.webp)
తెలుగు సినిమా ఎదుగుదల అక్కినేని(Akkineni)కాంపౌండ్ లోనే పురుడు పోసుకుందని చెప్పుకోవడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అందుకు ఆద్యుడు మహానటుడు అక్కినేని నాగేశ్వరరావు అనే విషయం తెలిసిందే. ఇప్పుడు ఆయన రెండో మనవడు అఖిల్ అక్కినేని(Akhil Akkineni)ఈ నెల 10 న ;లెనిన్' తో సెల్యులాయిడ్ పై అడుగుపెడుతున్నాడు. రిలీజ్ టైందగ్గరపడుతున్న కొద్దీ అక్కినేని అభిమానుల్లో తీవ్రమైన ఉత్కంఠ, టెన్షన్ నెలకొంది.
దీనికి ప్రధాన కారణం అఖిల్ కెరీర్ లో ఇంతవరకు సరైన హిట్ లేదు. అఖిల్ మొదలుకొని, ఏజెంట్ వరకు తన పెర్ఫార్మ్ విషయంలో ఏ లోటు లేకపోయినా, కథ, కధనం బాగోకపోవడంతో హిట్ అనేది అఖిల్ కి డిస్టెన్స్ మెయిన్ టైన్ చేస్తుంది. పైగా ఇప్పుడు 3 సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత లెనిన్ తో వెండితెరపై కనిపించబోతున్నాడు . మరోవైపు రిలీజ్ డేట్ ఏకంగా 3 సార్లు మారడం కూడా అభిమానుల్లో టెన్షన్‌ని పెంచేసింది. మొదట మే 1న, ఆ తర్వాత జూన్ 26న విడుదల చేయాలనుకున్నా, చివరకు జూలై 10 వ తేదీని లాక్ చేశారు. రామ్ చరణ్ 'పెద్ది' వంటి పెద్ద సినిమాలతో బాక్సాఫీస్ క్లాష్ రాకూడదనే ఉద్దేశంతోనే నిర్మాత నాగార్జున ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ గ్రామీణ యాక్షన్ డ్రామాను దర్శకుడు మురళి కిషోర్ అబ్బూరు రాయలసీమ (చిత్తూరు) నేపథ్యంతో తెరకెక్కించారు. తిరుపతిలో జరిగిన ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో అఖిల్ తన అభిమానులకి భావోద్వేగంతో క్షమాపణలు చెప్పారు. "ఇంతకాలం మిమ్మల్ని ఊరించినందుకు నన్ను క్షమించండి, నా హృదయం ఎప్పుడూ మీ కోసమే " అంటూ చెప్పుకొచ్చాడు.
Also read: Imanvi: ప్రభాస్ హీరోయిన్ ఇమాన్వికి మరో ఛాన్స్ ఎందుకు రాలేదు.. అసలు రీజన్ ఇదే!
అయితే, ఈ టెన్షన్ల నడుమ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. నిర్మాత సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రంపై అత్యంత ధీమాగా ఉన్నారు. 'లెనిన్' చిత్రం బాక్సాఫీస్ వద్ద 100 కోట్ల నుండి 200 కోట్ల రూపాయల వరకు వసూలు చేసే సత్తా ఉన్న కమర్షియల్ సినిమా అని ఆయన గ్యారెంటీ ఇచ్చారు. ఇంటర్వెల్‌కు 45 నిమిషాల ముందు నుండి క్లైమాక్స్ వరకు ఒక్క సీన్ కూడా బోర్ కొట్టదని, థియేటర్ల నుండి వచ్చే ప్రతి ఒక్కరూ సంతృప్తితో వస్తారని 200 శాతం నమ్మకంగా చెప్పారు. అఖిల్ కూడా లెనిన్ ని 'రాయలసీమ మహాభారతం' అని అభివర్ణించారు. సీనియర్ నటుడు నాగార్జున కూడా "ఈ సినిమాలో మీరు అఖిల్‌ను చూడరు, కేవలం లెనిన్‌ను మాత్రమే చూస్తారు" అని ప్రశంసించారు. దీనికి తోడుగా యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) కూడా అఖిల్‌కు బాసటగా నిలిచి 'లెనిన్' కోసం గర్జించడంతో అక్కినేని ఫ్యాన్స్‌లో భయంతో కూడిన ఒక కొత్త జోష్ కనిపిస్తోంది. జూలై 10న థియేటర్లలో అఖిల్ ఎలాంటి విధ్వంసం సృష్టిస్తాడో చూడాలని టాలీవుడ్ మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. అఖిల్ సరసన భాగ్యశ్రీ బోర్సే జత కట్టింది.
akhil akkineni, bhagyashri borse, lenin, nagarjuna






