
మెగాస్టార్ చిరంజీవి హీరోగా బింబిసార ఫేమ్ వశిష్ఠ దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్న సోషియో ఫాంటసీ మూవీ 'విశ్వంభర'. జగదేకవీరుడు అతిలోకసుందరి, అంజి సినిమాల తర్వాత చిరంజీవి నటిస్తున్న ఫుల్ లెంగ్త్ సోషియో ఫాంటసీ ప్రాజెక్ట్ కావడంతో ఈ సినిమాపై మొదట్నుంచీ మంచి అంచనాలు ఉన్నాయి. అయితే వీఎఫ్‌ఎక్స్ వర్క్స్ ఆలస్యం, ఓటీటీ డీల్ వంటి కారణాలతో ఈ సినిమా రిలీజ్ ఆలస్యమవుతూ వచ్చింది.
తాజాగా 'విశ్వంభర' ఓటీటీ డీల్ క్లోజ్ అయినట్లు తెలుస్తోంది. ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్ వీడియో ఈ సినిమా డిజిటల్ హక్కులను ఏకంగా రూ. 55 కోట్ల ఫ్యాన్సీ రేటుకు దక్కించుకుందని సమాచారం.
అయితే ఈ ఓటీటీ డీల్ వెనుక పెద్ద ట్విస్ట్ ఉందట. ఈ సినిమాను రాబోయే సంక్రాంతి రేసులోనే గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల చేస్తామని యూవీ క్రియేషన్స్ అమెజాన్ కు ప్రామిస్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. సంక్రాంతి వంటి పెద్ద పండుగ సీజన్‌లో సినిమా వస్తే మాస్ అండ్ ఫ్యామిలీ ఆడియన్స్ రీచ్ నెక్స్ట్ లెవల్‌లో ఉంటుందని, అందుకే ఈ భారీ మొత్తాన్ని చెల్లించడానికి అమెజాన్ ప్రైమ్ ఒప్పుకుందని అంటున్నారు.
.webp)
కానీ, ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఉంది. చిరంజీవి నటిస్తున్న మరో మూవీ 'కాకా' ఇప్పటికే 2027 సంక్రాంతి సీజన్ పై కర్చీఫ్ వేసింది. 'విశ్వంభర' కోసం సంక్రాంతిని త్యాగం చేసి, సమ్మర్ సీజన్ కు 'కాకా' వెళ్తుందని ప్రచారం జరిగినప్పటికీ.. దానిని కాకా టీమ్ ఖండించింది. ఎట్టి పరిస్థితుల్లో 2027 సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదల చేయనున్నట్లు స్పష్టం చేసింది.
దీంతో చిరంజీవి సినిమాలు 'విశ్వంభర', 'కాకా' రెండూ ఒకేసారి విడుదలవుతాయా? అనేది సస్పెన్స్ లా మారింది. మరి విశ్వంభర సంక్రాంతి కండిషన్ నిజమేనా? ఒకవేళ నిజమైతే రెండు సినిమాల మధ్య కనీసం ఒక నాలుగైదు రోజుల గ్యాప్ ఉండేలా ప్లాన్ చేస్తారా? అనేది తెలియాల్సి ఉంది.
[Vishwambhara OTT Deal, Vishwambhara OTT Rights, Vishwambhara Release Date, Vishwambhara vs Kaaka, Megastar Chiranjeevi, Vishwambhara Movie, Telugu Film News, Telugu News]





