LATEST NEWS
తెలంగాణ రాజకీయాల్లో భూ వివాదాలు మరోసారి తారస్థాయికి చేరాయి. రాష్ట్రంలో అధికార కాంగ్రెస్ పార్టీకి, ప్రధాన ప్రతిపక్షమైన భారత్ రాష్ట్ర సమితికి   మధ్య మాటల యుద్ధం  ముదిరింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల అసెంబ్లీ వేదికగా మాజీ సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యుల భూ ఆక్రమణలంటూ చేసిన సంచలన వ్యాఖ్యలు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్‌పై గులాబీ పార్టీ  మండిపడింది. ప్రభుత్వ వైఫ్యాలను కప్పిపుచ్చుకునేందుకే కాంగ్రెస్ పెద్దలు ఇలాంటి నిరాధార ఆరోపణలు చేస్తున్నారని  ఎదురుదాడికి దిగింది. అయితే  అసంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి ఆన్ రికార్డ్ యటపెట్టిన భూముల వివరాలతో బీఆర్ఎస్ డిఫెన్స్ లో పడినట్లే కనిపిస్తోంది. ఆ పార్టీ చేస్తున్న ఎదురుదాడి ఆత్మరక్షణ యత్నంగా కనిపిస్తోందే తప్ప ప్రజలను నమ్మించడంలో విఫలమైంది. మామూలుగా సాధారణంగా రాజకీయాల్లో ప్రత్యర్థులపై విమర్శలు చేయడం వేరు.. సాక్షాత్తూ అసెంబ్లీ వేదికగా  సర్వే నంబర్లు, విస్తీర్ణాల ఆధారంగా లెక్కలు బయటపెట్టడం వేరు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అదే పని చేశారు.   ధరణి పోర్టల్‌ను అడ్డం పెట్టుకుని పేద రైతుల భూములను లాక్కున్నారని, దీని వెనుక పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయని సీఎం అన్నారు. ప్రాథమిక సమాచారం ఆధారంగానే ఈ వివరాలు బయటపెడుతున్నామని, పూర్తి స్థాయి ఫోరెన్సిక్ ఆడిట్,  లోతైన విచారణ జరిగితే మరిన్ని నిజాలు వెలుగులోకి వస్తాయని రేవంత్ రెడ్డి చెప్పారు.   ఈ నేపథ్యంలోనే అసెంబ్లీ వేదికగా రేవంత్ వెల్లడించిన వివరాలను ఖండిస్తూనే.. కేసీఆర్ కుటుంబం ఆ భూములన్నీ నిజమే, వాటిని  మేం దాచిపెట్టిందేమీ లేదు, ఎన్నికల అఫిడవిట్లలో స్వయంగా పొందుపరిచినవే అని చెప్పుకుంటోంది. అవన్నీ తమకు తరతరాలుగా వస్తున్న వేల ఎకరాల వారసత్వ భూములున్నాయనీ, తమది జమీందారీ నేపథ్యమని చెప్పుకుంటోంది. అయితే.. ఇక్కడ కేసీఆర్ కుటుంబం మరీ ముఖ్యంగా కేసీఆర్ చిన్న లాజిక్ మరిచిపోయారు. 1973 నాటి భూమి పరిమితి చట్టం  ప్రకారం ఉమ్మడి కుటుంబానికి మెట్ట భూమి 52 ఎకరాలు, కొన్ని ప్రత్యేక సందర్భాల్లో 54 ఎకరాలు మించి ఉండటానికి లేదన్న విషయాన్ని ఆయన ఉద్దేశపూర్వకంగానో లేదా నిజంగానే అయినా మరచిపోయారు.  దీంతో కల్వకుంట్ల కుటుంబం, బీఆర్ఎస్ రేవంత్ ఆరోపణలను తిప్పి కొట్టే ప్రయత్నం పెద్దగా ఫలిచడం లేదని పరిశీలకులు అంటున్నారు.   ఇక పోతే ఆ ఆరోపణల తీవ్రతను తగ్గిండానికి, ప్రస్తుతానికి తప్పించుకోవడానికి కేటీఆర్ పొలిటికల్ అస్త్రంగా సిట్టింగ్ జడ్డి విచారణ అంటూ సవాల్ చేస్తున్నారు.  అయితే..  సిట్టింగ్ జడ్జి విచారణ డిమాండ్ అనేది సమస్యను పక్కదారి పట్టించే, పాతచింతకాయపచ్చడి వ్యూహంగా పరిశీలకులు అభివర్ణిస్తున్నారు.  కేటీఆర్ డిమాండ్ కేవలం కాలయాపనకే తప్ప.. రేవంత్ రెడ్డి ఆరోపణలకు సమాధానం కాదని అంటున్నారు.  అన్నిటికంటే ప్రధానంగా... ఆ భూములు తమవేననీ, వాటిని చట్టబద్ధంగా కొన్నామనీ చెప్పుకుంటున్న కేటీఆర్   భూములు ఎవరి హయాంలో, ఎంత ధరకు  కొన్నారు అన్న వివరాలను వెల్లడించాల్సి ఉంది.  వాటిని కొనుగోలు చేయడానికి వెచ్చించిన నిధులు, అవి వచ్చిన మార్గం, దాని మూలాలు అన్నీ వివరించాల్సిన అవసరం ఉంది. అది వదిలేసి.. వ్యక్తిగత దూషణలు, ప్రత్యారోపణలు చేయడం వల్ల ఉపయోగం ఉండదు. ప్రత్యారోపణలు, వ్యక్తిగత దూషణలు ప్రజలలో కల్వకుంట్ల కుటుంబ వాదనను బలహీన పరుస్తాయో తప్ప మరో ప్రయోజనం ఉండదని పరిశీలకులు అంటున్నారు.  అన్నిటికీ మించి అవి వారసత్వ భూములు అన్న ఒక్క మాటతో ఈ వివాదాన్ని ముగించేయడం కల్వకుంట్ల కుటుంబానికి అంత తేలిక కాదు. ఏది ఏమైనా అసెంబ్లీ వేదికగా రేవంత్ రెడ్డి సృష్టించిన ‘భూ’ కంపం కేసీఆర్ కుటుంబాన్ని, అలాగే బీఆర్ఎస్ పార్టీనీ ఆత్మరక్షణలో పడేసిందన్నది మాత్రం ఎవరూ కాదనలేని వాస్తవమని చెప్పాలి.  [Revanth Reddy, KCR Family Lands, BRS Counter Attack, Telangana Politics, Dharani Portal Row]
వైద్య రంగంలో జరిగే చిన్నపాటి తప్పులు ఒక్కోసారి మనుషుల జీవితాలనే తీవ్రంగా మార్చేస్తుంటాయి. అలాంటి ఒక విషాదకరమైన సంఘటన బెక్కీ జోన్స్ అనే మహిళ జీవితంలో చోటుచేసుకుంది. 2012లో ఆమె తీవ్రమైన మైగ్రేన్ తలనొప్పితో బాధపడుతూ ఆసుపత్రికి వెళ్లారు. వైద్యులు ఆమెకు బ్రెయిన్ స్కాన్ నిర్వహించగా మెదడులో ఒక పెద్ద మచ్చ కనిపించింది. ఆ మచ్చను చూసి అది ప్రమాదకరమైన బ్రెయిన్ ట్యూమర్ అని, ప్రాణాంతక క్యాన్సర్ అని వైద్యులు నిర్ధారించారు. చికిత్స వెంటనే ప్రారంభించకపోతే ప్రాణాలకే ముప్పు వాటిల్లుతుందని పదే పదే హెచ్చరించడంతో, ఆమె కీమోథెరపీ తీసుకోవడం ప్రారంభించారు. అది ఒక ఏడాది కాదు, రెండేళ్లు కాదు.. ఏకంగా 11 ఏళ్ల పాటు సుదీర్ఘంగా కొనసాగింది. కొద్ది నెలల వ్యవధిలోనే ముగియాల్సిన మానసిక, శారీరక వేదన ఆమె జీవితంలో దాదాపు దశాబ్ద కాలానికి పైగా నిత్యకృత్యమైంది. కీమోథెరపీ వల్ల కలిగే తీవ్రమైన పార్శ్య ప్రభావాలు, వెంట్రుకలు రాలిపోవడం, వికారంగా ఉండటం, శరీరం బలహీనపడటం వంటి నరకయాతనను ఆమె ప్రతిరోజూ అనుభవించారు. చికిత్స ఆపేస్తే ఎక్కడ క్యాన్సర్ తిరగబెట్టి తన ప్రాణాలను తీస్తుందో అనే భయంతోనే ఆమె 11 ఏళ్ల పాటు ఆ నరకాన్ని భరిస్తూ వచ్చారు. అయితే 2025లో ఆమె వైద్య రిపోర్టులను కొందరు న్యూరోసర్జన్లు మరియు రేడియాలజిస్టులు మరొకసారి క్షణ్ణంగా పరిశీలించినప్పుడు అసలు షాకింగ్ నిజం వెలుగులోకి వచ్చింది. బెక్కీ జోన్స్‌కు అసలు ఎప్పుడూ బ్రెయిన్ క్యాన్సరే లేదని వైద్యులు తేల్చి చెప్పారు. స్కాన్‌లో కనిపిస్తున్న మచ్చ క్యాన్సర్ ట్యూమర్ కాదని, అది  ట్యూమర్‌ఫ్యాక్టివ్ డిమైలినేషన్  అనే అరుదైన నాడీ సంబంధిత సమస్య అని స్పష్టం చేశారు. నరాల పొర దెబ్బతినడం వల్ల వచ్చే ఒక రకమైన వాపు కారణంగా అది స్కాన్‌లో చూడటానికి హానికరమైన ట్యూమర్‌లా కనిపించిందని వివరించారు. ఈ నిజం తెలుసుకున్న బెక్కీ జోన్స్‌కు ఉపశమనం లభించడం కంటే తీవ్రమైన దిగ్భ్రాంతి, వేదన మిగిలాయి. తన జీవితంలోని అమూల్యమైన 11 సంవత్సరాల కాలాన్ని, ఆరోగ్యాన్ని కేవలం ఒక తప్పుడు వైద్య నిర్ధారణ వల్ల అనవసరంగా కోల్పోయానని ఆమె కన్నీటిపర్యంతమయ్యారు.  నాకు అసలు బ్రెయిన్ ట్యూమరే లేదు, పదేళ్లకు పైగా ఏ కారణం లేకుండానే నరకాన్ని అనుభవించాను  అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సంఘటన అరుదైన లేదా క్లిష్టమైన వైద్య పరీక్షలు ఎదురైనప్పుడు సెకండ్ ఒపినియన్ ఎంత కీలకమో అందరికీ కన్నువిప్పు కలిగిస్తోంది.     [ Becky Jones, Medical Misdiagnosis, Brain Tumor, Tumefactive Demyelination, Brain Scan, Chemotherapy, Neurology, Neurosurgery, Radiology, Second Opinion ]
పట్టభద్రుల ఎన్నికలకు ఓటర్ల జాబితా ప్రక్రియ షెడ్యూల్ విడుదల.. ! తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక ఘట్టానికి రంగం సిద్ధమైంది. రాష్ట్రంలోని అత్యంత ప్రతిష్టాత్మకమైన మహబూబ్‌నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ అలాగే వరంగల్-ఖమ్మం-నల్గొండ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ నియోజకవర్గాలకు జరగనున్న ఎన్నికలకు సంబంధించి ఎన్నికల సంఘం అధికారిక ప్రకటన జారీ చేసింది. వచ్చే ఏడాది 2027 మార్చి నెలలో సిట్టింగ్ ఎమ్మెల్సీల పదవీకాలం ముగియనున్న నేపథ్యంలో, ఈ రెండు స్థానాలకు కొత్తగా ఓటర్ల జాబితాను సిద్ధం చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జూరీ చేసింది. దీనికి సంబంధించిన పూర్తి స్థాయి షెడ్యూల్‌ను అధికారులు తాజాగా విడుదల చేయడంతో పట్టభద్రుల్లో ఉత్కంఠ నెలకొంది.  ఈ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోవాలనుకునే అర్హులైన అభ్యర్థుల కోసం అధికారిక యంత్రాంగం పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టింది.  ఈ ప్రత్యేక ఓటర్ల నమోదు ప్రక్రియకు సంబంధించి సెప్టెంబర్ 28వ తేదీన అధికారికంగా ప్రజా నోటీసు లేదా ప్రకటన వెలువడనుంది. నవంబర్ 1, 2026 నాటికి డిగ్రీ లేదా తత్సమాన విద్యార్హత సాధించిన పట్టభద్రులందరూ ఈ ఓటర్ల నమోదుకు పూర్తిగా అర్హులుగా ఉంటారని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. అర్హులైన నిరుద్యోగులు, ఉద్యోగులు మరియు పట్టభద్రులు తమ ఓటు హక్కు కోసం నవంబర్ 6వ తేదీ వరకు ఫారం-18 ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించారు.  అక్టోబర్ 15న పత్రికల్లో తొలి పునఃప్రచురణ, అక్టోబర్ 25న రెండో పునఃప్రచురణ చేపట్టనున్నారు. గడువు ముగిసిన తర్వాత అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి నవంబర్ 25వ తేదీన ముసాయిదా (డ్రాఫ్ట్) ఓటర్ల జాబితాను ప్రచురించనున్నారు.  ఒకవేళ ముసాయిదా జాబితాలో పేర్లు లేకపోతే లేదా తప్పులు ఉంటే, వాటి సవరణలు మరియు అభ్యంతరాల స్వీకరణ కోసం నవంబర్ 25 నుండి డిసెంబర్ 10వ తేదీ వరకు ప్రత్యేక సమయం కేటాయించడం జరిగింది.  ప్రజల నుంచి వచ్చిన అభ్యంతరాలను నిశితంగా పరిశీలించి అన్ని రకాల మార్పు చేర్పులు పూర్తి చేసిన అనంతరం, డిసెంబర్ 30వ తేదీన తుది ఓటర్ల జాబితాను అధికారికంగా విడుదల చేయనున్నట్లు ఎన్నికల సంఘం తేల్చిచెప్పింది. అయితే, ఇక్కడ పట్టభద్రులు అత్యంత గమనించాల్సిన కీలక విషయం ఏమిటంటే.. గతంలో పాత ఓటర్ల జాబితాలో పేర్లు ఉన్నవారు సైతం ఈసారి కొత్తగా మార్పు చేసిన ఫారం-18 ద్వారా విధిగా దరఖాస్తు చేసుకోవాలని ఈసీ స్పష్టం చేసింది. దరఖాస్తుతో పాటు అర్హతకు సంబంధించిన ధ్రువీకరించిన సర్టిఫికెట్ల కాపీలను జతచేయాల్సి ఉంటుంది. పట్టభద్రులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని సకాలంలో దరఖాస్తు చేసుకోవాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.        [ graduate mlc elections, telangana voters list, form 18 registration, mlc election schedule, telangana news, graduate voters, Mlc Tinmar Malanna, Telugu one, Telugu News ]
