.webp)
ఇండియాలోనే మోస్ట్ రాయల్ ఫ్యామిలీ అక్కినేని వారి కోడలి హోదాలో శోభిత ధూళిపాళ్ల అలియాస్ శోభిత అక్కినేని ఎంత సంతోషంగా ఉందో చూస్తూనే ఉన్నాం. పెళ్లి తర్వాత హీరోయిన్ గాను సత్తా చాటుతూ అక్కినేని ఫ్యామిలీతో పాటు అభిమానులని ఆనందానికి గురి చేస్తుంది. రీసెంట్ గా హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్ ఇటీవల ఒక వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేసింది
దీంతో ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడమే కాకుండా, నటి శోభితా ధూళిపాళ్ల దృష్టిని ఆకర్షించింది. వీడియోపై వెంటనే స్పందించిన శోభిత, అహల్య అభిప్రాయంతో 100 శాతం ఏకీభవిస్తున్నట్లు ఒక ఎమోజీ ద్వారా వ్యక్తపరిచారు. అంతేకాకుండా తన జీవితంలో ఎదురైన చేదు అనుభవాలను, గతాన్ని నెమరువేసుకుంటూ సుదీర్ఘమైన కామెంట్ జతచేశారు. "నేను కేవలం 16 సంవత్సరాల చిన్న వయస్సులోనే నా సంచులు సర్దుకుని విశాఖపట్నం నుండి ముంబైకి పారిపోవాల్సి వచ్చింది. అక్కడ నా భవిష్యత్తుకు ఎలాంటి గ్యారెంటీ లేదు, కానీ నాకంటూ ఒక మంచి అవకాశం దక్కుతుందనే నమ్మకంతో ముందడుగు వేశాను. తెలుగు రాష్ట్రాల్లోని వాతావరణం కలలు కనేవారికి, ముఖ్యంగా ఎలాంటి గాడ్ ఫాదర్ లేకుండా పరిశ్రమలోకి వచ్చే బయటి వ్యక్తులకు తీవ్ర ప్రతికూలంగా మరియు జడ్జిమెంటల్‌గా అనిపించింది. మరీ ముఖ్యంగా ఒక మహిళగా కొత్త రంగానికి రావాలని ప్రయత్నిస్తే, ఆ వివక్ష, ఒత్తిడి రెట్టింపు (డబుల్ డోస్) స్థాయిలో ఉంటుంది. నేను ముంబై వెళ్లి అనేక కష్టనష్టాల మధ్య మోడలింగ్ నుండి నేటి అంతర్జాతీయ నటిగా ఎదిగిన ప్రయాణాన్ని ఆమె గుర్తుచేశారు. "అయితే ఇది 10 నుండి 15 ఏళ్ల క్రితం నాటి మాట, కాలంతో పాటు ఇప్పుడు పరిస్థితులు మారాయని భావిస్తున్నాను. మన తెలుగు కమ్యూనిటీలోని ప్రజలు ప్రతిభను గుర్తించి ప్రోత్సహించేందుకు కాస్త ధైర్యం, ఆత్మవిశ్వాసం (గ్రో ఏ స్పైన్ & రెక్కలు) పెంచుకుంటారని ఆశిస్తున్నాను" అని ఆమె పేర్కొన్నారు.
.webp)
Also Read: కాకాలో అలనాటి స్టార్ హీరోయిన్: భార్యగా అయితే ఇంక కెవ్వుకేకే!
ఇంతకీ ఆ ఇన్ఫ్లుయెన్సర్ రిలీజ్ చేసిన వీడియోలో 'ఒక తెలుగు వ్యక్తికి మరొక తెలుగు వ్యక్తే అతిపెద్ద శత్రువు" మన సమాజంలో ఎవరైనా కొత్తగా ఒక వ్యాపారం ప్రారంభించినా, రెస్టారెంట్ తెరిచినా లేదా సరికొత్త ఆలోచనతో ముందుకు వచ్చినా, వారికి ప్రోత్సాహం అందించడానికి బదులుగా అందులో అంత గొప్పదనమేముంది?" అంటూ విమర్శలు గుప్పించడమే ఎక్కువ మంది మొదటి స్పందనగా ఉంటుంది. సినిమా సంస్కృతి, భాషాభిమానం గురించి ఎంతో గొప్పగా మాట్లాడే తెలుగు ప్రజలు, సొంత మనుషులు ఎదుగుతున్నప్పుడు మాత్రం సరైన మద్దతు ఇవ్వడంలో వెనకబడిపోతున్నారని చెప్పుకొచ్చింది.
[Sobhita Dhulipala, Telugu People Are Their Own Enemies, Nagarjuna, NagaChaitanya, Telugu Cinema, Telugu Cinema News, Tollywood, Tollywood News]




