LATEST NEWS
  మంత్రి లోకేశ్ విద్యాశాఖను అద్బుతంగా తీర్చిదిద్దుతున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రశంసించారు. లోకేశ్ ఏరికోరి ఆ శాఖను ఎంచుకున్నారని తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లా కొత్తచెరువు జడ్పీ పాఠశాలలో మెగా పీటీఎం 2.0 కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతు మీ పిల్లలకు చదువు చెప్పించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుందన్నారు. విద్యార్థుల విషయంలో టీచర్లదే కాదు.. తల్లిదండ్రులది కూడా బాధ్యత ఉంటుందన్నారు.   మన పిల్లల్ని తీర్చిదిద్ది జ్ఞానాన్ని ఇచ్చే పుణ్య పాఠశాల చదువుకుని పైకి వచ్చిన వారు స్కూళ్లకు ఎంతకొంత సాయం చేయాలి సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. ఆడ, మగ బిడ్డలను సమానంగా చూసుకోవాలిని పిలుపునిచ్చారు. ఆ ఉద్దేశ్యంతోనే ఎంత మంది పిల్లలు ఉన్నా తల్లికి వందనం ఇస్తున్నాం అని ముఖ్యమంత్రి తెలిపారు. వేటు స్కూళ్లకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దుతామన్నారు. మెగా పేరెంట్స్​మీటింగ్​తో గిన్నిస్​రికార్డు నెలకొల్పామన్నారు. స్కూల్ పిల్లలకు ఇచ్చే పుస్తకాలు, బ్యాగులపై కూడా గత పాలకులు బొమ్మలు వేసుకున్నారని విమర్శించారు.  నేను అనుకునే లక్ష్యాన్ని నెరవేరుస్తాననే ధైర్యం ఇక్కడ వచ్చిందన్నారు. పేరెంట్స్​ కమిటీ ఏర్పాటు చేయాలని 1998‌లో అనుకున్నానని తెలిపారు.  విద్యావ్యవస్థను అద్భుతంగా నిర్వహిస్తున్న మంత్రి లోకేశ్​కు అభినందనలు తెలిపారు. గడచిన ఐదేళ్లలో ఒక టీచర్​ను కూడా నియమించలేదన్నారు. టీచర్లు లేకుండా విద్యా సంస్కరణలు ఎలా తెచ్చారో జగన్​ చెప్పాలన్నారు. ఆంగ్ల మాధ్యమం పెట్టామంటూ లేనిపోని సమస్యలు తీసుకొచ్చారని ఆరోపించారు. టీచర్లను తాము గౌరవంగా చూస్తాం.. నూతన సంస్కరణలను తీసుకు వస్తామని అన్నారు. ఇప్పటికే 12 డీఎస్సీలు పెట్టి లక్షా 66 వేల మందికి టీచర్ ​ఉద్యోగాలు ఇచ్చామని తెలిపారు. ఇటీవలే ఇంకో డీఎస్సీ వేసి 16,347 పోస్టులు భర్తీ చేస్తున్నామని చంద్రబాబు ప్రకటించారు.   
  ఇదీ జ‌గ‌న్ బంగారు పాళ్యం ప‌ర్య‌ట‌న‌కు ప‌త్రిక‌ల్లో పెడుతోన్న క్యాప్ష‌న్స్. జులై 9న జ‌గ‌న్ చిత్తూరు జిల్లా బంగారు పాళ్యం మామిడి రైతుల ప‌ర‌మార్శ‌కు వ‌చ్చారా? లేక త‌న హంగూ ఆర్భాటం చూపించ‌డానికి వ‌చ్చారా? ఎవ‌రికీ అర్ధం కాలేదు. అద‌స‌లు ప‌ర‌మార్శ యాత్ర‌లా లేదు. దండ‌యాత్ర‌ను త‌ల‌పిస్తోంద‌న్న మాట వినిపిస్తోంది. అధ్య‌క్షుడినే ఏకంగా చొక్కా ప‌ట్టుకుని లాగుతున్నారు, ముట్టుకుంటున్నారు. ఎవ‌రూ ఎవ‌రి మాట విన‌డం లేదు. జ‌గ‌న్ అరుస్తున్నా ప‌ట్టించుకున్న పాపాన పోలేదెవ‌రూ. 10 ల‌క్ష‌ల జ‌నాభా వ‌చ్చినా టీడీపీ స‌భ‌లు స‌జావుగా  జ‌రిగిన‌వి ఎన్ని లేవు. అదే వైసీపీ.. ఆ అరుపులేంటి? కేక‌లేంటి? ర‌చ్చ రావ‌ణ్య‌మేంటి? కొంద‌ర‌న‌నే మాట‌లేంటంటే అర‌లుంగీలు క‌ట్టి వ‌దిలితే వీళ్లు అచ్చం ఆ దండుపాళ్యం బ్యాచీలా లేరూ.. అన్న మాట వినిపించింది స‌ర్వ‌త్ర‌ .అటుమొన్న పొదిలి, మొన్న తెనాలి, నిన్న సత్తెనపల్లి, నేడు బంగారుపాళ్యం.. అంతా ఒక‌టే బ్యాచ్, ఒక‌టే లుక్. ఎలాంటి తేడా లేదు. అల‌జ‌డి  సృష్టించ‌డానికి అంద‌రూ క‌ల‌సి క‌ట్టు క‌ట్టుకుని మూకుమ్మ‌డిగా దిగిన‌ట్టుగా క‌నిపిస్తోందన్న టాక్ వినిపిస్తోంది.ఇది మామిడి రైతుల క‌ష్టాలు తెలుసుకోవ‌డం కాదు.. మ‌న్నాంగ‌డ్డి కాదు. ఇది అదే. శాంతి భ‌ద్ర‌త‌ల స‌మ‌స్య‌కు విఘాతం క‌లిగించేదే.. కాబ‌ట్టి దీన్ని కంప‌ల్స‌రిగా క‌ట్ట‌డి చేయాలంటారు కొంద‌రు. మ‌రి కొంద‌రైతే ఒక ప్ర‌శ్న వేస్తున్నారు. ప్ర‌జాక్షేత్రంలో ప్ర‌జా స‌మ్య‌ల‌ను తెలుసుకుని.. ప్ర‌జా వేదిక‌లైన అసెంబ్లీకి వెళ్లి స‌మ‌స్య ప‌రిష్కారం  క‌నుగొన‌డం ఒక రూట్ మ్యాప్. ఆయ‌న‌స‌లు అసెంబ్లీకే వెళ్ల‌కుండా  ఏం సాధించేట‌ట్టు? అదీ నిజ‌మే క‌దా అంటారు ఇంకొంద‌రు. జ‌గ‌న్ ఇప్ప‌ట్లో అప్ప‌ట్లో అసెంబ్లీకి వ‌చ్చేది లేదు. అక్క‌డ రైతులు కాదు.. ఇత‌రులెవ‌రి స‌మ‌స్య‌ల‌ను చ‌ర్చించే అవ‌కాశమే లేదు. ఇదంతా త‌న రాజ‌కీయ ల‌బ్ధి కోసం చేస్తున్న పోరాటం ఆరాటం.  అయినా సీజ‌న్ అయిపోయాక వ‌చ్చి ప్ర‌యోజ‌న‌మేంటి? అంటారు కొంద‌రు రైతులు. ఒక వేళ జ‌గ‌న్ నిజంగా చేయాల్సి వ‌స్తే ఇప్ప‌టికే జిల్లాలోని ఫ్యాక్ట‌రీల్లో నిల్వ ఉన్న ల‌క్ష కిలోల ప‌ల్ప్ ని కొనాలి. ఎందుకంటే త‌మ ద‌గ్గ‌ర అంత నిల్వ ఉంది కాబ‌ట్టి.. ఈ సీజ‌న్ కి ప‌ల్ప్ వ‌ద్ద‌న్న‌ది ఫ్యాక్ట‌రీల మాట‌. ఎప్పుడైతే ఉన్న నిల్వ అమ్ముడ‌వుతుందో ఆపై తాము కొంటామ‌ని అంటారు వారు. ఈ సీజ‌న్ లో కూడా అదేమంత సేల్ కాలేదు. వాళ్లు అప్ప‌ట్లో ముప్పై రూపాయ‌లు ప‌ర్ కిలో కొంటే ఇప్పుడు ఐదు రూపాయ‌ల‌కు కూడా కొనే నాథుడే లేరు. దీంతో వారు కాయ కొన‌డం లేదు. ఇక్క‌డ చూస్తే ప‌ల్ప్ ఫ్యాక్ట‌రీలు కొంటున్నాయి క‌దాని.. టేబుల్ ర‌కాలు ప‌క్క‌న పెట్టి, తోతాపురి ర‌కం ఎక్కువ‌గా వేసేశారు రైతులు.  ఈ క‌మ్యూనికేష‌న్ గ్యాప్ వ‌ల్ల వ‌చ్చిన తంటా ఇది. దానికి తోడు త‌న హ‌యాంలో ఈ రైతుల‌ను ప‌ట్టించుకున్న పాపాన పోలేదు.. జ‌గ‌న్. వారికి ఏదైనా సాయం చేసిన దాఖ‌లాలు కూడా లేవు. ఈ  సారి వ‌ర్షాలు కూడా బాగా ప‌డ్డంతో.. పంట ఏపుగా ఎదిగింది. దీంతో వ‌చ్చిన స‌మ‌స్య ఇది. ఇది జ‌నానికి అర్ధం కావ‌ల్సిన విష‌యం. కానీ  జ‌గ‌న్ ఏం చేస్తున్నారు? బ‌ల ప్ర‌ద‌ర్శ‌న చేయ‌డానికో వేదిక చేసుకుంటున్నార‌న్న ఆరోప‌ణ‌లు వినిపిస్తున్నాయి. దీంతో స‌మ‌స్య ఏంటో అర్ధంకాక ఒక గ‌జిబిజి గంద‌ర‌గోళానికి ఆస్కార‌మేర్ప‌డుతోంద‌న్న విమ‌ర్శ‌లు వినిపిస్తున్నాయ్. ఇది మామిడి రైతుల కష్టాలు తెలుసుకుని కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలకు ఒక నివేదిక ఇద్దాం,దీనిపై అసెంబ్లీలో గట్టిగా మాట్లాడదాం అన్న ఆలోచనతో చేసిన పర్యటన లాగా వుందా? ఆ ఆలోచనే లేకపోతే ఈ సమస్యను అధికారంలో లేని నీవు పరిష్కరిస్తావా?ఎంత దండగ మారిన గోల ఇది. ఇదేమన్నా కోటప్పకొండ తిరనాళ్ళా?ఈ పోకడ రాష్ట్రానికి క్యాన్సర్ కంటే ప్రమాదకరం!  