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శాసనసభలో తెలంగాణ భూములపై చేసిన ప్రసంగం ప్రకంపనలు సృష్టించింది. రాజకీయ నాయకులకు భూమి, భారీ ప్రాజెక్టుల్లో కమిషన్లు అనేవి ప్రధాన ఆదాయ వనరులు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ భూమికి సంబంధించిన అక్రమాలు, కబ్జాలు లెక్కకు మించి జరిగాయనే విమర్శలు ఉన్నాయి.  దీనికి సంబంధించి అధికార, ప్రతిపక్ష సభ్యులు పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నారు. బడా రాజకీయ నాయకుల నుంచి గ్రామ స్థాయి రాజకీయ నాయకుల వరకు భూకబ్జాలకు, అక్రమ భూఆక్రమణలకు పాల్పడ్డారన్న ఆరోపణలు ప్రచారంలో ఉన్నాయి.   పోరంబోకు, అటవీ, అసైన్డ్ భూములు ఆక్రమణకు గురయ్యాయి. వాటిని ధరణి ద్వారా న్యాయబద్దత లేదా చట్టబద్ధత కల్పించుకోవడానికి ప్రయత్నించారనే ఆరోపణలు కూడా వున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాటల్లో నిజం వుంది. అయితే, ఇది బిఆర్ఎస్ నాయకులకు మాత్రమే వర్తిస్తుందా, కాంగ్రెస్ పార్టీ నాయకులకు వర్తించదా అనేది ప్రశ్న. అదికారంలో వున్న పార్టీకి భూములను భుక్తం చేసుకునే వెసులుబాటు ఎక్కువగా వుంటుంది. చాలా మంది 1973 నాటి భూమి పరిమితి చట్టం రద్దయిందని అనుకుంటున్నారు. కానీ అది అమలులోనే వుంది. ఉమ్మడి కుటుంబానికి మెట్ట భూమి 52 ఎకరాలు, కొన్ని ప్రత్యేక సందర్భాల్లో 54 ఎకరాలు ఉండవచ్చు. తరి భూమి (ఏడాదికి రెండు పంటలు పండేది) 27 ఎకరాలు వుండవచ్చు. అంతకంటే ఎక్కువగా ఉంటే దాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాల్సి వుంటుంది. ఈ చట్టానికి లోబడి భూమిని కలిగి వుండేలా చాలా మంది జాగ్రత్త పడి వుంటారు. కానీ కొన్ని సందర్భాల్లో అది అతిక్రమణకు గురైంది. భూ పరిమితి చట్టం అమలులో వుందనే విషయం తెలియని ఓ నాయకుడు ఎమ్మెల్యే అభ్యర్థిగా తాను సమర్పించిన అఫిడవిట్‌లో 110 ఎకరాలు ఉన్నట్లు చెప్పుకున్నాడు.  తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అప్పటి టిఆర్ఎస్, ఆ తర్వాతి బిఆర్ఎస్ ప్రభుత్వాలు భూ హక్కుల పాబందిని ధ్వంసం చేశాయి. ఆ విధ్వంసం బహుశా 2018 నుంచి ఎక్కువగా జరుగుతూ వచ్చింది. ఆ ఏడాది నుంచి పహణీ రాయడం ఆపేశారు. పహాణీ అనేది భూ యాజమాన్యాన్ని పక్కా చేస్తుంది. అంటే ఏ భూమి ఎవరి పేరు మీద వుందనే విషయాన్ని అది తేటతెల్లం చేస్తుంది.  ఇది వేర్వేరు సర్వే నెంబర్లలో ఒక వ్యక్తి కలిగి వున్న భూమిని తెలియజేస్తుంది. ఆసామీవారి ఖాతాలు మాయమయ్యాయి.  పట్వారీ వ్యవస్థను ఎన్‌టీ రామారావు ప్రభుత్వం రద్దు చేస్తే, వీఆర్వో వ్యవస్థను కేసీఆర్ ప్రభుత్వం రద్దు చేసింది మస్కూర్ వ్యవస్థను కూడా ఈ ప్రభుత్వం రద్దు చేసింది. దీంతో ఒక గ్రామంలో ఏ భూమి ఎవరి పేరు మీద ఉందనే విషయం తెలియకుండా పోయింది, ఆర్డీవోలకు ఉన్న హక్కులను రద్దు చేసి కలెక్టర్ చేతిలో పెట్టారు. దీంతో భూముల యాజమాన్య హక్కులు తెలుసుకోవడం సమస్యగా తయారైంది. రాత్రికి రాత్రి బలవంతులు భూములను ధరణిలో ఎక్కించుకుని కబ్జాలు చేసిన వైనాలున్నాయనే విషయం ఏ గ్రామానికి వెళ్లినా తెలుస్తుంది. దీంతో గ్రామాల్లో భూ తగాదాలు పెరిగాయి.  కేసీఆర్ ప్రభుత్వం భూములకు సంబంధించి కొత్త పద్ధతి ప్రవేశపెట్టడం వల్ల కూడా భూ యాజమాన్యానికి సంబంధించిన వివరాలు తెలుసుకునే అవకాశం లేకుండా పోయింది. ఎవరైనా తమ భూమి వివరాలను దాచి పెట్టుకునే అవకాశం అది. అంటే ఒక వ్యక్తి తన భూమి వివరాలను రెండో కంటికి కనిపించకుండా దాచి పెట్టుకోవచ్చు  రేవంత్ రెడ్డి భూ వివరాలను బయటపెడతానని చెబుతున్నారు. కేసీఆర్ ఎర్రవెల్లి ఫామ్‌హౌస్ మీద చాలా గట్టి ప్రకటనే చేశారు. దాన్ని అమలు చేస్తారా, లేదా అనేది తర్వాతి విషయం. బీఆర్ఎస్ బడా నేతల భూముల లెక్కలు కూడా చెప్పారు. కాంగ్రెస్ నాయకులు, ఇతర పార్టీల నాయకుల భూముల వివరాలను కూడా బయటపెడతారా, చూడాలి.  మరో విషయం..  చోటా మోటా నాయకులు గ్రామాల్లో వందల ఎకరాలు సంపాదించుకున్న వైనం కూడా వుంది. వాటిని బయటకు తీస్తారా? రేవంత్ రెడ్డి మీద కూడా భూములకు సంబంధించి ఆరోపణలు వున్నాయి. తన విషయాన్ని ఆయన స్పష్టం చేస్తారా? తెలంగాణలో భూమి అనేదే ఇప్పుడు ప్రధానమైన చర్చ. దాని అంతు తేలిస్తే చాలా సమస్యలకు పరిష్కారం లభించవచ్చు. అందుకు రాజకీయ నాయకులు సిద్ధపడుతారా అనేది సందేహం. Telangana Lands, Telangana Politcs, Revanth reddy, KCR, BRS, Dharni, Telugu One
భారతదేశ రాజకీయ చరిత్రలో ఒక సరికొత్త మైలురాయిగా నిలిచిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 76వ జన్మదిన వేడుకలు మరియు ఆయన ప్రజా జీవితంలో అప్రతిహతంగా పాతికేళ్లు  పూర్తి చేసుకున్న సందర్భంగా వారణాసి వేదికగా నెల రోజుల పాటు జరగనున్న  సేవా సంకల్ప అభియాన్ లో  తొలి రోజు గురువారం (సెప్టెంబర్ 17) ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు పాల్గొన్నారు. అలాగే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సహా  పాటు పలువురు అగ్రనేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.    సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 17 వరకు దేశవ్యాప్తంగా ఒక నెల రోజుల పాటు కొనసాగే సేవ మరియు ప్రజా సంక్షేమ కార్యక్రమాలకు  ప్రధాని మోడీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసి నియోజకవర్గం కాశీ నగరంలో  గురువారం (సెప్టెంబర్ 17) శ్రీకారం చుట్టారు. ఈ వేడుకల్లో భాగంగా ప్రధాని మోదీ జన్మస్థలమైన గుజరాత్‌లోని వడ్నగర్ నుండి వారణాసి వరకు  అలాగే వారణాసి నుండి వడ్నగర్ వరకు రెండు భారీ బైక్ ర్యాలీలను అగ్రనేతలు జెండా ఊపి ప్రారంభించారు. ఈ యాత్రలు  10 రాష్ట్రాల గుండా ప్రయాణించి, 193 జిల్లాలు మరియు దాదాపు 1,159 గ్రాగాలను తాకుతూ అక్టోబర్ 7న ముగియనున్నాయి. ఈ బృహత్తర బైక్ ర్యాలీలు మొత్తం 40,000 కిలోమీటర్ల దూరాన్ని కవర్ చేయనుండగా, ఇందులో  వెయ్యి మంది  భాగస్వాములు కావడం విశేషం. ఈ  కార్యక్రమంలో  పాల్గొనేందుకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు విజయవాడ నుండి బయలుదేరి వారణాసి  చేరుకున్నారు. అక్కడ తొలుత ప్రసిద్ధ శ్రీ కాశీ విశ్వనాథుని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం, రుద్రాక్ష ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్‌లో నిర్వహించిన సేవా యాత్ర ప్రారంభ వేడుకల్లో చంద్రబాబు పాల్గొన్నారు. ఇదే సమయంలో గుజరాత్‌లోని వడ్నగర్‌లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్, మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే తదితరులు వ్యతిరేక దిశ నుంచి సాగే బైక్ ర్యాలీని ప్రారంభించారు. ఈ యాత్రల ద్వారా దేశవ్యాప్తంగా ప్రతి గ్రామానికి, ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాలను చేరవేయడంతో పాటు, ప్రజా భాగస్వామ్యం,  సామాజిక బాధ్యత ప్రాముఖ్యతను చాటిచెప్పాలన్నది  లక్ష్యంగా పెట్టుకున్నారు. ఒకవైపు వారణాసిలో కాశీ విశ్వనాథ ధామ్‌లో పవిత్ర జలాలతో జలాభిషేకం చేసేందుకు దేశంలోని వివిధ నదుల నుండి నీటిని సేకరించి ఈ యాత్ర ద్వారా తరలిస్తున్నారు.   నెల రోజుల పాటు సాగే  సేవా సంకల్ప అభియాన్ లో భాగంగా రక్తదాన శిబిరాలు, ఆరోగ్య పరీక్షలు, స్వచ్ఛతా కార్యక్రమాలు, అట్టడుగు స్థాయి లబ్ధిదారుల సన్మానం,  వికసిత్ భారత్-2047 లక్ష్యంగా పలు యువజన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. గ గుజరాత్ ముఖ్యమంత్రిగా ప్రారంభమై, దేశ ప్రధాని స్థాయి వరకు సాగిన మోదీ పరిపాలనా ప్రస్థానాన్ని, సంక్షేమ పాలనను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు ఈ కార్యక్రమాన్ని రూపొందించారు.  [Seva Sankalp Abhiyan, PM Modi birthday, Chandrababu Naidu Varanasi, Yogi Adityanath, Vadnagar Varanasi bike rally, NDA leaders Varanasi, Telugu One]
ALSO ON TELUGUONE N E W S
Nani’s The Paradise is gearing up for a theatrical release on September 24, and the actor has begun the film’s promotional tour with director Srikanth Odela. The duo interacted with the media in Chennai as part of the promotions for the highly anticipated action drama. Speaking about the film, Nani said, “The Paradise is the kind of mass film that I am waiting to watch on the big screen. I love films with a strong emotional core, and even though this film has a lot of action, the mother emotion connects with the audience.” He also praised Anirudh Ravichander’s music and said his song with Kayadu Lohar would be another special attraction. Nani also opened up about his character Jadal and expressed confidence that the role would stay with audiences after the film’s release. “People will identify me as Jadal post release. I am confident that everyone will have a blasting theatrical experience,” he said, while promising an intense and emotional theatrical experience. Srikanth Odela revealed that The Paradise revolves around a revolution and an uprising against oppression, with the story drawing from real incidents he witnessed in his hometown. The director stressed that the film combines a grand revolutionary setting with a strong mother-son emotional core. Produced by Sudhakar Cherukuri, the film also stars Kayadu Lohar, Mohan Babu, Raghav Juyal and Sonali Kulkarni in prominent roles, with Anirudh composing the music. Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them. 
