Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...ప్రశ్న రావణ్ పై ఉపా చట్టం ప్రయోగం వెనుక అసలు కారణాలివే.!
posted on: Jul 8, 2026 11:39AM

తెలుగువన్ ఎక్స్ క్లూజివ్
ఆంధ్రప్రదేశ్‌లో గత కొద్ది రోజులుగా తీవ్ర సంచలనం సృష్టిస్తున్న ప్రశ్న రావణ్ అలియాస్ జోసెఫ్ అరెస్ట్ వ్యవహారం సరికొత్త మలుపు తిరిగింది. గన్నవరం పోలీసులు ఆయనను అరెస్ట్ చేసి, కోర్టు ముందు హాజరుపరచగా న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించడంతో నెల్లూరు జైలుకు తరలించారు. అయితే, ఆయనపై కేవలం పవన్ కళ్యాణ్ లేదా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడులను దూషించారనే కారణంతోనే కాకుండా, అత్యంత కఠినమైన ఉపా చట్టం కింద దేశద్రోహం కేసులు నమోదు చేయడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
ఈ కేసు పూర్వాపరాలను పరిశీలిస్తే.. కేవలం దళిత క్రిస్టియన్ శంఖారావం సభలో మాట్లాడిన వ్యాఖ్యల కోణంలోనే కాకుండా.. ఆయన వెనుక ఉన్న ఒక పెద్ద నెట్‌వర్క్‌ను పోలీసులు రిమాండ్ రిపోర్ట్‌లో ఎండగట్టారు. గన్నవరం పోలీసులు సమర్పించిన నివేదిక ప్రకారం, ప్రశ్న రావణ్ దేశ సార్వభౌమత్వానికి భంగం కలిగించేలా ప్రవర్తించారనే బలమైన ఆరోపణలు ఉన్నాయి. నిషేధిత మావోయిస్టు పార్టీకి మద్దతుగా, యువతను ఆ మార్గం వైపు ప్రేరేపించేలా ఆయన కంటెంట్ ఉందనేది పోలీసుల ప్రధాన అభియోగం.
ముఖ్యంగా గత ఏడాది నవంబర్‌లో ఆయన విడుదల చేసిన కొన్ని వీడియోలను పోలీసులు పెన్ డ్రైవ్ రూపంలో న్యాయస్థానానికి సమర్పించారు. నిషేధిత సీపీఐ (ఎంఎల్) మావోయిస్టు సంస్థకు చెందిన కేశవరావు, హిడ్మా వంటి అగ్రనేతలను కీర్తిస్తూ.. వారు అమరజీవులని, మళ్లీ పుడతారని, యుద్ధం కొనసాగుతూనే ఉంటుందని రావణ్ వ్యాఖ్యానించినట్లు రిమాండ్ రిపోర్ట్‌లో స్పష్టంగా పేర్కొన్నారు. అమాయక గరిజన యువతను టార్గెట్ చేసుకుని దేశానికి వ్యతిరేకంగా యుద్ధం ప్రకటించేలా ఈ ప్రసంగాలు ఉన్నాయని ప్రాసిక్యూషన్ వాదిస్తోంది.
ఈ పరిణామాలపై మాజీ న్యాయమూర్తి రామకృష్ణ రామకృష్ణ తెలుగువన్ న్యూస్ తో ప్రత్యేకంగా మాట్లాడుతూ.. ఉపా' చట్టం కింద ఒకసారి కేసు నమోదైతే సాధారణ ఐపీసీ సెక్షన్లలాగా బెయిల్ రావడం సులభం కాదన్నారు. అయితే.. ఈ చట్టాన్ని శాంతిభద్రతలు సజావుగా ఉన్న ఏపీలో ప్రయోగించడం ఆందోళన కు గురిచేస్తోందనీ, ప్రభుత్వం మారిన ప్రతిసారీ ఒకరు నేరస్థుడిగా, మరొకరు ప్రజాసేవకుడిగా మారిపోయే సంప్రదాయం సరికాదన్నారు.
ప్రస్తుతం ప్రశ్న రావణ్ ముందున్న ఏకైక మార్గం హైకోర్టును ఆశ్రయించడమేనన్న ఆయన.. ప్రశ్న రావణ్.. ఆయన తరపు న్యాయవాదులు క్వాష్ పిటిషన్ దాఖలు చేసి, ఈ ఎఫ్‌ఐఆర్‌ను కొట్టివేయాలని కోరే అవకాశం ఉందన్నారు. హైకోర్టుకు ఉన్న ప్రత్యేక అధికారాల ద్వారా వీడియో కంటెంట్‌ను క్షుణ్ణంగా పరిశీలించి.. ఒకవేళ ఆ ప్రసంగాల వల్ల సమాజంలో తక్షణ నష్టం లేదా హింస జరగలేదని భావిస్తే రావణ్‌కు ఉపశమనం లభించే అవకాశాలు ఉన్నాయని రామకృష్ణ అభిప్రాయపడ్డారు.
Prashna Ravana Arrest AP, Former Judge Ramakrishna Interview, UAPA Case Andhra Pradesh, Ravana Remand Report, AP Politics Telugu News