  తెలంగాణలో ఇప్పుడు సవాళ్లు ప్రతి సవాళ్ల రాజకీయం నడుస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, శ్రీకారం చుట్టిన సవాళ్ల రాజకీయం మలుపులు తిరుగుతూ ఎక్కడెక్కడికో పోతోంది. సూది కోసం సోది కెళితే. అన్నట్లుగా అసలు చర్చ పక్కకుపోయి,రాజకీయ రచ్చ, పొంగి పొరలుతోంది. సాగుతోంది.   నిజానికి, సవాళ్ల రాజకీయానికి శ్రీకారం చుట్టిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేవలం రైతు సమస్యల వరకే పరిమితం అయ్యారు. ‘రైతులకు ఎవరు ఎంత మేలు చేశారు తేల్చుకుందాం రండని అటు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి ఇటు ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ అధ్యక్షుడు,మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్’కు,బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్’కు బహిరంగ వేదిక నుంచి ఒకే సారి సవాలు విసిరారు. ఇక ఆ తర్వాత ఏమి జరిగింది అన్నది ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. కారణాలు ఏవైనా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విసిరిన సవాలును ప్రధాని మోడీ,కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి,మాజీముఖ్యమంత్రి కేసీఆర్, పెద్దగా పట్టించుకోలేదు. కానీ, మాజీ మంత్రి, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు,కేటీఆర్’ రియాక్ట్ అయ్యారు. సోమాజీగూడ గూడ ప్రెస్ క్లబ్  వేదికగా   చర్చకు సై ..అన్నారు. ఇక అక్కడి నుంచి చర్చ,రచ్చగా మారింది. చర్చ జరగవలసింది, చట్ట సభల్లో కానీ, క్లుబ్బుల్లో, పబ్బుల్లో కాదని, అసలు ముఖ్యమంత్రి సవాలు చేసింది మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్’ కు కానే కేటీఆర్’కు కాదని కాంగ్రెస్ మంత్రులు, నాయకులు  కేటీఆర్’ విమర్శలను తిప్పి కొట్టారు. నిజమే, ముఖ్యమంత్రి, ఇతర మంత్రులు,కాంగ్రెస్ నాయకులు లేటెస్ట్’గా చెపుతున్నట్లుగా ప్రజాసమస్యలు, ప్రభుత్వ విధానాలు చర్చించేందుకు సరైన వేదిక చట్ట సభలే..నిజానికి  సమస్య లేదా విషయం ఏదైనా, చర్చ జరగవలసింది, చట్టసభల్లోనే,..అందులో మరో అభిప్రాయానికి ఆస్కారమే లేదు. తెలంగాణలోనే కాదు, దేశంలో ఎక్కడైనా, ఏ రాష్ట్రంలో అయినా ప్రభుత్వ విధానాలు, చట్టాలు, పథకాలు,ప్రజా సమస్యలపై చర్చలు జరగవలసింది చట్టసభల్లోనే..మరో వేదిక అది ఎంత పవిత్రమైనది అయినా, ప్రభుత్వ విధానాలు, ప్రజా సమస్యలు చర్చించేందుకు అది తగిన వేదిక కాదు. నిజమే కావచ్చును,చట్టసభలు ఎంత చక్కగా జరుగుతున్నాయో,గౌరవ ప్రజా ప్రతినిధుల ప్రవర్తన ఎంత గౌరవ ప్రదంగా ఉంటుందో చూస్తూనే ఉన్నాం..అయినా సరే చట్ట సభల తీరు ఎంత సుందర ముదనష్టంగా ఉన్నా సరే,పభుత్వ విధానాలు, ప్రజాసమస్యలపై చర్చ జరగవలసింది చట్ట సభల్లోనే.. క్లబ్బుల్లోనో, మరో బహిరంగ ప్రదేశంలోనో కాదు. ఈ విషయంలో   అధికార, విపక్షాలకు ఎవరికీ రెండవ అభిప్రాయం ఉండదు,ఉండరాదు.ఉన్నా అది పరిగణలోకి తీసుకోవలసిన అవసరం లేదని, న్యాయస్థానాలు,రాజ్యాంగ నిపుణులు అనేక సందర్భాలో స్పష్టం చేశారు.    కానీ, ఇప్పడు రాష్ట్రంలో, రైతులకు ఏ ప్రభుత్వం ఎంత మేలు చేసింది’ అనే విషయంపై చర్చ పేరిట జరుగతున్నరచ్చ, విషయానికి వస్తే.. చాలా విచిత్రమైన పరిస్థితి కనిపిస్తోంది.సవాళ్లు ప్రతి సవాళ్లుగా సాగుతున్నరాజకీయం,రాజకీయమ పార్టీలు, నాయకులు   గమనిస్తున్నాయో లేదో  సామాన్యులకు చీదర పుట్టిస్తోంది. ప్రజలు అసహ్యించుకుంటున్నారని మీడియా చర్చల్లో పాల్గొంటున్న పెద్దలు హెచ్చరిస్తున్నారు.నిజానికి, రాజకీయ పార్టీల తీరు, అధికార విపక్ష సభ్యుల ప్రవర్తన అంతా శ్రీ వైష్ణవులే ..అన్నట్లు, ఉందని, సామాన్య ప్రజలు సైతం ఆశ్చర్యంతో కూడిన అవేద వ్యక్తపరుస్తున్నారు.  అధికార, ప్రతిపక్ష పార్టీలు సాగిస్తున రాజకీయ రచ్చలో అసలు విషయం పక్కకు పోయి, కేవలం రాజకీయ రచ్చ మాత్రమే మిగిలిందని ఆవేదన వ్యక్త పరుస్తున్నారు. ఇదలా ఉంటే ఇప్పడు తాజాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కొత్త ఎజెండాతో కొత్త ప్రపోజల్’తో ముందుకొచ్చారు. కృష్ణా,గోదావరి జలాల విషయంలో చర్చించేందుకు ప్రతిపక్ష నేత కేసీఆర్‌ను అసెంబ్లీకి రమ్మంటే రావడంలేదని, ఆయన ఆరోగ్యం బాగా లేనందున తమనే ఎర్రవల్లి ఫాంహౌజ్‌‌కు రమ్మంటే వస్తామని ముఖ్యమంత్రి  రేవంత్‌రెడ్డి అన్నారు. తేదీ చెబితే అక్కడికే వచ్చి మాక్‌ అసెంబ్లీ నిర్వహిస్తామని చెప్పారు.  అలాగే, ‘‘మీ సుదీర్ఘ అనుభవాన్ని, ఆలోచనల్నీ తెలంగాణ ప్రజలకు సూచన కింద ఇస్తే స్వాగతిస్తాం. మీరు ఏ తారీకు చెప్పినా అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేస్తాం. కృష్ణా, గోదావరి జలాలపె ఉమ్మడి రాష్ట్రంలో, తొమ్మిదిన్నరేళ్ల మీ పాలనలో, గడచిన ఏడాదిన్నరలో తీసుకున్న నిర్ణయాలపై కూలంకశంగా చర్చిద్దాం. స్పీకర్‌ అనుమతితో నిపుణులను కూడా పిలిచి అభిప్రాయం తీసుకుందాం’’ అని పేర్కొన్నారు. ఇక ఇప్పుడు, ఈ ప్రతిపాదనపై మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్’ ఏ విధంగా స్పందిస్తారు అనేది చూడవలసి వుంది.అయితే, చర్చ అయినా, రచ్చ అయినా, ఏమి జరిగిన ఏమి జరగక పోయినా, చివరకు మిగిలేది శూన్యం.  
  తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. గత  అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఎన్నికల కోడ్ ఉన్నప్పటికీ సభలు నిర్వహించి, ట్రాఫిక్ జామ్ చేసి ప్రజలను ఇబ్బంది పెట్టారని ఉత్తమ్ కుమార్ రెడ్డిపై పలు కేసులు నమోదు అయ్యాయి. ఈ కేసు విచారణకు ఉత్తమ్ కుమార్ రెడ్డి హాజరు కాకపోవడంతో కోర్టు వారెంట్ జారీ చేసింది. దీంతో కోర్టు ఆయన వైఖరిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. తదుపరి విచారణ 16వ తేదీకి వాయిదా వేసిన కోర్టు 16వ తేదీన ఉత్తమ్ కుమార్ రెడ్డి తప్పకుండా కోర్టులో హాజరు అవ్వాలని  నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టు ఆదేశించింది. ఈ పరిణామం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.  
    బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ సోమాజిగూడలోని యశోద ఆసుపత్రిలో చేరారు. మాజీ సీఎంకు మరోసారి  డాక్టర్లు వైద్య పరీక్షలు చేయనున్నారు. ఈ నెల 3న ఆయన అస్వస్థతతో ఆస్పత్రిలో చేరగా ఆరోగ్యం మెరగ్గానే ఉందని బ్లడ్‌ షుగర్, సోడియం స్థాయిలు కొద్దిగా పెరిగాయని డాక్టర్లు తెలిపారు. ఆరోగ్యం కుదుటపడటంతో ఈనెల 5న డిశ్ఛార్జి అయ్యారు. వారం రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని, తర్వాత తర్వాత పరీక్షలు చేయాల్సి ఉంటుందని డిశ్చార్జి సమయంలో వైద్యులు తెలిపారు.  ఈక్రమంలో వైద్య పరీక్షల కోసం కేసీఆర్‌ మళ్లీ యశోద ఆసుపత్రిలో చేరారు. ఈ వైద్య పరీక్షల అనంతరం మాజీ సీఎం కేసీఆర్ ఎర్రవల్లిలోని తన ఫామ్‌హౌస్‌కు వెళ్లే అవకాశముందని వారు వెల్లడించారు. అయితే గత ఐదు రోజులుగా కేసీఆర్ నందినగర్‌లోని తన నివాసంలోనే రెస్ట్ తీసుకుంటున్న సంగతి తెలిసిందే. జూన్ 11వ తేదీన కాళేశ్వరం ప్రాజెక్ట్ కమిషన్ ఎదుట మాజీ సీఎం కేసీఆర్ విచారణకు హాజరైన సంగతి తెలిసిందే. ఆ సమయంలోనే ఆయన కొంత అస్వస్థతతో ఉన్నారు.  కాళేశ్వరం కమిషన్ ఎదుట విచారణ నేపథ్యంలో ఒపెన్ కోర్టుకు తాను రాలేనని.. ఇన్‌సైడ్ విచారణకు హాజరవుతానంటూ కమిషన్‌కు గులాబీ బాస్ స్పష్టం చేశారు.  జస్టిస్ పీ చంద్రఘోష్ నేతృత్వంలోనే కాళేశ్వరం కమిషన్ మాజీ మంత్రి హరీశ్ రావు  విచారణకు హాజరు కావాల్సి ఉంది. అయితే, అనూహ్యంగా తాను ఇవాళ విచారణకు హాజరుకావడం లేదని కమిషన్‌కు హరీశ్ రావు సమాచారం అందజేశారు. అయితే, కేసీఆర్ వైద్య పరీక్షల నిమిత్తం ఇవాళ సోమాజిగూడ యశోదా ఆసుపత్రికి వెళ్లనుండటంతో మరో రోజున విచారణకు హాజరవుతానని జస్టిస్ పీ చంద్రఘోష్‌కు సమాచారం అందజేశారు హరీశ్ రావు    
ALSO ON TELUGUONE N E W S
Raghav Juyal has made the entire nation notice him with awe and shock in his film, Kill. A funny guy who made people laugh with his antics as an anchor, a dancing sensation - who made Slow Motion walk iconic and made entire nation look at lyrical, freestyle dance forms, played a ruthless robber like never before.  His transformation from a dancer with funny attitude to a seriously talented actor has shocked everyone. Now, he is debuting in Telugu with Natural Star Nani's The Paradise. Srikanth Odela is directing the film and with the teaser, the team showcased that it will be mad, violent action flick.  Now, Raghav Juyal has been cast in a furious antagonist role. The makers state that the role will be more terrifying than Kill and his appearance in lesser known Yudhra. As a ruthless, merciless and power-hungry antagonist his character will be seen as a person who cannot tolerate even a small raise in voice.  He loves to suppress and oppress downtrodden and the rebellion is lead by Nani in Secunderabad set in 1960's. Srikanth Odela is taking care of every minute detail about his character and he is working round the clock to present him in such a terrifying manner that Nani vs him episodes would be a blast on screen, say makers.  Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
Pragya Jaiswal did not find huge success as much as other contemporaries but she has been one of the most followed actresses on social media. Recently, her bold pictures and glamour show has been keeping her highly relevant. Now, she sizzled in a white monokini and internet is going crazy looking at them.    The actress has been sharing bikini, monokini, vacation pics from different places along with professional photoshoots. After Daaku Maharaaj, she will be once again seen in Akhanda 2 Thandaavam, reprising her role from Akhanda. But she might not be the full fledged leading lady in the film, from reports.    Except besides Nandamuri Balakrishna, she is not being offered roles from Telugu Cinema, even though she is beautiful and ready to play any role. Keeping all that aside, glam lovers are happy looking at bold updates from time to time.  Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them. 
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas)సుజిత్(sujeeth)కాంబినేషన్ లో తెరకెక్కిన 'సాహో' చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకి పరిచయమైన బాలీవుడ్ నటి 'శ్రద్దాకపూర్'(Shraddha Kapoor). ఒకప్పటి అగ్ర నటుడు 'శక్తీ కపూర్' కూతురిగా 2010 లో హిందీ సినీ  సినీ రంగ ప్రవేశం చేసిన శ్రద్దా, ఆ తర్వాత ఎన్నో చిత్రాల్లో ప్రాధాన్యత గల పాత్రలని పోషించి స్టార్ డమ్ ని సంపాదించింది.  ప్రముఖ రచయిత రాహుల్ మోడీ(Rahul Mody)తో శ్రద్దాకపూర్  డేటింగ్ లో ఉందనే వార్తలు ఎప్పట్నుంచో వస్తున్న విషయం తెలిసిందే. రీసెంట్ గా ఆ ఇద్దరు కలిసి ఒక విమానంలో ప్రయాణం చేస్తున్నారు. వైట్ కలర్ డ్రెస్ తో ఉన్న ఆ   ఇద్దరు, పక్క పక్క సీట్స్ లో కూర్చోగా, రాహుల్ కి శ్రద్ధ ఫోన్ లో ఏదో చూపిస్తూ ఉంది. ఎయిర్ లైన్స్ సిబ్బంది ఒకరు ఆ ఇద్దరి  ఫోటో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేసాడు. దీంతో ఈ పిక్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఒక వీడియోని కూడా రికార్డు చేసాడనే వార్తలు వినిపిస్తున్నాయి. శ్రద్ధ, రాహుల్ కి తెలియకుండా ఎయిర్ లైన్స్ సిబ్బంది ఫోటోలు తీయడంపై, పలువురు సినీ తారలు సోషల్ మీడియా వేదికగా  మండిపడుతున్నారు. రాహుల్, శ్రద్ధ కలిసి చాలాసార్లు మీడియాకి పోజులిచ్చిన విషయం తెలిసిందే. శ్రద్ధ గత ఏడాది చివరలో విడుదలైన 'స్త్రీ 2 'లో ప్రధాన క్యారక్టర్ ని పోషించి మంచి విజయాన్ని అందుకుంది. ప్యార్ కా పంచనామా, సోను కె  టైటుకి  స్వీటీ, దే దే  ప్యార్  దే, తు ఝూతి మెయిన్ మక్కర్ వంటి చిత్రాలకి రచయితగా పని చెయ్యడంతో పాటు దర్శకత్వ శాఖలోను పని చేసాడు.        
భారతీయ సినిమా ప్రేక్షకులకి పరిచయం అక్కరలేని పేరు 'విద్యాబాలన్'(Vidya Balan). రెండు దశాబ్దాల క్రితం ప్రారంభమైన తన సినీ జర్నీలో ఎన్నో హిట్ సినిమాలు ఉండటంతో పాటు ఆయా చిత్రాల్లోని పాత్రల ద్వారా ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసింది. సిల్క్ స్మిత జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన 'ది డర్టీ పిక్చర్' లో ఆమె పోషించిన టైటిల్ రోల్ నే అందుకు ఉదాహరణ. గత ఏడాది  హర్రర్ కామెడీ 'భూల్ భూలయ్య 3 ' లో మంజులిక, మల్లికా అనే రెండు వైవిధ్యమైన క్యారెక్టర్స్ తో అలరించింది. విద్యాబాలన్ రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతు కెరీర్ మొదట్లో 'మోహన్ లాల్'(Mohanlal)సరసన చక్రం అనే మూవీలో నటించడానికి ఒప్పుకున్నాను. కొంత భాగం షూటింగ్ ని కూడా జరుపుకోవడంతో మూవీ   ప్రజల్లోకి వెళ్ళింది. కానీ ఆ తర్వాత అనుకోకుండా ఆగిపోయింది. మోహన్ లాల్ కి, చిత్ర నిర్మాతకి మధ్య అభిప్రాయ బేధాలు రావడంతోనే ఆగిపోయింది. కానీ నా వల్లే ఆగిపోయిందనే ప్రచారం చేసి ఐరెన్ లెగ్ ముద్ర వేశారు. ఫలితంగా చక్రంతో పాటు ఒప్పకున్న తొమ్మిది దక్షిణాది చిత్రాల నుంచి నన్ను తొలగించేసారు. ఆ ప్రభావం నా కెరీర్ పై పడింది. కానీ అమితాబచ్చన్ లాంటి వాళ్ళు ప్రారంభంలో తిరస్కరణకి గురయ్యారని తెలిసి ముందుకు సాగాను. విశ్వాసంతో ముందుకు సాగితే ఖచ్చితంగా మన రోజు అంటు వస్తుందని చెప్పుకొచ్చింది.      విశ్వవిఖ్యాత నటసార్వభౌమ పద్మశ్రీ 'నందమూరి తారకరామారావు'(Ntr)జీవిత కథ ఆధారంగా అయన తనయుడు గాడ్ ఆఫ్ మాసెస్ 'బాలకృష్ణ'(Balakrishna)నటించి, రూపొందించిన చిత్రాలు 'ఎన్టీఆర్ కథానాయకుడు', 'ఎన్టీఆర్ మహానాయకుడు'. ఈ రెండు   చిత్రాల్లో  ఎన్టీఆర్ సతీమణి 'బసవతారకమ్మ' క్యారక్టర్ ని అద్భుతంగా పోషించి  తెలుగు ప్రేక్షకుల్ని కూడా విద్యా బాలన్ తన నటనతో మెప్పించింది.  