  ఇండియాలోనే మోస్ట్ రాయల్ ఫ్యామిలీ అక్కినేని వారి కోడలి హోదాలో శోభిత ధూళిపాళ్ల అలియాస్ శోభిత అక్కినేని ఎంత సంతోషంగా ఉందో చూస్తూనే ఉన్నాం. పెళ్లి తర్వాత హీరోయిన్ గాను సత్తా చాటుతూ అక్కినేని ఫ్యామిలీతో పాటు అభిమానులని ఆనందానికి గురి చేస్తుంది. రీసెంట్ గా హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్  ఇటీవల ఒక వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేసింది దీంతో ఆ  వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడమే కాకుండా, నటి శోభితా ధూళిపాళ్ల దృష్టిని ఆకర్షించింది. వీడియోపై వెంటనే స్పందించిన శోభిత, అహల్య అభిప్రాయంతో 100 శాతం ఏకీభవిస్తున్నట్లు ఒక ఎమోజీ ద్వారా వ్యక్తపరిచారు. అంతేకాకుండా తన జీవితంలో ఎదురైన చేదు అనుభవాలను, గతాన్ని నెమరువేసుకుంటూ సుదీర్ఘమైన కామెంట్ జతచేశారు. "నేను కేవలం 16 సంవత్సరాల చిన్న వయస్సులోనే నా సంచులు సర్దుకుని విశాఖపట్నం నుండి ముంబైకి పారిపోవాల్సి వచ్చింది. అక్కడ నా భవిష్యత్తుకు ఎలాంటి గ్యారెంటీ లేదు, కానీ నాకంటూ ఒక మంచి అవకాశం దక్కుతుందనే నమ్మకంతో ముందడుగు వేశాను. తెలుగు రాష్ట్రాల్లోని వాతావరణం కలలు కనేవారికి, ముఖ్యంగా ఎలాంటి గాడ్ ఫాదర్ లేకుండా పరిశ్రమలోకి వచ్చే బయటి వ్యక్తులకు తీవ్ర ప్రతికూలంగా మరియు జడ్జిమెంటల్‌గా అనిపించింది. మరీ ముఖ్యంగా ఒక మహిళగా కొత్త రంగానికి రావాలని ప్రయత్నిస్తే, ఆ వివక్ష, ఒత్తిడి రెట్టింపు (డబుల్ డోస్) స్థాయిలో ఉంటుంది. నేను  ముంబై వెళ్లి అనేక కష్టనష్టాల మధ్య  మోడలింగ్ నుండి నేటి అంతర్జాతీయ నటిగా ఎదిగిన ప్రయాణాన్ని ఆమె గుర్తుచేశారు. "అయితే ఇది 10 నుండి 15 ఏళ్ల క్రితం నాటి మాట, కాలంతో పాటు ఇప్పుడు పరిస్థితులు మారాయని భావిస్తున్నాను. మన తెలుగు కమ్యూనిటీలోని ప్రజలు ప్రతిభను గుర్తించి ప్రోత్సహించేందుకు కాస్త ధైర్యం, ఆత్మవిశ్వాసం (గ్రో ఏ స్పైన్ & రెక్కలు) పెంచుకుంటారని ఆశిస్తున్నాను" అని ఆమె పేర్కొన్నారు.     Also Read: కాకాలో అలనాటి స్టార్ హీరోయిన్: భార్యగా అయితే ఇంక కెవ్వుకేకే! ఇంతకీ ఆ ఇన్ఫ్లుయెన్సర్ రిలీజ్ చేసిన వీడియోలో 'ఒక తెలుగు వ్యక్తికి మరొక తెలుగు వ్యక్తే అతిపెద్ద శత్రువు" మన సమాజంలో ఎవరైనా కొత్తగా ఒక వ్యాపారం ప్రారంభించినా, రెస్టారెంట్ తెరిచినా లేదా సరికొత్త ఆలోచనతో ముందుకు వచ్చినా, వారికి ప్రోత్సాహం అందించడానికి బదులుగా అందులో అంత గొప్పదనమేముంది?" అంటూ విమర్శలు గుప్పించడమే ఎక్కువ మంది మొదటి స్పందనగా ఉంటుంది. సినిమా సంస్కృతి, భాషాభిమానం గురించి ఎంతో గొప్పగా మాట్లాడే తెలుగు ప్రజలు, సొంత మనుషులు ఎదుగుతున్నప్పుడు మాత్రం సరైన మద్దతు ఇవ్వడంలో వెనకబడిపోతున్నారని చెప్పుకొచ్చింది.       [Sobhita Dhulipala, Telugu People Are Their Own Enemies, Nagarjuna, NagaChaitanya, Telugu Cinema, Telugu Cinema News, Tollywood, Tollywood News]
సంగీత ప్ర‌పంచంలో త‌న‌కంటూ ప్ర‌త్యేక స్థానాన్ని సంపాదించుకున్న ఎం.ఎస్‌.సుబ్బులక్ష్మి.. అత్యున్న‌త పుర‌స్కారం భార‌త‌ర‌త్న‌తో పాటు ప‌ద్మ‌విభూష‌ణ్‌, ప‌ద్మ‌భూష‌ణ్ అవార్డులు కూడా అందుకున్నారు. ఇవికాక లెక్క‌కు మించిన పుర‌స్కారాలు ఆమెను వ‌రించాయి. ఇదంతా నాణేనికి ఒక‌వైపు మాత్ర‌మే. ఆమె జీవితంలో ఎన్నో క‌ష్టాలు, ఎన్నో ఒడిదుడుకులు ఉన్నాయి. ఇప్పుడు ఆమె జీవితాన్ని తెర‌పై ఆవిష్క‌రించే ప్ర‌య‌త్నం జ‌రుగుతున్న విష‌యం తెలిసిందే. ఎం.ఎస్‌.సుబ్బుల‌క్ష్మి పాత్ర‌లో ర‌ష్మిక మంద‌న్న న‌టించ‌బోతున్నారు. అయితే ఇది సాధార‌ణ సినిమా కాదు. ఎందుకంటే ఆ పాత్ర‌లో ఎన్నో వేరియేష‌న్స్ ఉంటాయి. వాటిని స‌మ‌ర్థ‌వంతంగా అభిన‌యించ‌డం అనేది ఇప్పుడు ర‌ష్మిక మంద‌న్న ముందున్న అతి పెద్ద అగ్ని ప‌రీక్ష‌. అస‌లు ఎం.ఎస్‌.సుబ్బుల‌క్ష్మి జీవిత చ‌రిత్ర ఏమిటి అనేది ఒక‌సారి ప‌రిశీలిస్తే..  ఎం.ఎస్‌.సుబ్బుల‌క్ష్మి పూర్తి పేరు మ‌ధురై షణ్ముఖవడివు సుబ్బలక్ష్మి. ఇంట్లో ఆమెను అంద‌రూ కుంజ‌మ్మ అని పిలిచేవారు. మధురై మీనాక్షి అమ్మవారి ఆలయ సమీపంలో జన్మించిన ఆమె తల్లి షణ్ముఖవడివు వీణా విద్వాంసురాలు, దేవదాసి సంప్రదాయానికి చెందిన ఇసై వెల్లాలర్ కుటుంబానికి చెందినవారు. లీగల్ ఫాదర్‌గా సుబ్రమణ్య అయ్యర్ ఉన్నప్పటికీ, బయలాజికల్ ఫాదర్‌గా పుష్పవనం అయ్యర్ పేరు ప్రచారంలో ఉంది. ఆమె చిన్నతనంలోనే తండ్రి ఆసరా లేని స్థితిని ఈ విష‌యాలు స్పష్టం చేస్తాయి. త‌ల్లే ఆమెకు తొలి గురువై కర్ణాటక సంగీతంలో శిక్షణ ఇచ్చింది. అయితే, కేవలం 13 సంవత్సరాల లేత వయసులోనే ఒక చెట్టియార్‌కు ఎం.ఎస్‌.ను ఇచ్చి పెళ్లి చెయ్యాల‌ని త‌ల్లి నిర్ణ‌యించింది. కానీ, దాన్ని ఆమె వ్య‌తిరేకించారు. ఆనాటి ప్రముఖ విమర్శకుడు వెంకటాచలం వ్యాఖ్యానిస్తూ, పదమూడేళ్ల బాలికలో 30 ఏళ్ల మహిళకు ఉండే ఆత్మస్థైర్యాన్ని, నిశ్చయాన్ని చూశానని కొనియాడారు. 1938లో 'సేవాసదనం' చిత్రంతో వెండితెరకు పరిచయమైన ఆమె శకుంతలై, సావిత్రి, 1945లో వచ్చిన మీరా వంటి చిత్రాల్లో నటించారు. మీరా చిత్ర విజయం ఆమె సినీ ప్రయాణానికి ముగింపు పలికినా, పవిత్రమైన భక్తి సంగీత ప్రపంచానికి మహోన్నత ద్వారాలు తెరిచింది. సుబ్బలక్ష్మి జీవితంలో అత్యంత కీలకమైన మలుపు టి.సదాశివం పరిచయం వ‌ల్ల జ‌రిగింది. ఆనంద వికటన్ ప్రకటనల మేనేజర్‌గా, కల్కి పత్రిక సహ వ్యవస్థాపకుడిగా, స్వాతంత్య్ర‌ సమరయోధుడిగా ఉన్న సదాశివం ఆమె కెరీర్‌ను, జీవితాన్ని ఏకంగా 57 సంవత్సరాల పాటు సానబెట్టి నడిపించారు. అంతకుముందు కర్ణాటక సంగీత విద్వాంసుడు, నటుడు జి.ఎన్. బాలసుబ్రమణ్యంతో ఆమెకు భావోద్వేగ అనుబంధం ఉండేదని, దాదాపు 20 ప్రేమలేఖలు కూడా రాశారని బయోగ్రాఫర్లు పేర్కొన్నారు. అయితే, తన కళకు, సమాజంలో భద్రతకు, దేవుడిలాంటి ప్రతిష్ఠకు సదాశివం అండ అవసరమని గుర్తించి ఆమె ఆయనను వివాహమాడారు. సదాశివం మొదటి భార్య 1938లో మరణించగా, 1940 నుండి 1997లో ఆయన కన్నుమూసే వరకు ఈ దంపతుల బంధం కొనసాగింది. దేవదాసి నేపథ్యం నుండి వచ్చిన ఆమెను సంప్రదాయ బ్రాహ్మణ గృహిణిగా, కంచి పట్టు చీర, పెద్ద బొట్టుతో 'అమ్మ' అనే ఆధ్యాత్మిక బింబంగా మలచడంలో పబ్లిసిటీ నిపుణుడైన సదాశివం వ్యూహాత్మక పాత్ర పోషించారు. తన సొంత పిల్లలు లేకపోయినా, సదాశివం మొదటి భార్య కుమార్తెలైన రాధ, విజయలను ప్రాణంకంటే ఎక్కువగా పెంచారు. ఇందులో రాధ వేదికపై ఆమె వెనకాల వోకల్ సపోర్ట్ ఇస్తూ నీడలా ఉండేది. 1980ల కాలంలో రాధ అకాల మరణం సుబ్బలక్ష్మిని తీవ్ర శోకసంద్రంలో నెట్టివేసింది. సదాశివం కఠినమైన నిబంధనలతో ప్రవర్తించినప్పటికీ, సుబ్బలక్ష్మి స్వర మాధుర్యాన్ని ప్రపంచ వేదికలకు తీసుకెళ్లారు. ఐక్యరాజ్యసమితి (UN General Assembly)లో 1966లో ప్రతిష్ఠాత్మక కచేరీ నిర్వహించిన తొలి భారతీయ సంగీత కళాకారిణిగా ఆమె చరిత్ర సృష్టించారు. 1998లో భారత ప్రభుత్వం ఆమెకు దేశ అత్యున్నత పౌర పురస్కారం 'భారతరత్న' అందించి గౌరవించింది. సంగీత రంగానికి చెందిన కళాకారిణికి భారతరత్న దక్కడం భారతీయ చరిత్రలోనే మొదటిసారి. 1997లో సదాశివం మరణించిన తర్వాత "ఆయన లేని జగత్తులో నేను కచేరీలు చేయలేను" అంటూ ఆమె క‌చేరీలు పూర్తిగా నిలిపివేశారు. చివరకు 2004 సెప్టెంబర్ 16న ఈ గానకోకిల కంఠం మూగ‌బోయింది. కన్నతల్లిని, కన్నవారిని వదిలేసిందని తమ్ముడి నుండి విమర్శలు వచ్చినా, అంతర్గత సంఘర్షణలు, సమాజపు ఆంక్షలు ఎదుర్కొన్నా, ఒక సాధారణ అమ్మాయి జగజ్జేతగా మారిన ఈ ప్రయాణాన్ని విజువల్ కాన్‌ప్లిక్ట్‌తో తెరకెక్కించడమే దర్శకుడు గౌతమ్ తిన్ననూరి ముందున్న అసలైన స‌వాలు కాగా, అంతే భ‌క్తి శ్ర‌ద్ధ‌ల‌తో ఆ పాత్ర‌ను ఆక‌ళింపు చేసుకొని అభిన‌యించ‌డం ర‌ష్మిక ముందు ఉన్న‌ మ‌రో ప‌రీక్ష‌.      [MS Subbulakshmi Biopic, Rashmika Mandanna, Gowtam Tinnanuri, Geetha Arts, MS Subbulakshmi Life Story, Unheard Truths of MS Subbulakshmi]
