
మెగాస్టార్ వన్ మాన్ షో 'కాకా' రిలీజ్ సంక్రాంతికైనా రోజుకొక ఇంట్రెస్టింగ్ న్యూస్ వచ్చి అభిమానులని, సోషల్ మీడియాని పులకరింతలకి గురి చేస్తుంది. స్టిల్ ఇప్పుడు అదే ఆనవాయితీని కంటిన్యూ చేస్తు ఒక ఆసక్తికర న్యూస్ హల్ చల్ చేస్తుంది.
స్నేహ.. హోమ్లీ క్యారెక్టర్లకి కేరాఫ్ అడ్రస్. ఇప్పుడు కాకాలో ఒక ముఖ్యమైన క్యారక్టర్ లో కనిపించబోతున్నట్టు సమాచారం. సినీ సర్కిల్స్ లో అయితే చిరంజీవి భార్యగా ఉండబోతనే న్యూస్ కూడా చాలా నమ్మకంగానే తచ్చాడుతు ఉంది.గతంలో ఓ ఇంటర్వ్యూలో స్నేహ మాట్లాడుతూ తన కెరీర్‌లో మెగాస్టార్ చిరంజీవితో ఒక్కసారైనా తెర పంచుకోవాలనేది తన చిరకాల కోరిక అని వెల్లడించారు. నేడు ఆ కల నెరవేరిందని అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. టాలీవుడ్‌లో నాగార్జునతో 'శ్రీరామదాసు', 'రాజన్న', వెంకటేష్‌తో 'సంక్రాంతి', బాలకృష్ణతో 'పాండురంగడు' వంటి సూపర్ హిట్ సినిమాల్లో నటించి ఆకట్టుకున్న స్నేహ.. ఇప్పుడు చిరంజీవితో జతకట్టడం ద్వారా సీనియర్ స్టార్స్ అందరితోనూ నటించిన అరుదైన హీరోయిన్ల జాబితాలో చేరబోతున్నారు. గతంలో సౌందర్య, రమ్యకృష్ణ, మీనా, రోజా, సిమ్రాన్, టబు మాత్రమే టాలీవుడ్ టాప్ 4 స్టార్లతో కలిసి నటించిన ఘనత సాధించారు.
.webp)
Also Read: ప్రీమియర్ షోలలో 'ది ప్యారడైజ్’రికార్డ్స్.. ఎన్నో తెలిస్తే మీరు షాక్
మరి చిరు తో సెల్యులాయిడ్ ని పంచుకోవడం ఖాయమైతే ఆ అరుదైన మైలురాయిని అందుకోబోతున్న 7వ కథానాయికగా స్నేహ చరిత్ర సృష్టించినట్టే . జన నాయగన్, టాక్సిక్ ఫేమ్ కె వెంకట్ కె నారాయణ రాజీ పడకుండా భారీ బడ్జెట్‌తో ఈ కాకాని నిర్మిస్తున్నాడు. వరల్డ్ రిలీజ్ డేట్ 2027 జనవరి 13 . వాల్తేరు వీరయ్య బాబీ దర్శకుడు.
[Kaaka, Sneha, Chiranjeevi, Kaaka Movie Heroins, Anaswara Rajan, Tollywood Movies Postponed, Telugu Cinema, Telugu Cinema News, Tollywood, Tollywood News]





