Home

»

Latest News

అఖిల్ 'లెనిన్' మూవీ ఫస్ట్ రివ్యూ.. ఇలా ఉంటుందని అసలు ఊహించలేదు.!

Jul 8, 2026 10:17AM

అక్కినేని యువ హీరో అఖిల్ నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ 'లెనిన్' బాక్సాఫీస్ వద్ద సందడి చేయడానికి సిద్ధమవుతోంది. అఖిల్ గత చిత్రం 'ఏజెంట్' భారీ అంచనాలతో వచ్చి డిజాస్టర్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ఆ సినిమా తర్వాత అఖిల్ దాదాపు 3 ఏళ్ల పాటు విరామం తీసుకుని, ఎంతో పట్టుదలగా ఈ 'లెనిన్' ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించారు. జూలై 10న థియేటర్లలోకి రాబోతున్న ఈ సినిమాపై అక్కినేని అభిమానులు భారీ ఆశలే పెట్టుకున్నారు. 'వినరో భాగ్యము విష్ణుకథ' సినిమాతో బాక్సాఫీస్ వద్ద మంచి సక్సెస్ అందుకున్న మురళీ కిషోర్ అబ్బూరు ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. క్రేజీ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటిస్తుండగా.. సితార ఎంటర్టైన్మెంట్స్, మనం ఎంటర్‌ప్రైజెస్ బ్యానర్స్ పై సూర్యదేవర నాగవంశీ, అక్కినేని నాగార్జున సంయుక్తంగా ఈ న్యూ ఏజ్ కమర్షియల్ డ్రామాను నిర్మించారు.

సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా విడుదల చేసిన టీజర్, ట్రైలర్, సాంగ్స్ ఇప్పటికే ప్రేక్షకుల్లో సినిమాపై ఉన్న అంచనాలను పెంచేశాయి. అఖిల్ మునుపెన్నడూ లేని విధంగా రగ్డ్ లుక్‌లో కనిపిస్తుండటం ట్రేడ్ వర్గాల్లో సైతం హాట్ టాపిక్‌గా మారింది. ఈ సినిమాలో అఖిల్ మేకోవర్, అతని నటన కెరీర్‌లోనే బెస్ట్ అని చిత్ర యూనిట్ చాలా కాన్ఫిడెంట్‌గా చెప్తోంది. 

జూలై 10న రిలీజ్ కాబోతున్న తరుణంలో, ఈ చిత్రాన్ని మేకర్స్ ఇప్పటికే కొంతమంది పరిశ్రమ పెద్దలకు, సన్నిహితులకు ప్రత్యేకంగా ప్రదర్శించారు. సినిమాను చూసిన ఇండస్ట్రీ ప్రముఖుల నుంచి అందుతున్న ఫస్ట్ రివ్యూ రిపోర్ట్స్ వింటే అక్కినేని ఫ్యాన్స్‌కి ఖచ్చితంగా పూనకాలు రావడం ఖాయంగా కనిపిస్తోంది.

ఈ ఇన్సైడ్ టాక్ ప్రకారం, 'లెనిన్' సినిమా మ్యాన్ ఆఫ్ మాసెస్  ఎన్టీఆర్ పవర్‌ఫుల్ వాయిస్ ఓవర్‌తో అత్యంత గ్రాండ్‌గా ప్రారంభమవుతుందట. ఎన్టీఆర్ గంభీరమైన శబ్దంతో సినిమా బ్యాక్‌డ్రాప్‌ను ఎలివేట్ చేసే విధానం థియేటర్లలో ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని సమాచారం. ఆ తర్వాత వచ్చే అఖిల్ ఇంట్రడక్షన్ సీన్, హై-వోల్టేజ్ యాక్షన్ బ్లాక్స్ వెండితెరపై మాస్ జాతరను తలపిస్తాయని చెప్తున్నారు. 

ఇక హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే ఎంట్రీ సీనియర్ ఎన్టీఆర్ ఐకానిక్ డైలాగ్‌తో ప్లాన్ చేయడం అదిరిపోయిందని తెలుస్తోంది. అఖిల్, భాగ్యశ్రీ బోర్సేల మధ్య సాగే రొమాంటిక్ ట్రాక్ చాలా వైవిధ్యంగా, ఫ్రెష్‌గా ఉంటుందని, వీరి ప్రేమకథే మొత్తానికి ఈ కమర్షియల్ యాక్షన్ డ్రామాను ఒక పెద్ద మలుపు తిప్పుతుందని ఇండస్ట్రీ టాక్. ఈ కథలో హీరోయిన్ క్యారెక్టర్‌కు కేవలం గ్లామర్‌కే పరిమితం కాకుండా చాలా ప్రాధాన్యత కల్పించారట.

ముఖ్యంగా సెకండాఫ్‌లో వచ్చే కొన్ని షాకింగ్ ట్విస్టులు ప్రేక్షకులు ఎవ్వరూ ఊహించని విధంగా ఉంటాయని, ఆ స్క్రీన్‌ప్లే మ్యాజిక్‌కి థియేటర్లలో మైండ్ బ్లాక్ అవ్వడం ఖాయమని ఇన్సైడర్ రిపోర్ట్స్ స్పష్టం చేస్తున్నాయి. ఫస్టాఫ్ ఎంటర్టైన్మెంట్, యాక్షన్ మోడ్‌లో సాగితే..సెకండాఫ్ మాత్రం అద్భుతమైన ఎమోషన్స్, మైండ్ బ్లోయింగ్ ట్విస్టులతో సరికొత్త అనుభూతిని ఇస్తుందని అంటున్నారు. 

మొత్తానికి 'లెనిన్' చిత్రం అఖిల్ అక్కినేనికి ఒక సాలిడ్ కమర్షియల్ కంబ్యాక్ మూవీ అవుతుందని, బాక్సాఫీస్ వద్ద అఖిల్ ఖాతాలో మొదటి బ్లాక్‌బస్టర్ పడటం ఖాయమని ఈ ఫస్ట్ రివ్యూస్ ద్వారా స్పష్టమవుతోంది. దాదాపు 3 సంవత్సరాల నిరీక్షణకు ఈ సినిమాతో అఖిల్ సరైన సమాధానం చెప్పబోతున్నాడని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. మరి జూలై 10న సాధారణ ప్రేక్షకులు ఈ న్యూ ఏజ్ కమర్షియల్ డ్రామాను ఏ రేంజ్‌లో ఆదరిస్తారో చూడాలి.

 

 

Akhil Akkineni, Lenin Review, Bhagyashri Borse, NTR

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com