భారతీయ సినిమా ప్రేక్షకులకి పరిచయం అక్కరలేని పేరు 'విద్యాబాలన్'(Vidya Balan). రెండు దశాబ్దాల క్రితం ప్రారంభమైన తన సినీ జర్నీలో ఎన్నో హిట్ సినిమాలు ఉండటంతో పాటు ఆయా చిత్రాల్లోని పాత్రల ద్వారా ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసింది. సిల్క్ స్మిత జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన 'ది డర్టీ పిక్చర్' లో ఆమె పోషించిన టైటిల్ రోల్ నే అందుకు ఉదాహరణ. గత ఏడాది  హర్రర్ కామెడీ 'భూల్ భూలయ్య 3 ' లో మంజులిక, మల్లికా అనే రెండు వైవిధ్యమైన క్యారెక్టర్స్ తో అలరించింది. విద్యాబాలన్ రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతు కెరీర్ మొదట్లో 'మోహన్ లాల్'(Mohanlal)సరసన చక్రం అనే మూవీలో నటించడానికి ఒప్పుకున్నాను. కొంత భాగం షూటింగ్ ని కూడా జరుపుకోవడంతో మూవీ   ప్రజల్లోకి వెళ్ళింది. కానీ ఆ తర్వాత అనుకోకుండా ఆగిపోయింది. మోహన్ లాల్ కి, చిత్ర నిర్మాతకి మధ్య అభిప్రాయ బేధాలు రావడంతోనే ఆగిపోయింది. కానీ నా వల్లే ఆగిపోయిందనే ప్రచారం చేసి ఐరెన్ లెగ్ ముద్ర వేశారు. ఫలితంగా చక్రంతో పాటు ఒప్పకున్న తొమ్మిది దక్షిణాది చిత్రాల నుంచి నన్ను తొలగించేసారు. ఆ ప్రభావం నా కెరీర్ పై పడింది. కానీ అమితాబచ్చన్ లాంటి వాళ్ళు ప్రారంభంలో తిరస్కరణకి గురయ్యారని తెలిసి ముందుకు సాగాను. విశ్వాసంతో ముందుకు సాగితే ఖచ్చితంగా మన రోజు అంటు వస్తుందని చెప్పుకొచ్చింది.      విశ్వవిఖ్యాత నటసార్వభౌమ పద్మశ్రీ 'నందమూరి తారకరామారావు'(Ntr)జీవిత కథ ఆధారంగా అయన తనయుడు గాడ్ ఆఫ్ మాసెస్ 'బాలకృష్ణ'(Balakrishna)నటించి, రూపొందించిన చిత్రాలు 'ఎన్టీఆర్ కథానాయకుడు', 'ఎన్టీఆర్ మహానాయకుడు'. ఈ రెండు   చిత్రాల్లో  ఎన్టీఆర్ సతీమణి 'బసవతారకమ్మ' క్యారక్టర్ ని అద్భుతంగా పోషించి  తెలుగు ప్రేక్షకుల్ని కూడా విద్యా బాలన్ తన నటనతో మెప్పించింది.  
  దేవుడి మీద నమ్మకం ఉండటంలో తప్పులేదు. ఏదైనా పని మొదలు పెట్టేముందు.. ఇష్ట దైవాన్ని పూజిస్తే శుభం జరుగుతుందని ఎందరో నమ్ముతారు. దానికి వల్ల ఒక పాజిటివ్ ఫీలింగ్ తో పనిని మొదలుపెడతాం. దాంతో మంచి ఫలితాలు వస్తాయి. ఇంతవరకు బాగానే ఉంది కానీ.. కొందరు మాత్రం తమ టాలెంట్ కంటే కూడా.. స్వామిజీలనే ఎక్కువగా నమ్ముతుంటారు. ఏవోవో పూజలు చేసేసి.. ఆ పూజల వల్ల తమ కెరీర్ దూసుకుపోతుంది అనుకుంటారు.   వివాదాస్పద జ్యోతిస్యుడు వేణుస్వామి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. జ్యోతిష్యం పేరుతో సినీ ప్రముఖల వ్యక్తిగత జీవితాల గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేసి విమర్శలు ఎదుర్కొంటాడు. అయినప్పటికీ కొందరు సినీ జనాలు వేణుస్వామిని నమ్ముతుంటారు. ముఖ్యంగా కొందరు హీరోయిన్లు వేణుస్వామి చేత ప్రత్యేక పూజలు చేయించుకోవడం చూస్తున్నాం. గతంలో స్టార్ హీరోయిన్ రష్మిక మందన్నా సైతం వేణుస్వామి చేత పూజలు చేయించుకున్నట్లు ప్రచారం జరిగింది. ఆ లిస్టులో డింపుల్ హయాతి, అషు రెడ్డి వంటి భామల పేర్లు ఉన్నాయి. ఇక ఇప్పుడు మరో ప్రముఖ హీరోయిన్ నిధి అగర్వాల్ ఆ లిస్టులో చేరింది.   'సవ్యసాచి'తో టాలీవుడ్ కి హీరోయిన్ గా పరిచయమైన నిధి అగర్వాల్.. తక్కువ సినిమాలతోనే యువతలో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం ఆమె చేతిలో బడా సినిమాలు ఉన్నాయి. పవన్ కళ్యాణ్ సరసన నటించిన 'హరి హర వీరమల్లు' చిత్రం జూలై 24 ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే ప్రభాస్ తో స్క్రీన్ షేర్ చేసుకుంటున్న 'ది రాజా సాబ్' డిసెంబర్ 5న విడుదల కానుంది. ఈ రెండు సినిమాల తర్వాత మరికొన్ని భారీ ఆఫర్లు నిధిని వరించే అవకాశముంది. ఇప్పటికే, వెంకటేష్-త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కనున్న మూవీలో హీరోయిన్ గా నిధి అగర్వాల్ లాక్ అయినట్లు సమాచారం. ఇలా వరుస క్రేజీ సినిమాలతో అలరించడానికి సిద్ధమవుతున్న నిధి.. తాజాగా వేణుస్వామితో ప్రత్యేక పూజలు చేయించుకోవడం హాట్ టాపిక్ గా మారింది.   నిధి అగర్వాల్ కోసం పూజ జరిపించి, ఆమెను ఆశీర్వదించినట్లు తెలుపుతూ.. తాజాగా వేణుస్వామి సోషల్ మీడియా వేదికగా వీడియోలు పంచుకున్నాడు. వేణుస్వామితో పూజలు చేయించుకున్న తర్వాత పలువురు హీరోయిన్ల కెరీర్ పీక్స్ వెళ్ళిందనే అభిప్రాయాలు ఇండస్ట్రీ వర్గాల్లో ఉన్నాయి. ఆ నమ్మకంతోనే నిధి కూడా గతంలో ఓసారి పూజలు చేయించుకున్నట్లు తెలుస్తోంది. ఆ పూజల తర్వాత ఆమెకు మంచి ఆఫర్స్ వచ్చాయట. అందుకే ఇప్పుడు మరోసారి పూజలు చేయించుకున్నట్లు సమాచారం. ఈ పూజ తర్వాత తన కెరీర్ మరింత ఊపందుకుంటుందని నిధి భావిస్తున్నట్టు వినికిడి. మరి ఆమె ఆశలు నెరవేరుతాయో లేదో చూడాలి.   అయితే వేణుస్వామితో నిధి అగర్వాల్ పూజలు చేయించుకోవడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు నిధిపై విమర్శలు గుప్పిస్తున్నారు. నీ టాలెంట్ వల్ల ఆఫర్స్ వస్తాయి కానీ.. ఆయన పూజల వల్ల ఎందుకొస్తాయని కామెంట్స్ చేస్తున్నారు.  
Enforcement Directorate has decided to register a case on Vijay Deverakonda, Rana Daggubati, Manchu Lakshmi, Prakash Raj, Sudigali Sudheer and many other celebrities, social media influencers for promoting illegal betting applications. The case also involves violations under the Prevention of Money Laundering Act (PMLA). The ED has taken cognizance of promotional activities carried out by a wide range of individuals who endorsed betting platforms, thereby encouraging users to participate in unlawful online betting. Here's The list of those named in the ED's case:  1. Rana Daggubati 2. Prakash Raj 3. Vijay Deverakonda 4. Manchu Lakshmi 5. Pranitha Subhash 6. Nidhhi Agerwal 7. Ananya Nagalla 8. Siri Hanumanth 9. Sreemukhi 10. Varshini Sounderajan 11. Vasanthi Krishnan 12. Shobha Shetty 13. Amrutha Chowdhary 14. Nayani Pavani 15. Neha Pathan 16. Pandu 17. Padmavati 18. Imran Khan 19. Vishnu Priya 20. Harsha Sai 21. Bhaiyya Sunny Yadav 22. Shyamala 23. Tasty Teja 24. Reethu Chowdhary 25. Bandaru Seshayani Supreetha The ED has also named key individuals involved in the operation and management of these betting apps : 26. Operators of the betting platforms 27. Kiran Goud 28. Social media influencers Ajay, Sunny, and Sudheer 29. YouTube channel ‘Local Boy Nani’ As few social activists raised objection against celebrities promoting illegal betting apps. ED started investigation into the actors promoting them and many celebrities have also apologised for promoting them. Still, ED has moved forward with registering the case. We have to wait and see, how celebrities will respond.  Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them. 