మెగాస్టార్ చిరంజీవి హీరోగా బింబిసార ఫేమ్ వశిష్ఠ దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్న సోషియో ఫాంటసీ మూవీ 'విశ్వంభర'. జగదేకవీరుడు అతిలోకసుందరి, అంజి సినిమాల తర్వాత చిరంజీవి నటిస్తున్న ఫుల్ లెంగ్త్ సోషియో ఫాంటసీ ప్రాజెక్ట్ కావడంతో ఈ సినిమాపై మొదట్నుంచీ మంచి అంచనాలు ఉన్నాయి. అయితే వీఎఫ్‌ఎక్స్ వర్క్స్ ఆలస్యం, ఓటీటీ డీల్ వంటి కారణాలతో ఈ సినిమా రిలీజ్ ఆలస్యమవుతూ వచ్చింది. తాజాగా 'విశ్వంభర' ఓటీటీ డీల్ క్లోజ్ అయినట్లు తెలుస్తోంది. ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్ వీడియో ఈ సినిమా డిజిటల్ హక్కులను ఏకంగా రూ. 55 కోట్ల ఫ్యాన్సీ రేటుకు దక్కించుకుందని సమాచారం. అయితే ఈ ఓటీటీ డీల్ వెనుక పెద్ద ట్విస్ట్ ఉందట. ఈ సినిమాను రాబోయే సంక్రాంతి రేసులోనే గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల చేస్తామని యూవీ క్రియేషన్స్ అమెజాన్ కు ప్రామిస్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. సంక్రాంతి వంటి పెద్ద పండుగ సీజన్‌లో సినిమా వస్తే మాస్ అండ్ ఫ్యామిలీ ఆడియన్స్ రీచ్ నెక్స్ట్ లెవల్‌లో ఉంటుందని, అందుకే ఈ భారీ మొత్తాన్ని చెల్లించడానికి అమెజాన్ ప్రైమ్ ఒప్పుకుందని అంటున్నారు. కానీ, ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఉంది. చిరంజీవి నటిస్తున్న మరో మూవీ 'కాకా' ఇప్పటికే 2027 సంక్రాంతి సీజన్ పై కర్చీఫ్ వేసింది. 'విశ్వంభర' కోసం సంక్రాంతిని త్యాగం చేసి, సమ్మర్ సీజన్ కు 'కాకా' వెళ్తుందని ప్రచారం జరిగినప్పటికీ.. దానిని కాకా టీమ్ ఖండించింది. ఎట్టి పరిస్థితుల్లో 2027 సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదల చేయనున్నట్లు స్పష్టం చేసింది. దీంతో చిరంజీవి సినిమాలు 'విశ్వంభర', 'కాకా' రెండూ ఒకేసారి విడుదలవుతాయా? అనేది సస్పెన్స్ లా మారింది. మరి విశ్వంభర సంక్రాంతి కండిషన్ నిజమేనా? ఒకవేళ నిజమైతే రెండు సినిమాల మధ్య కనీసం ఒక నాలుగైదు రోజుల గ్యాప్ ఉండేలా ప్లాన్ చేస్తారా? అనేది తెలియాల్సి ఉంది.       [Vishwambhara OTT Deal, Vishwambhara OTT Rights, Vishwambhara Release Date, Vishwambhara vs Kaaka, Megastar Chiranjeevi, Vishwambhara Movie, Telugu Film News, Telugu News]  
  మెగాస్టార్ వన్ మాన్ షో 'కాకా' రిలీజ్ సంక్రాంతికైనా రోజుకొక ఇంట్రెస్టింగ్ న్యూస్ వచ్చి అభిమానులని, సోషల్ మీడియాని పులకరింతలకి గురి చేస్తుంది. స్టిల్ ఇప్పుడు అదే ఆనవాయితీని కంటిన్యూ చేస్తు ఒక ఆసక్తికర న్యూస్ హల్ చల్ చేస్తుంది.  స్నేహ..  హోమ్లీ క్యారెక్టర్లకి కేరాఫ్ అడ్రస్. ఇప్పుడు కాకాలో ఒక ముఖ్యమైన క్యారక్టర్ లో  కనిపించబోతున్నట్టు  సమాచారం. సినీ సర్కిల్స్ లో అయితే చిరంజీవి భార్యగా ఉండబోతనే న్యూస్ కూడా చాలా నమ్మకంగానే తచ్చాడుతు ఉంది.గతంలో ఓ ఇంటర్వ్యూలో స్నేహ మాట్లాడుతూ తన కెరీర్‌లో మెగాస్టార్ చిరంజీవితో ఒక్కసారైనా తెర పంచుకోవాలనేది తన చిరకాల కోరిక అని వెల్లడించారు. నేడు ఆ కల నెరవేరిందని అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. టాలీవుడ్‌లో నాగార్జునతో 'శ్రీరామదాసు', 'రాజన్న', వెంకటేష్‌తో 'సంక్రాంతి', బాలకృష్ణతో 'పాండురంగడు' వంటి సూపర్ హిట్ సినిమాల్లో నటించి ఆకట్టుకున్న స్నేహ.. ఇప్పుడు చిరంజీవితో జతకట్టడం ద్వారా సీనియర్ స్టార్స్ అందరితోనూ నటించిన అరుదైన హీరోయిన్ల జాబితాలో చేరబోతున్నారు. గతంలో సౌందర్య, రమ్యకృష్ణ, మీనా, రోజా, సిమ్రాన్, టబు మాత్రమే టాలీవుడ్ టాప్ 4 స్టార్లతో కలిసి నటించిన ఘనత సాధించారు.    Also Read: ప్రీమియర్ షోలలో 'ది ప్యారడైజ్’రికార్డ్స్.. ఎన్నో తెలిస్తే మీరు షాక్ మరి చిరు తో సెల్యులాయిడ్ ని పంచుకోవడం ఖాయమైతే  ఆ అరుదైన మైలురాయిని అందుకోబోతున్న 7వ కథానాయికగా స్నేహ చరిత్ర సృష్టించినట్టే . జన నాయగన్, టాక్సిక్ ఫేమ్  కె వెంకట్ కె నారాయణ  రాజీ పడకుండా భారీ బడ్జెట్‌తో ఈ కాకాని నిర్మిస్తున్నాడు. వరల్డ్ రిలీజ్ డేట్  2027 జనవరి 13 . వాల్తేరు వీరయ్య బాబీ దర్శకుడు.      [Kaaka, Sneha, Chiranjeevi,  Kaaka Movie Heroins,  Anaswara Rajan, Tollywood Movies Postponed, Telugu Cinema, Telugu Cinema News, Tollywood, Tollywood News]
నాచురల్ స్టార్ నాని ప్రస్తుతం 'యేష నాగుల' సాంగ్స్ తో రికార్డు సృష్టిస్తూ బిజీగా ఉన్నాడు. అభిమానులు అయితే రిలీజ్ రోజు థియేటర్స్ లో 'నాని'లా స్టెప్స్ వేయాలనే ప్రీ ప్రిపరేషన్ లో ఉన్నారు. ఇప్పుడు వాళ్ళ ముందుకు ప్యారడైజ్ సంబంధించిన మరో రికార్డు వచ్చి చేరడంతో వాళ్ళ ఆనందానికి అవధులు లేకుండా పోతున్నాయి. సెప్టెంబర్ 24న రిలీజ్ కాబోతున్న ప్యారడైజ్ ఒక్క రోజు ముందే అంటే సెప్టెంబర్ 23 రాత్రివేళ భారీ ఎత్తున గ్రాండ్ ప్రీమియర్ లతో వస్తున్న విషయం తెలిసిందే.కేవలం రెండు తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ,ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఏకంగా 800లకి పైగా ప్రత్యేక ప్రీమియర్ షోలని ప్రదర్శించబోతుండటం టాలీవుడ్ చరిత్రలోనే ఒక అరుదైన రికార్డుగా నిలవనుంది. ఈ వార్తే నాని అభిమాలని హుషారు అనే వర్డ్ కి సరికొత్త పదాన్ని కనుక్కునే అన్వేషణలో పడేలా చేస్తుంది.ఇక సినిమా ప్రమోషన్ల కోసం చిత్రబృందం 'జడల జమానా షురూ' పేరుతో ఒక గ్రాండ్ ప్రీ-రిలీజ్ టూర్ షెడ్యూల్‌ను కూడా ప్రకటించి సోషల్ మీడియాని  ఊపేస్తోంది.     Also Read: బ్రెయిన్ స్ట్రోక్‌పై పోరాటం చేస్తున్న 'గబ్బర్ సింగ్’రమేశ్: బెడ్ పై ఏ హీరో సాంగ్స్ చూస్తున్నాడో తెలుసా!  విడుదలకు ముందే దేశంలోని ప్రధాన నగరాలైన చెన్నై, బెంగళూరు, కొచ్చి, మరియు హైదరాబాద్‌లలో నేచురల్ స్టార్ నాని స్వయంగా పర్యటిస్తూ ప్రమోషనల్ ఈవెంట్లలో పాల్గొని అభిమానులని నేరుగా కలవనున్నారు. ఇప్పటికే విదేశీ మార్కెట్లలో ముఖ్యంగా ఉత్తర అమెరికాలో అడ్వాన్స్ బుకింగ్స్ శరవేగంగా ప్రారంభమై, స్వల్ప వ్యవధిలోనే $150K మార్కును దాటేసి కొత్త రికార్డులను నమోదు చేస్తోంది.  శ్రీకాంత్ ఓదేల మార్క్ రగ్గడ్ ఇంటెన్సిటీతో రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో నాని 'జడల్' అనే అత్యంత విభిన్నమైన, పవర్‌ఫుల్ మాస్ లుక్‌లో కనిపించబోతున్నారు. ఎస్‌ఎల్‌వి సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తుండగా రాఘవ్ జుయల్, కయాదు లోహర్అ కీ రోల్స్. అనిరుద్  రవిచందర్ మ్యూజిక్. 'A' సర్టిఫికేట్ రావడమే కొంచం ఇబ్బంది. నాని ప్రవాహం  ముందు ఆ సర్టిఫికెట్ ప్రభావం ఉండకపోవచ్చని టాక్.        The Paradise, he Paradise Record Premieres, Nani, kayadu lohar, Jadal Zamana,Tollywood Movies Postponed, Telugu Cinema, Telugu Cinema News, Tollywood, Tollywood News  
'మహానటి', 'సీతారామం', 'లక్కీ భాస్కర్' వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యాడు మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్. ఇప్పుడు ఆయన నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ అండ్ హార్ట్ టచింగ్ డ్రామా 'ఆకాశంలో ఒక తార' సినిమా నుంచి క్రేజీ అప్‌డేట్ వచ్చింది. ఈ చిత్రాన్ని నవంబర్ 20న విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. "ది జర్నీ టు ది స్టార్స్ బిగిన్స్.. ఆకాశంలో ఒక తార నవంబర్ 20న థియేటర్లలోకి వస్తోంది.. ఒక అందమైన ప్రపంచం మీ కోసం వేచి చూస్తోంది" అంటూ విడుదల చేసిన అనౌన్స్‌మెంట్ పోస్టర్ ప్రతీ ఒక్కరినీ ఆకట్టుకుంటోంది. పవన్ సాదినేని ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. వైవిధ్యమైన కథాంశంతో, ఎమోషనల్ అండ్ రొమాంటిక్ రైడ్‌గా రూపొందుతున్న ఈ సినిమాలో దుల్కర్ సరసన సాత్విక వీరవల్లి హీరోయిన్ గా నటిస్తోంది.  స్వప్న సినిమాస్, గీతా ఆర్ట్స్, లైట్‌బాక్స్ మీడియా సంయుక్తంగా ఈ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. స్వప్న సినిమాస్ - దుల్కర్ కాంబినేషన్ అనగానే మనకి 'మహానటి', 'సీతారామం' లాంటి ఆల్ టైమ్ క్లాసిక్స్ గుర్తుకొస్తాయి. ఆ సెంటిమెంట్ కాంబో మళ్లీ రిపీట్ అవుతుండటంతో, ఈ సినిమాతో హ్యాట్రిక్ క్లాసిక్ హిట్ పక్కా అని సినీ ప్రియులు భావిస్తున్నారు. ఇక ఈ చిత్రానికి జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తుండటం విశేషం. తెలుగు, మలయాళం, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో పాన్ ఇండియా లెవల్లో నవంబర్ 20, 2026న రాబోతున్న ఈ 'ఆకాశంలో ఒక తార' బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో చూడాలి.       [Aakasamlo Oka Tara Release Date, Dulquer Salmaan Aakasamlo Oka Tara, Dulquer Salmaan Telugu Movie, Aakasamlo Oka Tara Movie, Dulquer Salmaan, Pavan Sadineni, Swapna Cinema, Telugu Film News, Telugu News]  
  పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుంచి ఇప్పటి వరకు ఎన్ని సినిమాలు వచ్చినా, ఇక ముందు ఎన్ని సినిమాలు వచ్చినా 'గబ్బర్ సింగ్' మానియా మాత్రం నిత్యం రగులుతూనే ఉంటుంది. ఈ సినిమాలో 'అంత్యాక్షరి' సన్నివేశంలో నటించి ‘గబ్బర్ సింగ్’ రమేశ్.గా గుర్తింపు పొందాడు రమేశ్.  కొద్దిరోజుల క్రితం తీవ్రమైన బ్రెయిన్ స్ట్రోక్‌కు గురై అత్యవసర పరిస్థితిలో అపోలో ఆసుపత్రిలో చేరారు. ఆ సమయంలో ఆయన ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉందన్న వార్త విని సినీ వర్గాలు, పవన్ కల్యాణ్ అభిమానులు, ప్రేక్షకులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.  వైద్యుల నిరంతర పర్యవేక్షణ, శస్త్రచికిత్స మరియు మెరుగైన వైద్య సేవలు ఫలించడంతో రమేశ్ ప్రస్తుతం బ్రెయిన్ స్ట్రోక్ నుంచి క్రమంగా కోలుకుంటున్నారు. ఈ కష్టకాలంలో ఆయనలో మానసిక స్థైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని నింపేందుకు కుటుంబ సభ్యులు ఎంతో శ్రమిస్తున్నారు. ఆసుపత్రి బెడ్‌పైన ఉన్న రమేశ్‌కు ఆయనకు ఎంతో ఇష్టమైన పవన్ కల్యాణ్ సినిమాలను, అలాగే ‘గబ్బర్ సింగ్’ చిత్రంలోని అంత్యాక్షరి సీన్లను టీవీలో చూపిస్తూ నిత్యం ఉత్సాహపరుస్తున్నారు. ఈ క్రమంలో టీవీలో వచ్చే పాటలను చూస్తూ ఆయన సరదాగా పాడుతున్న ఓ భావోద్వేగమైన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.     Also Read: బెడ్‌రూమ్ సీన్లలో హీరోల స్పర్శ తగలకుండా ఆ 'బాల్‌'తోనే.. బోల్డ్ సీన్స్ గుట్టు విప్పిన హీరోయిన్!  రమేశ్ అనారోగ్యానికి గురైన విషయం తెలిసిన వెంటనే టాలీవుడ్‌కి చెందిన పలువురు ప్రముఖులు, సహ నటులు, దర్శకులు మరియు మెగా కుటుంబ సభ్యులు తక్షణమే స్పందించారు. మెగాస్టార్ చిరంజీవి మరియు నాగబాబు రమేష్ కుటుంబానికి 5 లక్షల మేర ఆర్థిక సాయం ప్రకటించడమే కాకుండా లక్షల ఖరీదైన ట్రీట్ మెంట్ ని కూడా అపోలోలో ఫ్రీగా ఇప్పించారు. వీడియో చూసిన అభిమానులు సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ 'రమేష్ త్వరగా సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకుని, మళ్లీ పూర్వవైభవం సంతరించుకుని వెండితెరపై నవ్వులు పూయించాలని  ‘గెట్ వెల్ సూన్ రమేశ్’ అంటూ కామెంట్స్ తో సోషల్ మీడియాకి కూడా మానవత్వం పీక్ లో ఉంటుందని నిరూపిస్తున్నారు.     [Gabbari Sing, Pawan kalyan, Gabbar Singh Actor Ramesh Brain Stroke Recovery, Chiranjeevi, Tollywood Movies Postponed, Telugu Cinema, Telugu Cinema News, Tollywood, Tollywood News]
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో వస్తున్న మూవీ 'డ్రాగన్'. మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ కలిసి భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని 2027 జూన్ 11న విడుదల చేస్తామని మేకర్స్ ఇదివరకే అధికారికంగా ప్రకటించారు. కానీ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వార్త ఎన్టీఆర్ అభిమానులకు తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.  ఇటీవల ఎన్టీఆర్ చేతికి గాయం కావడం, దానికి సర్జరీ జరగడంతో ఆయన కొంతకాలం పాటు విశ్రాంతి తీసుకోవాల్సి వచ్చింది. దాంతో ప్లాన్ చేసిన కీలక షూటింగ్ షెడ్యూల్స్ ఆలస్యమయ్యాయి. ఎన్టీఆర్‌తో పాటు ఇతర ప్రధాన నటీనటులు నటించాల్సిన కాంబినేషన్ సీన్స్ చాలావరకు పెండింగ్‌లో పడిపోయాయి. ఇప్పుడు వారందరి డేట్స్‌ను మళ్లీ అడ్జస్ట్ చేస్తూ కొత్త షెడ్యూల్స్ ప్లాన్ చేయడం ప్రశాంత్ నీల్‌కి పెద్ద ఛాలెంజ్‌గా మారింది. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ మేకింగ్ స్టైల్ ఎలా ఉంటుందో తెలిసిందే. ఆయన ప్రతి సీన్‌లోనూ, ప్రతీ ఫ్రేమ్ లోనూ క్వాలిటీ విషయంలో అస్సలు రాజీపడరు. పైగా, షూటింగ్ పూర్తి కావడం ఒకెత్తయితే.. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కోసం నెలల తరబడి సమయం పడుతుంది. అనుకున్నట్టుగా జూన్ 11న సినిమా రావాలంటే, వచ్చే ఫిబ్రవరి నాటికే టోటల్ టాకీ పార్ట్ కంప్లీట్ కావాలి. కానీ ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే అది కష్టంగా కనిపిస్తోంది. ఒకవేళ షూటింగ్ ఆలస్యమైతే.. 2027 దసరాకు సినిమాను తీసుకొచ్చే ఆలోచనలో మేకర్స్ ఉన్నారట. మరి ఈ ప్రచారంలో నిజమెంత అనేది తెలియాల్సి ఉంది.       [NTR Dragon Release Date, NTR Dragon Postponed, Dragon 2027 Dasara Release, NTR Dragon Movie, Jr NTR, Prashanth Neel, Telugu Film News, Telugu News]  
  జోనర్ ఏదైనా సరే ;బోల్డ్ సీన్స్' కి కూడా ఫ్యాన్స్, డై హార్డ్ ఫ్యాన్స్ ఉంటారనేది సినీ సత్యం. పైగా రిపీట్ ఆడియన్స్ కూడా ఉంటారు. కానీ వాళ్ళని బాధకి గురి చేసే అంశం ఏంటంటే బోల్డ్ మరియు రొమాంటిక్ సీన్లు అనేవి చాలా వరకు సహజంగా క్రికరించినవి కావు. సినిమాలైనా వెబ్ సిరీస్‌లైనా అదే బాపతు.  వీటిపై చాలా వివరంగా ప్రముఖ హాలీవుడ్ నటి సారా షాహీ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో  వెల్లడి  చేసి ప్రపంచవ్యాప్తంగా సినీ అభిమానులని ఆశ్చర్యపరిచింది. ముఖ్యంగా నెట్‌ఫ్లిక్స్‌లో విపరీతమైన ప్రజాదరణ పొందిన 'సెక్స్/లైఫ్' (Sex/Life) వంటి సిరీస్‌లలో ధైర్యంగా నటించిన సారా, బెడ్‌రూమ్ సన్నివేశాల్లో హీరోలు లేదా సహ నటుల శరీర స్పర్శ లేకుండా సీన్లు ఎలా రికార్డ్ చేస్తారో వివరంగా వెల్లడించింది.  ఆమె మాట్లాడుతు హాలీవుడ్‌లో రొమాంటిక్, బోల్డ్ సీన్లు చిత్రీకరించేటప్పుడు నటీనటులు మానసికంగా, శారీరకంగా ఎలాంటి అసౌకర్యానికి గురికాకుండా ఉండేందుకు ఒక ప్రత్యేకమైన ట్రిక్ ఉపయోగిస్తారట. షూటింగ్ సమయంలో ఇద్దరి నటుల మధ్య గాలి తీసేసిన ఒక చిన్న ప్లాస్టిక్ 'యోగా బాల్', లేదా యోగా డిస్క్ బాల్‌ ఉంచుతారు. కెమెరా ముందుకు వచ్చి సీన్‌లో ఇన్వాల్వ్ అయ్యే సమయంలో నటుడు కేవలం ఆ యోగా బాల్‌ను మాత్రమే స్పర్శిస్తాడు. దీనివల్ల ఎదుటి నటి శరీరానికి నేరుగా నటుడి స్పర్శ తగలదు. "నాకు కేవలం ఆ సాఫ్ట్ బాల్ ప్రెజర్ లేదా ఇంపాక్ట్ మాత్రమే అనిపిస్తుంది, అంతే తప్ప ఎదుటి నటుడి శరీర స్పర్శ నా చర్మానికి ఏమాత్రం తగలదు" అని సారా స్పష్టం చేశారు. ఈ వినూత్నమైన పద్ధతి వల్ల నటీనటులకు సెట్‌లో పూర్తి రక్షణ మరియు పని చేయడానికి అవసరమైన స్వేచ్ఛ లభిస్తుంది. కెమెరా ముందు అసౌకర్యంగా భావించే అనవసర శారీరక స్పర్శలు లేకుండా, తమ పరిమితులకు లోబడి చాలా ప్రొఫెషనల్‌గా సురక్షితంగా నటించే వెసులుబాటు ఈ యోగా బాల్ ట్రిక్ ఇస్తుందని ఆమె పేర్కొన్నారు. అయితే, తెరపై చూసే ప్రేక్షకులకు మాత్రం వాస్తవంగానే రొమాన్స్ చేస్తున్నట్లు కనిపించడం హాలీవుడ్ మేకర్స్ సాంకేతిక నైపుణ్యానికి నిదర్శనం.   Also Read: Ramayana: 'రామాయణ' పార్ట్ 1 :ప్రపంచంలోనే ముందుగా ఈ దేశంలో విడుదల..అక్కడే ఎందుకు! ఇంతేకాకుండా, ఇటువంటి క్లిష్టమైన ఇంటిమేట్ సన్నివేశాల షూటింగ్ సమయంలో దాదాపు 3 నుంచి 4 గంటల సమయం కేటాయించి ప్రోస్టెటిక్స్ కూడా ఉపయోగిస్తారని సారా గతంలో వెల్లడించారు. 8 ఎపిసోడ్లు ఉన్న సిరీస్‌లలో నటీనటులు పూర్తిగా సౌకర్యవంతంగా ఉండేందుకు ప్రొడక్షన్ బృందం ఇన్టిమసీ కోఆర్డినేటర్లను (Intimacy Coordinators) నియమిస్తుందనేది సినీ వర్గాల సమాచారం. ఏది ఏమైనా ఈ మాటలన్నీ బోల్డ్ సీన్స్, రొమాంటిక్ సీన్స్ ఇష్టపడే వాళ్ళు అసలు పట్టించుకోరు. అసలు విన్నట్టుగానే ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి కావాల్సింది తమ కంటికి ఏం కనపడుతుందని మాత్రమే. అందుకే ఆ జోనర్ సినిమాలకి నైట్ విహంగులు ఎక్కువ.      [Sarah Shahi, Yoga Ball Secret, Hollywood intimate scenes , Sex Life Netflix, Tollywood Movies Postponed, Telugu Cinema, Telugu Cinema News, Tollywood, Tollywood News]  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఆ ఒపీనియన్ పోల్ ఫలితాలు నిజంగా నిజం అయితే, కేరళలో మళ్ళీ సీపీఎం సారధ్యంలోని వామపక్ష కూటమి అధికారంలోకి వస్తుంది. ఇదే ఆ అద్భుతం. ఎందుకంటే, గత నాలుగు దశాబ్దాలలో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే కూటమి వరసగా రెండవసారి అధికారంలోకి వచ్చిన చరిత్ర లేనే లేదు. ఒక సారి ఎల్డీఎఫ్ అధికారంలోకి వస్తే ఐదేళ్ళ తర్వాత కాంగ్రెస్ సారధ్యంలోని ఐక్య ప్రజాస్వామ్య కూటమి(యూడీఎఫ్) అధికారంలోకి రావడం, దేవభుమిలో దైవ నిర్ణయమా అన్నట్లుగా ప్రతి ఎన్నికల్లోనూ అధికారం చేతులు మారుతూ వస్తోంది. అలాంటిది, ఈసారి ఒపీనియన్ పోల్స్ నిజమై వరసగా రెండవసారి వామపక్ష కూటమి అధికారంలోకి వస్తే, అది చరిత్రే అవుతుంది. ఇక ఒపీనియన్ పోల్స్ విషయానికి వస్తే, జాతీయ న్యూస్ ఛానెల్ ఏబీపీ, సీ ఓటర్ సంస్థలు సంయుక్తంగా ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఈ సర్వే ప్రకారం, 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో వామపక్ష కూటమికి 83 నుంచి  91 స్థానాలు, యూడీఎఫ్ కూటమికి 47 నుంచి 55 స్థానాలు మాత్రమే దక్కుతాయని తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో ఇలా జాతకాలు తిరగబడడంపై సోషల్ మీడియాలో,’లెగ్ మహిమ’ లాంటి జోక్స్  ట్రోలవుతున్నాయి. అయితే 2016లో జరిగిన ఎన్నికల్లో కేవలం 47 సీట్లకే పరిమితం అయిన కాంగ్రెస్’కు ఈసారి ఒకటీ అరా సీట్లు ఎక్కువస్తే, రావచ్చును. అదే కాంగ్రెస్’కు కాసింత ఊరట. అదలా ఉంటే, పశ్చిమ బెంగాల్లో సైతం పట్టు సాధించిన బీజేపే, కేరళలో మాత్రం పట్టు కాదు కదా, పట్టుమని పది సీట్లు తెచ్చుకునే స్థితిలో లేదు. నిజానికి, దేశంలో బీజేపీకి అసలు ఏ మాత్రం మింగుడు పడని రాష్ట్రాలు ఎవైన ఉన్నాయంటే కేరళ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల  పేర్లే ప్రముఖంగా వినిపిస్తాయి. ఈ సారి కూడా కమల దళం కేరళలో కాలు పెట్టె పరిస్తి లేదని సర్వే ఫలితాలు చెపుతున్నారు. ఎప్పటిలానే ఇప్పడు కూడా  బీజేపీకి సున్నా నుంచి రెండు సీట్లు వచ్చే అవకాశం ఉందని, సర్వేస్వరుల అభిప్రాయంగా ఉంది. కేరళలో మొత్తం 140 స్థానాలకు ఏప్రిల్ 6 తేదీన ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది. మే 2 తేదీన ఫలితాలు వెలువడతాయి. కేరళ ఎలక్షన్ పై యావత్ దేశం ఆసక్తి కనబరుస్తోంది.    
