క్రియాటినిన్ పెరిగితే కిడ్నీలు ఫెయిల్ అవుతున్నట్టేనా.. డయాలసిస్‌పై క్లారిటీ..!
Published on: Tue Sep 22, 2026 9:30AM

క్రియాటినిన్ అంటే ఏమిటి? మన శరీరంలో క్రియాటినిన్ స్థాయిలు ఎందుకు పెరుగుతాయి? క్రియాటినిన్ ఎక్కువగా ఉంటే కిడ్నీల పనితీరుపై ఎలాంటి ప్రభావం ఉంటుంది? గుండె సమస్యలు, కిడ్నీ సమస్యలకు దీనికి ఉన్న సంబంధం ఏమిటి?
ఈ వీడియోలో Creatinine Test, Creatinine Levels, Kidney Functionగురించి ప్రముఖ నెఫ్రాలజిస్ట్ Dr. Sree Bhushan Raju, MD, Nephrology వివరంగా తెలియజేస్తున్నారు. రక్తంలో క్రియాటినిన్ స్థాయిని ఎలా పరీక్షిస్తారు, రిపోర్టులో వచ్చే ఫలితాలను ఎలా అర్థం చేసుకోవాలి వంటి ముఖ్యమైన విషయాలను తెలుసుకోవచ్చు.
క్రియాటినిన్ స్థాయి పెరగడానికి కిడ్నీ సమస్యలతో పాటు డీహైడ్రేషన్, కండరాలకు సంబంధించిన సమస్యలు, అధిక శారీరక శ్రమ వంటి ఇతర కారణాలు కూడా ఉండవచ్చు. అందుకే ఒకసారి క్రియాటినిన్ ఎక్కువగా వచ్చిందని మాత్రమే కిడ్నీ ఫెయిల్యూర్ అని భావించకూడదు. అవసరమైన ఇతర పరీక్షలతో పాటు వైద్యుల సలహా తీసుకోవడం ముఖ్యం.
కిడ్నీల ఆరోగ్యం, క్రియాటినిన్ స్థాయిలు, కిడ్నీ ఫిల్టరింగ్ సామర్థ్యం, గుండె ఆరోగ్యంతో ఉన్న సంబంధం గురించి ఈ వీడియోలో మరిన్ని ముఖ్యమైన విషయాలను తెలుసుకోండి.
మీ ఆరోగ్య సమస్య ఏదైనా... మా హెల్త్ యూట్యూబ్ ఛానల్‌లో సీనియర్ డాక్టర్స్ చెప్పిన సలహాలు... సూచనలు ఉన్నాయి. మా యూట్యూబ్ ఛానల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 👉 TeluguOne Health (సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!)