సీతారామం' మూవీతో తెలుగు ప్రేక్షకుల అభిమాన కథానాయకగా మారిన నటి'మృణాల్ ఠాకూర్'(Mrunal Thakur). ఆ తర్వాత నాచురల్ స్టార్ 'నాని'(Nani)తో కలిసి 'హాయ్ నాన్న'లో జత కట్టి తెలుగు ప్రేక్షకులకి మరింత దగ్గరయ్యింది. అల్లు అర్జున్(Allu Arjun)అట్లీ(Atlee)కాంబినేషన్ లో పాన్ ఇండియా ప్రాజెక్జ్ ఒకటి  తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ముగ్గురు హీరోయిన్లు ఉన్న ఈ మూవీలో మృణాల్ ఠాకూర్ కూడా ఒక హీరోయిన్ గా చెయ్యబోతుందనే వార్తలు వస్తున్నాయి. అయితే ఈ విషయంపై మేకర్స్ నుంచి అధికార ప్రకటన రావాల్సి ఉంది. సోషల్ మీడియాలో 'మృణాల్ ఠాకూర్' తన కాళ్లకి మెట్టెలు తొడిగి ఉన్న పిక్ ఒకటి వైరల్ గా మారింది. దీంతో అభిమానులతో పాటు నెటిజన్స్ షాక్ కి గురయ్యి, మృణాల్ రహస్యంగా ఎవరినైనా పెళ్లి  చేసుకుందేమో అంటు కామెంట్స్ చేస్తున్నారు. కానీ అసలు నిజం ఏంటంటే 'డెకాయిట్' చిత్ర యూనిట్ ఆ పిక్ ని షేర్ చేసింది. అడవి శేషు(Adavi Sesh)హీరోగా 'డెకాయిట్'(Dacoit)అనే మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీలో 'మృణాల్' హీరోయిన్ గా చేస్తుంది. డెకాయిట్ షూటింగ్ లో  పాల్గొనడం కోసం మృణాల్ హైదరాబాద్ వచ్చిందని చెప్పడానికే, కాళ్ళకి మట్టెలు ఉన్న పిక్ ని షేర్ చేసారు. దీంతో డెకాయిట్ లో తన క్యారక్టర్ కి సంబంధించి మృణాల్ కాళ్ళకి మట్టెలు ధరించినట్టుగా తెలుస్తుంది. షానియెల్ డియో దర్శకత్వంలో తెరకెక్కుతున్న డెకాయిట్ ని యార్లగడ్డ సుప్రియతో కలిసి సునీల్ నారంగ్ నిర్మిస్తున్నాడు. బాలీవుడ్ అగ్ర దర్శకుడు, అగ్ర నటుడు అనురాగ్ కశ్యప్(Anurag Kashyap)ప్రకాష్ రాజ్, సునీల్, అతుల్ కులకర్ణి, కామాక్షి బాసర్ల కీలక పాత్రలు పోషించారు. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25 న విడుదల కానుంది.      
  20 ఏళ్ళ వయసులో హీరోగా ఎంట్రీ ఇవ్వడానికే ఆలోచిస్తుంటారు. అలాంటిది జూనియర్ ఎన్టీఆర్ మాత్రం 20 ఏళ్లకే ఎన్నో సంచనాలు సృష్టించి స్టార్ హీరోగా ఎదిగాడు. 19 ఏళ్లకే 'ఆది' సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న తారక్.. 20 ఏళ్లకే 'సింహాద్రి'తో ఇండస్ట్రీ హిట్ కొట్టాడు. ఇది దర్శకధీరుడు రాజమౌళి డైరెక్ట్ చేసిన రెండో సినిమా కావడం విశేషం.   తారక్ హీరోగా నటించిన రెండో సినిమా 'స్టూడెంట్ నెం.1'తో దర్శకుడిగా పరిచయమై, మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకున్నాడు రాజమౌళి. అయినప్పటికీ దర్శకుడిగా ఆయనకు రెండో అవకాశం రాలేదు. అనుకోకుండా 'సింహాద్రి' రూపంలో రెండో సినిమాని కూడా ఎన్టీఆర్ తోనే చేసే ఛాన్స్ దక్కించుకున్న రాజమౌళి..  తన దర్శకత్వ ప్రతిభ ఏంటో చూపించాడు.      జులై 9, 2003 న విడుదలైన 'సింహాద్రి' చిత్రం.. అప్పటిదాకా టాలీవుడ్ లో ఉన్న రికార్డులను తిరగరాసింది. ఎన్టీఆర్ చెప్పిన పవర్ ఫుల్ డైలాగ్స్ , యాక్షన్ సన్నివేశాలు, మాస్ డ్యాన్స్ స్టెప్పులు.. ప్రేక్షకులను మళ్ళీ మళ్ళీ థియేటర్స్ కి వచ్చేలా చేశాయి. ఈ చిత్రం 55 సెంటర్స్ లో 175 రోజులు ఆడి, ఎప్పటికీ చెక్కుచెదరని రికార్డు క్రియేట్ చేసింది. అంతకుముందు, ఆ తర్వాత పలు సినిమాలు ఇండస్ట్రీ హిట్ గా నిలిచాయి. వాటిలో చాలా సినిమాలు సింహాద్రి కలెక్షన్స్ దాటాయి కానీ, 175 రోజుల రికార్డును మాత్రం బ్రేక్ చేయలేకపోయాయి. సినిమా విడుదలై 22 ఏళ్ళు అయినా ఇప్పటికీ ఆ రికార్డు అలాగే ఉంది. ప్రస్తుతం ఎంతటి హిట్ సినిమాలైనా 50 రోజులు నడిచే పరిస్థితి కూడా లేదు. దీన్ని బట్టి చూస్తే ఏ సినిమాకి దక్కని విధంగా అత్యధిక కేంద్రాలలో 175 రోజుల ఆడిన చిత్రంగా సింహాద్రి పేరు శాశ్వతంగా నిలిచిపోనుంది.   సింహాద్రి విజయానికి ఎన్నో కారణాలు కారణాలున్నాయి. కీరవాణి సంగీతం కూడా ప్రధాన పాత్ర పోషించింది. ఆయన కంపోజ్ చేసిన అన్ని సాంగ్స్ ఆకట్టుకున్నాయి. 'చీమ చీమ', 'ఆంధ్ర సోడా బుడ్డి' సాంగ్స్ అయితే మాస్ ని ఉర్రుతలూగించాయి. యాక్షన్ సన్నివేశాలు కూడా మాస్ ని మెప్పించాయి. రాజమౌళి సినిమాలలో హీరోలు పట్టుకునే ఆయుధాలు ప్రత్యేకంగా ఉంటాయి. అయితే ఇప్పటిదాకా రాజమౌళి సినిమాలలో సింహాద్రి గొడ్డలిని మించిన ఆయుధం లేదంటే అతిశయోక్తి కాదేమో. ఆ గొడ్డలి పట్టుకొని ఎన్టీఆర్ శత్రువులపై విరుచుకుపడుతుంటే మాస్ ఊగిపోయారు. 20 ఏళ్ళ కుర్రాడు యంగ్ టైగర్ లా వెండితెరపై రౌద్ర రసం పండిస్తే అందరూ ఫిదా అయ్యారు. ఎంటర్టైన్మెంట్, యాక్షన్, ఎమోషన్, మ్యూజిక్ ఇలా ఒకటేమిటి? అన్ని కరెక్ట్ గా కుదిరాయి కాబట్టే 'సింహాద్రి' అంతటి సంచలనం సృష్టించింది. ఆ తర్వాత ఎన్టీఆర్, రాజమౌళి అంతకుమించిన విజయాలను అందుకున్నారు. అలాగే వీళ్ళ కాంబినేషన్ లోనే 'యమదొంగ', 'ఆర్ఆర్ఆర్' వంటి చిత్రాలు వచ్చాయి. అయితే ఎన్ని సినిమాలు వచ్చినా వీళ్లిద్దరి కెరీర్ లో 'సింహాద్రి'కి ఎప్పటికీ ప్రత్యేక స్థానముంటుంది.   ముఖ్యంగా ఎన్టీఆర్ కి, ఆయన ఫ్యాన్స్ కి 'సింహాద్రి' అనేది వెరీ వెరీ స్పెషల్ మూవీ. ఎందుకంటే ఏకంగా బాలకృష్ణ,చిరంజీవిల స్టార్డంని సవాల్ చేసేలా అప్పట్లో సింహాద్రి చరిత్ర సృష్టించింది. అప్పటికే బాలకృష్ణ,చిరంజీవి తెలుగునాట తిరుగులేని మాస్ ఇమేజ్ ఉన్న హీరోలు. చిన్న చిన్న ఊళ్ళల్లో కూడా వారి సినిమాలు వంద రోజులు ఆడేవి. అంతటి స్టార్డం ఉన్న హీరోల రికార్డులను కేవలం 20 ఏళ్ళ వయసున్న ఎన్టీఆర్ కొట్టాడు. ఈ జనరేషన్ లో వాళ్ళ రికార్డులను కొట్టిన మొదటి హీరో ఎన్టీఆర్ కావడం విశేషం. ఆరోజుల్లో సింహాద్రితో ఎన్టీఆర్ సృష్టించిన సంచలనానికి ఉదాహరణగా చెప్పుకుంటే.. బాలయ్య నరసింహనాయుడు చిత్రం 105 సెంటర్స్ లో వంద రోజులు ఆడగా.. చిరు ఇంద్ర మూవీ 122 సెంటర్స్ లో ఆడింది. అలాంటిది సింహాద్రి సినిమా ఏకంగా 150 సెంటర్లలో వంద రోజులు ఆడి చరిత్ర సృష్టించింది.  
