LATEST NEWS
విజయవాడ సెంట్రల్ శాసనసభ్యుడు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు బోండా ఉమామహేశ్వరరావు రాజకీయ ప్రయాణంపై సోషల్ మీడియాలో జరుగుతున్న ఊహాగానాలు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారాయి. ఇటీవల  ముద్రగడ పద్మనాభం సంతాప సభలో ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి వేదికను పంచుకోవడం తీవ్ర రాజకీయ చర్చకు దారితీసిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా మాజీ మంత్రి అంబటి రాంబాబుతో ఆయన  ఆత్మీయంగా మెలగడానికి సంబంధించిన  దృశ్యాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి.  దీంతో బోండా ఉమా పార్టీ మారుతున్నారనే ప్రచారం జోరుగా సాగింది. బోండా ఉమా తీరును సీరియస్ గా పరిగణించిన తెలుగుదేశం అధిష్ఠానం కూడా ఆయనను వివరణ కోరింది.   అంతే కాకుండా.. తెలుగుదేశం పార్టీ ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, జాతీయ ప్రధాన కార్యదర్శి కిలారు రాజేష్, నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడులతో  కూడిన త్రిసభ్య కమిటీ ఎదుట హాజరై తన వైఖరిని స్పష్టం చేయాలని బోండాకు నోటీసులు పంపింది.   అయితే తనపై వస్తున్న ప్రచారాన్ని, ఆరోపణలను బోండా ఉమా తీవ్రంగా ఖండించారు. తాను వైసీపీ  కార్యక్రమంలోనూ పాల్గొనలేదని, అది ఏ రాజకీయ పార్టీకీ సంబంధం లేని   కార్యక్రమని స్పష్టం చేశారు. గుంటూరులో జనసేన మాజీ  నాయకుడు దాసరి రాము ఏర్పాటు చేసిన సంతాప సభకు మాత్రమే తాను హాజరయ్యానని తెలిపారు. ఆ వేదికపై కాకతాళీయంగా  అంబటి రాంబాబు కలవడంతో   మర్యాదపూర్వకంగా  పలకరించి మాట్లాడానని ఆయన వివరణ ఇచ్చారు.     ఈ మొత్తం వ్యవహారంతో వైసీపీ విజయవాడకు చెందిన కీలక నాయకుడు తమ గూటికి చేరడం ఖాయమన్న భావనకు వచ్చింది. ఆ నేపథ్యంలోనే   వైసీపీలోని కాపు సామాజికవర్గానికి చెందిన నేతలు  అంబటి రాంబాబు, పేర్ని నాని  మీడియా ముందుకొచ్చి బోండా ఉమా మద్దతుగా గళమెత్తారు. అయితే.. తాజాగా   వైసీపీ నిరసనలను ప్రశ్నిస్తూ ఆ పార్టీ నేతలను బోండా ఉమా గట్టిగా నిలదీయడంతో  వైసీపీ ఆశలు నీరుగారిపోయాయి. అంతకు ముందే బోండా ఉమా పార్టీ మారే ఉద్దేశం లేదంటూ స్పష్టత నిచ్చారు. తాజాగా విజయవాడలో  మెగా డీఎస్సీ లో అక్రమాలు అంటూ మల్లాది విష్ణు నేతృత్వంలో వైసీపీ చేపట్టిన రిలే నిరాహార దీక్ష లో మంత్రి నారా లోకేష్ కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ, లోకేష్ రాజీనామా చేయాలనే డిమాండ్ వినిపించారు. దీనితో బోండా తన నియోజకవర్గం లో అధికారుల అనుమతి లేకుండా వైసీపీ చేస్తున్న ఈ నిరసన దీక్షలను నిలువరించే ప్రయత్నం చేశారు. అనుమతుల్లేని  అనధికారిక దీక్షల వల్ల   స్థానిక ప్రజలు ట్రాఫిక్ సమస్యలను ఎదుర్కుంటున్నారని, వెంటనే వైసీపీ నేతలు తమ దీక్షలు విరమించాలని బోండా   వైసీపీ కి వ్యతిరేకంగా గట్టిగా గళం విప్పారు.  ఈ ఘటన తరువాత వైసీపీయుల స్వరం మారింది. అంతకు ముందు వరకూ బోండాకు మద్దతుగా గళమెత్తిన వైసీపీ... ఆ తరువాత.. బోండా ఉమా టార్గెట్ గా పెద్ద ఎత్తున విమర్శలు గుప్పింింది. తాము శాంతియుతంగా  చేపట్టిన నిరాహారదీక్షను బోండా  భగ్నం చేసారంటూ   పేర్ని నాని విమర్శలు గుప్పించారు. ఒక విధంగా బోండా ఉమ   ప్రజాస్వామ్యం మీద  దాడి చేశారని దుయ్యబట్టారు. దీనితో బోండా ఉమా  విషయంలో వైసీపీ ఆశలు ఆవిరయ్యాయనీ, అందుకే ఆయన టార్గెట్ గా ఫ్యాన్ పార్టీ విమర్శలకు పదును పెట్టిందనీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అదే సమయంలో బోండా ఉమా ఫ్యాన్ గూటికి చేరుతున్నారంటూ జరుగుతున్న ప్రచారానికి కూడా బోండా చెక్ పెట్టారని అంటున్నారు.   Bonda Uma, Vijayawada Central, TDP leadership, YSRCP, Ambati Rambabu
ప్రజా బలం ముందు ధన బలం తలవంచక తప్పదని మరోసారి రుజువైంది. 2024 ఎన్నికలలో వైసీపీ ధన బలంతో గెలిచేందుకు ప్రయత్నించి ఘోర పరాజయాన్ని మూటగట్టుకోగా,  ప్రజాబలంతో బరిలో నిలిచిన తెలుగుదేశం ఘన విజయం సాధించింది.  ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు, గణాంకాలను అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) ఇటీవల విడుదల చేసిన ఆర్థిక విశ్లేషణ నివేదిక ప్రస్ఫుటంగా తేల్చింది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల వేళ రాజకీయ పార్టీల ఆదాయ, వ్యయాలకు సంబంధించిన వివరాలను ఏడీఆర్ నివేదిక బయటపెట్టింది.    ఏడీఆర్  నివేదిక మేరకు   దేశంలోని ప్రాంతీయ పార్టీల ఆదాయంలో తెలుగుదేశం పార్టీ అగ్రస్థానంలో నిలిచింది. ఆ ఆర్థిక సంవత్సరానికి  తెలుగుదేశం పార్టీ ప్రకటించిన ఆదాయం  228.31 కోట్ల రూపాయలు.  ఇది   దేశవ్యాప్తంగా   36 ప్రాంతీయ పార్టీల మొత్తం ఆదాయంలో దాదాపు 19 శాతం. తెలుగుదేశం పార్టీకి వచ్చిన ఆదాయంలో సభ్యత్వ రుసుములు, పార్టీ చందాలు,  బ్యాంక్ డిపాజిట్లపై వచ్చిన వడ్డీ ప్రధాన వనరులుగా నిలిచాయి. అయితే.. ఎన్నికల  ఖర్చుల విషయానికి వస్తే వైసీపీ దేశంలోనే అత్యధికంగా వ్యయం చేసిన ప్రాంతీయ పార్టీగా నిలిచింది. ఆ  ఆర్థిక సంవత్సరంలో వైసీపీ  ఆదాయం 140.4 కోట్ల రూపాయలు కాగా, చేసిన వ్యయం 340.2 కోట్ల రూపాయలు. తమ వార్షిక రాబడి కంటే 142 శాతం అదనంగా, అంటే  దాదాపు  199.8 కోట్ల మేర ఎక్కువ వ్యయం చేసింది. ఈ మొత్తం వ్యయంలో  ఆ పార్టీ  300 కోట్ల రూపాయలకు  పైగా కేవలం ఎన్నికల ప్రచారానికే కేటాయించింది.  దీనికి భిన్నంగా తెలుగుదేశం పార్టీ  క్రమశిక్షణతో వ్యయం చేసింది. పార్టీకి వచ్చిన  228.31 కోట్లరూపాయల  ఆదాయంలో తెలుగుదేశం  61.33 కోట్ల రూపాయలు   ఖర్చు చేసింది. ఇందులో ఎన్నికల వ్యయం  31.73 కోట్ల రూపాయలు.   ఆదాయంలో ఏకంగా 73 శాతానికి పైగా..  అంటే  167 కోట్ల రూపాయలను  మిగులు నిధిగా భద్రపరుచుకుంది. ఇదే సమయంలో పొత్తులో ఉన్న జనసేన పార్టీ రూ.64.1 కోట్ల ఆదాయాన్ని, రూ.56.9 కోట్ల వ్యయాన్ని చూపించింది. ఏడీఆర్ నివేదికను ఉటంకిస్తూ.. కేవలం ప్రకటనలు, ప్రచార ఆర్భాటాలకు వందల కోట్లు గుమ్మరించినంత మాత్రాన ఓటర్లను ఆకట్టుకోవడం సాధ్యం కాదని  పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  వైఎస్సార్‌సీపీ  340 కోట్లకు పైగా వెచ్చించి భారీగా ఎన్నికలలో విజయం కోసం ఖర్చు చేసినప్పటికీ,  ఆ పార్టీ 2024 ఎన్నికలలో గెలిచినది కేవలం 11 స్థానాలలో మాత్రమే.  అదే సమయంలో పరిమిత వ్యయంతోనే   ప్రజాక్షేత్రంలోకి వెళ్లిన తెలుగుదేశం కూటమికి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. తెలుగుదేశం పార్టీ 2024 ఎన్నికలలో   135 స్థానాల్లో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే.   మొత్తానికి  ధనబలం కంటే ప్రజాబలమే పార్టీల విజయానికి కీలకమని అని ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు,  ఏడీఆర్  నివేదిక కూడా ప్రస్ఫుటంగా తేల్చిచెప్పాయి.   ADR Report Andhra Pradesh, TDP Election Funds, YSRCP Campaign Expenditure, AP Assembly Elections 2024, Political Party Income, TeluguOne
లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రయాగ్‌రాజ్‌లో నిర్వహించ తలపెట్టిన ఛాత్రోన్ కీ గూంజ్  (విద్యార్థుల గళం) సదస్సుకు లైన్ క్లియర్ అయ్యింది.  సభా వేదికకు సంబంధించి ఇచ్చిన అనుమతిని ఆ తరువాత అకస్మాత్తుగా ఉప సంహరించుకున్న  కాయస్థ పాఠశాల  ట్రస్ట్, దీనిపై సర్వత్రా నిరసనలు, విమర్శలు వెల్లువెత్తడంతో  అనివార్యంగా వెనక్కు తగ్గి అనుమతిని పునరుద్ధరిస్తూ గురువారం (ఆగస్టు 6) రాత్రి పొద్దుపోయిన తరువాత ప్రకటన విడుదల చేసింది. అయితే  కొన్ని షరతులు విధించింది.   దేశవ్యాప్తంగా విద్యా వ్యవస్థను వేధిస్తున్న  ప్రశ్నాపత్రాల లీకేజీలు,  నిరుద్యోగం, యువత భవిష్యత్తుపై రాహుల్ గాంధీ ప్రత్యక్షంగా విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించేందుకు ఉద్దేశించిన ఈ సదస్సు ఈనెల 8న. ప్రయాగ్‌రాజ్‌లోని ప్రసిద్ధ కేపీ కాలేజీ మైదానంలో నిర్వహించేందుకు కాంగ్రెస్ భారీ ఏర్పాట్లు చేసింది. ఇందుకు కేపీ ట్రస్ట్ అనుమతి కూడా ఇచ్చింది. అయితే.. అనూహ్యంగా.. కేపీ ట్రస్ట్ బుధవారం ( ఆగస్టు 5)     సభకు ఇచ్చిన అనుమతిని ఉపసంహరించరుకుంటున్నట్లు తెలిపింది.  రాహుల్ గాంధీ నేరుగా విద్యార్థుల సమస్యలపై గళమెత్తితే  ప్రభుత్వ  వైఫల్యాలు బయటపడతాయన్న భయంతోనే కేంద్రంలోని మోడీ సర్కార్, యూపీలోని బీజేపీ ప్రభుత్వం..   ట్రస్ట్ యాజమాన్యంపై   ఒత్తిడి తెచ్చి సభకు అనుమతి రద్దు చేయించాయన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. వేదిక అనుమతి రద్దయినా..  మైదానాలు మారినా రాహుల్ గాంధీ ప్రయాగ్‌రాజ్ పర్యటన  రద్దు కాదనీ, నిర్ణీత షెడ్యూల్ ప్రకారమే  జరుగుతుందనీ కాంగ్రెస్ ప్రకటించింది.   రాహుల్ సభకు అనుమతి రద్దు చేస్తూ కేపీ ట్రస్ నిర్ణయం పట్ల సర్వత్రా ఆగ్రహం, విమర్శలు రావడంతో..  ఆ ట్రస్ట్ తాత్కాలిక అధ్యక్షుడు జితేంద్ర నాథ్ చౌదరి హైకోర్టు సీనియర్ న్యాయవాదులతో   సంప్రదింపులు జరిపి.. సభకు అనుమతిని పునరుద్ధరించారు. అయితే..   ఈ సభ వల్ల కాలేజీలో జరిగే  తరగతులకు ఎలాంటి ఆటంకం, భంగం కలగకూడదనీ,   ప్రయాగ్‌రాజ్ జిల్లా మేజిస్ట్రేట్  నుంచి కాంగ్రెస్ నాయకత్వం తప్పనిసరిగా చట్టబద్ధమైన   అనుమతి తీసుకోవాలని షరతులు విధించారు.   Rahul Gandhi Prayagraj Meeting, Chatron Ki Goonj, KP Ground Permission, Congress Student Rally, UP Politics News, Rahul Gandhi Student Interaction
మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ భద్రతకు నిజంగా ముప్పు ఉందా? పరామర్శల పేరిట పోలీసుల ఆంక్షలను ఉల్లంఘిస్తూ, శాంతి భద్రతల సమస్య ఉత్పన్నమయ్యేలా సాగుతున్న ఆయన పర్యటనల తీరు నేపథ్యంలో  జగన్  భద్రత అంశం మరోసారి చర్చకు వచ్చింది.  అంతటితో ఆగకుండా,  జగన్‌కు రక్షణ తగ్గించారంటూ వైసీపీ ఎంపీల బృందం కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలవడం, దీనిపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే  వివరణ ఇవ్వడంతో జగన్ భద్రత అంశం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.   వైసీపీ  ఎంపీల బృందం  ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాను ఇటీవల కలిసి  జగన్‌కు తగిన భద్రత కల్పించాలని విజ్ఞప్తి చేసింది. జగన్ భద్రతలో కోతలు విధిస్తున్నారని, దీనివల్ల ఆయన ప్రాణాలకు ప్రమాదం పొంచి ఉందనీ వైసీపీ ఎంపీలు  ఆందోళన వ్యక్తం చేశారు. దీంతోపాటు రాష్ట్రంలో డీఎస్సీ నియామకాల విషయంలో అక్రమాలపైనా, రాష్ట్రంలో  వైసీపీ నాయకులు, కార్యకర్తలపై రాజకీయ వేధింపులతో కేసులు బనాయిస్తున్నారని వారు హోంమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఈ అంశాలపై పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని అమిత్ షా వారికి హామీ ఇచ్చినట్లు వారు ఆ తరువాత మీడియాకు తెలిపారు.   అయితే..  వైఎసీపీ ఎంపీల ఆరోపణలను ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం  తోసిపుచ్చింది. రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత ఈ విషయమై స్పందిస్తూ, జగన్ మోహన్ రెడ్డికి  భద్రత తగ్గించినట్లు వైసీపీయలు చేస్తున్న ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని చెప్పారు.  స్పష్టం చేశారు. నిబంధనల ప్రకారమే జగన్ కు భద్రత కొనసాగిస్తున్నట్లు స్పష్టం చేశారు.  ప్రభుత్వం తరుఫున భద్రతా ఏర్పాట్లలో ఎలాంటి లోపాలు లేవని వంగలపూడి అనిత కండబద్దలు కొట్టినట్లు చెప్పారు.  వైసీపీ   పర్యటనలు, సభలలో పోలీసు అనుమతులకు మించి భారీగా జన సమీకరణ చేస్తుండటమే అసలు సమస్య పేర్కొన్నారు.  అనుమతించిన దాని కంటే  ఎన్నో రెట్లు ఎక్కువగా జనాన్ని వైసీపీ తరలించడంవల్లనే  క్షేత్రస్థాయిలో భద్రతా నిర్వహణ పోలీసులకు సవాలుగా మారుతోందనీ,  ప్రణాళికారాహిత్యమైన ఈ తీరు వల్లనే భద్రతా పరమైన ఇబ్బందులు తలెత్తుతున్నాయన్నారు.  జగన్ భద్రత తగ్గించినట్లు స్పష్టమైన ఆధారాలేవీ ఇప్పటివరకు బయటకు రాలేదు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు భద్రతకు సంబంధించి రాజకీయ విమర్శలు రావడం సహజమే అయినా.. ఈ విషయంలో రాజకీయ వివాదాల కంటే భద్రతా ఏజెన్సీల అంచనాలకే ప్రాధాన్యత ఉంటుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.     Jagans security, Amit Shah, YCP MPs, Vangalapudi Anita, Jagan security controversy, Andhra Pradesh politics, TeluguOne
 పార్లమెంట్ ఆవరణలో  స్కిట్ చేశారంటూ  లోక్‌సభలో ప్రతిపక్ష నేత  రాహుల్ గాంధీ,  మరో నలుగురు విపక్ష ఎంపీలపై బీహార్‌ కోర్టులో క్రిమినల్ ఫిర్యాదు నమోదైంది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల సందర్భంగా లోక్‌సభ ప్రాంగణంలో ప్రతిపక్ష నాయకులు ప్రదర్శించిన సొలిటిరల్ స్కిట్ తీవ్ర దుమారాన్ని రేపింది. సనాతన ధర్మ విశ్వాసాలను, భక్తుల మత మనోభావాలను గాయపరిచేలా ఈ ప్రదర్శన ఉందని, కేవలం ప్రచారం కోసమే ఇలా చేశారని ఆరోపిస్తూ..   న్యాయస్థానంలో పిటిషన్ దాఖలైంది.   పార్లమెంట్ ఆవరణలో జులై 31న అయోధ్య రామమందిర విరాళాల కుంభకోణంపై విపక్ష ఎంపీలు వినూత్న నిరసన చేపట్టారు.  ఈ నిరసనలో భాగంగా ఇండిపెండేంట్  ఎంపీ రాజేశ్ రంజన్ అలియాస్ పప్పు యాదవ్ ఒక పూజారి వేషధారణలో  కూర్చిన తన ముందు ఒక  విరాళాల పెట్టెను ఉంచగా, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, సమాజ్‌వాదీ పార్టీ ఎంపీలు భక్తుల రూపంలో వచ్చి ఆ పెట్టెలో డబ్బులు వేస్తున్నట్లుగా.. ఆ డబ్బులను   పూజారి వేషంలో ఉన్న పప్పు యాదవ్   తన జేబులో వేసుకోవడం, దాన్ని పక్కనే ఉన్న మరో ప్రతిపక్ష ఎంపీ ప్రశ్నించడం వంటి సన్నివేశాలను ఆ స్కిట్ లో ప్రదర్శించారు. అయోధ్య రామమందిరం పేరిట సేకరించిన విరాళాల విషయంలో అక్రమాలు జరిగాయనే అంశాన్ని వ్యంగ్యంగా, నాటకీయంగా చూపించేందుకు వారు చేపట్టిన ఈ వినూత్న నిరసన  రాజకీయ వివాదానికి దారి తీసింది.   రామాలయాన్ని, పూజారి వ్యవస్థను, భక్తుల నమ్మకాలను హేళన చేసేలా ఈ నిరసన ఉందంటూ..  బీహార్‌లోని జమూయి సివిల్ కోర్టులో  ఓ సీనియర్ న్యాయవాది పిటిషన్ దాఖలు చేశారు.  ఈ పిటిషన్‌లో రాహుల్ గాంధీని ప్రధాన ప్రతివాదిగా చేర్చడంతో పాటు,  ఎంపీ పప్పు యాదవ్, సమాజ్‌వాదీ పార్టీకి చెందిన ఎంపీలు అవధేశ్ ప్రసాద్, రుచి వీర,   ధర్మేంద్ర యాదవ్‌లను  ప్రతివాదులుగా చేర్చారు. ఈ ఐదుగురు ఎంపీలు చట్టవిరుద్ధంగా, మతపరమైన భావాలను దెబ్బతీసేలా వ్యవహరించారని పిటిషనర్ పేర్కొన్నారు.  Rahul Gandhi court complaint, Parliament skit controversy, Bihar Jamui Civil Court case, Ayodhya Ram Mandir donation skit, Opposition MPs court case, Pappu Yadav priest skit
ALSO ON TELUGUONE N E W S
టాలీవుడ్‌లో 'తకిట తకిట', 'అవును', 'మాయ' వంటి చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకుని, ఆ తర్వాత బాలీవుడ్‌లోనూ తనదైన ముద్ర వేసిన హ్యాండ్సమ్ హీరో హర్షవర్ధన్ రాణే ప్రస్తుతం వార్తల్లో నిలిచారు. ప్రముఖ నటి సంజీదా షేక్‌తో ఈ యంగ్ హీరో ప్రేమలో ఉన్నాడంటూ నెట్టింట ప్రచారం జోరందుకుంది. ఈ ఇద్దరూ కలిసి విహారయాత్రలకు వెళ్తున్నారని, ఒకే రకమైన లొకేషన్ల నుంచి సోషల్ మీడియాలో ఫోటోలు షేర్ చేస్తుండటంతో వీరిద్దరి మధ్య ఏదో ఉందనే ఊహాగానాలు మొదలయ్యాయి. గతంలో 'తైష్' అనే వెబ్ సిరీస్‌లో కలిసి నటించినప్పటి నుంచే వీరిమధ్య సఖ్యత పెరిగిందనే పుకార్లు షికారు చేస్తున్నాయి. అయితే, తనపై వస్తున్న ఈ డేటింగ్ రూమర్లపై హర్షవర్ధన్ రాణే స్పందిస్తూ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. తన వ్యక్తిగత జీవితం గురించి మీడియాలో వచ్చే వార్తలను తాను పెద్దగా పట్టించుకోనని, ప్రజలు ఏది అనుకోవాలనుకుంటే అది అనుకోవచ్చని వ్యాఖ్యానించారు. కెరీర్ పరంగా చూస్తే, హర్షవర్ధన్ 'సనమ్ తేరి కసమ్', 'హసీన్ దిల్‌రుబా' చిత్రాలతో బాలీవుడ్‌లో మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక సంజీదా షేక్ టీవీ రంగంతో పాటు వెబ్ సిరీస్‌లలోనూ తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్నారు. గతంలో కూడా పలువురు సెలబ్రిటీలతో వీరి పేర్లు ముడిపడి ఉన్నప్పటికీ, ప్రస్తుత డేటింగ్ వార్తలు బాలీవుడ్ మరియు టాలీవుడ్ వర్గాల్లో తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. అభిమానులు మాత్రం ఈ జంట నిజంగానే ప్రేమలో ఉందా అని నెట్టింట చర్చించుకుంటున్నారు. ప్రస్తుతం హర్షవర్ధన్ రాణే తన వరుస సినిమాల షూటింగ్‌లలో బిజీగా ఉన్నారు. రాబోయే ప్రాజెక్ట్‌లతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్న ఈ హీరో, తన లవ్ లైఫ్‌పై మరింత స్పష్టత ఇస్తారో లేదో వేచి చూడాలి.
  మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(Ram Charan)వన్ మాన్ షో 'పెద్ది' బాక్సాఫీస్ వద్ద సాధించిన ఘన విజయం తెలిసిందే. ప్రస్తుతం ఓటిటి లో రన్ అవుతూ ఉంది. రీసెంట్ గా  లెజండరీ రైటర్స్ పరుచూరి బ్రదర్స్ ద్వయంలో ఒకరైన పరుచూరి గోపాలకృష్ణ తన అధికారిక యూట్యూబ్ ఛానెల్ 'పరుచూరి పాఠాలు' ద్వారా 'పెద్ది' సినిమాపై విశ్లేషణాత్మక రివ్యూ ఇచ్చి సినీ వర్గాల్లో ఆసక్తికర చర్చకి  తెరలేపారు. సినిమాలోని ప్లస్ పాయింట్లతో పాటు కొన్ని ప్రధానమైన లోపాలని కూడా ఆయన స్పష్టంగా చెప్పడం విశేషం. పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడుతూ, 'ఓట్లే లేని ఒక చిన్న గ్రామంలో రైలు ఆగాలి' అనే ఒకే ఒక్క ప్రతిపాదన చుట్టూ కథ అల్లుకుని, మూడు గంటల నిడివి ఉన్న పూర్తి స్థాయి కమర్షియల్ సినిమాగా మలచడం సాధారణ విషయం కాదు. ఊరికి గుర్తింపు తీసుకురావాలనే తపనతో హీరో క్రికెట్, కుస్తీ వంటి క్రీడల్లో ఓడిపోయినప్పటికీ, చివర్లో రన్నింగ్ రేసులో అసాధారణ ప్రతిభ చాటి తన ఆశయాన్ని సాధించే క్రమం ప్రేక్షకులకి  ఎంతో స్ఫూర్తినిస్తుంది. ముఖ్యంగా సినిమా చివరి సన్నివేశాల్లో అందించిన సామాజిక సందేశం నన్ను ఎంతగానో ఆకట్టుకోవడంతో పాటు పెద్ది విజయంలో  రామ్ చరణ్ పాత్ర అద్వితీయమైనది.  సినిమా మొత్తాన్ని రామ్ చరణ్ తన ఒంటిచేతితో, స్వయంకృషితో భుజాలపై మోశాడు. ఒకవేళ ఈ సినిమాలో చరణ్ స్థానంలో వేరే ఏ హీరో నటించినా ఫలితం మరోలా ఉండేది. కేవలం ఆయనకున్న ఇమేజ్ మరియు అద్భుత నటన వల్లే థియేటర్ల వద్ద భారీ వసూళ్లు వచ్చాయి. కుస్తీ యోధుడిగా శారీరక మార్పులు చేసుకోవడం, భావోద్వేగాలను పండించిన తీరు సినిమాకు ప్రధాన బలంగా నిలిచాయి. అయితే సినిమా నిడివి బాక్సాఫీస్ వద్ద పెద్ద ప్రతికూలాంశంగా మారింది. మూడు గంటల రన్‌టైమ్‌లో దాదాపు 30 నుంచి 40 నిమిషాల వరకు సన్నివేశాలను తొలగించవచ్చు. హీరో, హీరోయిన్ల కాస్ట్యూమ్స్ సగటు తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగినట్లుగా లేకపోవడం కూడా ఒక పెద్ద మైనస్ పాయింట్‌.  జాన్వీ కపూర్ పాత్ర నిడివి చాలా తక్కువ నిడివితో  ఉండటం బాగోలేదు. . ఏదేమైనా, ఒక విభిన్నమైన క్రీడా నేపథ్యాన్ని ఎంచుకుని మెగా అభిమానులకు, సాధారణ ప్రేక్షకులకు ఆహ్లాదకరమైన అనుభూతిని అందించినందుకు పెద్ది చిత్రబృందాన్ని ప్రశంసిస్తున్నాను. దర్శకుడు బుచ్చిబాబు పనితనం కూడా బాగుందని చెప్పుకొచ్చారు.  Ram Charan, Peddi, Janhvi kapoor, Paruchuri Gopalakrishna  
మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్ కుమార్తె విస్మయా మోహన్‌లాల్ (Vismaya Mohanlal) నటిగా ఎంట్రీ ఇచ్చిన డెబ్యూ మూవీ 'తుడక్కమ్' (Thudakkam). '2018' లాంటి ఆల్ టైమ్ బ్లాక్‌బస్టర్ అందించిన జూడ్ ఆంటోనీ జోసెఫ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ యాక్షన్ థ్రిల్లర్ ఈరోజే థియేటర్లలోకి వచ్చేసింది.  'తుడక్కమ్' అంటే మలయాళంలో 'ఆరంభం' అని అర్థం. ఈ సినిమాతో విస్మయాతో పాటు ప్రముఖ నిర్మాత ఆంటోనీ పెరుంబావూర్ కుమారుడు ఆశిష్ జో ఆంటోనీ కూడా పవర్‌ఫుల్ విలన్‌గా ఎంట్రీ ఇచ్చాడు. మీనూ అనే ఒక సాధారణ పల్లెటూరి అమ్మాయి కథ ఇది. బ్యాంక్ ఎగ్జామ్ రాయడానికి సిటీకి వెళ్లి అనూహ్యంగా ఒక ప్రమాదకరమైన మర్డర్ మిస్టరీ చిక్కుముడిలో పడిపోతుంది. అక్కడి నుంచి ఆమె తన ప్రాణాలను కాపాడుకోవడానికి చేసే సర్వైవల్ అండ్ ఫైటింగ్ అడ్వెంచరే ఈ 'తుడక్కమ్'. ట్విట్టర్ లో ఈ సినిమా చూసిన క్రిటిక్స్ అండ్ ఆడియన్స్ చెబుతున్న మాట ఏంటంటే.. "విస్మయా మోహన్‌లాల్ డెబ్యూ పర్ఫెక్ట్ గా కుదిరింది". ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో వచ్చే ఫైట్ సీన్స్ లో విస్మయా నటన చూసి జనాలు షాక్ అవుతున్నారు. ఒరిజినల్ గా మార్షల్ ఆర్ట్స్ ట్రైనింగ్ తీసుకున్న అమ్మాయి కావడం వల్ల, యాక్షన్ సీక్వెన్సెస్ లో ఇరగ్గొట్టేసింది. నిజంగా ఫైట్స్ చేస్తున్నంతసేపు స్క్రీన్ పై తండ్రి మోహన్‌లాల్ ఫ్లేవర్ స్పష్టంగా కనిపించిందని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అంతేకాదు, సినిమాలో స్పెషల్ సర్ప్రైజ్ ఎలిమెంట్ ఉంది. కంప్లీట్ యాక్టర్ మోహన్‌లాల్ స్పెషల్ గెస్ట్ అప్పీరెన్స్. జూడ్ ఆంటోనీ డైరెక్షన్, జేక్స్ బిజోయ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ తో మోహన్‌లాల్ ఎంట్రీ థియేటర్లను షేక్ చేసిందట. డైరెక్టర్ జూడ్ ఆంటోనీ “నన్ను సినిమా మాయాజాలంలోకి లాగిన నా నట విక్రాంతుడికి నా ఇష్టపూర్వక సమర్పణ” అని టైటిల్ కార్డ్స్ లో వేసిన ట్రిబ్యూట్ కి మోహన్‌లాల్ ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. అయితే సినిమాలో కొన్ని నెగెటివ్స్ కూడా ఉన్నాయని ట్విట్టర్ లో కామెంట్స్ వినిపిస్తున్నాయి. విస్మయాకు మలయాళం సరిగ్గా రాకపోవడం వల్ల ఆమె క్యారెక్టర్ కి వేరేవాళ్లతో డబ్బింగ్ చెప్పించారు. దీనివల్ల కొన్ని చోట్ల ఎమోషనల్ సీన్స్ లో ఎక్స్‌ప్రెషన్స్ కి, డబ్బింగ్ కి సింక్ తప్పిందనే టాక్ వచ్చింది. ఫస్ట్ హాఫ్ కాస్త స్లోగా మొదలైనప్పటికీ, ఇంటర్వెల్ బ్లాక్ నుండి సెకండ్ హాఫ్ చివరి వరకు ఒక గ్రిప్పింగ్ సస్పెన్స్ థ్రిల్లర్ గా సినిమా సాగుతుందట. మొత్తానికి ‘తుడక్కమ్’ చిత్రం విస్మయా కెరీర్ కి ఒక గ్రాండ్ ఆరంభాన్ని ఇచ్చిందనే చెప్పాలి. ముఖ్యంగా తన మార్షల్ ఆర్ట్స్, యాక్షన్ సీన్స్ తో ఒక సాలిడ్ హీరోయిన్ గా థియేటర్లలో విజిళ్లు వేయించుకోవడం నిజంగా గ్రేట్.     Mohanlal Daughter, Vismaya Mohanlal, Thudakkam Review  
నటీనటులు: దీక్షిత్ శెట్టి, శశి ఓదెల, యుక్తి తరేజా, మురళీధర్ గౌడ్ సాంకేతిక వర్గం: ఛాయాగ్రహణం (సినిమాటోగ్రఫీ): నాగేష్ బానెల్ సంగీతం: పూర్ణచంద్ర తేజస్వి కూర్పు (ఎడిటింగ్): శ్రావణ్ కటికనేని రచన, దర్శకత్వం: కృష్ణ కుమార్ (కేకే) నిర్మాణం: సుధాకర్ చెరుకూరి దీక్షిత్ శెట్టి హీరోగా నటించిన చిత్రం KJQ (King Jackie Queen), కేజేక్యూ (కింగ్ జాకీ క్వీన్). 2010లో 'కేడీ' చిత్రానికి దర్శకత్వం వహించిన కృష్ణ కుమార్ (కేకే) ఈ సినిమా విడుదలకు ముందే కన్నుమూశారు. ఆయన చివరి రోజుల్లో నిర్మాత సుధాకర్ చెరుకూరి అండగా నిలవడమే కాకుండా, సినిమాను పూర్తి చేసి నేడు ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఒక దర్శకుడు చనిపోయాక సినిమా విడుదల కావడం అనే అరుదైన, విచారకరమైన నేపథ్యం ఈ సినిమాపై కాస్త ఆసక్తిని పెంచింది. మరి ఈ చిత్రం ఎలా ఉందో చూద్దాం. కథ: హైదరాబాద్ అండర్‌వరల్డ్‌కు కింగ్‌గా ఎదుగుతాడు పార్థ (Deekshith Shetty). జాకీ (Shashi Odela)తో స్నేహం ఏర్పడ్డాక వీరిద్దరూ మరింత శక్తివంతంగా మారతారు. తన ఎదుగుదలతో పార్థకు అహంకారం పెరిగిపోయి, తను కోరుకున్నది దక్కించుకోవడమే లక్ష్యంగా బతుకుతుంటాడు. ఈ క్రమంలో తన ప్రైవేట్ బర్త్ డే పార్టీలో డ్యాన్స్ చేయాలని స్టార్ హీరోయిన్ 'క్వీన్' భావన (Yukti Thareja)ను ఆహ్వానిస్తాడు. ఆమె తిరస్కరించడంతో ఆమెపై మోజు పెంచుకుంటాడు. ఆ తర్వాత పార్థ అహంకారం అతన్ని ఎక్కడికి తీసుకెళ్లింది? దీని వల్ల జాకీ, క్వీన్ జీవితాలు ఎలా ప్రభావితం అయ్యాయి? అనేది మిగతా కథ. విశ్లేషణ: తన పాత్రకు న్యాయం చేయడానికి దీక్షిత్ శెట్టి బాగానే కష్టపడ్డాడు కానీ, చాలా చోట్ల మితిమీరిన నటన కనబరిచాడు. పాత్రకు ఉన్న ఎక్సెంట్రిక్ స్వభావాన్ని బ్యాలెన్స్ చేయడంలో విఫలమయ్యాడు. దర్శకుడు శ్రీకాంత్ ఓదెల సోదరుడు శశి ఓదెల ఎమోషనల్ సన్నివేశాల్లో బాగా చేశాడు. యుక్తి తరేజాకు ఒక బోల్డ్ క్యారెక్టర్ దక్కినా, నటన పరంగా ఆకట్టుకోలేకపోయింది. అయితే తన వంతు ప్రయత్నం చేసింది, తెరపై అందంగా కనిపించింది. తన తొలి చిత్రం 'కేడీ'లోనే హాలీవుడ్ స్థాయి టేకింగ్ చూపించిన కృష్ణ కుమార్ (KK), ఈ రెండో సినిమా చేయడానికి 16 ఏళ్లు