Home

»

Latest News

shankar: శంకర్ శకం ముగిసిందా?.. ఇకపై ఆ అద్భుతాలు చూడలేమా!

Jul 8, 2026 11:50AM

 

సినిమాని అన్ని విభాగాల్లోను అప్ డేట్ కండిషన్ లోకి తీసుకొచ్చిన దర్శకుడు శంకర్. ప్రేక్షకుల సినీ ఆలోచన స్థాయి పెంచి, మేము సినిమా చూసాం అని గర్వపడేలా చేసిన  దర్శకుడు కూడా. మేకింగ్ పరంగా కూడా సినిమా సైతం ఊహించని విధమైన టేకింగ్ తో సినిమా యొక్క వాల్యూ పెంచాడు. భారతీయ చలనచిత్ర రంగాన్ని గ్రాఫిక్స్ వైపు, భారీ బడ్జెట్ వైపు నడిపించిన ఒకే ఒక్కడు కూడాను.
1993లో వచ్చిన 'జెంటల్‌మ్యాన్' సినిమాతో మొదలైన ఆయన ప్రస్థానం, దాదాపు పాతికేళ్ల పాటు అప్రతిహతంగా సాగింది. జెంటల్‌మ్యాన్ సినిమా బాక్సాఫీస్ వద్ద సాధించిన 100% బ్లాక్‌బస్టర్ విజయం టాలీవుడ్, కోలీవుడ్‌లను ఊపేసింది. ఆ తర్వాత వచ్చిన 'భారతీయుడు', 'జీన్స్', 'అపరిచితుడు', 'రోబో' చిత్రాలు కేవలం సినిమాలు కావు, ఇండియన్ సినిమా స్టాండర్డ్స్‌ మార్చేసిన అద్భుతాలు. ముఖ్యంగా 2010లో వచ్చిన 'రోబో' చిత్రం ప్రపంచవ్యాప్తంగా దాదాపు ₹375 కోట్లకు పైగా వసూలు చేసి ఆ రోజుల్లోనే సరికొత్త చరిత్ర సృష్టించింది. హాలీవుడ్ స్థాయి విజువల్స్ మన స్క్రీన్‌పై చూపించి అందరినీ నోరెళ్లబెట్టేలా చేశారు శంకర్.

కానీ కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఒకప్పటి ట్రెండ్ సెట్టర్, ఇప్పుడు ట్రెండ్ ఫాలో అవ్వడానికి కూడా ఇబ్బంది పడుతున్నారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గత కొన్నేళ్లుగా శంకర్ కెరీర్ గ్రాఫ్ పరిశీలిస్తే ఆయన మేకింగ్ స్టైల్‌లో పాత ముద్ర స్పష్టంగా కనిపిస్తోంది. 500 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన '2.0' చిత్రం ఆశించిన స్థాయిలో   మెప్పించలేకపోయింది. వసూళ్లు సాధించినప్పటికీ, శంకర్ మార్క్ ఎమోషన్ అందులో మిస్ అయిందనేది పచ్చి నిజం. ఇక ఇటీవల కాలంలో ఆయన దర్శకత్వంలో వచ్చిన చిత్రాలు మరింత నిరాశపరిచాయి. దాదాపు 250 కోట్ల బడ్జెట్‌తో నిర్మించిన 'ఇండియన్ 2'  డిజాస్టర్‌గా నిలిచింది. కేవలం 20% పాజిటివ్ టాక్ కూడా తెచ్చుకోలేక, పాతకాలపు కథనంతో సాగడం శంకర్ అభిమానులను సైతం తీవ్రంగా కలచివేసింది.  రామ్ చరణ్‌తో చేసిన 'గేమ్ చేంజర్ పరిస్థితి అంతే.

ప్రస్తుతం ఉన్న ట్రెండ్ ప్రకారం రాజమౌళి, ప్రశాంత్ నీల్, లోకేష్ కనగరాజ్ వంటి యువ దర్శకులు సరికొత్త స్క్రీన్‌ప్లే, గ్రిప్పింగ్ నరేషన్‌తో దూసుకుపోతున్నారు. నేటి తరం ఆడియన్స్ కేవలం భారీ సెట్లు, వందల కోట్లు ఖర్చు పెట్టిన గ్రాఫిక్స్ చూసి పడిపోవడం లేదు. బలమైన కథ, ఎమోషన్ ఉంటేనే 000 కోట్ల క్లబ్‌లో సినిమాలు చేరుతున్నాయి. కానీ శంకర్ ఇంకా 1990ల నాటి లంచగొండితనం, సామాజిక సమస్యల చుట్టూనే తిరుగుతున్నారు. నేటి డిజిటల్ యుగంలో 5G స్పీడ్‌తో దూసుకుపోతున్న ప్రేక్షకులకు శంకర్ పాత ఫార్ములా రొటీన్‌గా అనిపిస్తోంది.

Also read: Lenin: టెన్షన్..టెన్షన్..టెన్షన్! 

ఈ పరిస్థితులని చూస్తుంటే 'శంకర్ నుంచి ఇకపై అద్భుతమైన సినిమాలు రావడం కష్టమేనా?' అనే ప్రశ్న సినీ విశ్లేషకుల్లో వ్యక్తమవుతోంది. అయితే ఆయనను తక్కువ అంచనా వేయలేం. 30 ఏళ్లకు పైగా ఇండస్ట్రీని ఏలిన ఒక లెజెండరీ దర్శకుడు ఒక్క సరైన హిట్‌తో మళ్లీ ఫామ్‌లోకి రావడం అసాధ్యమేమీ కాదు. కాకపోతే శంకర్ తన పాత ఆలోచనల నుంచి బయటకు వచ్చి, నేటి తరం ప్రేక్షకుల పల్స్ పట్టుకోవాల్సి ఉంటుంది. విజువల్ గ్రాండ్‌నెస్ పక్కన పెట్టి, కథలో దమ్ము చూపిస్తేనే శంకర్ మళ్లీ కింగ్ కాగలరు. లేదంటే ఆయన శకం ముగిసినట్లేనని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. 

shankar, game changer, ram charan

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com