Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...భారతీయులు ఎందుకు ఇలా అవుతున్నారు? డింక్ జంటలుగా మారడం వెనుక అసలు కారణాలు ఏంటంటే..!
posted on: Jul 7, 2026 3:00PM

ఒక ఉత్తమమైన తరాన్ని సమాజానికి ఇచ్చే ఉద్దేశంతో వివాహం చేసుకుంటారని పెద్దలు చెబుతారు. ఆరోగ్యకరమైన బంధం ద్వారా ఒక మంచి తరం తయారవుతుంది. కుటుంబం విషయానికి వస్తే.. వంశం ముందుకు సాగడం అనేది పిల్లల ద్వారానే జరుగుతుంది. ఇది వందలాది, వేలాది సంవత్సరాలుగా సాగుతున్న సంప్రదాయం. అయితే భారతదేశంలో ఇప్పుడు కొత్త ట్రెండ్ నడుస్తోంది. భారతీయులు విదేశాలలో పుట్టిన సంప్రదాయాలను పాటిస్తూ వెర్రిగా మారిపోతున్నారు. డేటింగ్ లు, సహజీవనాలు, రకరకాల కొత్త కల్చర్లు పాటిస్తూ భారతీయ సంస్కృతికి దూరం అవుతున్నారు. ఇప్పుడు డింక్ పేరిట ఏకంగా ఒక తరాన్ని పుట్టకుండా ఆపేస్తున్నారు. అసలు డింక్ అంటే ఏమిటి? దీని పట్ల భారతీయ జంటలు ఎందుకు అంత ఆకర్షితులు అవుతున్నారు? దీని గురించి వివరంగా తెలుసుకుంటే..
దశాబ్దాలుగా కుటుంబ వంశాన్ని కొనసాగించే మార్గంగా వివాహాన్ని చూసేవారు. కానీ కొత్త తరం దీనికి వ్యతిరేకంగా ఉంది, వంశాన్ని ముందుకు తీసుకెళ్లడం అనే విషయం కంటే.. ప్రపంచం పట్ల ఆసక్తి పెరిగింది, సంబంధాల తీరు కూడా మారుతోంది. ఇప్పుడు ఒక బిడ్డను కనాలన్నా, వంశాన్ని ముందుకు నడపాలన్నా పెద్దగా ఆసక్తి చూపడం లేదు.దీన్నే డింక్ అంటున్నారు. విదేశాలలో పుట్టిన ఈ సంస్కృతి పట్ల భారతీయులు కూడా నెమ్మదిగా అలవాటు పడుతున్నారు.
డింక్ అంటే..
DINK అంటే ' డబుల్ ఇన్కమ్ నో కిడ్స్ ', పేరులోనే దీని అర్థం ఉంది. దీని అర్థం పెళ్లి తర్వాత పిల్లలను కనాలని అనుకోకపోవడం.
డింక్ జంటలు ఎందుకు పెరుగుతున్నాయ్..
కొన్నేళ్ల క్రితం వరకు ఇంకా పిల్లలు ఎందుకు పుట్టలేదు అనేదే చాలా పెద్ద ప్రశ్నగా ఉండేది పెళ్లైన జంటల్లో.. కానీ ఇప్పుడు పిల్లలు వద్దు అనే నిర్ణయం వస్తోంది. ముఖ్యంగా బారతదేశంలోని పట్టణాలలో ఉన్న జంటలలో చాలా మార్పు వస్తోంది. చదువుకున్న, ఇద్దరూ సంపాదించే భార్యాభర్తలు అసలు మనకు పిల్లలు అవసరమేనా అనే ప్రశ్న వేసుకుంటున్నారు. ముఖ్యంగా 20, 30 ఏళ్ల వయసులో పెళ్లిచేసుకున్న జంటలు ఈ నిర్ణయం తీసుకుంటున్నాయి.ఈ నిర్ణయం తీసుకోవడానికి చాలా కారణాలు ఉన్నాయి.
ఆర్థిక భారం..
చాలామంది ఎదుర్కునే స్పష్టమన కారణం ఆర్థిక విషయాలే.. ఇరవై, ముప్పై సంవత్సరాల కిందట పిల్లలను పెంచినట్టు నేటికాలంలో మెట్రో సిటీలలో పిలలను పెంచడం కష్టమవుతోందని చాలామంది అంటున్నారు. పాఠశాల ఫీజులు,ఇల్లు కొనడం లేదా అద్దె, పిల్లల సంరక్షణ , ఆరోగ్య సంరక్షణ.. ఇవన్నీ పిల్లలు వద్దు అనుకోవడానికి కారణం అవుతున్నాయి. మెట్రో పట్టణాలలో ఇద్దరు వ్యక్తుల సంపాదన కూడా వీటికి సరిగా సరిపోవడం లేదని ఆవేదన చాలా మందిలో ఉంది.
క్వాలిటీ లైఫ్..
పిల్లలు పుడితే లైఫ్ క్వాలిటీ పోతుందని చాలామంది జంటలు అబిప్రాయం. పిల్లల బాధ్యతలలో తాము ఎన్నో సంతోషాలు, సరదాలు, ఇష్టాలు కోల్పోవడానికి, జీవితాన్ని సరదాగా గడపడానికి, ముఖ్యంగా భార్యాభర్తలు ఇద్దరూ ఒకరితో ఒకరు ఎక్కువ సమయం గడపడానికి సరిపడినంత సమయం దొరకడం లేదని అనుకుంటున్నారు. పైగా పిల్లల కారణంగా జీవితంలో కాస్త విలాసంగా బ్రతికే అవకాశం ఉన్నా దాన్ని పిల్లల కోసం త్యాగం చేయాల్సి వస్తుంది. అందుకే పిల్లలు వద్దని అనుకుంటున్నారు.
మరొక మార్గం..
చాలా మంది DINK జంటగా ఉండాలని నిర్ణయం తీసుకుంటే అది బాధ్యతల నుండి తప్పించుకోవడం కోసం లేదా వారి విలాసవంతమైన జీవితం కోసం అనుకుంటారు. కానీ ఇది తప్పు.. చాలామంది పిల్లల పట్ల తీసుకోవాల్సిన బాధ్యతలను ఒకరికొకరు బాధ్యతగా చూసుకోవడంలో, అలాగే వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులు, జంతు సంక్షేమం వంటి తమకు ఇష్టమైన విషయాల ద్వారా బాధ్యతను తీసుకుంటున్నారు. ఇది తమ తరువాత వంశం లేకపోయినా, కుటుంబాన్ని కాపాడుకోవడం , జీవన నాణ్యతను మెరుగ్గా ఉంచుకోవడం వంటి కారణాల వల్లే చేస్తున్నారు.
*రూపశ్రీ.






