్ 6, న రిలీజ్ కానుంది. రామాయణ పార్ట్ 1 కూడా అదే రోజు వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది. ఇండియా వైడ్ గా మాత్రం 8 న రిలీజ్. ఈ నేపథ్యంలో ఇప్పుడు సీన్ vs రామాయణ గా పిలుచుకోవాల్సిన పరిస్థితి. ఫాహద్ ఫాజిల్ తో 'ఆవేశం' తెరకెక్కించి 150 కోట్ల మార్కుని అందుకున్న జితు మాధవన్ దర్శకుడు.
[Scene Teaser, Suriya, Jithu Madhavan, Nazriya Nazim, Naslen, Telugu Cinema, Telugu Cinema News, Tollywood, Tollywood News]