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఓటరు తీర్పుకు వెళుతున్నా, అందరి దృష్టి, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల ఏలుబడిలో ఉన్న ఉభయ తెలుగు రాష్ట్రాలు, మరీ ముఖ్యంగా ఇప్పటికే బీజేపీ కన్నుపడిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీల దుష్టి  మాత్రం పశ్చిమ బెంగాల్ పైనే వుంది.  పశ్చిమ బెంగాల్లో ‘అద్భుతం’ జరిగి బీజేపీ విజయం సాధిస్తే, ఇక  కమల దళం ఫోకస్, తెలంగాణకు షిఫ్ట్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఈ నేపధ్యంలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయంలో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. బెంగాల్లో బీజేపీ గెలిస్తే, ఇప్పటికే అంతర్గత కుటుంబ కలహాలతో సతమతవుతున్న తెరాస నాయకత్వానికి మరిన్నితిప్పలు తప్పవన్న మాట అంతఃపుర వర్గాలలో సైతం వినవస్తోంది.  పశ్చిమ బెంగాల్’లో ఎలాగైతే కమలదళం ఓ వంక తమ ట్రేడ్ మార్క్, హిందుత్వ రాజకీయాలు సాగిస్తూ, మరో వైపు నుంచి ‘ఆకర్ష్’ అస్త్రంతో అధికార పార్టీని నిర్వీర్యం చేసిన విధంగానే, ఇక్కడ కూడా ఫిరాయింపులను ప్రోత్సహింఛి పార్టీని నిట్టనిలువునా చీల్చే ప్రమాదాన్ని కొట్టివేయలేమని పార్టీ వర్గాలు కూడా అనుమానం వ్యక్త పరుస్తున్నాయి.  ఇప్పటికే తెలంగాణ  బీజేపీ నాయకులు 30 మంది తెరాస ఎమ్మెల్యేలు తమ టచ్ లో ఉన్నారని బెదిరిస్తున్నారు.అది నిజం అయినా కాకపోయినా..తెరాసలో అసంతృప్తి అగ్గి రగులుతోందనేది మాత్రం ఎవరూ కాదనలేని నిజం. అంతే కాకుండా రాష్ట్రానికి వచ్చిన కేంద్రనాయకులు ఎవరిని పలకరించినా, నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని ఎలాంటి సషబిషలు లేకుండా కుండబద్దలు కొడుతున్నారు.అందుకే, బెంగాల్లో బీజేపీ గెలిస్తే.. అనే ఊహా కూడా  గులాబీ గూటిలో గుబులు పుట్టిస్తోంది. అయితే, బెగాల్’లో బీజేపీ గెలిస్తే ఒక్క తెలంగాణలోనే కాదు, దేశ రాజకీయ వాతావరణంలోనే పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  అలాగే,  దేశ ముఖ చిత్రంలో కూడా పెను మార్పులు తప్పవని అంటున్నారు. అయితే రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరూహించెదరు..
మన ఆరోగ్య సంరక్షణలో పీచు పదార్థం లేదా ఫైబర్ (Fiber) పాత్ర ఎంత కీలకమైనదో అందరికీ తెలిసిందే. జీర్ణక్రియ మెరుగుపడాలన్నా, మలబద్ధకం సమస్య దూరమవ్వాలన్నా, బరువు అదుపులో ఉండాలన్నా ప్రతీ ఒక్కరూ ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారాలు తీసుకోమని సలహా ఇస్తుంటారు. కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు, చిరుధాన్యాలు మరియు పప్పుధాన్యాలలో లభించే ఈ పీచు పదార్థం పేగులలోని మంచి బాక్టీరియాకు ఆహారంగా పనిచేసి పొట్ట ఆరోగ్యాన్ని కాపాడుతుంది. అయితే, ఏదైనా అతిగా తింటే అమృతమైనా విషమవుతుందనే నానుడి ఫైబర్ విషయంలోనూ నూటికి నూరు శాతం వర్తిస్తుంది. ఫైబర్ ఆరోగ్యానికి మంచిదే కదా అని మోతాదుకు మించి ఎక్కువగా తీసుకోవడం వల్ల పేగుల ఆరోగ్యం బాగుపడటానికి బదులుగా తీవ్రంగా పాడయ్యే ప్రమాదం ఉందని పోషకాహార నిపుణులు మరియు గ్యాస్ట్రోఎంటరాలజిస్టులు తీవ్రంగా హెచ్చరిస్తున్నారు. సాధారణంగా ఒక ఆరోగ్యవంతమైన మానవ శరీరానికి రోజువారీగా సుమారు 25 నుండి 30 గ్రాముల ఫైబర్ మాత్రమే అవసరమవుతుంది. కానీ చాలామంది బరువు వేగంగా తగ్గాలనే ఉద్దేశంతో లేదా జీర్ణ సమస్యల నుండి త్వరగా ఉపశమనం పొందాలని ఒక్కసారిగా తమ ఆహారంలో ఫైబర్ పరిమాణాన్ని 50 నుండి 60 గ్రాములకు పైగా పెంచేస్తుంటారు. ఇలా హఠాత్తుగా లేదా అతిగా పీచు పదార్థాన్ని తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థపై విపరీతమైన భారం పడుతుంది. మన పేగుల్లో ఉండే బాక్టీరియా ఈ అధిక ఫైబర్‌ను వేగంగా ఫర్మెంటేషన్ (కిణ్వ ప్రక్రియ) చేయడం ప్రారంభిస్తుంది. దీని ఫలితంగా కడుపులో విపరీతమైన గ్యాస్ తయారవ్వడం, కడుపు ఉబ్బరంగా అనిపించడం, కడుపులో తీవ్రమైన నొప్పి మరియు అసౌకర్యం వంటి సమస్యలు వెంట వెంటనే తలెత్తుతాయి. అంతేకాకుండా, పరిమితికి మించిన ఫైబర్ తీసుకోవడం వల్ల విరోచనాలు (Diarrhea) లేదా కొందరిలో విరుద్ధంగా మరింత తీవ్రమైన మలబద్ధకం (Constipation) ఏర్పడే అవకాశం ఉంది. మనం తినే ఫైబర్ సరిగ్గా జీర్ణం కావాలంటే శరీరానికి తగినంత నీరు అత్యంత అవసరం. శరీరం లోపల నీటి శాతం తక్కువగా ఉండి, ఫైబర్ మాత్రమే ఎక్కువగా తీసుకుంటే, ఆ పీచు పదార్థం పేగుల్లోని నీటిని పీల్చేసుకుని గట్టిపడిపోతుంది. దీనివల్ల ఆహారం పేగుల్లో ముందుకు కదలకుండా అడ్డుపడి మలబద్ధకాన్ని మరింత క్లిష్టం చేస్తుంది. ఇది క్రమంగా కడుపులో తీవ్రమైన తిమ్మిర్లు మరియు పేగులలో వాపునకు దారితీస్తుంది. అధిక ఫైబర్ వల్ల మరొక ప్రధానమైన ముప్పు ఏమిటంటే పోషకాల లోపం. మనం తీసుకునే ఆహారంలో పీచు పదార్థం మోతాదుకు మించి ఉంటే, అది శరీరంలో కీలకమైన కాల్షియం, ఐరన్, జింక్ మరియు మెగ్నీషియం వంటి ఖనిజాలను పేగులు పీల్చుకోకుండా అడ్డుకుంటుంది. ఫైబర్ ఈ ఖనిజాలతో బంధాన్ని ఏర్పరచుకుని, అవి శరీరానికి అందకుండానే మలం ద్వారా బయటకు పంపేస్తుంది. ఫలితంగా దీర్ఘకాలంలో రక్తహీనత (Anemia) మరియు ఎముకల బలహీనత వంటి సమస్యలు తలెత్తుతాయి. కాబట్టి రోజువారీ డైట్‌లో ఫైబర్‌ను ఒక్కసారిగా కాకుండా క్రమక్రమంగా పెంచుకోవాలి. ప్రతిరోజూ కనీసం 2.5 నుండి 3 లీటర్ల నీరు తాగుతూ, శరీరానికి సరిపడా సమతుల్య ఆహారాన్ని మాత్రమే తీసుకోవడం ద్వారా పొట్టను, పేగులను ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు.     [ Fiber, High Fiber Diet, Digestive Health, Constipation, Diarrhea, Gut Health, Bloating, Hydration, Nutrient Deficiency, Healthy Diet ]
నేటి వేగవంతమైన జీవనశైలి మరియు మార్పుచెందిన ఆహార అలవాట్ల కారణంగా మధుమేహం లేదా టైప్ 2 డయాబెటిస్ అనేది ప్రతి ఇంటా సాధారణ సమస్యగా మారిపోయింది. రక్తంలో చక్కెర స్థాయిలు ఎప్పుడు ఏ విధంగా పెరుగుతాయో తెలియక చాలామంది ప్రతిరోజూ ఆందోళన చెందుతుంటారు. ముఖ్యంగా ఉదయం పూట తినే అల్పాహారం లేదా బ్రేక్‌ఫాస్ట్ మన రోజంతా ఉండే బ్లడ్ షుగర్ లెవెల్స్‌ను నేరుగా ప్రభావితం చేస్తుంది. ఉదయాన్నే మైదా, ప్రాసెస్ చేసిన పిండి వంటకాలు లేదా అధిక కార్బోహైడ్రేట్లు ఉండే ఆహారాలు తీసుకోవడం వల్ల రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు ఒక్కసారిగా స్పైక్ అవుతాయి. ఇలాంటి సమయంలో శరీరానికి అవసరమైన పోషకాలను అందిస్తూ, బ్లడ్ షుగర్ లెవెల్స్‌ను స్థిరంగా ఉంచే ఆరోగ్యకరమైన టిఫిన్ ఎంచుకోవడం అత్యంత ఆవశ్యకం. మధుమేహ బాధితులకు దివ్యౌషధంగా పనిచేసే అలాంటి ఒక అద్భుతమైన సాంప్రదాయక ఉదయపు ఆహారమే జొన్న మెంతి పరోటా (Jowar Methi Paratha). జొన్నలు మరియు మెంతులు రెండూ కూడా ఆయుర్వేదంలో మరియు ఆధునిక పోషకాహార శాస్త్రంలో అత్యుత్తమ ఆహారాలుగా గుర్తించబడ్డాయి. సాధారణంగా మనం తినే గోధుమలు లేదా బియ్యంతో పోలిస్తే జొన్నలలో గ్లైసీమిక్ ఇండెక్స్ (GI) చాలా తక్కువగా ఉంటుంది. జొన్నల పిండిని ఆహారంగా తీసుకున్నప్పుడు అది శరీరంలో చాలా నెమ్మదిగా జీర్ణమవుతుంది. దీనివల్ల రక్తంలోకి గ్లూకోజ్ ఒక్కసారిగా విడుదల కాకుండా క్రమంగా విడుదలవుతుంది. తద్వారా ఇన్సులిన్ స్థాయిలు అకస్మాత్తుగా పెరగకుండా అదుపులో ఉంటాయి. అంతేకాకుండా జొన్నలలో పుష్కలంగా ఉండే డైటరీ ఫైబర్ లేదా పీచు పదార్థం జీర్ణ వ్యవస్థను మెరుగుపరచి, ఎక్కువ సేపు కడుపు నిండిన భావనను కలిగిస్తుంది. ఇది పదే పదే ఆకలి వేయకుండా ఆపుతుంది, తద్వారా బరువు పెరగకుండా సమర్థవంతంగా అదుపు చేయవచ్చు. ఇక ఈ పరోటాలో ఉపయోగించే మరో ముఖ్యమైన దినుసు మెంతి ఆకులు. మెంతి ఆకులలో లభించే విశిష్టమైన గెలాక్టోమన్నన్ అనే పీచు పదార్థం మరియు అమైనో ఆమ్లాలు శరీరంలో ఇన్సులిన్ సున్నితత్వాన్ని (Insulin Sensitivity) పెంచుతాయి. మెంతి ఆకులు రక్తంలోని గ్లూకోజ్ శోషణను నెమ్మదింపజేసి డయాబెటిస్ నియంత్రణలో కీలక పాత్ర పోషిస్తాయి. జొన్న పిండికి సన్నగా తరిగిన పచ్చి మెంతి ఆకులు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి ముక్కలు, వాము మరియు తగినంత ఉప్పు కలిపి కొద్దిగా గోరువెచ్చని నీటితో సాఫ్ట్‌గా కలుపుకోవాలి. జొన్న పిండిలో గ్లూటెన్ ఉండదు కాబట్టి రొట్టెలు చేయడం కొద్దిగా కష్టంగా అనిపించినా, కొద్దిపాటి నూనె లేదా నెయ్యి రాసి నిదానంగా ఒత్తి పెనంపై కాల్చుకోవాలి. ఈ జొన్న మెంతి పరోటాను ప్రతిరోజూ ఉదయం టిఫిన్‌గా తీసుకోవడం వల్ల కేవలం షుగర్ లెవెల్స్ అదుపులో ఉండటమే కాకుండా, శరీరానికి అవసరమైన ప్రోటీన్, కాల్షియం, ఐరన్ మరియు విటమిన్లు సమృద్ధిగా లభిస్తాయి. ముఖ్యంగా ఇందులో ఉండే ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు మరియు యాంటీ ఆక్సిడెంట్లు చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి. నిత్యం బిపి, షుగర్ సమస్యలతో బాధపడేవారు మరియు బరువు తగ్గాలనుకునే వారు తమ రోజువారీ ఉదయపు ఆహారంలో ఒకట్రెండు జొన్న మెంతి పరోటాలను పెరుగు లేదా పుదీనా చట్నీతో కలిపి తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. సంపూర్ణ ఆరోగ్యం కోసం ఈ రుచికరమైన, పోషకాల గని వంటి బ్రేక్‌ఫాస్ట్‌ను మీ ఆహారంలో భాగం చేసుకోండి.     [ Jowar Methi Paratha, Diabetes, Type 2 Diabetes, Blood Sugar, Jowar, Methi Leaves, Low GI Foods, Dietary Fiber, Insulin Sensitivity, Healthy Breakfast ]  