ఆమని(Aamani)ప్రధాన పాత్రలో 'తెలంగాణ'(Telangana)జానపద కళారూపమైన ఒగ్గు కథా నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం 'బ్రహ్మాండ'(Brahmanda). బలగం జయరాం, ఆనంద్ బాల్సాద్, రవి, దేవిశ్రీ, కార్తీక్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ నెల 18 న విడుదలకి సిద్ధమవుతున్న 'బ్రహ్మాండ' కి 'సండ్ర నగేష్ అలియాస్ రాంబాబు'(Rambabu)దర్శకుడు. నాలుగురోజుల క్రితం హైదరాబాద్(Hydearabad)లోని ప్రసాద్ ల్యాబ్(Prasad Lab)లో 'బ్రహ్మాండ' మూవీకి సంబంధించిన ప్రివ్యూ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ క్రమంలో ప్రివ్యూ చూస్తున్న రాంబాబు ఒక్కసారిగా బ్రెయిన్ స్ట్రోక్ కి గురయ్యాడు. దీంతో ఆయన్ని వెంటనే అపోలో హాస్పిటల్ కి తరలించి ట్రీట్ మెంట్ అందించారు. ఆ తర్వాత నిమ్స్ కి తరలించారు. చివరికి పరిస్థితి విషమించడంతో మంగళవారం అర్ధరాత్రి చనిపోయాడు. బ్రహ్మాండ చిత్ర బృందంతో పాటు పలువురు సినీ ప్రముఖులు రాంబాబు మృతి పట్ల తమ సంతాపాన్ని తెలియచేసారు. రాంబాబు అంత్య క్రియలు ఆయన స్వగ్రామమైన మెదక్ జిల్లా శివంపేట మండలం, అల్లీపూర్ గ్రామంలో నిన్న జరిగాయి. సుదీర్ఘ  కాలం నుంచి చిత్ర పరిశ్రమలో ఉన్న రాంబాబు దాదాపుగా 150 సినిమాలతో పాటు కొన్ని సీరియల్స్ కి దర్శకత్వానికి సంబంధించిన వివిధ శాఖల్లో పని చేసాడు. భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. సోలో దర్శకుడుగా 'బ్రహ్మాండ' మొదటి మూవీ.    
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఆ ఒపీనియన్ పోల్ ఫలితాలు నిజంగా నిజం అయితే, కేరళలో మళ్ళీ సీపీఎం సారధ్యంలోని వామపక్ష కూటమి అధికారంలోకి వస్తుంది. ఇదే ఆ అద్భుతం. ఎందుకంటే, గత నాలుగు దశాబ్దాలలో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే కూటమి వరసగా రెండవసారి అధికారంలోకి వచ్చిన చరిత్ర లేనే లేదు. ఒక సారి ఎల్డీఎఫ్ అధికారంలోకి వస్తే ఐదేళ్ళ తర్వాత కాంగ్రెస్ సారధ్యంలోని ఐక్య ప్రజాస్వామ్య కూటమి(యూడీఎఫ్) అధికారంలోకి రావడం, దేవభుమిలో దైవ నిర్ణయమా అన్నట్లుగా ప్రతి ఎన్నికల్లోనూ అధికారం చేతులు మారుతూ వస్తోంది. అలాంటిది, ఈసారి ఒపీనియన్ పోల్స్ నిజమై వరసగా రెండవసారి వామపక్ష కూటమి అధికారంలోకి వస్తే, అది చరిత్రే అవుతుంది. ఇక ఒపీనియన్ పోల్స్ విషయానికి వస్తే, జాతీయ న్యూస్ ఛానెల్ ఏబీపీ, సీ ఓటర్ సంస్థలు సంయుక్తంగా ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఈ సర్వే ప్రకారం, 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో వామపక్ష కూటమికి 83 నుంచి  91 స్థానాలు, యూడీఎఫ్ కూటమికి 47 నుంచి 55 స్థానాలు మాత్రమే దక్కుతాయని తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో ఇలా జాతకాలు తిరగబడడంపై సోషల్ మీడియాలో,’లెగ్ మహిమ’ లాంటి జోక్స్  ట్రోలవుతున్నాయి. అయితే 2016లో జరిగిన ఎన్నికల్లో కేవలం 47 సీట్లకే పరిమితం అయిన కాంగ్రెస్’కు ఈసారి ఒకటీ అరా సీట్లు ఎక్కువస్తే, రావచ్చును. అదే కాంగ్రెస్’కు కాసింత ఊరట. అదలా ఉంటే, పశ్చిమ బెంగాల్లో సైతం పట్టు సాధించిన బీజేపే, కేరళలో మాత్రం పట్టు కాదు కదా, పట్టుమని పది సీట్లు తెచ్చుకునే స్థితిలో లేదు. నిజానికి, దేశంలో బీజేపీకి అసలు ఏ మాత్రం మింగుడు పడని రాష్ట్రాలు ఎవైన ఉన్నాయంటే కేరళ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల  పేర్లే ప్రముఖంగా వినిపిస్తాయి. ఈ సారి కూడా కమల దళం కేరళలో కాలు పెట్టె పరిస్తి లేదని సర్వే ఫలితాలు చెపుతున్నారు. ఎప్పటిలానే ఇప్పడు కూడా  బీజేపీకి సున్నా నుంచి రెండు సీట్లు వచ్చే అవకాశం ఉందని, సర్వేస్వరుల అభిప్రాయంగా ఉంది. కేరళలో మొత్తం 140 స్థానాలకు ఏప్రిల్ 6 తేదీన ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది. మే 2 తేదీన ఫలితాలు వెలువడతాయి. కేరళ ఎలక్షన్ పై యావత్ దేశం ఆసక్తి కనబరుస్తోంది.    
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఓటరు తీర్పుకు వెళుతున్నా, అందరి దృష్టి, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల ఏలుబడిలో ఉన్న ఉభయ తెలుగు రాష్ట్రాలు, మరీ ముఖ్యంగా ఇప్పటికే బీజేపీ కన్నుపడిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీల దుష్టి  మాత్రం పశ్చిమ బెంగాల్ పైనే వుంది.  పశ్చిమ బెంగాల్లో ‘అద్భుతం’ జరిగి బీజేపీ విజయం సాధిస్తే, ఇక  కమల దళం ఫోకస్, తెలంగాణకు షిఫ్ట్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఈ నేపధ్యంలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయంలో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. బెంగాల్లో బీజేపీ గెలిస్తే, ఇప్పటికే అంతర్గత కుటుంబ కలహాలతో సతమతవుతున్న తెరాస నాయకత్వానికి మరిన్నితిప్పలు తప్పవన్న మాట అంతఃపుర వర్గాలలో సైతం వినవస్తోంది.  పశ్చిమ బెంగాల్’లో ఎలాగైతే కమలదళం ఓ వంక తమ ట్రేడ్ మార్క్, హిందుత్వ రాజకీయాలు సాగిస్తూ, మరో వైపు నుంచి ‘ఆకర్ష్’ అస్త్రంతో అధికార పార్టీని నిర్వీర్యం చేసిన విధంగానే, ఇక్కడ కూడా ఫిరాయింపులను ప్రోత్సహింఛి పార్టీని నిట్టనిలువునా చీల్చే ప్రమాదాన్ని కొట్టివేయలేమని పార్టీ వర్గాలు కూడా అనుమానం వ్యక్త పరుస్తున్నాయి.  ఇప్పటికే తెలంగాణ  బీజేపీ నాయకులు 30 మంది తెరాస ఎమ్మెల్యేలు తమ టచ్ లో ఉన్నారని బెదిరిస్తున్నారు.అది నిజం అయినా కాకపోయినా..తెరాసలో అసంతృప్తి అగ్గి రగులుతోందనేది మాత్రం ఎవరూ కాదనలేని నిజం. అంతే కాకుండా రాష్ట్రానికి వచ్చిన కేంద్రనాయకులు ఎవరిని పలకరించినా, నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని ఎలాంటి సషబిషలు లేకుండా కుండబద్దలు కొడుతున్నారు.అందుకే, బెంగాల్లో బీజేపీ గెలిస్తే.. అనే ఊహా కూడా  గులాబీ గూటిలో గుబులు పుట్టిస్తోంది. అయితే, బెగాల్’లో బీజేపీ గెలిస్తే ఒక్క తెలంగాణలోనే కాదు, దేశ రాజకీయ వాతావరణంలోనే పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  అలాగే,  దేశ ముఖ చిత్రంలో కూడా పెను మార్పులు తప్పవని అంటున్నారు. అయితే రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరూహించెదరు..
పిల్లలను పెంచడం పిల్లల ఆట కాదు. ప్రతి తల్లిదండ్రులు తమ బిడ్డకు మంచి జీవితాన్ని ఇవ్వాలని కోరుకుంటారు. దానికి తగినట్టే అన్నీ వారికి అందించాలని అనుకుంటారు. కానీ చాలా సార్లు, తెలిసి లేదా తెలియకుండా తల్లిదండ్రులు కొన్ని తప్పులు చేస్తారు. అవి పిల్లలపై చాలా చెడు ప్రభావాన్ని చూపుతాయి. కొన్ని పరిస్థితులలో పిల్లలను తిట్టడం వారి మెదడు,  మానసిక పెరుగుదలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుందని నిపుణులు అంటున్నారు. పిల్లలను  ఎప్పుడు తిట్టకూడదో,  దీని వెనుక కారణాలు ఏమిటో తెలుసుకుంటే.. పిల్లలు భయంలో ఉన్నప్పుడు.. తప్పు చేసిన తర్వాత పిల్లలు కొన్నిసార్లు భయపడతారు. ఇలా  భయపడితే లేదా ఇప్పటికే ఏదైనా విషయం గురించి ఒత్తిడిలో ఉంటే, ఈ సమయంలో పిల్లలను తిట్టడం సరైనది కాదు. అలాంటి పరిస్థితిలో, పిల్లల మనస్సు మరింత భయపడవచ్చు. దీని ఫలితంగా పిల్లలు తను చేసిన పనులను,  విషయాలను తల్లిదండ్రులతో  పంచుకోవడం మానేస్తాడు. అటువంటి పరిస్థితిలో పిల్లవాడు ఇప్పటికే సున్నితంగా ఉంటే అతన్ని తిట్టడానికి బదులుగా ప్రేమతో జరిగిన తప్పు గురించి   వివరించడం మంచిది. కొత్తగా ఏదైనా చేసేటప్పుడు చేసే తప్పులు.. పిల్లలు ఏదైనా విషయం గురించి  ఆసక్తిగా ఉండి, ప్రతి క్షణం కొత్తగా ఏదైనా చేయాలని లేదా కొత్తగా ఏదైనా నేర్చుకోవాలని ప్రయత్నిస్తుంటే, అలాంటి పరిస్థితిలో, పిల్లలను ఎట్టి పరిస్థితుల్లోనూ తిట్టకూడదు. పిల్లలు నేర్చుకునేటప్పుడు తరచుగా తప్పులు చేస్తారు. ఈ తప్పులు వారు మంచిగా మారడానికి,  వారికి గొప్ప అనుభవాలుగా సహాయపడతాయి. అందువల్ల, ప్రతి చిన్న తప్పుకు వారిని తిట్టడం వల్ల వారి ఆత్మవిశ్వాసం దెబ్బతింటుంది. దీని కారణంగా పిల్లలు కొత్తగా ఏదైనా చేసే ముందు భయపడతారు.   పిల్లలు అలసిపోయినప్పుడు.. పిల్లలు బాగా అలసిపోయినప్పుడు, ఆకలిగా ఉన్నప్పుడు, వారు ఏదైనా తినేటప్పుడు  పిల్లలను  తిట్టకూడదు. పెద్దల మాదిరిగానే పిల్లలు కూడా  అలసిపోయినా లేదా ఆకలిగా ఉన్నా వారి మానసిక స్థితి సరిగా ఉండదు. అలాంటి సమయంలో పిల్లలను తిడితే  ఇది పిల్లలకు మరింత  చిరాకు తెప్పిస్తుంది. ఆ సమయంలో పిల్లలను  తిట్టడం ప్రారంభిస్తే, విషయం మరింత దిగజారిపోతుంది.అందుకే పిల్లలను మందలించాలన్నా మొదట వారి పరిస్థితి  సాధారణ స్థితికి వచ్చాక ఆ తరువాత  తప్పు గురించి వివరించి చెప్పాలి.                                         *రూపశ్రీ.