తీసుకున్నాడు. కొన్ని సన్నివేశాల్లో ఆయన విజన్ కనిపించినా, చాలా వరకు హడావుడిగా తీసినట్లు అనిపిస్తుంది. బహుశా కొన్ని సీన్స్ ఆయన అసిస్టెంట్లు తీసి ఉండొచ్చు, అందుకే చాలా సన్నివేశాల్లో ఇంపాక్ట్ మిస్సయింది. చిన్న వయసులో జరిగిన వేధింపుల వల్ల పవర్ కోసం ఆరాటపడే వ్యక్తి, ఎప్పుడూ తన సంతోషాన్ని తానే నాశనం చేసుకునే మరో దురదృష్టవంతుడి కథను తెరపై సరిగ్గా ఆవిష్కరించలేకపోయారు. యుక్తి తరేజా ఎమోషనల్ ట్రాక్ ను కూడా సరైన విధంగా డీల్ చేయలేదు. కథకు తగ్గట్టుగా సంగీతం లేదు, ఎడిటింగ్ కూడా అక్కడక్కడా గందరగోళంగా ఉంది. సినిమాటోగ్రఫీ ఇంకాస్త మెరుగ్గా ఉండాల్సింది. చనిపోయిన దర్శకుడి సినిమాను పూర్తి చేసి విడుదల చేసిన నిర్మాత ప్రయత్నం అభినందనీయం. కానీ సినిమా మాత్రం ఏమాత్రం అంచనాలను అందుకోలేకపోయింది. ప్లస్ పాయింట్స్: సెకండ్ హాఫ్‌లో కొన్ని సీన్స్ యుక్తి తరేజా గ్లామర్ మైనస్ పాయింట్స్: ఆకట్టుకోని నటీనటుల పెర్ఫార్మెన్స్ ఏమాత్రం మెప్పించని సంగీతం కొన్ని సిల్లీ డైలాగులు లోపించిన సాంకేతిక, నిర్మాణ విలువలు బాటమ్ లైన్: దురదృష్టవశాత్తూ సినిమాలో ఏదీ వర్కౌట్ కాలేదు. రేటింగ్: 1.5/5 డిస్‌క్లెయిమర్: ఈ రివ్యూలో వ్యక్తం చేసిన అభిప్రాయాలు పూర్తిగా సమీక్షకుడి వ్యక్తిగతమైనవి, వీటికి సంస్థకు ఎలాంటి బాధ్యత లేదు. పాఠకులు తమ సొంత విచక్షణతో నిర్ణయం తీసుకోవాలని సూచిస్తున్నాం
దక్షిణాది చిత్రసీమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కథానాయకి పూర్ణ సోషల్ మీడియా వేదికగా చేసిన ఓ భావోద్వేగ పోస్ట్ ప్రస్తుతం నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఇటీవల రెండోసారి మాతృత్వపు తీపిని ఆస్వాదించిన ఈ భామ, తన తండ్రిని గుర్తుచేసుకుంటూ అత్యంత ప్రేమపూర్వకమైన సందేశాన్ని అభిమానులతో పంచుకున్నారు. తనకు జన్మనిచ్చిన తండ్రి జ్ఞాపకాలు ఎప్పటికీ అమరమని పేర్కొంటూ పూర్ణ రాసుకొచ్చిన వార్తలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా తన చిన్నారి చిన్న కళ్లలోకి చూస్తుంటే స్వర్గస్తులైన తన నాన్న రూపమే గుర్తుకు వస్తోందని ఆమె ఆవేదనతో పాటు ఆనందాన్ని వ్యక్తం చేశారు. కుటుంబ బంధాలకు ఎంతో ప్రాధాన్యమిచ్చే పూర్ణ, తండ్రి లేని లోటు తనను నిరంతరం వేధిస్తూనే ఉంటుందని అన్నారు. అయితే దేవుడు ఇచ్చిన ఈ రెండో సంతానం రూపంలో మళ్లీ తన తండ్రి ఆశీస్సులు, ఆ రూపం ఇంట్లోనే ఉన్నట్లుగా భావిస్తున్నానని చెప్తూ ఆత్మీయ పోస్ట్ పెట్టింది. తెలుగు ప్రేక్షకులకు 'అవును', 'సీమ ట‌పాకాయ్' వంటి సూపర్ హిట్ చిత్రాలతో సుపరిచితమైన పూర్ణ, తన వైవిధ్యమైన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. గ్లామర్ పాత్రలతో పాటు పెర్ఫార్మెన్స్ ప్రాధాన్యమున్న పాత్రలలో నటించి మెప్పించిన ఈ బ్యూటీ, బుల్లితెరపై డాన్స్ రియాలిటీ షోలకు న్యాయ నిర్ణేతగా వ్యవహరించి రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ ఫ్యాన్ బేస్ సంపాదించుకున్నారు. ఇటీవల వివాహ బంధంలోకి అడుగుపెట్టిన పూర్ణ, కుటుంబ జీవితాన్ని సమర్థవంతంగా బ్యాలెన్స్ చేస్తున్నారు. మొదటి బాబు జన్మించిన సమయంలోనూ, తాజాగా పాపాయి పుట్టిన వేళ కూడా తన సంతోషకరమైన క్షణాలను అభిమానులతో నిరంతరం పంచుకుంటూనే ఉన్నారు. ఈ ఎమోషనల్ పోస్ట్‌పై నెటిజన్లు, చిత్ర పరిశ్రమకు చెందిన సహచర నటీనటులు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. పూర్ణకు ధైర్యం చెబుతూ, పాపాయికి శుభాకాంక్షలు తెలుపుతూ సోషల్ మీడియాలో కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ప్రస్తుతం కుటుంబ బాధ్యతల్లో బిజీగా ఉన్న పూర్ణ, త్వరలోనే మంచి కథాంశాలు ఉన్న చిత్రాలతో మళ్లీ రీఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. తన నటనతో అలరించేందుకు ఆసక్తిగా ఉన్న పూర్ణ తదుపరి ప్రాజెక్ట్‌లకు సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడే అవకాశం ఉంది.
Cast: Dheekshith Shetty, Shashi Odela, Yukti Thareja, Muralidhar Goud Crew:  Cinematography by Nagesh Banell Music by Poornachandra Tejaswi Editing by Shravan Katikaneni Written and Directed by Krishna Kumar aka KK Produced by Sudhakar Cherukuri King Jackie Queen aka KJQ has created buzz with director Krishna Kumar, KK, who directed Kedi in 2010, passing away before movie release. Producer Sudhakar Cherukuri has decided to help the director during his last days and even completed the film and released it today, after his passing. With such a rare and unfortunate event, the movie did create anticipation. Let's discuss about the movie in detail.  Plot:  Partha (Dheekshith Shetty) has risen to become the King of Hyderabad Underworld. He befriends Jackie (Shashi Odela) and they both become most powerful. Partha's rise makes him egoistic and he doesn't care about anything but gain whatever he desires. He invites Queen, the Star actress Bhavana (Yukti Thareja) to perform in a private birthday party. She denies and he starts to be obsessed with her. Where does his ego lead him and how it effects Jackie and Queen?  Analysis:  Dheekshith Shetty tried hard to perform at his best in the role but he did go overboard at many places. While the character is eccentric, he needed to balance it without going too much. Shashi Odela, brother of director Srikanth Odela, is good in emotional scenes. Yukti Thareja has been given a bold character but her performance doesn't really live up. But she gave her best and her beauty is eye-catching.  Krishna Kumar showcased good technical abilities in his Kedi. He presented some Hollywood level sequences in his first movie itself. He took more than 16 years to get his next as Kedi failed to excite audiences. His vision and ability are visible in few sequences but many look hurriedly shot. Maybe few have been shot by him and few by his assistants. Still, the impact is missing in many.  The lofty ideals of power consuming a person who started his journey due to trauma of being abused at a young age and another unlucky man who always ends up killing his own happiness doesn't shine through. Even Yukti Thareja's portions are not handled with the same deft eye that such an emotional thread and journey needs.  Music doesn't live up to the necessities of the story and editing is also random at places. Cinematography could have been better. Overall, producer and team completing the movie of a deceased director and releasing it is appreciable. But film doesn't really live up to any expectations.  Positives:  Few moments in second half Yukti Thareja beauty Negatives: Performances are bland  Music is not up-to-the mark Dialogues are at times too silly Technical and production values could've been better Bottomline: Unfortunately nothing really works.  Rating: 1.5/5  Disclaimer: The views/opinions expressed in this review are personal views/opinions shared by the writer and organisation does not hold a liability to them. Viewers' discretion is advised before reacting to them.
