Home

»

Latest News

ఏందయ్య సామీ: రణబాలి ఫుల్ సాంగ్‌లో విజయ్, రశ్మిక కెమిస్ట్రీ హైలైట్.!

Sep 22, 2026 3:44PM

విజయ్ దేవరకొండ, రశ్మిక మందన్న జంటగా నటిస్తున్న పాన్ ఇండియా మూవీ "రణబాలి". ఈ సినిమాకు రాహుల్ సంకృత్యన్ దర్శకత్వం వహిస్తున్నారు. టీ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ హ్యూజ్ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. దసరా కానుకగా అక్టోబర్ 16న "రణబాలి" సినిమా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ రోజు ఈ చిత్రం నుంచి 'ఏందయ్య సామీ..' ఫుల్ లిరికల్ సాంగ్ ను రిలీజ్ చేశారు. తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో ఈ పాటను విడుదల చేశారు.

"రణబాలి"లో విజయ్, రశ్మిక పెళ్లి వేడుక సందర్భంగా 'ఏందయ్య సామీ..' పాట చిత్రీకరించారు. 19వ శతాబ్దంలో పెళ్లి సందడి ఎంత సంప్రదాయంగా ఉండేదో, పెళ్లి తర్వాత నూతన వధూవరుల జీవితం ఎలా ఉండేదో ఈ పాటలో అందంగా రూపొందించారు. నిజ జీవితంలో భార్యాభర్తలైన విజయ్, రశ్మిక కెమిస్ట్రీ ఈ పాటలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. 

ఈ పాటను అజయ్ అతుల్ మెలోడియస్ గా కంపోజ్ చేశారు. రామజోగయ్య శాస్త్రి అద్భుతమైన లిరిక్స్ అందించగా, శ్వేతా మోహన్, అజయ్ గోగవలే మధురంగా పాడారు. 'ఏందయ్య సామీ..' పాట ఎలా ఉందో చూస్తే - 'ఏందయ్యా సామీ ఇట్ట గాస్తాందీ వెన్నెల, ఊపేస్తా ఉంది సిత్తరాలా ఉయ్యాలా, వీచే గాలికి అత్తరద్దిందెవ్వరు, మారే ఝాముకి మందుపెట్టిందెవ్వరు, మాయదారి మనస్సాగక జాగరమన్నరా...' అంటూ మళ్లీ మళ్లీ వినాలనిపించేలా సాగుతుందీ పాట.

ఇది కూడా చదవండి: పౌరాణిక పాత్రలో లారెన్స్.. ‘మహావీర్ కర్ణ’పై అంచనాలు పెంచుతున్న ఫస్ట్ లుక్

19వ సెంచరీ నేపథ్యంతో 1854 నుంచి 1878 మధ్య బ్రిటీష్ పాలనా కాలంలో జరిగిన యదార్థ చారిత్రక సంఘటనల ఆధారంగా "రణబాలి" సినిమా రూపొందుతోంది. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో మూవీ లవర్స్ లో ఆసక్తి కలిగిస్తోంది. రీసెంట్ గా రిలీజ్ చేసిన ఈ చిత్ర టీజర్ మూవీపై అంచనాలు మరింతగా పెంచేసింది.

మీకు నచ్చవచ్చు: 
ఇండియాస్ రియల్ జేమ్స్ బాండ్.. RAW వెనుక ఉన్న మాస్టర్‌మైండ్ ఇతనే.!
ఎన్టీఆర్ కెరీర్‌లో తొలి 'A' స‌ర్టిఫికెట్ సినిమా వెనుక ఆస‌క్తికర విశేషాలు.!

 

 

 

[Endhayya Saami Full Song, Ranabaali Song, Ranabaali Movie, Vijay Rashmika, Vijay Deverakonda, Rashmika Mandanna, Rahul Sankrityan, Ajay Atul, Telugu Songs 2026, Best Telugu Songs]

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com