ఒక రిలేషన్ ఏర్పడటం సులువే  కానీ దానిని కొనసాగించడం మాత్రం   కష్టం. విజయవంతమైన సంబంధంలో ప్రేమ, గౌరవం, నమ్మకం, నిజాయితీ ఉండాలి. మరోవైపు, సందేహం, అవమానం, మోసం, అబద్ధాలు, హింస ఇవన్నీ సంబంధాన్ని చెడగొట్టడానికి కారణం అవుతాయి. కానీ కొంతమందికి అనుమానించే అలవాటు ఉంటుంది. వారు తమ భాగస్వామిని ప్రతి విషయంలోనూ అనుమానిస్తారు. ఇది సంబంధంలో బాధను మిగులుస్తుంది.   అందువల్ల, సంబంధంలో నమ్మకం,  ఒకరి పట్ల ఒకరు గౌరవం  కలిగి ఉండటం చాలా ముఖ్యం. భార్యాభర్తల సంబంధంలో నమ్మకాన్ని,  గౌరవాన్ని  పెంపొందించడంలో మీకు సహాయపడే చిట్కాలు తెలుసుకుంటే.. స్పష్టమైన సంభాషణ.. సంబంధం ప్రారంభంలో, జంటలు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటారు. కానీ క్రమంగా సంభాషణ తగ్గడం ప్రారంభమవుతుంది. వారు తమ భావాలను వివరించలేరు,  ఇతరుల భావాలను అర్థం చేసుకోలేరు. అటువంటి పరిస్థితిలో ఇద్దరి మధ్య అపార్థాలు తలెత్తడం ప్రారంభమవుతుంది. ఇది అనుమానానికి దారితీస్తుంది. ఇలాంటి  పరిస్థితిలో, ఒకరితో ఒకరు బహిరంగంగా మాట్లాడుకోవడం చాలా ముఖ్యం. ఒకరి మాటలు,  భావాలను అర్థం చేసుకోవడం,  ఒకరి మీద ఒకరికి మంచి అభిప్రాయాలు ఏర్పడటం చాలా ముఖ్యం. నమ్మకం.. నమ్మకం అనేది సంబంధానికి పునాది. భార్యాభర్తల  ఇద్దరి మధ్య నమ్మకం లేకపోతే, ఆ సంబంధం బలహీనపడవచ్చు. అటువంటి పరిస్థితిలో ఒకరినొకరు నమ్మకాన్ని పెంచుకోవడానికి ప్రయత్నించడం ముఖ్యం. మనసులో ఏవైనా సందేహాలు ఉంటే మాట్లాడి వాటిని నివృత్తి చేసుకోవాలి.  తద్వారా నమ్మకం పెరుగుతుంది. నాణ్యమైన సమయం.. కొన్నిసార్లు బిజీ జీవనశైలి కారణంగా ఇప్పటి భార్యాభర్తలు  ఒకరికొకరు సమయం ఇవ్వలేకపోతున్నారు. ఇది సంబంధంలో దూరాన్ని సృష్టిస్తుంది. ఇది సంబంధంలో అనుమానాన్ని,  అపనమ్మకాన్ని కూడా పెంచుతుంది. అటువంటి పరిస్థితిలో సంబంధానికి సమయం ఇవ్వడం ముఖ్యం.  భాగస్వామితో సమయం గడపాలి.  ఇద్దరూ కలిసి భోజనం  చేయడం, వంట చేయడం,  వారాంతాల్లో బయటకు వెళ్లడం, లేదా ఒకరితో ఒకరు బహిరంగంగా మాట్లాడుకోవడం చేయాలి. ఇలా చేయడం వల్ల మీ సంబంధం బలపడుతుంది.  *రూపశ్రీ.
  వర్షాకాలంలో గాలిలోని చల్లదనం హాయిని,  విశ్రాంతిని కలిగిస్తుంది. అందుకే చాలామందికి వర్షాకాలం అంటే బాగా ఇష్టం ఉంటుంది.  కానీ దీని కారణంగా చాలా సమస్యలు కూడా ఉన్నాయి.  వాటిలో ఒకటి ఇంట్లో పెరుగు సరిగా తోడు కాకపోవడం. చలికాలంలో జరిగేది ఏంటంటే.. పెరుగు తొందరగా తోడు కాకపోవడం ఒకటైతే.. పెరుగు బాగా క్రీమ్ లాగా కాకపోవడం మరొకటి.    కాలాన్ని బట్టి అన్ని మారుతున్నట్టే ఈ ప్రక్రియలో కూడా మార్పు చోటు చేసుకుంటుంది.  అయితే ఈ చలికాలంలో పెరుగు బాగా తోడు కావాలన్నా, క్రీమ్ గా గడ్డ పెరుగు రావాలన్నా ఈ కింది చిట్కాలు గమనించి వాటిని ఫాలో అవ్వాలి. ఉష్ణోగ్రత.. పెరుగు చిక్కగా రావాలంటే పాల ఉష్ణోగ్రత చాలా ముఖ్యం.  కొంతమంది పాలను వేడి చేసి అలా వదిలేసి ఉష్టోగ్రత చెక్ చేయకుండా తోడు పెడుతుంటారు. వాతావరణం కారణంగా పాలు తొందరగా చల్లగా అవుతాయి. అందుకే పాలు గోరువెచ్చగా ఉన్నాయా లేదా చెక్ చేసుకోవాలి. పాత్ర.. పెరుగు తోడు పెట్టాలి అనుకునే పాత్ర శుభ్రంగా ఉండాలి.  కొందరు ఏం చేస్తారంటే.. పాలు కాచిన గిన్నెలో అట్లాగే కాసింత పెరుగు వేసేస్తుంటారు. ఇది పెరుగు అదొక రకమైన వాసన,  పెరుగు రుచి మారడానికి కారణం అవుతుంది.  శుభ్రంగా, పొడిగా ఉన్న గిన్నెలో పాలు వేసి అందులో తోడు పెడితే పెరుగు బాగా అవుతుంది. పెరుగు కంటెంటే.. పాలు తోడు పెట్టడానికి పెరుగును జోడించడం మామూలే. అయితే  చలికాలంలో వాతావరణం కారణంగా కేవలం కొద్దిగా పెరుగు వేస్తే అది తోడు కావడం చాలా ఆలస్యం అవుతుంది.  పుల్లగా లేకుండా ఫ్రెష్ గా ఉన్న పెరుగును వినియోగించాలి.  ఒక లీటరు పాలకు ఒకటి నుండి రెండు స్పూన్ల తాజా పెరుగుతో తోడు పెడితే పెరుగు చాలా బాగా తోడవుతుంది. ఒక చిట్కా.. పెరుగును పాలలో ఒక చెంచా మొత్తంలో వేసి అలా మూత పెట్టేస్తుంటారు. అయితే ఇలా చేస్తే పెరుగు తోడు కావడం లేటవుతుంది. అలా కాకుండా పెరుగును పాలలో వేయగానే పాలు మొత్తం బాగా కలపాలి.  ఇలా చేస్తే పెరుగు చక్కగా సమంగా తయారవుతుంది. ప్రదేశం.. పెరుగు బాగా తోడు కావాలి అంటే ఇంట్లో స్థిరమైన, కాస్త వెచ్చగా ఉన్న ప్రదేశంలో పాల గిన్నెను ఉంచాలి. దీని వల్ల పెరుగు బాగా తోడవుతుంది. చల్లని ప్రదేశంలో ఉంచితే పెరుగు తొందరగా తోడు కాదు.                                     *రూపశ్రీ.  