వయస్సు పెరుగుతున్న కొద్దీ లేదా మారుతున్న జీవనశైలి కారణంగా మన శరీరంలో వచ్చే అత్యంత ప్రధానమైన మార్పు ఎముకల బలహీనత. చిన్న వయస్సులోనే కీళ్ల నొప్పులు రావడం, కొద్దిపాటి దెబ్బలకే ఎముకలు విరగడం లేదా అరిగిపోవడం వంటి సమస్యలు నేడు చాలామందిని వేధిస్తున్నాయి. సాధారణంగా ఎముకల ఆరోగ్యం అనగానే మనకు వెంటనే గుర్తుకువచ్చేది పాలు మరియు పాల ఉత్పత్తులు మాత్రమే. కానీ మన ఇంట్లోనే లభించే కొన్ని సంప్రదాయ మరియు సహజ సిద్ధమైన ఆహార పదార్థాలు పాలకంటే అత్యంత శక్తివంతంగా ఎముకలను దృఢపరచగలవని ఆరోగ్య నిపుణులు వెల్లడిస్తున్నారు. ముఖ్యంగా నల్ల నువ్వులు, పొన్నగంటి కూర, తోటకూర మరియు రాగులు వంటి పదార్థాలలో లభించే కాల్షియం, మెగ్నీషియం, భాస్వరం మరియు విటమిన్లు మన ఎముకల సాంద్రతను (Bone Density) ఊహించని రీతిలో పెంచి, వాటిని ఉక్కులా బలంగా మారుస్తాయి. నల్ల నువ్వులు (Black Sesame Seeds) ఎముకల ఆరోగ్యానికి ఒక గొప్ప నిధి లాంటివి. వీటిలో సాధారణ తెల్ల నువ్వుల కంటే అత్యధిక పరిమాణంలో కాల్షియం మరియు యాంటీఆక్సిడెంట్లు లభిస్తాయి. కేవలం వంద గ్రాముల నల్ల నువ్వులను తీసుకుంటే దాదాపు 1450 మిల్లీగ్రాముల వరకు ఉపాధి కలిగించే కాల్షియం శరీరానికి అందుతుంది. ఇది మనం రోజువారీ తాగే ఒక గ్లాసు పాలలో లభించే కాల్షియం కంటే దాదాపు ఐదు రెట్లు ఎక్కువ కావడం విశేషం. అంతేకాకుండా, వీటిలోని జింక్ మరియు రాగి (Copper) కండరాలు, ఎముకల అనుసంధాన కణజాలాన్ని బలోపేతం చేస్తాయి. క్రమం తప్పకుండా ప్రతిరోజూ ఒక స్పూన్ వేయించిన నల్ల నువ్వులను లేదా నువ్వుల లడ్డును ఆహారంలో చేర్చుకోవడం వల్ల ఆస్టియోపోరోసిస్ (Osteoporosis) వంటి తీవ్రమైన ఎముకల వ్యాధులు రాకుండా అరికట్టవచ్చని వైద్యులు సూచిస్తున్నారు. ఆకుకూరల విషయానికి వస్తే పొన్నగంటి కూర మరియు తోటకూర ఎముకల బలానికి అద్భుతంగా తోడ్పడతాయి. పొన్నగంటి కూరలో కాల్షియంతో పాటు విటమిన్ ఎ, విటమిన్ సి మరియు పీచు పదార్థాలు పుష్కలంగా ఉంటాయి. ఇది ఎముకల అరుగుదలను నివారించడమే కాకుండా, కీళ్ల మధ్య ఉండే సైనోవియల్ ద్రవం ఇంకిపోకుండా కాపాడుతుంది. మరొకవైపు, తోటకూర (Amaranth Leaves) అత్యధిక కాల్షియం మరియు మెగ్నీషియం కలిగిన ఆకుకూరగా పేరుగాంచింది. వంద గ్రాముల తోటకూరలో సుమారు 330 మిల్లీగ్రాముల కాల్షియం ఉంటుంది. ఇది శరీరంలో ఎముకల నిర్మాణికి అవసరమైన ఆస్టియోబ్లాస్ట్ కణాల ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది. వారానికి రెండు లేదా మూడు సార్లు ఈ ఆకుకూరలను పప్పు లేదా వేపుడు రూపంలో తీసుకోవడం వల్ల ఎముకల మాతృక (Bone Matrix) ఎంతో దృఢపడుతుంది. వీటితో పాటు మన సంప్రదాయ చిరుధాన్యమైన రాగులు (Ragi/Finger Millet) ఎముకల ఆరోగ్యానికి ఒక పవర్‌హౌస్‌గా పనిచేస్తాయి. శాకాహార ఆహారాలలో రాగులలో ఉన్నంత కాల్షియం మరే ఇతర ధాన్యంలోనూ లభించదు. ప్రతి వంద గ్రాముల రాగులలో దాదాపు 344 మిల్లీగ్రాముల సులభంగా జీర్ణమయ్యే కాల్షియం నిండి ఉంటుంది. ప్రతిరోజూ ఉదయాన్నే రాగి జావ తాగడం లేదా రాగి సంకటి, రాగి రొట్టెలు తీసుకోవడం వల్ల ఎముకల సాంద్రత క్రమంగా పెరుగుతుంది. చిన్నపిల్లల పెరుగుదలకు, గర్భిణులకు మరియు రుతుస్రావం ముగిసిన (Menopause) మహిళలకు ఎముకలు బలహీనపడకుండా ఉండటానికి రాగులు ఎంతో మేలు చేస్తాయి. ఈ నాలుగు సహజ ఆహారాలను మన రోజువారీ జీవనశైలిలో భాగం చేసుకోవడం ద్వారా ఎముకల నొప్పులకు స్వస్తి చెప్పి, సుదీర్ఘకాలం ఆరోగ్యంగా ఉండవచ్చు.     [ Bone Health, Bone Density, Calcium Rich Foods, Black Sesame Seeds, Ponnaganti Leaves, Amaranth Leaves, Ragi, Osteoporosis, Joint Health, Strong Bones ]
అమరాంత్ సీడ్స్.. తోటకూర గింజలు లేదా రాజ్‌గిరా అని వీటిని పిలుస్తారు. ఇవి ఇటీవల కాలంలో సూపర్ ఫుడ్‌గా విపరీతమైన ప్రజాదరణ పొందుతున్నాయి. ప్రాచీన కాలం నుండి మన సాంప్రదాయ ఆహారంలో భాగమైన ఈ గింజలు, ఆధునిక ఆరోగ్య నిపుణుల ప్రశంసలు అందుకుంటున్నాయి. మన నిత్య జీవితంలో తోటకూరను ఆకుకూరగా ఎంతగా ఉపయోగిస్తామో, దాని గింజలలో ఉన్న పోషక విలువలు కూడా అంతకంటే ఎక్కువే. సాధారణంగా కనిపించే ఈ చిన్న గింజలను ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల శరీరంలో అద్భుతమైన మార్పులు కనిపిస్తాయి. అవేంటో తెలుసుకుంటే.. అమరాంత్ సీడ్స్ అంటే.. అమరాంత్ సీడ్స్ అనేది 'అమరాంథస్' అనే మొక్క నుండి లభించే గింజలు. తెలుగులో వీటిని తోటకూర గింజలు అని పిలుస్తారు. ఉత్తర భారతదేశంలో వీటిని 'రాజ్‌గిరా' లేదా 'రామ్‌దానా' అని అంటారు. అమరాంత్ గింజలను ధాన్యాల జాబితాలో చేర్చినప్పటికీ, వృక్షశాస్త్రం ప్రకారం ఇవి నిజానికి సూడోసిరియల్స్ గా పిలుస్తున్నారు. అంటే బియ్యం, గోధుమల లాగా కాకుండా, ఇవి ఆకుకూరల జాతికి చెందిన గింజలు. అందుకే వీటిలో ఇతర సాధారణ ధాన్యాల కంటే పోషకాలు ఎంతో ఎక్కువగా ఉంటాయి. ఇందులో గ్లూటెన్ ఉండకపోవడం వల్ల ఇది గ్లూటెన్ అలర్జీ ఉన్నవారికి సురక్షితమైన ప్రత్యామ్నాయంగా మారుతుంది. ఆరోగ్యానికి అమరాంత్ సీడ్స్ చేసే మేలు.. పోషకాల గని: అమరాంత్ గింజలలో శరీరానికి కావలసిన అత్యంత ముఖ్యమైన విటమిన్లు , ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇందులో క్యాల్షియం, మెగ్నీషియం, ఐరన్, ఫోస్ఫరస్ , పోటాషియం సమృద్ధిగా లభిస్తాయి. ముఖ్యంగా ఎముకల ఆరోగ్యానికి అవసరమైన క్యాల్షియం ఇతర ధాన్యాలతో పోలిస్తే ఇందులో చాలా ఎక్కువగా ఉంటుంది. ప్రొటీన్: సాధారణంగా వృక్ష సంబంధిత ఆహారాలలో అన్ని రకాల అమైనో ఆసిడ్లు లభించడం చాలా అరుదు. కానీ అమరాంత్ లో శరీరానికి అవసరమైన తొమ్మిది రకాల అవసరమైన అమైనో ఆసిడ్లు ఉంటాయి. ముఖ్యంగా 'లైసిన్' అనే అమైనో ఆసిడ్ ఇందులో ఉండటం వల్ల ఇది శరీరంలో ప్రొటీన్ శోషణకు ఎంతగానో తోడ్పడుతుంది. శాఖాహారులకు, కండరాల పుష్టిని కోరుకునే వారికి ఇది సరైన పోషకాహారం. జీర్ణవ్యవస్థ మెరుగుదల: అమరాంత్ గింజలలో  ఫైబర్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది జీర్ణక్రియను వేగవంతం చేసి మలబద్ధకం సమస్యను నివారిస్తుంది. అలాగే ప్రేగుల ఆరోగ్యాన్ని కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఫైబర్ ఎక్కువ సమయం కడుపు నిండిన భావనను కలిగిస్తుంది కాబట్టి, అతిగా తినే అలవాటు తగ్గుతుంది. గుండె ఆరోగ్యం , కొలెస్ట్రాల్ నియంత్రణ: అమరాంత్ లో ఉండే సహజ నూనెలు , ఫైబర్ రక్తంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ (LDL) స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయి. ఇందులో ఉన్న యాంటీఆక్సిడెంట్లు గుండె నాళాల్లో పూడికలు ఏర్పడకుండా నిరోధించి, రక్తప్రసరణను నార్మల్ గా ఉండేలా చేస్తాయి. తద్వారా రక్తపోటు నియంత్రణలో ఉండి గుండె జబ్బుల ముప్పు తగ్గుతుంది. బరువు తగ్గడానికి: బరువు తగ్గాలనుకునే వారికి అమరాంత్ సీడ్స్ చక్కని ఎంపిక. తక్కువ క్యాలరీలు, అధిక ప్రొటీన్ , పీచు పదార్థం కలిగి ఉండటం  వల్ల శరీర జీవక్రియ రేటు అంటే మెటబాలిజం  పెరుగుతుంది. కొవ్వును కరిగించే ప్రక్రియ వేగవంతమై, ఆరోగ్యకరమైన రీతిలో బరువు తగ్గడానికి ఇది దోహదపడుతుంది. డయాబెటిస్ నియంత్రణ: ఈ గింజలలో ఉన్న గ్లైసెమిక్ ఇండెక్స్ సాధారణ ధాన్యాల కంటే తక్కువగా ఉంటుంది. దీని వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు ఒక్కసారిగా పెరగకుండా క్రమబద్ధంగా ఉంటాయి. మధుమేహ వ్యాధిగ్రస్తులు తమ రోజువారీ ఆహారంలో అమరాంత్ ను చేర్చుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుకోవచ్చు. వ్యాధి నిరోధక శక్తి.. అమరాంత్ లో స్క్వాలేన్ , లోనాఫిన్ వంటి శక్తివంతమైన సమ్మేళనాలు  ఉంటాయి. ఇవి శరీరంలో  ఇన్ఫ్లమేషన్ తగ్గించడమే కాకుండా, క్యాన్సర్ కణాల పెరుగుదలను అడ్డుకోవడంలో తోడ్పడతాయి. శరీర కణజాలాన్ని రక్షించే యాంటీఆక్సిడెంట్లు రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తాయి. ఆహారంలో అమరాంత్ సీడ్స్ ఎలా తీసుకోవాలి? అమరాంత్ సీడ్స్ ని వివిధ రకాలుగా ఆహారంలో భాగం చేసుకోవచ్చు. వీటిని వేయించి, పాప్‌కార్న్ లాగా మార్చి పాలు లేదా తేనెతో కలిపి ఉదయపు అల్పాహారంగా తీసుకోవచ్చు. వరి అన్నం లాగే వీటిని ఉడికించి తీసుకోవచ్చు లేదా ఉప్మా రూపంలో వండుకోవచ్చు. అమరాంత్ గింజలను పిండిగా తయారుచేసి  గోధుమ పిండితో కలిపి రొట్టెలు, చపాతీలు తయారు చేసుకోవచ్చు. పాయసం లేదా పానీయాలలో ఉడకబెట్టిన అమరాంత్ గింజలను చేర్చి పౌష్టికాహారంగా తీసుకోవచ్చు. సలాడ్లు లేదా సూప్‌లలో వేయించిన అమరాంత్ గింజలను పైన చల్లుకోవడం ద్వారా పోషక విలువలతో పాటు రుచిని పెంచుకోవచ్చు.                      *రూపశ్రీ.  
ఆరోగ్యం కోసం వాకింగ్ చేయాలని చాలామంది అనుకుంటారు. వాకింగ్ లో కూడా చాలా రకాలు ఉన్నాయి. బ్రిస్క్ వాకింగ్ , బ్యాక్ వాకింగ్.. అంటూ చాలా రకాలు ఉన్నాయి. వీటిలో 8 ఆకారంలో వాకింగ్ చేయడం చాలా పవర్ఫుల్ అంటున్నారు. దీన్ని అష్టాంగ నడక లేదా ఎనిమిది ఆకారపు నడక అని కూడా అంటారు. ఇది శారీరక, మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించే అద్భుతమైన సాంప్రదాయ వ్యాయామ పద్ధతి. దీని గురించి వివరంగా తెలుసుకుంటే.. అష్టాంగ నడక.. సాధారణంగా మనం ప్రతిరోజూ నేరుగా లేదా పార్కుల్లో రౌండ్‌గా నడుస్తుంటాం. కానీ ఒకే రీతిలో నడిచే నడక కంటే,  ఎనిమిది ఆకారంలో నడవడం వల్ల శరీరానికి ఎన్నో రెట్ల అదనపు ప్రయోజనాలు లభిస్తాయి. సరైన పద్ధతిలో ఈ నడకను  దినచర్యలో భాగం చేసుకుంటే, కొద్దిరోజుల్లోనే శరీరంలో వచ్చే మార్పులను ప్రత్యక్షంగా చూడవచ్చు. చిన్న స్థలం చాలు.. ఈ నడకను సాధన చేయడానికి పెద్దగా స్థలం లేదా ఖరీదైన పరికరాలు అవసరం లేదు.  ఇంటి ఆవరణలో లేదా ఒక ఖాళీ గదిలో దక్షిణం నుండి ఉత్తర దిశగా ఎనిమిది ఆకారాన్ని ఊహించుకుని లేదా సుద్ద ముక్కతో గీసుకుని నడవడం ప్రారంభించాలి. ఉదయం లేదా సాయంత్రం వేళల్లో పరగడుపున పరధ్యానం లేకుండా పాదరక్షలు లేకుండా నడవడం చాలా మంచిది. ఎలా నడవాలి?  నడిచేటప్పుడు శ్వాసపై ధ్యాస ఉంచుతూ ప్రశాంతంగా, నిలకడగా అడుగులు వేయాలి. దాదాపు పదిహేను నిమిషాలు ఒక దిశలో నడిచిన తర్వాత, తదుపరి పదిహేను నిమిషాలు వ్యతిరేక దిశలో నడవడం ఈ పద్ధతి లో ఉండే  ముఖ్య నియమం. అష్టాంగ నడక వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు.. గుండె ఆరోగ్యం.. ఎనిమిది ఆకారంలో తిరుగుతూ నడవడం వల్ల శరీరంలో రక్త ప్రసరణ ఎంతో మెరుగుపడుతుంది. రెండు వైపులా  అడుగులు వేయడం వల్ల శరీరంలోని అన్ని అవయవాలకు, ముఖ్యంగా గుండెకు తగినంత ప్రాణవాయువు అందుతుంది. ఇది రక్తపోటును అదుపులో ఉంచడానికి, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి ఎంతో తోడ్పడుతుంది. నాడీ వ్యవస్థ.. కాళ్ళ నొప్పులు, కీళ్ల నొప్పులతో బాధపడేవారికి ఇది అద్భుతమైన ఔషధంలా పనిచేస్తుంది. ఎనిమిది ఆకారంలో నడిచేటప్పుడు మోకాళ్లు, తుంటి భాగాలు, వెన్నుముక సహజంగా వంగుతాయి. దీనివల్ల వెన్నుముక బలపడి, నడుము నొప్పి , సయాటికా వంటి సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. పాదాల కింద ఉండే ఆక్యుప్రెజర్ పాయింట్లు నేలను తాకడం వల్ల నాడీ వ్యవస్థ ఉత్తేజితమవుతుంది. మానసిక ఆరోగ్యం.. అష్టాంగ నడక మానసిక ఒత్తిడిని తగ్గించడంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఎనిమిది ఆకారాన్ని అనుసరిస్తూ నడిచేటప్పుడు మనస్సు పూర్తిగా ఆకారం పైన నడక పైన దృష్టి పెడుతుంది. దీనివల్ల అనవసరమైన ఆలోచనలు తగ్గి, మెదడు ప్రశాంతంగా మారుతుంది. ఏకాగ్రత, జ్ఞాపకశక్తి పెరుగుతాయి. నిద్రలేమి సమస్యతో బాధపడేవారు క్రమం తప్పకుండా ఈ నడకను సాధన చేస్తే మంచి నిద్ర పడుతుంది. డయాబెటిస్ కు మంచిది.. అష్టాంగ నడక వల్ల జీర్ణక్రియ సమర్థవంతంగా పనిచేస్తుంది. ఈ వ్యాయామం వల్ల పొత్తికడుపు భాగంలో కదలికలు ఏర్పడి, మలబద్ధకం, గ్యాస్ వంటి సమస్యలు తగ్గుతాయి. అలాగే శరీరంలో పేరుకుపోయిన అనవసర కొవ్వు కరిగి, బరువు అదుపులోకి వస్తుంది. డయాబెటిస్ ఉన్నవారిలో ఇన్సులిన్ స్థాయిలు సమతుల్యంగా ఉండటానికి, రక్తంలో చక్కెర శాతాన్ని తగ్గించడానికి ఈ నడక ఎంతగానో సహాయపడుతుంది. ముఖ్యమైన విషయం.. సాధారణ నడకతో పోలిస్తే అష్టాంగ నడక శరీరంలోని రెండు వైపుల కండరాలను సమంగా ఉపయోగిస్తుంది. దీనివల్ల శరీర సమతుల్యత పెరుగుతుంది. వయసు పైబడిన వారు పడిపోకుండా స్థిరంగా నడవడానికి ఇది ఎంతో ఉపయోగపడుతుంది. రోజూ  నార్మల్ బ్యాకింగ్  కు బదులుగా  ప్రతిరోజూ కనీసం అర్ధగంట సేపు ఈ అష్టాంగ నడకను సాధన చేయడం ద్వారా సంపూర్ణ ఆరోగ్యాన్ని , కొత్త ఉత్సాహాన్ని సొంతం చేసుకోవచ్చు.                          *రూపశ్రీ.  
గర్భనిరోధక మాత్రలు మహిళల జీవితంలో ఎంతో కీలకమైన పాత్ర పోషిస్తాయి. కుటుంబ నియంత్రణతో పాటు నెలసరి సరిగ్గా రానప్పుడు వాటిని రీసెట్ చేయడానికి, తీవ్రమైన కడుపునొప్పి, పిసిఓడి వంటి హార్మోన్ల సమస్యల చికిత్సకు కూడా వైద్యులు వీటిని సూచిస్తుంటారు. అయితే వీటిని కొద్దికాలం  పాటు వైద్యుల పర్యవేక్షణలో వాడటం సురక్షితమే..  అయినప్పటికీ, ఎక్కువ కాలం పాటు ముఖ్యంగా వైద్యుల సలహా లేకుండా క్రమం తప్పకుండా వాడటం వల్ల కొన్ని ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది.  ముఖ్యంగా మహిళలు వైద్యుల సలహాతో అయినా సరే.. ఎక్కువకాలం గర్భనిరోధక మాత్రలు వాడటం మంచిది కాదు.. దీర్ఘకాలం గర్భనిరోధక మాత్రలు వాడటం వల్ల శరీరంలో ఎలాంటి మార్పులు , సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది? మహిళలు ఎదుర్కొనే సమస్యలు ఏమిటి?  వివరంగా తెలుసుకుంటే.. హార్మోన్ల అసమతుల్యత , మూడ్ స్వింగ్స్...  గర్భనిరోధక మాత్రలలో ఈస్ట్రోజెన్ , ప్రొజెస్టిన్ అనే హార్మోన్లు ఉంటాయి. వీటిని ఎక్కువకాలం తీసుకోవడం వల్ల శరీరంలో సహజమైన హార్మోన్ల ఉత్పత్తి ప్రభావితమవుతుంది. దీనివల్ల మానసిక ఆందోళన, నిరాశ, చిరాకు, మూడ్ స్వింగ్స్ వంటి సమస్యలు తరచూ ఎదురవుతాయి. రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టడం..  ఎక్కువకాలం పాటు గర్భనిరోధక  మాత్రలు వాడటం వల్ల రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టే ముప్పు పెరుగుతుందని పరిశోధనలు చెబుతున్నాయి. ముఖ్యంగా కాళ్లలోని నాళాలలో లేదా ఊపిరితిత్తులలో రక్తం గడ్డకట్టడం వంటి తీవ్రమైన సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. అధిక బరువు ఉన్నవారిలో,   ముప్పై ఐదేళ్లు పైబడిన మహిళల్లో ఈ ప్రమాదం మరింత ఎక్కువగా ఉంటుంది. గుండె సంబంధిత సమస్యలు , అధిక రక్తపోటు..  గర్భనిరోధక మాత్రల వల్ల కొందరిలో రక్తపోటు పెరిగే అవకాశం ఉంది. క్రమం తప్పకుండా చాలా ఏళ్ల పాటు వీటిని వాడటం వల్ల గుండె సంబంధిత వ్యాధులు ,  స్ట్రోక్ వచ్చే ముప్పు కూడా పెరుగుతుంది. విటమిన్లు , ఖనిజాల లోపం..  ఈ మాత్రలు ఎక్కువ కాలం పాటు వాడటం వల్ల జీర్ణ వ్యవస్థలో పోషకాల శోషణ తగ్గుతుంది. ముఖ్యంగా విటమిన్ బి6, విటమిన్ బి12, ఫోలిక్ యాసిడ్, విటమిన్ సి , మెగ్నీషియం, జింక్ వంటి ముఖ్యమైన ఖనిజాల లోపం శరీరంలో ఏర్పడుతుంది. దీనివల్ల ఎప్పుడూ అలసట, నీరసం , రోగనిరోధక శక్తి తగ్గడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.  రొమ్ము నొప్పులు.. ఎక్కువ కాలం ఈ మాత్రల  వాడకం వల్ల శరీరంలో హార్మోన్ల స్థాయిలో వచ్చే మార్పుల కారణంగా రొమ్ములో బరువుగా అనిపించడం, వాపు లేదా నొప్పి రావడం జరుగుతుంది. కాలేయం , పిత్తాశయ సమస్యలు.. మాత్రల రూపంలో తీసుకునే ఈ హార్మోన్లను కాలేయం జీర్ణం చేయాల్సి ఉంటుంది. ఎక్కువ కాలం వీటిని వాడటం వల్ల కాలేయ పనితీరుపై ప్రభావం పడి కాలేయ గడ్డలు ఏర్పడటం లేదా పిత్తాశయంలో రాళ్లు తయారయ్యే ప్రమాదం ఉంటుంది. క్యాన్సర్ ప్రమాదం..  ఎక్కువ కాలం గర్భనిరోధక మాత్రలు వాడటం వల్ల గర్భాశయ ముఖద్వారం , రొమ్ము క్యాన్సర్ వచ్చే ముప్పు కొద్దిగా  పెరుగుతుందని కొన్ని అధ్యయనాలు తెలుపుతున్నాయి. అయితే అదే సమయంలో ఇవి అండాశయ , గర్భాశయ క్యాన్సర్ల నుండి రక్షణ ఇస్తాయట. మహిళలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. మహిళలు గర్భనిరోధక మాత్రలు వాడే ముందు , వాడే సమయంలో కొన్ని జాగ్రత్తలు పాటించడం అవసరం. సొంత వైద్యం చేసుకోవద్దు. వైద్యుల సలహా మేరకు మాత్రమే వీటిని ప్రారంభించాలి. ప్రతి కొన్ని నెలలకోసారి సాధారణ ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం మంచిది. కొందరు వైద్యులు కేవలం సమస్యను తగ్గించాలనే కారణంతో ఈ మాత్రలను ఎక్కువ నెలలు రికమెండ్ చేస్తూ ఉంటారు. అవగాహన లోపం వల్ల కంటిన్యు గా ఎక్కువ నెలలు ఈ మాత్రలు రికమెండ్ చేయడం లేదా వాడటం మంచిది కాదు. రక్తపోటు , కాలేయ పనితీరును తరచూ సరిచూసుకోవాలి. మాత్రలు వాడుతున్న సమయంలో తరచూ తలనొప్పి, కాళ్ల వాపు, తీవ్రమైన కడుపునొప్పి లేదా చూపు మందగించడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి.                        *రూపశ్రీ.