  వైవిధ్యమైన కథలతో సెల్యులాయిడ్ పైకి వచ్చేమెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, ఈ రోజు  హారర్ కామెడీ జానర్‌ 'కొరియన్ కనకరాజు' తో సరెండర్ అయ్యాడు. యువి క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్ పై రాజీవ్ రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి, ప్రమోద్ ఉప్పలపాటి, వంశీ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా  నిర్మించారు.   మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా వేదికగా 'కొరియన్ కనకరాజు' పై స్పందిస్తూ 'ఎక్కడ విన్నా నవ్వులే నవ్వులు. ప్రియమైన వరుణ్ తేజ్, ఈ విజయానికి నిజంగా నువ్వు అర్హుడివి. నీ కష్టం, నిబద్ధతకు తగిన ఫలితం దక్కింది. ఈ గొప్ప విజయాన్ని అందుకున్న ప్రతి ఒక్కరికీ అభినందనలు. త్వరలోనే మూవీని వీక్షించనున్నట్లుగా ఎక్స్ వేదికగా ట్వీట్ చేసాడు. దీంతో మెగా ఫ్యాన్స్ లో జోష్ నెలకొని ఉంది. కొరియన్ కనకరాజు కథాంశం ఎంతో వినూత్నంగా ఉండటమే కాకుండా ప్రేక్షకులను థియేటర్లలో పగలబడి నవ్వించేలా తీర్చిదిద్దారు. పెనుగొండలోని కియా కార్ల తయారీ పరిశ్రమలో పనిచేసే చైత్ర అనే యువతి ప్రేమలో కథానాయకుడు కనకరాజు పడతాడు. కొరియన్ సంస్కృతి, డ్రామాలంటే ఇష్టపడే కథానాయకి చుట్టూ, కొరియా ప్రాంతం నుంచి ముడిపడిన కొన్ని ఆసక్తికరమైన అనూహ్య పరిణామాలు మరియు ఆత్మల నేపథ్యంతో సాగే వినోదం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది.  Also read: బాలయ్య హీరోయిన్ కి తృటిలో తప్పిన ప్రమాదం.. కానీ ఆ కుక్క ఏం చేసిందంటే  వరుణ్ తేజ్ తన నటనతో అలరించడమే కాకుండా సీమ యాసలో పలికే సంభాషణలతో అందరినీ మెప్పించాడు  హీరోయిన్‌గా నటించిన రితికా నాయక్ తన అందం, అభినయంతో ఆకట్టుకోగా, కమెడియన్ సత్య తనదైన టైమింగ్, వన్ లైనర్స్, పంచ్ డైలాగ్స్‌తో  ప్రధాన హైలైట్‌గా నిలిచాడు. థమన్ అందించిన నేపథ్య సంగీతం సన్నివేశాలని నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్లగా, కలర్‌ఫుల్ సినిమాటోగ్రఫీ విజువల్స్‌కు మరింత ఆకర్షణ తీసుకొచ్చింది. మేర్లపాక గాంధీ దర్శకుడు. Chiranjeevi, Korean Kanakaraju, varun tej
టాలీవుడ్‌లో తన గ్లామర్, ఎనర్జెటిక్ డాన్స్‌తో కుర్రకారును ఊపేసిన భామ శ్రీలీల. ఇటీవల తెలుగులో అవకాశాలు కాస్త తగ్గినా, ఇప్పుడు తమిళ చిత్రసీమ నుంచి ఈ చిన్నదానికి ఒక బిగ్ జాక్‌పాట్ తగిలినట్లు వార్తలు వస్తున్నాయి. ఇండియన్ సినిమా సూపర్‌స్టార్ రజినీకాంత్ తదుపరి చిత్రంలో శ్రీలీల ఒక కీలక పాత్రకు ఎంపికైందనే టాక్ కోలీవుడ్ సర్కిల్స్‌లో జోరుగా సాగుతోంది. సూపర్‌స్టార్ రజినీకాంత్ సరసన లేదా ఆయన నటిస్తున్న భారీ ప్రాజెక్ట్‌లో అవకాశం రావడం ఏ కథానాయికానికైనా కెరీర్‌లోనే మైలురాయిగా నిలుస్తుంది. కోలీవుడ్‌లో ప్రస్తుతం ఈ క్రేజీ కాంబినేషన్ గురించే హాట్ చర్చ నడుస్తోంది. ఈ ప్రాజెక్ట్ గనక కార్యరూపం దాల్చితే, తమిళంలో శ్రీలీల స్థానం మరింత బలపడటం ఖాయమని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. 'పెళ్లి సందD' చిత్రంతో టాలీవుడ్‌కి పరిచయమైన శ్రీలీల, మాస్ మహారాజా రవితేజతో చేసిన 'ధమాకా' సినిమాతో రాత్రికి రాత్రే స్టార్ హీరోయిన్‌గా మారింది. ఆ తర్వాత బాలకృష్ణ 'భగవంత్ కేసరి', మహేష్ బాబు 'గుంటూరు కారం' వంటి భారీ ప్రాజెక్ట్‌లలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. అయితే వరుసగా కొన్ని సినిమాలు ఆశించిన విజయం సాధించకపోవడంతో శ్రీలీల తన ఫోకస్‌ను ఇతర భాషలపైకి మళ్లించింది. ఒకవైపు సినిమాల్లో బిజీగా ఉంటూనే తన ఎంబీబీఎస్ విద్యను పూర్తి చేసి డాక్టర్ పట్టా పుచ్చుకోవడమే కాకుండా, ఇద్దరు దివ్యాంగులైన పిల్లలను దత్తత తీసుకుని సామాజిక స్పృహను చాటుకుంది. ప్రస్తుతం ఈ గ్లామరస్ బ్యూటీ బాలీవుడ్ యంగ్ స్టార్ కార్తీక్ ఆర్యన్ సరసన ఒక హిందీ చిత్రంలో నటిస్తుండగా, కోలీవుడ్‌లో ధనుష్ కాంబినేషన్‌లోనూ ఓ సినిమా చేస్తోంది. గతంలో శివకార్తికేయన్‌తో చేసిన 'పరాశక్తి' ఆశించిన స్థాయిలో ఆడకపోయినా, ఇప్పుడు ఏకంగా రజినీకాంత్ చిత్రంలో ఛాన్స్ రావడం ఆమె కెరీర్‌ను మళ్ళీ టాప్ గేర్‌లోకి తీసుకెళ్తుందని విశ్లేషిస్తున్నారు. ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో శ్రీలీల అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. "మా డాన్సింగ్ క్వీన్‌కి సరైన ఆఫర్ దక్కింది.. సూపర్‌స్టార్‌తో సినిమా అంటే రచ్చ రచ్చే" అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తూ ట్రెండ్ చేస్తున్నారు. ఈ బిగ్ కాంబినేషన్‌కు సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వచ్చే అవకాశం ఉందని సమాచారం. ఈ ఆఫర్ కనుక నిజమైతే, శ్రీలీల కెరీర్‌లో ఇది అతిపెద్ద టర్నింగ్ పాయింట్‌గా మారడంలో ఎలాంటి సందేహం లేదు.   Sreeleela, Rajinikanth, Kollywood News
  గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ(Balakrishna)మెమొరీబిల్ హిట్ సాంగ్ 'స్వాతిలో ముత్యమంతా ముద్దులా ముట్టుకుంది సంధ్య వాన' పాట తెలుగు నాట మోగుతున్నంత కాలం రవీనా టాండన్ పేరు తెలుగు ప్రేక్షకుల నోళ్ళల్లో మోగుతూనే ఉంటుంది. రీసెంట్ గా రవీనా టాండన్    ముంబైలో జరిగిన 'ఓహ్ మై డాగ్'  సినిమా ప్రదర్శన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ సమయంలో ఊహించని సంఘటన ఎదురైంది.   రెడ్ కార్పెట్ వద్ద నటి రవీనా టండన్, చిత్రంలో ప్రధాన పాత్ర పోషించిన బ్రూనో (Bruno) అనే పెంపుడు కుక్కతో కలిసి ఫోటోలకి  భంగిమలు ఇచ్చారు. అయితే ఫోటో సెషన్ ముగిసిన తర్వాత ఆమె పైకి లేస్తున్న సమయంలో ఆ శునకం ఒక్కసారిగా బిగ్గరగా మొరుగుతూ రవీనా వైపు దూసుకొచ్చింది.  ఆ సమయంలో శునకం నటిని కొరికేందుకు ప్రయత్నించినట్లు కనిపించడంతో అక్కడున్న వారంతా తీవ్ర ఆందోళనకు గురయ్యారు. పెంపుడు జంతువు నటి డ్రెస్ నూలు దారాన్ని (thread) తన నోటితో గట్టిగా పట్టుకుని లాగడం వల్ల నటి ప్రమాదంలో పడినట్లు కనిపించింది. కానీ, అంతటి ఆందోళనకర పరిస్థితుల్లో కూడా రవీనా టండన్ ఎంత మాత్రం భయపడకుండా, ఒత్తిడికి గురికాకుండా ఎంతో నిబ్బరంగా వ్యవహరించారు.  Also read: కొరియన్ కనకరాజుని ఎంత పని చేసావు స్వామి.. థమన్ ప్లస్ అయ్యాడా! లేదా!  ఆమె వెనక్కి తగ్గడానికి బదులుగా ముందుకు జరిగి ఆ శునకాన్ని ప్రేమగా నిమురుతూ దానిని శాంతింపజేసే ప్రయత్నం చేశారు. తదనంతరం ప్రదర్శన ముగిసి బయటకు వస్తున్న సమయంలో విలేకరులతో మాట్లాడిన రవీనా టండన్, తాను సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నానని, కుక్క తనని  కొరకలేదని, కేవలం డ్రెస్ దారం మాత్రమే దాని నోటికి చిక్కుకుందని స్పష్టం చేశారు.  రెడ్ కార్పెట్ వద్ద జరిగిన ఈ దృశ్యాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. రవీనా బాలీవుడ్ లో అగ్ర హీరోయిన్ హోదాలో అనేక చిత్రాల్లో చేసింది. రవీనా కూతురు రష తడా ని రీసెంట్ గా ఘట్టమనేని జై కృష్ణ తో కలిసి శ్రీనివాస మంగాపురంలో కనిపించిన విషయం తెలిసిందే.    
Poonam Kaur has announced that the latest episode of her cultural series Shakti Aur Sanskriti, featuring renowned art collector and handloom patron Anju Poddar, fondly known as "The Ikkat Lady." Produced by TeluguOne, the series has been receiving an encouraging response for showcasing inspiring personalities who have made significant contributions to India's culture and heritage. Announcing the episode on the occasion of National Handloom Day, Poonam Kaur shared a heartfelt note celebrating Anju Poddar's lifelong dedication to preserving India's handloom legacy. Calling her "Amma ji," Poonam described the 75-year-old as "a living treasure of our handloom heritage" and praised her boundless energy, saying she still carries "the enthusiasm of a teenager." Poonam also highlighted some remarkable facets of Poddar's journey. She revealed that legendary painter M.F. Husain painted Anju Poddar long before he famously painted Madhuri Dixit, inspired by the elegance of her sari. She added that stepping into Poddar's home is like experiencing a living piece of ancient India, reflecting her immense passion for preserving traditional textiles and their stories. Apart from being an avid handloom enthusiast and curator, Anju Poddar has also played a quiet yet significant role in supporting deserving artisans by recommending them for recognition. She has also led spiritual journeys to Mansarovar, making her contribution extend well beyond the world of textiles. With Shakti Aur Sanskriti, Poonam Kaur continues to bring such inspiring stories to audiences, celebrating individuals who have dedicated their lives to preserving India's rich cultural traditions. The latest episode featuring Anju Poddar is another addition to the series' growing list of meaningful conversations that highlight the country's artistic and cultural heritage. Disclaimer: This article is based on discussions and information shared across available sources, social media and publicly available news items. Interpretations remain those of the users involved. Readers are encouraged to exercise discretion before drawing conclusions.
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఆ ఒపీనియన్ పోల్ ఫలితాలు నిజంగా నిజం అయితే, కేరళలో మళ్ళీ సీపీఎం సారధ్యంలోని వామపక్ష కూటమి అధికారంలోకి వస్తుంది. ఇదే ఆ అద్భుతం. ఎందుకంటే, గత నాలుగు దశాబ్దాలలో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే కూటమి వరసగా రెండవసారి అధికారంలోకి వచ్చిన చరిత్ర లేనే లేదు. ఒక సారి ఎల్డీఎఫ్ అధికారంలోకి వస్తే ఐదేళ్ళ తర్వాత కాంగ్రెస్ సారధ్యంలోని ఐక్య ప్రజాస్వామ్య కూటమి(యూడీఎఫ్) అధికారంలోకి రావడం, దేవభుమిలో దైవ నిర్ణయమా అన్నట్లుగా ప్రతి ఎన్నికల్లోనూ అధికారం చేతులు మారుతూ వస్తోంది. అలాంటిది, ఈసారి ఒపీనియన్ పోల్స్ నిజమై వరసగా రెండవసారి వామపక్ష కూటమి అధికారంలోకి వస్తే, అది చరిత్రే అవుతుంది. ఇక ఒపీనియన్ పోల్స్ విషయానికి వస్తే, జాతీయ న్యూస్ ఛానెల్ ఏబీపీ, సీ ఓటర్ సంస్థలు సంయుక్తంగా ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఈ సర్వే ప్రకారం, 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో వామపక్ష కూటమికి 83 నుంచి  91 స్థానాలు, యూడీఎఫ్ కూటమికి 47 నుంచి 55 స్థానాలు మాత్రమే దక్కుతాయని తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో ఇలా జాతకాలు తిరగబడడంపై సోషల్ మీడియాలో,’లెగ్ మహిమ’ లాంటి జోక్స్  ట్రోలవుతున్నాయి. అయితే 2016లో జరిగిన ఎన్నికల్లో కేవలం 47 సీట్లకే పరిమితం అయిన కాంగ్రెస్’కు ఈసారి ఒకటీ అరా సీట్లు ఎక్కువస్తే, రావచ్చును. అదే కాంగ్రెస్’కు కాసింత ఊరట. అదలా ఉంటే, పశ్చిమ బెంగాల్లో సైతం పట్టు సాధించిన బీజేపే, కేరళలో మాత్రం పట్టు కాదు కదా, పట్టుమని పది సీట్లు తెచ్చుకునే స్థితిలో లేదు. నిజానికి, దేశంలో బీజేపీకి అసలు ఏ మాత్రం మింగుడు పడని రాష్ట్రాలు ఎవైన ఉన్నాయంటే కేరళ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల  పేర్లే ప్రముఖంగా వినిపిస్తాయి. ఈ సారి కూడా కమల దళం కేరళలో కాలు పెట్టె పరిస్తి లేదని సర్వే ఫలితాలు చెపుతున్నారు. ఎప్పటిలానే ఇప్పడు కూడా  బీజేపీకి సున్నా నుంచి రెండు సీట్లు వచ్చే అవకాశం ఉందని, సర్వేస్వరుల అభిప్రాయంగా ఉంది. కేరళలో మొత్తం 140 స్థానాలకు ఏప్రిల్ 6 తేదీన ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది. మే 2 తేదీన ఫలితాలు వెలువడతాయి. కేరళ ఎలక్షన్ పై యావత్ దేశం ఆసక్తి కనబరుస్తోంది.    
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఓటరు తీర్పుకు వెళుతున్నా, అందరి దృష్టి, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల ఏలుబడిలో ఉన్న ఉభయ తెలుగు రాష్ట్రాలు, మరీ ముఖ్యంగా ఇప్పటికే బీజేపీ కన్నుపడిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీల దుష్టి  మాత్రం పశ్చిమ బెంగాల్ పైనే వుంది.  పశ్చిమ బెంగాల్లో ‘అద్భుతం’ జరిగి బీజేపీ విజయం సాధిస్తే, ఇక  కమల దళం ఫోకస్, తెలంగాణకు షిఫ్ట్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఈ నేపధ్యంలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయంలో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. బెంగాల్లో బీజేపీ గెలిస్తే, ఇప్పటికే అంతర్గత కుటుంబ కలహాలతో సతమతవుతున్న తెరాస నాయకత్వానికి మరిన్నితిప్పలు తప్పవన్న మాట అంతఃపుర వర్గాలలో సైతం వినవస్తోంది.  పశ్చిమ బెంగాల్’లో ఎలాగైతే కమలదళం ఓ వంక తమ ట్రేడ్ మార్క్, హిందుత్వ రాజకీయాలు సాగిస్తూ, మరో వైపు నుంచి ‘ఆకర్ష్’ అస్త్రంతో అధికార పార్టీని నిర్వీర్యం చేసిన విధంగానే, ఇక్కడ కూడా ఫిరాయింపులను ప్రోత్సహింఛి పార్టీని నిట్టనిలువునా చీల్చే ప్రమాదాన్ని కొట్టివేయలేమని పార్టీ వర్గాలు కూడా అనుమానం వ్యక్త పరుస్తున్నాయి.  ఇప్పటికే తెలంగాణ  బీజేపీ నాయకులు 30 మంది తెరాస ఎమ్మెల్యేలు తమ టచ్ లో ఉన్నారని బెదిరిస్తున్నారు.అది నిజం అయినా కాకపోయినా..తెరాసలో అసంతృప్తి అగ్గి రగులుతోందనేది మాత్రం ఎవరూ కాదనలేని నిజం. అంతే కాకుండా రాష్ట్రానికి వచ్చిన కేంద్రనాయకులు ఎవరిని పలకరించినా, నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని ఎలాంటి సషబిషలు లేకుండా కుండబద్దలు కొడుతున్నారు.అందుకే, బెంగాల్లో బీజేపీ గెలిస్తే.. అనే ఊహా కూడా  గులాబీ గూటిలో గుబులు పుట్టిస్తోంది. అయితే, బెగాల్’లో బీజేపీ గెలిస్తే ఒక్క తెలంగాణలోనే కాదు, దేశ రాజకీయ వాతావరణంలోనే పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  అలాగే,  దేశ ముఖ చిత్రంలో కూడా పెను మార్పులు తప్పవని అంటున్నారు. అయితే రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరూహించెదరు..
ప్రేమ,  సహజీవనం, పెళ్లి.. ఏదైనా కావచ్చు.. అమ్మాయిలు అబ్బాయిలతో రిలేషన్ లో ఉండటం నేటి కాలంలో జరుగుతోంది.  రిలేషన్ లో ఉన్నప్పుడు అమ్మాయిలు తమకు తెలియకుండానే కొన్ని తప్పులు చేస్తారు.  వీటి కారణంగానే ఆ తరువాత చాలా బాధపడతారు కూడా. ఈ తప్పుల వల్ల బంధాలు చెడిపోవడం, విచ్చిన్నం కావడం, ఆఖరుకు ఆ బంధం ముగిసిపోవడం వంటివి కూడా జరిగే అవకాశం ఉంటుంది. రిలేషన్ లో ఉన్న ఎంతో మంది అమ్మాయిలు చేసే తప్పులు ఏంటో తెలుసుకుంటే.. అది కొంతమందికి అయినా ఆలోచించే అవకాశాన్ని,  తప్పు జరగకుండా జాగ్రత్త పడే అవకాశాన్ని ఇచ్చినట్టు అవుతుంది.  రిలేషన్ లో ఉండే అమ్మాయిలు చేసే తప్పులు ఏమిటో తెలుసుకుంటే.. తొందరపాటు.. ప్రేమ, సహజీవనం,  పెళ్లి.. ఇలా ఏ బంధంలో అయినా  మహిళలు ఒక కొత్త బంధానికి త్వరగా కట్టుబడిపోతారు. ఏ సంబంధమైనా బలంగా అభివృద్ధి చెందడానికి సమయం పడుతుంది. కానీ మహిళలు మాత్రం చాలా తొందరగా ఆ బంధానికి స్టిక్ అయిపోతారు.  అవగాహన లేకుండా జరిగే ఈ తొందరపాటు వల్ల  భవిష్యత్తులో  చాలా సమస్యలు వస్తాయి.  మొదట్లో తాము అనుకున్నట్టు, తరువాత లేదని అనుకోవడం,  పరిస్థితులు విభిన్నంగా మారడం.. ఇలా చాలా విషయాలు ఆ తరువాత బంధాన్ని విచ్చిన్నం చేసే దిశగా సాగుతాయి.  ప్రాధాన్యత.. మహిళలు ఏ సంబంధంలోనైనా చాలా భావోద్వేగంగా ఉంటారు.  తరచుగా తమ అవసరాల కంటే తమ భాగస్వామి అవసరాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఈ అలవాటు కారణంగా, సంబంధంలో తమకు తాము ప్రియారిటీ ఇచ్చుకోవడం కూడా మరిచిపోతారు.  ఇధి ఇలాగే కొనసాగితే.. బంధంలో భాగస్వామి తప్ప వారు ఎప్పటికీ కనిపించరు.  సింపుల్ గా చెప్పాలంటే తమను తాము కోల్పోతారు. ఇదే తర్వాత వారి బాధకు కారణం అవుతుంది. ఎమోషనల్ డిపెండింగ్.. చాలా మంది మహిళలు ఎప్పుడూ భావోద్వేగపరంగా తమ  భాగస్వామి మీద ఆధారపడతారు, తమ సంతోషాన్ని, తమకు కావలసిన ఓదార్పును,  తన ఇష్టాలను అన్నింటిని తమ భాగస్వామి ద్వారానే పొందుతారు.  ఇందులో తప్పు లేదు. భాగస్వామి కూడా భావోద్వేగపరంగా అంతే అనుభూతి చెందించే పర్లేదు.. కానీ  భావోద్వేగ మద్దతు కోసం పూర్తిగా  భాగస్వామిపై ఆధారపడటం  తప్పు. ఈ అలవాటు  భాగస్వామిపై ఒత్తిడిని కలిగించి సంబంధం విచ్ఛిన్నం కావడానికి దారితీయవచ్చు. ఎంపిక.. చాలా వరకు మహిళలు సంబంధాలలో తమ సొంత ఇష్టాలను పక్కన పెడతారు. తమ భాగస్వామికి అవి నచ్చవనే కారణంతో వారు తమ అభిరుచులను, అవసరాలను నిర్లక్ష్యం చేస్తారు. అలా చేయడం  సంబంధానికి మంచిది కాదు. అది సంబంధం విచ్ఛిన్నం కావడానికి దారితీయవచ్చు.  ఎవరి కోసమూ  అభిరుచులను, ఇష్టాలను వదులుకోకూడదు. లేకపోతే రేపటి రోజు చెప్పుకోవడానికి ఇష్టం,  చేయడానికి అభిరుచి వంటివి ఏమీ లేకుండా చుట్టూ శూన్యం ఉన్నట్టు అనిపిస్తుంది.                                              *రూపశ్రీ.
సిబ్లింగ్ థెరపీ..  తోబుట్టువుల మధ్య వచ్చే మనస్పర్థలు సులువుగా తొలగించే భలే మార్గం..! అన్నా తమ్ముడు, అక్కా చెల్లి, అన్నా చెల్లెళ్లు,  అక్కా తమ్ముళ్లు.. ఇలా తోబుట్టువుల బంధాలు చాలా గొప్పవి. ఒకే తల్లి రక్తం పంచుకుని పుట్టిన వారి మధ్య బంధం ఎంతో అపురూపమైనది.  చిన్నతనంలో తోబుట్టువులు కొట్టుకున్నా, తిట్టుకున్నా, గొడవ పడినా అది జరిగిన తర్వాత కొన్ని నిమిషాలు లేదా గంటల్లోనే తిరిగి కలిసిపోతారు.  ఒక్కటిగా పెరుగుతారు.  కానీ పెద్దయ్యాకే సమస్యలు వస్తాయి.  చాలామందికి అపార్థాలు చోటుచేసుకుంటాయి. మనస్పర్థలు వస్తాయి. వీటి వల్ల కేవలం ఆ మనిషి మాత్రమే కాకుండా కుటుంబం అంతా కలత చెందుతుంది.  పైగా ఇలాంటి మనస్పర్థలు,  అపార్థాల వల్ల దూరం కూడా పెరుగుతుంది. ఇలాంటి దూరాలను తగ్గించి, మనస్పర్థలు పోగొట్టి తిరిగి తోబుట్టువులను ఒక్కటిగా ఉంచే మార్గమే సిబ్లింగ్ థెరపీ.. అసలు సిబ్లింగ్ థెరపీ అంటే ఏంటి? దీని ప్రయోజనం ఏంటి? ఇదెలా సహాయపడుతుంది? పూర్తీగా తెలుసుకుంటే.. సిబ్లింగ్ థెరపీ అంటే.. సిబ్లింగ్ థెరపీ అనేది కుటుంబ చికిత్సలో ఒక భాగం. తోబుట్టువుల మధ్య మాట్లాడుకునే విధానాన్ని  మెరుగుపరచడం, గత విభేదాలను పరిష్కరించడం,  సంబంధంలో నమ్మకాన్ని తిరిగి వచ్చేలా చేయడం  దీని లక్ష్యం. ఈ చికిత్సలో బాగా ట్రైనింగ్ అయిన వ్యక్తి మనస్పర్థలు ఉన్న ఇద్దరు వ్యక్తులను  స్వేచ్ఛగా తమ భావాలను వ్యక్తపరచనవు చెబుతారు. ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడానికి గల కారణాలను అర్థం చేసుకోవడంలో సహాయపడతారు. తోబుట్టువుల మధ్య తరచుగా  జరిగే గొడవలు, ఇద్దరి మధ్య మాటలు లేకపోవడం, సవతి కుటుంబ సమస్యల కారణంగా సంబంధాలు దెబ్బతినడం, లేదా  పెద్దవయలు అయిపోయిన తల్లిదండ్రులను చూసుకోవడం.. ఇలా చాలా కారణాల వల్ల తోబుట్టువుల మధ్య విబేధాలు ఏర్పడితే వాటికి సరైన సొల్యుషన్ చెప్పి తోబుట్టువులను తిరిగి కలుపుతారు. ప్రయోజనం... సిబ్లింగ్ థెరపీ వల్ల కలిగే అతిపెద్ద ప్రయోజనం ఏమిటంటే, అది వారి మధ్య కమ్యునికేషన్ ను  మెరుగుపరుస్తుంది. థెరపీ సమయంలో, తోబుట్టువులు శ్రద్ధగా వినడం, తమ భావాలను సరైన విధంగా  వ్యక్తపరచడం,  అవతలి వ్యక్తి కోణాన్ని అర్థం చేసుకోవడం నేర్చుకుంటారు. దీనివల్ల క్రమంగా అపార్థాలు తగ్గుతాయి. ఒకవేళ చిన్ననాటి అనుభవం లేదా గతంలోని వివాదం వారి సంబంధంలో సమస్యకు కారణమైతే, ఈ సమస్యలను బహిరంగంగా చర్చించడానికి థెరపీ ఒక మంచ వాతావరణాన్ని అందిస్తుంది. కొన్నిసార్లు, పక్షపాతం, పగ, లేదా చెప్పుడు మాటలు వంటివి సంవత్సరాల తరబడి ఆ సంబంధాన్ని ప్రభావితం చేస్తూనే ఉంటాయి.  థెరపిస్ట్ సహాయంతో ఈ సమస్యలను చర్చించి పరిష్కరించడం జరుగుతుంది, తద్వారా ఆ సంబంధం సాఫీగా  సాగడానికి వీలవుతుంది. ఎమోషనల్ సపోర్ట్.. సిబ్లింగ్ థెరపీ  రిలేషన్స్ ను ఎమోషన్ పరంగా బలంగా మారుస్తుంది.  తోబుట్టువులకు ఒకరి మీద ఒకరికి నమ్మకం పెరుగుతుంది. కష్ట సమయాల్లో  కలసికట్టుగా ఉండటం, ఒకరి సంతోషాన్ని మరొకరు పంచుకోవడం, ఒకరి ఇబ్బందులలో మరొకరు తోడుగా ఉండటం.. ఇలా   మొత్తం కుటుంబంపై సానుకూల ప్రభావాన్ని చూపుతుంది. ఇంట్లో ఒత్తిడి తగ్గుతుంది , ఇతర కుటుంబ సభ్యులతో సంబంధాలు మెరుగుపడటం ప్రారంభిస్తాయి. తోబుట్టువుల మధ్య ఎప్పుడూ గొడవలు ఉంటే,  లేదా పూర్తీగా మాటలు ఆగిపోయి ఉంటే.. కుటుంబంలో పెద్ద మార్పు తర్వాత సంబంధాలు క్షీణిస్తే, లేదా కుటుంబ నిర్ణయాలపై తరచుగా వివాదాలు అవుతూ ఉంటే, సిబ్లింగ్ థెరపీని తీసుకోవడం చాలా మంచిది.                              *రూపశ్రీ.  
"నేటి బాలలె రేపటి పౌరులు.." "విత్తనం మంచిదైతే పసిడి పంట పండుతుంది".  ఇలాంటి మాటలు తరచుగా వింటూనే ఉంటాం. ఇవన్నీ పిల్లల వ్యక్తిత్వాన్ని వారి నడవడికను తెలియజేయడానికి, పిల్లల భవిష్యత్తు గురించి చెప్పడానికి ఉపయోగిస్తారు.  ప్రతి తల్లిదండ్రి తమ పిల్లలు ఉన్నతంగా ఎదగాలని, మంచి పేరు తెచ్చుకోవాలని, తమకు మంచి పేరు తీసుకురావాలని అనుకుంటారు.  అయితే ఇవన్నీ జరగాలన్నా, పిల్లలు జీవితంలో సక్సెస్ కావాలన్నా.. పిల్లలకు కొన్ని లక్షణాలు అలవాటు చేయాలి.  దీని వల్ల పిల్లల భవిష్యత్తు బంగారం అవుతుంది.  తల్లిదండ్రులు పిల్లలకు అలవాటు చేయాల్సినవి ఏమిటో తెలుసుకుంటే.. జ్ఞానం, తెలివితేటలు.. జ్ఞానం , తెలివితేటలు  పిల్లలకే కాకుండా పెద్దలకు కూడా బలాలుగా మారతాయి. నేర్చుకోవాలనే తపన, ఆలోచించి నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం ఉన్న పిల్లలు జీవితంలో విజయ మార్గంలో సులభంగా పయనిస్తారు. అటువంటి పిల్లలు తమ వృత్తి జీవితంలో ఎదురయ్యే సవాళ్లను మరింత సమర్థవంతంగా ఎదుర్కోగలరు. తెలివైన పిల్లలు తమ భవిష్యత్తును గొప్పగా మార్చుకోవడమే  చేసుకోవడమే కాకుండా వారి తల్లిదండ్రుల ప్రతిష్టను కూడా పెంచుతారు. అందుకే చిన్నతనం నుండే పిల్లలకు జ్ఞానాన్ని ఇవ్వాలి.   ప్రవర్తన.. మంచి ప్రవర్తన, నీతి, నిజాయితీ వంటి విలువలు గొప్ప ఆస్తిగా పరిగణించాలి. పెద్దల పట్ల గౌరవం, క్రమశిక్షణ, కుటుంబం పట్ల బాధ్యత కలిగిన పిల్లలు కుటుంబాన్ని ఒక్కటిగా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తారు. అలాంటి పిల్లలు ఇంట్లో శాంతి, సంతోషాన్ని నెలకొల్పి, సమాజంలో కుటుంబానికి గౌరవాన్ని తెస్తారు. అందుకే పిల్లలకు మంచి విలువలు నేర్పించాలి.  దీని వల్ల పిల్లల ప్రవర్తన కూడా ఉన్నతంగా మారుతుంది. నిజాయితీ.. అబద్ధాలు చెప్పడం, మోసం, వంచనలకు దూరంగా ఉండే పిల్లలు సమాజంలో మంచి పేరు తెచ్చుకోగలుగుతారు. పిల్లలు అయినా పెద్దలు అయినా.. వారి వ్యక్తిత్వాన్ని బలంగా ఉంచేది నిజాయితీనే..  ఇది  చుట్టూ ఉన్న వ్యక్తుల నమ్మకాన్ని పొందడంలో సహాయపడుతుంది. అటువంటి పిల్లలకు జీవితంలో విజయం సాధించడానికి గొప్ప అవకాశాలు ఉంటాయి. అందుకే వారి తల్లిదండ్రులు కూడా సమాజంలో గౌరవాన్ని పొందుతారు. దయ.. దయ కలిగి ఉండటం,  సహాయపడే గుణం ఉన్న పిల్లలు ఉంటే ఆ తల్లిదండ్రులు ఎంతో అదృష్టవంతులని చెప్పవచ్చు.  పేదలకు సహాయం చేస్తూ, ఇతరుల పట్ల సున్నితంగా ఉండే పిల్లలు సంతోషం, శాంతితో కూడిన జీవితాన్ని గడుపుతారు. అలాంటి పిల్లలకు  తల్లిదండ్రుల ఆశీర్వాదం, మద్దతు కూడా ఎప్పుడూ ఉంటుంది.   పిల్లలలో ఉండే ఈ దయ, జాలి, కరుణ, సహాయం చేసే గుణం వంటివి సమాజంలో గప్ప గౌరవాన్ని తెచ్చిపెడుతుంది.                                *రూపశ్రీ.  
మనిషి  మెదడు చాలా శక్తివంతమైనది.  మనిషి మనుగడ సాగుతున్నది మెదడు పనితీరు మీదనే.. మెదడు ఎంత ఆరోగ్యంగా ఉంటే మనిషి జీవితం అంత బాగుంటుంది.  కానీ మెదడు పనితీరు సరిగా లేకపోతే చాలా సమస్యలు వస్తాయి.  అయితే మనిషి మెదడు  ఎల్లప్పుడూ నిష్పక్షపాతంగా ఉండదని అంటున్నారు నిపుణులు. సమాచారాన్ని వేగంగా గ్రహించడంలో  సహాయపడటానికి..  మనస్సు కాగ్నిటివ్ బయాసెస్ అని పిలువబడే మానసిక పరిస్థితి పై ఆధారపడుతుంది. ఈ మార్గాలు సమయాన్ని ఆదా చేయగలిగినప్పటికీ, అవి ఆలోచించే, నిర్ణయాలు తీసుకునే ,  చుట్టూ ఉన్న వ్యక్తులను అర్థం చేసుకునే విధానాన్ని కూడా వక్రీకరించగలవని అంటున్నారు. దీని ఫలితంగా  మెదడు ఒక విషయాన్ని వేరేగా అన్వయించుకుంటుంది, అందుకే అదే నిజమని నమ్మే అవకాశం ఉంటుంది.  దీని గురించి మరింత వివరంగా తెలుసుకుంటే.. నిర్థారణలో పక్షపాతం..  ఇప్పటికే నమ్ముతున్న విషయాలను బలపరిచే సమాచారం కోసం  మెదడు సహజంగానే వెతుకుతూ ఉంటుందట.  ఎవరితోనైనా విభేదిస్తే, వారితో విభేధించడానికి గల అభిప్రాయానికి గల కారణాలను,  సాక్ష్యాలను విస్మరించి, వారు తప్పు అని చెప్పడానికి గల ప్రతి కారణంపై  దృష్టి పెడతారట. నిజాన్ని తెలుసుకోవడానికి  బదులుగా, మనస్సు తరచుగా తను అనుకున్నదే కరెక్ట్ అనే విషయాన్ని నిరూపించడం  కోసం వెతుకుతూ ఉంటుందట.  ఇలా నిజాలు తెలుసుకునే విషయంలో మెదడు పక్షపాతం వహిస్తుందట. హెలో ఎఫెక్ట్.. చాలామంది చక్కగా దుస్తులు ధరించి,  శుభ్రంగా ఉంటూ, చాలా ఆత్మవిశ్వాసంతో ఉంటుంటారు.  ఇలాంటి వారి విషయంలో చాలామంది పాజిటివ్ గానూ,  వాళ్లదిమంచి వ్యక్తిత్వం అని అనుకుంటారు.  దీని కారణం మెదడే.. ఇలాంటి వాళ్లు మంచోళ్లు అని మెదడు అనుకుంటుందట.  ఇలాంటి ప్రభావాన్ని హెలో ఎఫెక్ట్ అని అంటారు. ఒక వ్యక్తిలో  మంచి గుణాన్ని గమనించినప్పుడు, ఎటువంటి నిజమైన ఆధారం లేకపోయినా,  మెదడు వారికి ఇతర మంచి లక్షణాలు కూడా ఉన్నాయని దానంతట అదే ఊహించుకుంటుంది. వాస్తవాల ఆధారంగా ఒకరిని అంచనా వేయడానికి బదులుగా,  మనస్సు దానికి నచ్చినట్టు మంచి మంచి స్టోరీస్ ను ఊహించుకుని మరీ  వారిని చాలా మంచోళ్లను,  అన్నీ మంచి గుణాలే ఉన్నోళ్లుగా భావిస్తుంది. ఎమోషనల్ లాజిక్.. ఎమోషన్స్ అనేవి వాస్తవాన్ని చూసే విధానాన్ని ప్రభావితం చేస్తాయి. ఎప్పుడైనా ఆందోళనగా అనిపిస్తే, ఆ పరిస్థితి ప్రమాదకరమైనదని అనుకోవడం,  ఎందులో అయినా ఫెయిల్యూర్ ఎదురైతే నిజంగానే పూర్తీగా విఫలమయ్యారని అనుకోవడం జరుగుతుంది. మనిషిలో ఉండే ఫీలింగ్స్  సరైనవే అయినప్పటికీ, అవి ఎల్లప్పుడూ వాస్తవానికి దగ్గరగా ఉండవు. ఎమోషన్స్ ను  వాస్తవాల నుండి వేరు చేయడానికి కొంత సమయం తీసుకోవాలి, యాంత్రికంగా రియాక్ట్ అయ్యే  బదులు మరింత ఆలోచనాత్మకంగా స్పందించాలి.  అలా ఉంటేనే మంచిది.  లేకపోతే మెదడు చేతిలో మోసపోవాల్సి వస్తుంది. సన్క్ కాస్ట్ పాలసీ.. ఇప్పటికే చాలా సమయం , శ్రమను  ఒక పని కోసం వెచ్చించారు అనే కారణంతో  అందులో  అలాగే కొనసాగుతూ ఉంటే దాన్ని 'సన్క్ కాస్ట్ ఫాలసీ' (sunk cost fallacy) అంటారు.  మెదడు తరచుగా గత పెట్టుబడిని భవిష్యత్ విలువతో గందరగోళానికి గురిచేస్తుంది. దీనివల్ల ఏదైనా  ఇకపై ఉపయోగపడకపోయినా దాని నుండి బయటపడటం కష్టమవుతుంది.  ఇప్పటికే గడిపిన సమయాన్ని తిరిగి పొందలేరని గుర్తుంచుకోవాలి.  ఎలా ముందుకు సాగాలని నిర్ణయించుకుంటారో అదే  అత్యంత ముఖ్యం. నెగిటివ్  ప్రభావం.. ఎవరైనా విమర్మించినప్పుడు, తిట్టినప్పుడు, బాధపెట్టినప్పుడు.. అది  రోజుల తరబడి మనసులో నిలిచిపోతుంది, కానీ ఎన్నో మంచి విషయాలు, సంతోషకరమైన విషయాలు  త్వరగా మర్చిపోతారు. ఇలా జరగడానికి కారణం, మెదడు సహజంగానే సానుకూల అనుభవాల కంటే ప్రతికూల అనుభవాలపై ఎక్కువ శ్రద్ధ పెట్టడం. ఇది  ఒకప్పుడు, ప్రమాదం పట్ల అప్రమత్తంగా ఉండటానికి,  మానవులు మనుగడ సాగించడానికి సహాయపడింది. అయితే ఈ రోజుల్లో, ఇది రోజువారీ ఎదురుదెబ్బలను అవి నిజంగా ఉన్నదానికంటే చాలా పెద్దవిగా అనిపించేలా చేస్తుంది. నెగిటివ్ కంటే పాజిటివ్ ను మెదడులో ఇముడ్చుకోవాలి. అప్పుడే మెదడు పనితీరు ఆరోగ్యకరంగా ఉన్నట్టు. స్పాట్ లైట్ ఎఫెక్ట్..  తప్పులను,  రూపాన్ని, లేదా ఒక ఇబ్బందికరమైన క్షణాన్ని అందరూ గమనిస్తారని నమ్మడం చాలా సులభం. వాస్తవానికి, చాలా మంది తమ సొంత జీవితాలు , విషయాలపైనే దృష్టి పెడతారు. ఈ స్పాట్‌లైట్ ఎఫెక్ట్ వల్ల అందరూ తమను నిరంతరం గమనిస్తున్నారనే భావన కలుగుతుంది. కానీ నిజానికి అలా జరగకపోయినా  అదేలా భావిస్తుంటారు. ఈ ఆలోచనను  వదిలేయడం వల్ల,  రోజువారీ జీవితంలో మరింత ఆత్మవిశ్వాసంతో, తక్కువ భయంతో  ఉండటానికి సహాయపడుతుంది. పైన చెప్పుకున్నవిధంగా.. వివిధ కారణాల వల్ల చాలామందికి తమ మెదడే శత్రువులా మారి మోసం చేస్తుంది.                                     *రూపశ్రీ.  
మధుమేహం అనేది ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ఒక ఆరోగ్య సమస్య, ఇది అన్ని వయసుల వారిని ప్రభావితం చేస్తుంది. జీన్స్ ప్రభావం, ఊబకాయం , జీవనశైలిలో మార్పులు వంటి కొన్ని ప్రమాద కారకాలు ఈ వ్యాధి వచ్చే ప్రమాదాన్ని పెంచుతాయి. మధుమేహాన్ని సాధారణంగా టైప్ 1 , టైప్ 2 అనే రెండు ప్రధాన రకాలుగా చర్చిస్తారు, కానీ  టైప్ 1.5 డయాబెటిస్ గురించి చాలామందికి తెలియదు. లాడా డయాబెటిస్ అంటే.. latent autoimmune diabetes in adult అని అర్థం. ఇది నెమ్మదిగా అభివృద్ది చెందే ఆటోఇమ్యూన్ జబ్బు. 30 ఏళ్లు పైబడిన వారికి వస్తుంది. టైప్ 1 డయాబెటిస్ తో పోలిస్తే.. 1.5 డయాబెటిస్ వల్ల కలిగే నష్టం నెమ్మదిగా ఉంటుంది. మొదట్లో దీన్ని టైప్ 2 అని పొరబడతారు.  దీని గురించి మరింత వివరంగా తెలుసుకుంటే..  టైప్ 1.5 డయాబెటిస్.. టైప్ 1.5 డయాబెటిస్  లక్షణాలు టైప్ 1 , టైప్ 2 డయాబెటిస్  లక్షణాలను పోలి ఉంటాయి. ఇది  సాధారణంగా వయోజన దశలో నిర్ధారణ అవుతుంది.  టైప్ 2 డయాబెటిస్ లాగా ఇది కూడా నెమ్మదిగా డవలప్ చెందుతుంది. అయితే టైప్ 2 డయాబెటిస్ లా కాకుండా, LADA అనేది ఒక ఆటో ఇమ్యూన్ వ్యాధి.  దీనిని ఆహార, జీవనశైలి మార్పులతో  నయం చేయలేము. ఎవరికైనా టైప్ 2 డయాబెటిస్ ఉన్నట్లు నిర్ధారణ అయితే,  బరువు , జీవనశైలి ఆరోగ్యంగా ఉన్నప్పటికీ, అది నిజానికి టైప్ 1.5 డయాబెటిస్ అయ్యే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. టైప్ 1.5 డయాబెటిస్ కారణాలు, నిర్థారణ.. టైప్ 1.5 డయాబెటిస్‌ను అర్థం చేసుకోవాలంటే, అది ఇతర ప్రధాన రకాల డయాబెటిస్‌ల నుండి ఎలా భిన్నంగా ఉంటుందో తెలుసుకోవడం ముఖ్యం. టైప్ 1 డయాబెటిస్‌ను ఒక ఆటో ఇమ్యూన్ వ్యాధిగా పరిగణిస్తారు, ఎందుకంటే ఇన్సులిన్‌ను తయారు చేయడంలో శరీరానికి సహాయపడే ప్యాంక్రియాటిక్ బీటా కణాలను మీ  స్వయంగా నాశనం చేసుకోవడం వల్ల ఇది వస్తుంది. టైప్ 2 డయాబెటిస్ అనేది ప్రధానంగా ఇన్సులిన్‌కు శరీరం చూపే నిరోధకత వల్ల వచ్చే సమస్య. ఇలాంటప్పుడు శరీరం తగినంత ఇన్సులిన్‌ను ఉత్పత్తి చేయదు లేదా దానిని సరిగ్గా ఉపయోగించుకోదు. ఇన్సులిన్‌ను ఉత్పత్తి చేసే కణాలకు వ్యతిరేకంగా యాంటీబాడీలు ఏర్పడటం వల్ల క్లోమగ్రంథి దెబ్బతినడంతో టైప్ 1.5 మధుమేహం వస్తుంది.  కుటుంబంలో ఎవరికైనా ఆటోఇమ్యూన్ వ్యాధులు ఉంటే, ఈ రకమైన మధుమేహం వచ్చే ప్రమాదం ఉండవచ్చని వైద్యులు చెబుతున్నారు. టైప్ 1.5 డయాబెటిస్ ఉన్న వ్యక్తి ఊబకాయంతో ఉంటే, అది ఇన్సులిన్ నిరోధకతకు కూడా దారితీయవచ్చు. దీనిని ఎలా గుర్తించాలి? టైప్ 1.5 మధుమేహం  లక్షణాలు మొదట్లో అంత స్పష్టంగా ఉండవు. దీని సమస్యలు ఇతర రకాల మధుమేహంలో ఉండే సమస్యల మాదిరిగానే ఉండవచ్చు. అయితే దీనిని ముందుగానే గుర్తించకపోయినా లేదా చికిత్స చేయకుండా వదిలేసినా, అది డయాబెటిక్ కీటోయాసిడోసిస్‌కు దారితీయవచ్చు. టైప్ 1.5 మధుమేహం తరచుగా టైప్ 2 మధుమేహం మాదిరిగానే సమస్యలను కలిగిస్తుంది. పదే పదే దాహం ఎక్కువ వేయడం, తరచుగా మూత్రవిసర్జనకు వెళ్లాల్సి రావడం, బరువు తగ్గడం. దృష్టి మసకబారడం , జలదరింపు అనుభూతి వంటి లక్షణాలు ఉంటాయి. టైప్ 1.5 డయాబెటిస్ ను ఎలా నివారించాలి? టైప్ 1.5 డయాబెటిస్‌ను నిర్ధారించడానికి సమయం పట్టవచ్చు , దీనిని తరచుగా టైప్ 2 డయాబెటిస్‌గా పొరబడతారు. టైప్ 1 డయాబెటిస్ ఉన్నవారి మాదిరిగానే, టైప్ 1.5 డయాబెటిస్ ఉన్నవారిలో కూడా కనీసం ఒక యాంటీబాడీకి పాజిటివ్ అని తేలవచ్చు.  శరీరం ఇన్సులిన్ ఉత్పత్తిని నెమ్మదింపజేస్తుంది కాబట్టి, ఇన్సులిన్ ఇంజెక్షన్లు అవసరం కావచ్చు. ఇన్సులిన్ లేకుండా పరిస్థితి అదుపులో ఉండని వారు శాశ్వతంగా ఇన్సులిన్ తీసుకోవలసి రావచ్చు. ప్రస్తుతం, టైప్ 1.5 డయాబెటిస్‌ను నివారించడానికి మార్గం లేదు. టైప్ 1 డయాబెటిస్ మాదిరిగానే ఇందులో కూడా జన్యుపరమైన కారకాలు పాత్ర పోషిస్తాయి. టైప్ 1.5 డయాబెటిస్ వల్ల కలిగే సమస్యలను తగ్గించడానికి సరైన నిర్ధారణ , లక్షణాలపై శ్రద్ధ చూపడం చాలా ముఖ్యం.                                      *రూపశ్రీ.  
అవిసె గింజలు (Flax Seeds) చిన్నవైనా ఆరోగ్యానికి చేసే మేలు ఎంతో గొప్పది. ఆయుర్వేద నిపుణులు డా. చిట్టిభొట్ల మధుసూదన శర్మ ఈ వీడియోలో అవిసె గింజల అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను సులభంగా వివరించారు. అవిసె గింజల్లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు, ఫైబర్, లిగ్నాన్లు, యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యాన్ని కాపాడటంలో, రక్తనాళాలు ఆరోగ్యంగా ఉండేలా చేయడంలో, మెదడు పనితీరును మెరుగుపరచడంలో సహాయపడతాయి. క్రమం తప్పకుండా తీసుకుంటే చెడు కొలెస్ట్రాల్ తగ్గించడంలో, జీర్ణక్రియ మెరుగుపరచడంలో, మలబద్ధకాన్ని తగ్గించడంలో కూడా ఉపయోగపడతాయని డాక్టర్ వివరిస్తున్నారు. ముఖ్యంగా మహిళలకు అవిసె గింజలు ఎంతో మేలు చేస్తాయని ఆయన తెలిపారు. హార్మోన్ల సమతుల్యతను కాపాడటం, రుతుక్రమానికి సంబంధించిన సమస్యలను తగ్గించడం, మెనోపాజ్ సమయంలో వచ్చే అసౌకర్యాలను తగ్గించడం, చర్మం మరియు జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో అవిసె గింజలు ఉపయోగపడతాయని చెప్పారు. ఈ వీడియోలో అవిసె గింజలను ఎలా తీసుకోవాలి? రోజుకు ఎంత మోతాదులో తీసుకోవాలి? ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి? అనే అంశాలను కూడా వివరంగా తెలియజేశారు. అవిసె గింజలను మీ రోజువారీ ఆహారంలో చేర్చడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకోవాలంటే ఈ పూర్తి వీడియోను తప్పకుండా చూడండి.  వీడియోలోని ముఖ్యాంశాలు: అవిసె గింజల పోషక విలువలు గుండె ఆరోగ్యానికి అవిసె గింజల ప్రయోజనాలు మెదడు, రక్తనాళాల రక్షణలో వాటి పాత్ర మహిళల హార్మోన్ల ఆరోగ్యానికి ఉపయోగాలు జీర్ణక్రియ, మలబద్ధకం సమస్యలపై ప్రభావం అవిసె గింజలను తీసుకునే సరైన విధానం తీసుకునేటప్పుడు పాటించాల్సిన జాగ్రత్తలు గమనిక: ఈ వీడియోలో చెప్పిన అంశాలు ఆయుర్వేద నిపుణుల అభిప్రాయాల ఆధారంగా ఉన్నాయి. వ్యక్తిగత ఆరోగ్య పరిస్థితులకు అనుగుణంగా ఏదైనా ఆహార మార్పులు చేసే ముందు వైద్యుల సలహా తీసుకోవడం మంచిది. మీ ఆరోగ్య సమస్య ఏదైనా... మా హెల్త్ యూట్యూబ్ ఛానల్‌లో సీనియర్ డాక్టర్స్ చెప్పిన సలహాలు... సూచనలు ఉన్నాయి. మా యూట్యూబ్ ఛానల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 👉 TeluguOne Health (సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!)