  మోకాళ్ల నొప్పులు ప్రజల జీవితాన్ని కష్టతరం చేస్తాయి. దీని కారణంగా, లేవడం, కూర్చోవడం,  నడవడం నుండి రోజువారీ పనులు చేయడంలో సమస్యలు తలెత్తుతాయి. మోకాళ్లలో నిరంతరం నొప్పితో బాధపడే వారు ఈ సమస్యకు సర్జరీ లేదా చాలా తీవ్రమైన చికిత్సలతో తప్ప నయం కాదని అనుకుంటూ ఉంటారు.  అయితే ఇంటి చిట్కాతో మోకాళ్ల నొప్పిని ఈజీగా తగ్గించవచ్చని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు.  ఈ చిట్కా వల్ల మోకాళ్ల నొప్పి తగ్గడమే కాదు.. హాయిగా చకచకా తిరిగేసేంత శక్తి మోకాళ్లకు వస్తుంది అంటున్నారు. ఇంతకీ ఆ చిట్కాలేంటో తెలుసుకుంటే.. మోకాళ్లలో వాపు, మోకాళ్లు బిగుసుకుపోయినట్టు ఉండటం,   నొప్పి ఎక్కువగా ఉండటం  వంటి సమస్యలను తగ్గించడానికి ఆయుర్వేదంలో ఒక పురాతన  పేస్ట్ ఉంది.    దానిని మోకాలి నొప్పి ఉన్న  ప్రాంతంపై పూసి రాత్రంతా అలాగే ఉంచాలి.  ఉదయం నిద్రలేచిన తర్వాత  చాలా ఉపశమనం కలుగుతుందట. ఈ ఆయుర్వేద పేస్ట్ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుంటే..   పేస్ట్ తయారీ విధానం.. మోకాలి నొప్పి నుండి సహజ ఉపశమనం పొందడానికి,  ఆయుర్వేద పేస్ట్‌ను ఇంట్లో సులభంగా తయారు చేసుకోవచ్చు. దీని కోసం  కావలసిన పదార్థాలు.. 1 టీస్పూన్ ఆముదం 1 టీస్పూన్ తేనె 1 టీస్పూన్ దాల్చిన చెక్క పొడి 1  నిమ్మకాయ. తయారు విధానం.. ఒక గిన్నెలో అన్ని పదార్థాలను బాగా కలిపి మెత్తని పేస్ట్ తయారు చేసుకోవాలి. ఈ పేస్ట్ చాలా గట్టిగా  లేదా చాలా పలుచగా ఉండకూడదు.  మధ్యస్థంగా మోకాలి మీద రాసినప్పుడు కారిపోకుండా లేదా తొందరగా ఆరిపోయి రాలిపోకుండా ఉండాలి. ఈ పేస్ట్ ను చాలా సులభంగా అప్లై చేయవచ్చు. తయారు చేసుకున్న ఆయుర్వేద పేస్ట్ ను పలుచని పొరలాగా మోకాలిపై నొప్పి ఉన్న ప్రాతంలో లేదా మోకాలు అంతటగా  పూయాలి.  దానిపై మెత్తని  కాటన్ వస్త్రాన్ని చుట్టాలి.  8-10 గంటలు అలాగే ఉంచాలి. దీన్ని రాత్రి సమయంలో అప్లై చేసుకుంటే చాలా మంచిది.  ఉదయం గోరువెచ్చని నీటితో సున్నితంగా శుభ్రం చేసుకోవాలి. ప్రయోజనాలు.. ఈ పేస్ట్ రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. దీన్ని పూయడం వల్ల వాపు నుండి ఉపశమనం లభిస్తుంది. ఇది మోకాలు బిగుసుకుపోవడాన్ని  తగ్గించడంలో కూడా సహాయపడుతుంది.                                       *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు..
  మధుమేహాన్ని నిర్వహించడానికి  చాలా పద్ధతులను ప్రయత్నిస్తారు. తీపి ఆహారం తగ్గించడం,  చక్కెరకు దూరంగా ఉండటం,  అధిక మద్యపానాన్ని నివారించడం,   ఒత్తిడిని నిర్వహించడం.. ఇలా చాలా విషయాలు కంట్రోల్ చేసుకోవాల్సి ఉంటుంది.  కానీ గుడికి వెళ్లడం ద్వారా షుగర్ నయమవుతుందని మీరు విన్నారా?  గుడికి వెళ్లడం  వల్ల రక్తంలో చక్కెర తగ్గుతుందని,  కొన్ని సందర్భాల్లో మధుమేహం పూర్తిగా నయమవుతుందని అంటున్నారు. ఇది  నిజమే అని పోషకాహార నిపుణులు కూడా పేర్కొనడం గమనార్హం. ఇదెలా అనే విషయం తెలుసుకుంటే.. గుడికి వెళ్లడం అంటే ఇంటి నుండి గుడి ఎంతో కొంత దూరంలో ఉంటుంది.  ఇది ఒక చక్కని వాకింగ్ సెషన్ లాంటిది. అంతేకాదు.. గుడికి వెళ్తే అక్కడ మళ్లీ ప్రదక్షిణలు కూడా చేస్తారు. ఇది మరింత ప్రయోజనకరంగా ఉంటుంది.  ఇంకొక ముఖ్య విషయం ప్రశాంతత.  గుడిలో ప్రశాంతత ఉంటుంది. అక్కడ కొట్టే గంట చుట్టు ప్రక్కల వాతావరణాన్ని చాలా పాజిటివ్ గా ఉంచుతుంది.  గుడి చుట్టూ ఉండే మొక్కలు, ఇతర  విషయాలు కూడా చాలా పాజిటివ్ గా ఉంచుతాయి. ఇది సహజంగానే మనిషిలో ఒత్తిడి తగ్గిస్తుంది. రక్తప్రసరణ సక్రమంగా ఉండేలా చేస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలను కూడా నియంత్రణలో ఉంచుతుంది. సాధారణంగానే రోజుకు ఒక 10వేల అడుగులు వేయడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలను చాలా వరకు నియంత్రించవచ్చు. అంతేకాదు.. ప్రీడయాబెటిస్ ను కూడా నయం చేయవచ్చు. ఇలా గుడికి వెళ్తూ కార్బోహేడ్రేట్స్ అధికంగా ఉన్న ఆహారాన్ని నియంత్రించుకోవడం, ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవడం అలవాటు చేసుకుంటే మధుమేహం నియంత్రణ.. కొన్నేళ్లు ఇలా చేస్తే మధుమేహాన్ని నయం చేయడం సాధ్యమే.. అంటున్నారు.                                         *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు..
  బిపి ని సాధారణంగా  రక్తపోటు అని కూడా పిలుస్తారు.  హై బిపి ఉంటే మాత్రం దాన్ని అధిక రక్తపోటు అంటారు. ఇది ప్రపంచవ్యాప్తంగా బిలియన్ల మంది ప్రజలను ప్రభావితం చేసే ఆరోగ్య సమస్య. అధిక రక్తపోటు  గుండెపోటు,  స్ట్రోక్‌లకు కారణమవుతుంది.   వృద్ధాప్యంలో చిత్తవైకల్యం వచ్చే ప్రమాద కారకంగా కూడా ఉంటుంది. ప్రతి నలుగురు పురుషులలో ఒకరు,  దాదాపు ఐదుగురు స్త్రీలలో ఒకరు అధిక రక్తపోటుతో బాధపడుతున్నారు. కానీ చాలా మందికి దీని గురించి స్పష్టంగా తెలియదు.  అందుకే దీనిని  సైలెంట్ కిల్లర్ అని కూడా పిలుస్తారు. బిపిని నిర్వహించడానికి సరైన ఆహారం,  క్రమం తప్పకుండా వ్యాయామం చాలా ముఖ్యమైనవి.  వ్యాయామం చేయడం వల్ల రక్తపోటు ప్రమాదాన్ని తగ్గించవచ్చని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. అయితే వారానికి ఎన్నినిమిషాలు లేదా గంటలు వ్యాయామం చేయాలనే విషయం గురించి పూర్తీగా తెలుసుకుంటే.. హై బిపి అంటే.. అధిక రక్తపోటు అనేది ఒక తీవ్రమైన సమస్య. దీనిలో ధమని గోడలపై రక్త పీడనం సాధారణం కంటే ఎక్కువగా ఉంటుంది. దీని అర్థం  గుండె రక్తాన్ని పంప్ చేయడానికి ఎక్కువ కష్టపడాల్సి ఉంటుంది. అధిక రక్తపోటు గుండెపోటు, స్ట్రోక్,  మూత్రపిండాల వ్యాధితో సహా అనేక వ్యాధులకు కారణమవుతుంది. హై బిపి ప్రమాదం తగ్గించాలంటే.. అధిక రక్తపోటు నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోవాలనుకుంటే ఆరోగ్యకరమైన ఆహారంతో పాటు,  క్రమం తప్పకుండా వ్యాయామం,  వ్యాయామ అలవాట్లను కూడా అలవర్చుకోవాలి. శరీరంలో  అన్ని అవయవాలు సరిగ్గా పనిచేయడానికి ఈ అలవాట్లు కూడా అవసరం.  ఇది అనేక ఇతర వ్యాధుల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది. ఎన్ని గంటల వ్యాయామం? ఏ వ్యాయామాలు చేయాలి? వయోజన వ్యక్తులు అయితే  ప్రతి వారం కనీసం ఐదు గంటలు మితమైన వ్యాయామం చేస్తే అధిక రక్తపోటు ప్రమాదాన్ని గణనీయంగా తగ్గించవచ్చు. ముఖ్యంగా వారు 60 సంవత్సరాల వయస్సు వరకు వ్యాయామ అలవాటును కొనసాగించడం మంచిది. వారానికి 5 గంటల వ్యాయామం, ఇందులో కొన్ని తీవ్రమైన ఏరోబిక్ కార్యకలాపాలు,  మితమైన తీవ్రత కలిగిన వ్యాయామాల  కలయిక ఉండాలి. ఇది  రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. వ్యాయామం ఎలా హెల్ప్ అవుతుంది? వ్యాయామం రక్తపోటును ఎలా నియంత్రించడంలో సహాయపడుతుందో  అని చాలామందికి కన్ఫ్యూషన్ ఉంటుంది.   క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తే అది గుండెను బలపరుస్తుంది.  బలమైన గుండె ఎక్కువ కష్టపడకుండానే ఎక్కువ రక్తాన్ని పంప్ చేయగలదు. ఈ విధంగా రక్త నాళాలపై బలం తగ్గుతుంది.  ఫలితంగా రక్తపోటు తగ్గుతుంది. సాధారణ రక్తపోటు 120/80 mmHg లేదా అంతకంటే తక్కువగా ఉండాలి.                               *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు..