నారా లోకేష్ రాక.!
Published on: Tue Sep 22, 2026 5:15PM

యువనేత లోకేష్ రాప్తాడు రావడం పార్టీ కేడర్‌కు పండుగ రోజు. దివంగత ఎన్టీఆర్, పరిటాల రవి విగ్రహావిష్కరణకు తొలిసారి నియోజకవర్గానికి ఆనందంగా ఉందని రాప్తాడు ఎమ్మెల్యే, మాజీమంత్రి పరిటాల సునీత అన్నారు. రాప్తాడు నియోజకవర్గ టీడీపీ కార్యకర్తల సమన్వయ సమావేశంలో సునీతమ్మ మాట్లాడుతూ... రాప్తాడు నియోజకవర్గంలో గత ప్రభుత్వ హయాంలో చాలామందిని ఇబ్బంది పెట్టారు. కనీసం పెళ్లిళ్లకు కూడా వెళ్లకుండా అడ్డుకున్నారు. కార్యకర్తలు బెదరకుండా ధైర్యంతో నిలబడ్డారు. ఎన్టీఆర్ పిలుపుమేరకు పరిటాల రవీంద్ర రాజకీయాల్లోకి వచ్చారు. నాడు అన్న ఎన్టీఆర్ వద్దన్నా మంత్రి పదవి ఇచ్చి ఆదరించారు. చంద్రబాబు పిలుపుమేరకు నేను రాజకీయాల్లోకి వచ్చాను. ఆనాడు కార్యకర్తలే నా వెన్నంటి నడిపించారు. చంద్రబాబు మూడుసార్లు టిక్కెట్ ఇచ్చి, ఒకసారి మంత్రినిచేసి మా కుటుంబాన్ని ఆదరించారు.

గత ప్రభుత్వంలో నాపై 22, శ్రీరామ్‌పై 34, కార్యకర్తలపై 20కి పైగా కేసులు పెట్టారు. ఆ కేసుల గురించి ఆలోచించాలని లోకేష్‌ను కోరుతున్నా. రాప్తాడు నియోజకవర్గంలో అన్ని సామాజికవర్గాలు మాకు అండగా నిలబడ్డాయి. ప్రత్యర్థులు చేతిలో ప్రాణాలు కోల్పోయిన తగరకుంట ప్రభాకర్ ఆరుగురి బిడ్డలను చంద్రబాబు చదివించి ప్రయోజకులను చేశారు. పరిటాల రవితోపాటు చనిపోయిన వారి పిల్లలను చదివించారు. వాడుకుని పక్కనపడేసే పార్టీ కాదు తెలుగుదేశం. రాప్తాడు నియోజకవర్గంలో 11మందికి కార్యకర్తల సంక్షేమనిధి అందించారు. యువనేత లోకేష్ కార్యకర్తలకు ధైర్యాన్నిస్తూ యువగళం పాదయాత్ర చేసి స్పూర్తినిచ్చారు.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం వెనుక చంద్రబాబు, లోకేష్ రెక్కల కష్టం దాగిఉంది. అందువల్లే రాప్తాడులో దాదాపు 25వేలకు పైగా మెజారిటీ వచ్చింది. ఈ నియోజకవర్గంలో చిన్న సైకోను సాగనంపాలని ప్రజలు,కార్యకర్తలు నిర్ణయించుకొని, ఎన్నికల్లో నెరవేర్చుకున్నారు. రాప్తాడు నియోజకవర్గానికి సాగు, తాగునీరు అందించే రూ.800 కోట్ల అప్పర్ పెన్నార్ ప్రాజెక్టు అందించినందుకు కృతజ్జతలు. రైతులకు త్వరగా పరిహారం అందించాలని కోరుతున్నా. రాప్తాడు మండలంలో జూనియర్ కాలేజి మంజూరు చేయండి. రామగిరిలో హాస్టల్ భవనం, ఆత్మకూరులో కాలేజి మంజూరు చేయండి. విద్యాశాఖ మంత్రిగా లోకేష్ బాబు వచ్చాకే స్కూళ్లు బాగుపడ్డాయి. చదువుకునే ప్రతిబిడ్డకు తల్లికి వందనం అందిస్తున్నారు. మీ ఆదేశాల మేరకు కార్యకర్తలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి, పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నామని సునీత చెప్పారు.
స్థానిక ఎన్నికల్లో ఏకపక్ష విజయం సాధించాలి..!
హిందూపురం ఎంపి బికె పార్థసారధి మాట్లాడుతూ... దివంగత ఎన్టీఆర్, పరిటాల రవీంద్ర విగ్రహావిష్కరణకు యువనేత లోకేష్ రాప్తాడు రావడం ఆనందంగా ఉంది. ఆనాడు పరిటాల రవీంద్ర దివంగతులయ్యాక వచ్చిన ఎన్నికల్లో పార్టీ కేడర్ వెన్నుచూపకుండా 15వేల మెజారిటీతో పార్టీని గెలిపించారు. 2019లో అధికారం కోల్పోయాక బెదిరించారు. రామగిరి పోలీసు స్టేషన్ వద్ద ఆందోళన చేశాం. ఎక్కడా భయపడలేదు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చిన్నచిన్న విభేదాలను పక్కనబెట్టి ఏకపక్షంగా కూటమి అభ్యర్థులను గెలిపించుకోవాలి. 2019-24లో అభివృద్ధి జరగలేదు. చంద్రబాబు గారు హంద్రీనీవాను 3వేలకోట్లతో విస్తరించి కుప్పం వరకు నీళ్లు తీసుకెళ్లారు. యువనేత లోకేష్ యువగళంలో ఇచ్చిన 20లక్షల ఉద్యోగాల హామీమేరకు పరిశ్రమలు పెద్దఎత్తున ఎపికి వస్తున్నాయి. స్థానిక ఎన్నికల్లో కష్టపడి పనిచేయాలి, పార్టీ బాగుంటేనే అందరం బాగుంటాం. మరో 20ఏళ్లు తెలుగుదేశం అధికారంలో ఉండాలని అన్నారు.

స్థానిక ఎన్నికల్లో ఇదే ఉత్సాహాన్ని కొనసాగించండి :శ్రీరామ్
ధర్మవరం ఇన్చార్జి పరిటాల శ్రీరామ్ మాట్లాడుతూ... మీ అందరి సహకారంతో లోకల్ బాడీలో అద్భుత విజయాన్ని సాధించబోతున్నాం. పార్టీ కార్యకర్తలంతా గ్రామాల్లోకి వెళ్లి ఇదే ఉత్సాహాన్ని కొనసాగించాలి. యువగళం రథసారధి లోకేష్‌కు ఘనస్వాగతం పలికిన పార్టీ కేడర్‌కు అభినందనలు తెలిపారు. పార్లమెంటు పార్టీ ప్రెసిడెంట్ ఎంఎస్ రాజు మాట్లాడుతూ... కార్యకర్తల సంక్షేమం ధ్యేయం మొట్టమొదటిసారిగా కార్యకర్తల సంక్షేమనిధిని ఏర్పాటుచేసిన నాయకుడు లోకేష్. గత చీకటి పాలనను ఎదురొడ్డి యువగళం పాదయాత్ర ద్వారా రాష్ట్రప్రజలకు అండగా నిలబడ్డారు. అధికారంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వ దుర్మార్గాలకు చరమగీతం పాడారు. ఒకవైపు రాష్ట్రాభివృద్ధి, మరోవైపు కార్యకర్తల సంక్షేమం కోసం శ్రమిస్తున్నారు. ఎన్టీఆర్, చంద్రబాబు ఆశయాలను కొనసాగిస్తున్న భవిష్యత్ నాయకుడు లోకేష్ అని కొనియాడారు.
[ Nara Lokesh, Paritala Sunitha, Rapthadu, TDP, Telugu Desam Party, Chandrababu Naidu, Paritala Ravindra, Paritala Sriram, BK Parthasarathi, TDP Cadre, Rapthadu TDP, Local Body Elections, Youth Gala, Upper Pennar Project, Telugu One, Telugu News ]


