LATEST NEWS
రాజ‌కీయాల్లో ఓడ‌లు బండ్లు.. బండ్లు ఓడలు కావ‌డానికి పెద్ద  ఎక్కువ కాలం ప‌ట్ట‌దు. అధికారంలో ఉన్నంత సేపు ఈగ‌ల గుంపులా పార్టీ ముఖ్యుల చుట్టూ ప్రదక్షిణలు చేసే నేత‌లు.. అధికారంలో కోల్పోయిన త‌రువాత వారి వైపు కూడా చూడ‌రు. రాజ‌కీయాల్లో ఈ విష‌యం సాధార‌ణంగా జ‌రిగేదే. ప్ర‌స్తుతం ఆ అనుభ‌వం బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు స్ప‌ష్టంగా బోధప‌డుతోంది. కేటీఆర్ మంత్రిగా ఉన్న స‌మ‌యంలో ఆయ‌న అపాయింట్ మెంట్ కోసం చాలా మంది నేత‌లు ఎదురు చూసేవారు. అవ‌కాశం దొరికితే కాబోయే సీఎం కేటీఆర్ అంటూ ఆకాశానికి ఎత్తేశారు కూడా. ప‌రిస్థితులు తిర‌గబ‌డ‌టానికి ఎంతో కాలం ప‌ట్ట‌లేదు. గ‌తేడాది చివ‌రిలో జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో బీఆర్ఎస్ అధికారాన్ని కోల్పోయింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావ‌టంతో బీఆర్ఎస్ లోని ప‌లువురు కీల‌క నేత‌లు, ద్వితీయ స్థాయి నేత‌లు కాంగ్రెస్ గూటికి చేరిపోయారు. కేసీఆర్‌, కేటీఆర్ ల‌కు అత్యంత ద‌గ్గ‌ర వ్య‌క్తులు సైతం కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లారు. ఇప్పుడు ఇంకా బీఆర్ఎస్ లో ఉన్న‌ నేత‌లు సైతం అవ‌కాశాన్నిబ‌ట్టి ఎప్పుడైనా గోడదూకేస్తారన్న సంకేతాలే కనబడుతున్నాయి. ఈ నెల‌లో జ‌రిగిన లోక్ స‌భ ఎన్నిక‌ల ఫ‌లితాలు జూన్ 4న వెల్ల‌డి కానున్నాయి. ఈ ఫ‌లితాల్లో బీఆర్ఎస్ క‌నీసం 8 నుంచి తొమ్మిది స్థానాల్లో విజ‌యం సాధించ‌క‌పోతే ఆ పార్టీని వీడే నేత‌ల సంఖ్య భారీగానే ఉంటుంద‌ని రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతోంది.  బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్ రాజ‌కీయాల్లో క్రియాశీల‌కంగా ఉన్న‌ప్ప‌టినుంచి ప్ర‌తిప‌క్ష పాత్ర  పోషించ‌లేదు. గ‌తంలో కేసీఆర్‌, హ‌రీశ్ రావులు తెలంగాణ ఉద్య‌మ స‌మ‌యంలో పార్టీని ముందుండి న‌డిపించారు. ప్ర‌త్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు త‌రువాత బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తరువాతే కేటీఆర్ పార్టీలో కీల‌క భూమిక పోషిస్తూ వ‌చ్చారు. మంత్రిగా ప్ర‌భుత్వ పాల‌న‌లో, వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ హోదాతో పార్టీలో నెంబ‌ర్ 2గా కేటీఆర్ కొన‌సాగారు. దీంతో బీఆర్ఎస్ నేత‌లు, కార్య‌క‌ర్త‌లు కేటీఆర్ ను సీఎం స్థాయిలో చూస్తూ వ‌చ్చారు. పార్టీలోని ముఖ్య‌నేత‌లు సైతం ప‌ద‌వులకోసం కేటీఆర్ చుట్టూ ప్ర‌ద‌క్షిణ‌లు చేశారు.  కేసీఆర్, కేటీఆర్ ఏం చెబితే అది పార్టీ నేత‌లు శాస‌నంగా భావిస్తూ వ‌చ్చారు. కానీ, ప్ర‌స్తుతం ప‌రిస్థితి మారిపోయింది. అధికారం కాల్పోవ‌డంతో కేటీఆర్ హ‌వా కూడా పార్టీ నేత‌ల్లో క్ర‌మంగా త‌గ్గుతూ వ‌చ్చింది. కాంగ్రెస్ అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత నిర్వ‌హించిన అసెంబ్లీ స‌మావేశాల్లో పార్టీ శ్రేణులు ఆశించిన స్థాయిలో కేటీఆర్ రాణించ‌ లేక పోయారు. కాంగ్రెస్ ప్ర‌భుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు కేటీఆర్ చేసిన‌ ప్ర‌య‌త్నాలు విఫ‌ల‌మ‌య్యాయి. అధికారంలోఉన్న స‌మ‌యంలో అసెంబ్లీ స‌మావేశాల్లో విప‌క్షాల‌పై విరుచుకుప‌డుతూ బెంబేలెత్తించిన కేటీఆర్‌.. ప్ర‌తిప‌క్ష హోదాలో పార్టీ శ్రేణులు ఆశించిన స్థాయిలో కాంగ్రెస్ స‌భ్యుల దూకుడును ఎదుర్కోలేక పోయారు. దీంతో, హ‌రీశ్ రావు ఫ్రంట్ రోల్ లోకి వ‌చ్చి కాంగ్రెస్ స‌భ్యులకు దీటైన స‌మాధానం చెప్పారు.  బీఆర్ ఎస్ పార్టీ అధికారం కోల్పోయిన త‌రువాత కేటీఆర్ హ‌వా పార్టీలో తగ్గుతూ వ‌స్తోందన్న విష‌యం తాజాగా మ‌రోసారి స్ప‌ష్ట‌మైంది.  ఖ‌మ్మం - వ‌రంగ‌ల్ - న‌ల్గొండ ఉమ్మ‌డి జిల్లాల నియోజ‌క‌వ‌ర్గ  గ్రాడ్యుయేష‌న్ ఎమ్మెల్సీ ఎన్నికకు  ఈనెల 27న పోలింగ్ జ‌ర‌గ‌నుంది. జూన్ 5న ఫ‌లితాలు వెల్ల‌డి కానున్నాయి.  ఈ ఎన్నిక‌ల్లో అధికార కాంగ్రెస్ పార్టీ, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల అభ్య‌ర్థులు పోటీ ప‌డుతున్నారు. కాంగ్రెస్ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్, బీఆర్ఎస్ అభ్యర్థిగా ఏనుగుల రాకేష్ రెడ్డి,  బీజేపీ అభ్యర్థిగా ప్రేమేందర్ రెడ్డి బరిలో ఉన్నారు.  బీఆర్ఎస్ అభ్య‌ర్థిగా రాకేశ్ రెడ్డి ఎంపిక‌పై మూడు ఉమ్మ‌డి జిల్లాల్లోని బీఆర్ఎస్ కీల‌క‌ నేత‌లు అసంతృప్తిగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌చ్చాయి. త‌మ‌ను సంప్ర‌దించ‌కుండానే ప‌ల్లా రాజేశ్వ‌ర్ రెడ్డి మ‌నిషి అయిన రాకేశ్ రెడ్డికి ఏక‌ప‌క్ష నిర్ణ‌యంతో కేసీఆర్, కేటీఆర్ టికెట్ ఇచ్చార‌ని స‌ద‌రు నేత‌లు ఆగ్ర‌హంతో ఉన్నార‌ని ప్ర‌చారం జ‌రిగింది. ఆ ప్ర‌చారం నిజ‌మేన‌ని  రెండు రోజుల క్రితం స్ప‌ష్ట‌మైంది. ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో రాకేశ్ రెడ్డి విజ‌యానికి అనుస‌రించాల్సిన వ్యూహాల‌పై స‌మీక్ష నిర్వ‌హించేందుకు రావాల‌ని మూడు ఉమ్మ‌డి జిల్లాల పార్టీ ముఖ్య‌ నేత‌ల‌కు  కేటీఆర్ ఆదేశాలు జారీ చేశారు. కానీ  ఆ స‌మావేశానికి ప‌లువురు నేత‌లు గైర్హాజరయ్యారు. కేవ‌లం కొద్ది మంది మాత్ర‌మే హాజ‌ర‌య్యారు. దీంతో పార్టీలో ఈ విష‌యం పెద్ద చ‌ర్చ‌నీయాంశంగా మారింది. కేటీఆర్ పిలిచినా నేత‌లు స‌మావేశంకు హాజ‌రుకాక‌పోవ‌టం  పార్టీలో కేటీఆర్ హ‌వా త‌గ్గిపోయింద‌నడానికి నిదర్శనంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో బ‌ల‌ప‌డేందుకు బీజేపీ ప్ర‌య‌త్నాలు చేస్తోంది. అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఆపార్టీ ప్ర‌భావం స్ప‌ష్టంగా క‌నిపించింది. కేంద్రంలో మ‌రోసారి బీజేపీ అధికారంలోకి వ‌స్తే  బీఆర్ఎస్ లోని ముఖ్య‌నేత‌లు బీజేపీ, కాంగ్రెస్ పార్టీల్లోకి క్యూక‌ట్ట‌డం ఖాయ‌ంగా క‌నిపిస్తోంది. ఇప్ప‌టికే కాంగ్రెస్ నేత‌లు మీడియా స‌మావేశాల్లో లోక్ స‌భ ఫ‌లితాల త‌రువాత బీఆర్ ఎస్ నుంచి పెద్ద సంఖ్య‌లో కాంగ్రెస్ లోకి వలసలు ఉంటాయని చెప్పారు. అదే జ‌రిగితే రానున్న కాలంలో బీఆర్ ఎస్ పార్టీకి మ‌రింత గ‌డ్డు ప‌రిస్థితులు ఎదుర‌వ‌డం ఖాయం. అలాంటి ప‌రిస్థితుల‌ను కేటీఆర్ స‌మ‌ర్ధ‌వంతంగా ఎదుర్కొంటారని కానీ, ఎదుర్కోగలుగుతారని కానీ  పార్టీ శ్రేణులు బావించ‌డం లేదు. కేసీఆర్‌, హ‌రీశ్ రావులు యాక్టివ్ పాత్ర పోషిస్తేనే పార్టీ మ‌నుగ‌డ సాధ్య‌మ‌వుతుంద‌నీ, కేటీఆర్ చేతిలోకి పార్టీ ప‌గ్గాలు వెడితే పార్టీ మనుగడే ప్రశ్నార్ధకమౌతుందనీ బీఆర్ఎస్ శ్రేణులే అంటున్నాయి. 
  ఒక్కోరోజు గడుస్తున్న కొద్దీ వైసీపీ వర్గాల్లో టెన్షన్ పెరిగిపోతోంది. మొన్నటి వరకు ఇష్టమొచ్చినట్టు నోరు పారేసుకున్న వైసీపీ నాయకులు చాలామంది అడ్రస్ లేకుండా, కనిపించకుండా వెళ్ళిపోయారు. కొంతమంది మేకపోతు గాంభీర్యాలు ప్రదర్శిస్తున్నప్పటికీ లోపల్లోపల బేజారు అయిపోతున్నారు. అఫీషియల్‌గా కాకపోయినప్పటికీ వెలుగులోకి వస్తున్న సర్వేలన్నిటిలోనూ టీడీపీదే పైచేయి అని తేలుతూ వుండడంతో వైసీపీ వర్గాలు నిద్రకు కరవవుతున్నాయి.  
ఆంధ్రప్రదేశ్ లో ఒక విచిత్ర పరిస్థితి నెలకొని ఉంది. రాష్ట్రంలో ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఉన్నారు. అంటే రాష్ట్రంలో అల్లర్లు శాంతి భద్రతల సమస్యలు తలెత్తినప్పుడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఆయన బాధ్యత వాటిని అరికట్టి సాధారణ స్థితి పునరుద్ధరించేలా అధికారులకు దిశానిర్దేశం చేయడం. అయితే ఏపీ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఆ బాధ్యతను పూర్తిగా విస్మరించేశారు. రాష్ట్రంలో పల్నాడు ప్రాంతం సహా కొన్ని ప్రాంతాలు ఎన్నికల అనంతరం కూడా హింసాకాండతో అట్టుడుకుతుంటే, తీవ్ర ఉద్రిక్తలు నెలకొని ఉంటే వాటి గురించి ఒక్కటంటే ఒక్క మాట కూడా మాట్లాడకుండా కోర్టు అనుమతి తీసుకుని మరీ విదేశాలకు చెక్కేశారు. అలా చెక్కేసే ముందు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా తాను చేయకూడని పని కూడా చేశారు. అస్మదీయ కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించాల్సిందిగా సీఎస్ ను ఆదేశించేశారు. సీఎస్ పరమ వీర విధేయత ప్రదర్శించి ఆ పని చేయడానికి రెడీ అయిపోయారు. ఆ ఆదేశాల అమలు కోసం డీబీటీ నిధులను మళ్లించేయడానికీ సిద్ధమైపోయారు.  అయితే ఆపద్ధర్మ  ముఖ్యమంత్రిగా జగన్ తన బాధ్యతను విస్మరించారు. కానీ విపక్ష నేత అయిన చంద్రబాబు మాత్రం రాష్ట్రంలో నెలకొన్నఉద్రిక్త పరిస్థితులు, పల్నాడులో దాడులపై నిరంతర సమీక్షలు నిర్వహిస్తూ  రాష్ట్రంలో పరిస్థితిని చక్కదిద్దేందుకు కేంద్ర బలగాలను మోహరించాలని ఎన్నికల సంఘాన్ని కోరారు. చంద్రబాబు డిమాండ్ మేరకు  ఈసీ ఎన్నికల ఫలితాలు వెలువడిన రెండు వారాలపాటు కేంద్ర బలగాలు రాష్ట్రంలోనే ఉంచాలని కేంద్ర హోంశాఖను ఆదేశించింది. ఇక సంక్షేమ పథకాలకు సంబంధించి నిధులను  కాంట్రాక్టర్లకు చెల్లించేందుకు సర్కార్ చేస్తున్న ప్రయత్నాన్ని అడ్డుకోవాలంటూ  చంద్రబాబు గవర్నర్ కు రాసిన లేఖతో  అదే విధంగా  ఈ-ఆఫీస్‌ అప్‌గ్రేడేషన్‌  కూడా చంద్రబాబు ఫిర్యాదుతోనే ఆగింది. వైసీపీ తీసుకొచ్చిన తప్పుడు జీవోలను మాయం చేసేందుకు వైసీపీ సర్కార్ చేసిన ప్రయత్నానికి అడ్డుకట్ట పడింది. రాష్ట్ర బాగోగుల విషయంలో చంద్రబాబు రాజీప డరనడానికి వీటిని ఉదాహరణలుగా పరిశీలకులు చూపుతున్నారు.    ఇక  అమిత్ షా చెప్పిన జోస్యం నిజమై చంద్రబాబు జూన్ 9న రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తే ఆయన తాను చేస్తానన్న తొలి సంతకం, రెండో సంతకం విషయాలను పక్కన పెడితే.. గత ఐదేళ్ల పాలనలో అస్తవ్యవస్తంగా మారిన రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దడానికి మహాయజ్ణం లాంటిదే చేయాల్సి ఉంటుంది. రాష్ట్ర విభజన అనంతరం విభజిత ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాడు రాష్ట్రం పరిస్థితి ఏమిటో అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు రాష్ట్ర పరిస్థితి అంతకంటే అధ్వానంగా ఉంది.  నాడు రాష్ట్ర విభజన తరువాత ప్రభుత్వం జీరో నుంచి మొదలు పెట్టాల్సి వచ్చింది. ఇప్పుడు ఐదేళ్ల జగన్ పాలన తరువాత జీరోకన్నా దిగువ నుంచి అంటే మైనస్ నుంచి ప్రారంభించాల్సిన పరిస్థితి ఉంది. చంద్రబాబు విభజిత ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నాడు ప్రభుత్వ ఖజానా ఖాళీ, రాష్ట్రానికి రాజధాని లేదు. ఇప్పుడూ అదే పరిస్థితి.  అప్పట్లో ఐదేళ్లలో చంద్రబాబు రాష్ట్రాన్ని గాడిన పెట్టారు. రెవెన్యూలోటుతో  ఆరంభమైన విభజిత రాష్ట్రాన్ని తన విజనరీతో సర్ ప్లస్ స్టేట్ గా, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో నంబర్ వన్ స్టేట్ గా మార్చారు చంద్రబాబు. అంతేనా ఐదేళ్లలో ఒక్క సారి కూడా విద్యుత్ చార్జీలు పెంచకుండా నాణ్యమైన విద్యుత్ సరఫరా చేశారు. అయితే 2019లో తెలుగుదేశం పార్టీ పరాజయం పాలు కావడంతో రాష్ట్ర ముఖచిత్రం ఒక్కసారిగా మారిపోయింది. జగన్ హయంలో అమరావతి నిర్వీర్యమైంది. రాజధాని కోసం భూములిచ్చిన రైతులు రోడ్డున పడ్డారు.  ఇప్పుడు రాష్ట్రం కరెంటు కొరతతో దాదాపు అంధకారబంధురంగా మారింది. ఎప్పుడు వస్తుందో తెలియని విద్యుత్ సరఫరా చేస్తూ జగన్ ప్రభుత్వం విద్యుత్ చార్జీలను భారీగా పెంచింది.  పారిశ్రామిక రంగం, వ్యవసాయ రంగం కుదేలయ్యాయి. నిర్మాణ రంగం పడకేసింది. విద్యా వ్యవస్థ కుప్పకూలింది.   అమిత్ షా జోస్యం నిజమై చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా 9న ప్రమాణస్వీకారం చేపడితే ఆయన ముందున్న సమస్యలివి. మళ్లీ తొలి అడుగు నుంచీ రాష్ట్ర పునర్నిర్మాణం చేపట్టాల్సి ఉంటుంది. జన సంక్షేమ శ్రామికుడిగా, సంపద సృష్టికర్తగా చంద్రబాబు రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్లాల్సి ఉంటుంది. ఆ ఆశతోనే, ఆ నమ్మకంతోనే జనం చంద్రబాబు నాయకత్వంలోని తెలుగుదేశం కూటమికి అధికారం కట్టబెట్టారని భావించాల్సి ఉంటుంది. 
వయసు దగ్గర దగ్గర 75 సంవత్సరాలకు చేరువ అవుతోంది. అంతేకాకుండా ప్రధానమంత్రి హోదాలో కూడా వున్నారు కాబట్టి నరేంద్ర మోడీ గారిని మిగతా రాజకీయ నాయకులను విమర్శించినట్టు ఘాటుగా విమర్శించాలంటే కొంత ఇబ్బందిగానే వుంటుంది. అందుకే పెద్దమనిషి వయసుకి, హోదాకి గౌరవం ఇస్తూ చాలా వినయంగా అసలు విషయాన్ని తెలియజేసే ప్రయత్నం జరుగుతోంది. ప్రధాని నరేంద్ర మోడీ ఈసారి ఎన్నికలలో 4 వందల పార్లమెంటు స్థానాలు గెలిచి ప్రధానమంత్రి పీఠం మీద మూడోసారి కూర్చోవాలని ఆశిస్తున్నారు. ఆయన అలా ఆశించడంలో తప్పులేదు.. జనం ఆశీస్సులతో అనుకున్నట్టు జరిగినా బాధ లేదు. కానీ, ఆయన ఎన్నికలలో విజయం సాధించడం కోసం అనుసరిస్తున్న విధానాలు, మాట్లాడుతున్న మాటలే కొంత కాదు.. చాలా బాధను కలిగిస్తున్నాయి.  నరేంద్ర మోడీ నాయకత్వంలో వున్న బీజేపీ నాయకులు ముస్లింల విషయంలో ఎలా వ్యవహరిస్తారో మళ్ళీ ఇక్కడ ఉదహరించాల్సిన అవసరం లేదు. ముస్లిం ఓట్లు బీజేపీకి ఎంతమాత్రం పడవన్న విషయం కూడా ఎవరూ విస్మరించలేనిది. కొన్ని రాష్ట్రాల్లో పేద ముస్లింలకు రిజర్వేషన్ ఇస్తున్నారు. దాని విషయంలో మోడీ గారి సహచరుడు అమిత్ షా తన పార్టీ వైఖరిని స్పష్టంగా ప్రకటిస్తున్నారు. ఈసారి అధికారంలోకి రాగానే ముస్లింల రిజర్వేషన్లు తీసేస్తామని చెబుతున్నారు. సరే, అధికారం మళ్ళీ వస్తే వీళ్ళకు ఎలా చేయాలని అనిపిస్తే అలా చేస్తారు. దేశం ఆ నిర్ణయాన్ని ఇష్టం లేకపోయినా భరించక తప్పదు. ముస్లింల విషయంలో అలా వ్యవహరిస్తూనే ఇప్పుడు ఎన్నికల ప్రచారం సందర్భంగా శుక్రవారం నాడు మోడీ గారు అద్భుతమైన కొన్ని మాటలు జనం మీదకి వదిలారు. ‘‘హిందు, ముస్లిం అని నేను విడదీయను. చిన్నప్పుడు ఈద్ కూడా జరుపుకునేవాడిని. పక్కింటి ముస్లింలు మాకు ఆహారం పెట్టేవారు’’ అని ప్రేమతో కూడిన మాటలు చెబుతున్నారు. గోధ్రా దుర్ఘటన సందర్భంగా గానీ, కేంద్రంలో అధికారంలోకి రావడానికి గానీ, అధికారంలోకి వచ్చిన తర్వాత మోడీ గానీ, ఆయన పార్టీ వారుగానీ ముస్లింల విషయంలో చేసిన వ్యాఖ్యానాలు వారికి గుర్తుండక పోవచ్చుగానీ ముస్లింలు మరచిపోరు కదా. సరే, ఉత్తర ప్రదేశ్‌లో ప్రచారం చేస్తూ మోడీ గారు ఒక దారుణమైన మాట అన్నారు. కాంగ్రెస్, సమాజ్ వాది పార్టీ అధికారంలోకి వస్తే అయోధ్యలోని రామమందిరాన్ని వాళ్ళు కూల్చేస్తారట. ఇంతకంటే దారుణమైన స్టేట్‌మెంట్ మరొకటి వుంటుందా? ఇది మతం పేరుతో రాజకీయాలు చేయడం కాదా? ‘మోడీ’ అనే పేరును తిట్టినందుకు రాహుల్ గాంధీ పార్లమెంట్ సభ్యత్వాన్నే రద్దు చేయించారు. మరి మతం పేరుతో రాజకీయ విమర్శలు చేసినందుకు ఏం చేయాలి? 
పల్నాడు జిల్లాలో పోలింగ్ సందర్భంగా, ఆ తర్వాత అల్లర్లు జరిగిన నేపథ్యంలో జిల్లా కలెక్టర్ ను, తిరుపతి ఎస్పీని ఎన్నికల సంఘం బదిలీ చేసింది. ఈ నేపథ్యంలో, పల్నాడు జిల్లాకు కొత్త కలెక్టర్ ను నియమిస్తూ ఈసీ ఉత్తర్వులు జారీ చేసింది. పల్నాడు జిల్లాకు శ్రీకేశ్ బాలాజీ లట్కర్ ను కలెక్టర్ గా నియమిస్తున్నట్టు పేర్కొంది. ఈసీ ఈ సాయంత్రం లోగా తిరుపతి, పల్నాడు, అనంతరం జిల్లాలకు కొత్త ఎస్పీలను కూడా ప్రకటించనుంది. సీఎస్ పంపిన పేర్లను పరిశీలిస్తున్న ఈసీ కాసేపట్లో ఉత్తర్వులు వెలువరించనుంది.ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల అనంతరం పల్నాడులో జరిగిన హింసపై ఎన్నికల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని సీఎస్‌, డీజీపీలకు కమీషన్‌ ఆదేశాలు జారీ చేసింది. అంతేకాదు భవిష్యత్తులో అలాంటి పరిస్థితి తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఎస్పీలందరినీ ఆదేశించింది. ఈ క్రమంలోనే కమిషన్ వారి స్థాయిలో కేసులను సమీక్షించింది. చట్ట ప్రకారం, మోడల్ ప్రవర్తనా నియమావళి వ్యవధిలో, దోషులపై ఛార్జిషీట్‌ను సకాలంలో దాఖలు చేయడంపై తగిన నిర్ణయం తీసుకునేలా కఠినమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. దీంతోపాటు ఆ ఘటనల నేపథ్యంలో ఇటివల పల్నాడు జిల్లా కలెక్టర్ సహా పలువురిపై చర్యలు తీసుకుంది.
ALSO ON TELUGUONE N E W S
"Thangalaan," a period action movie starring Chiyaan Vikram, is directed by Pa Ranjith. The film features Parvathy Thiruvothu and Malavika Mohanan in key roles. Set against the backdrop of the Kolar Gold Fields, "Thangalaan" is based on real events. It is produced by KE Gnanavel Raja under the prestigious banner of Studio Green, in association with Pa Ranjith's Neelam Productions and Ms. Jyoti Deshpande of Jio Studios. The movie "Thangalan" is poised for a grand theatrical release soon. Latest, we hear is that the makers locked a date in mid june. The film will be hitting the big screens in June. The official announcement will be made very soon and aggressive promotions will be followed. Director Pa Ranjith plans to present Chiyaan Vikram in a new setting and in a distinct character. The ensemble cast includes Pashupathy, Harikrishnan, and Anbu Durai, among others.
National award winner and Kollywood star Suriya is in a never-before-seen-avatar in period saga Kanguva and the recently released teaser stuns everyone. It is evident that director Siva and his team are set to present a unique, larger-than-life epic fantasy film, which is rooted in the Tamil culture, for global audiences. Bollywood talented actor Bobby Deol is playing the powerful role of Udhiran in this movie. With each promotional material, hopes for this biggie grow stronger. The makers finding it tough to get a solo release date. Now, the team is eyeing for Diwali 2024. The official announcement regarding the release date will be out very soon. The film will be releasing in multiple languages in 2D and 3D. Human emotions, powerful performances and never seen before action sequences on a massive scale will be the core of the film. The film marks the debut of Bollywood Disha Patani in Tamil and rockstar DSP's return to Kollywood after a short hiatus. Kanguva is bankrolled by Studio Green in association with UV Creations. 'Kanguva' is going to give the audience an unforgettable cinematic experience as a visual wonder. The team will be updating soon interesting facts about the film that will add more flavour to the excitement of actor Suriya fans.
Anand Deverakonda's next Gam Gam Ganesha is fun action entertainer. This movie is being produced by Kedar Selagamshetty and Vamsi Karumanchi under the banner Hy-Life Entertainment. Uday Shetty is making his directorial debut with this film. This is Anand Devarakonda's first action movie in his career. The film is releasing worldwide in theaters on May 31st. After impressing with promotional content and interviews, makers planning to drop the theatrical trailer on May 20th. Pragati Srivastava, Karishma, Vennela Kishore, Jabardast Immanuel play other key roles in the film. Chaitan Bharadwaj took care of the music. The film is co produced by Anurag Paravatheneni.
"Santhana Prapthirasthu," a musical family entertainer, has been officially launched by producers Madhura Sreedhar Reddy and Nirvi Hariprasad Reddy. The film stars Vikranth and Chandni Chowdary in the lead roles. The movie's formal launch took place today in Hyderabad. Produced under the banners of Madhura Entertainment and Nirvi Arts, "Santhana Prapthirasthu" is directed by Sanjeev Reddy. Notably, the screenplay is penned by Sheikh Dawood Ji, known for his work on films like "Venkatadri Express," "Express Raja," and "Ek Mini Katha." At the launch event, the camera was switched on by producer and businessman Ambika Krishna, while Vasudha Foundation Chairman Mantena Venkata Ramaraju sounded the clapboard. Madhura Sreedhar Reddy directed the first shot, and the both producers handed over the script to director Sanjeev Reddy. Director Sanjeev Reddy stated, "The film is a musical family entertainer. From children to adults, the movie appeals to everyone. We are addressing a contemporary issue in an entertaining manner. The story revolves around a Warangal girl and a Hyderabad boy, portraying a problem faced by a newly married couple." Producers Madhura Sreedhar Reddy and Nirvi Hariprasad Reddy expressed their happiness at the formal launch, thanking Ambika Krishna and Mantena Venkata Ramaraju for their contributions. They emphasized that "Santhana Prapthirasthu" is a good musical family entertainer with Sunil Kashyap composing the music. Regular shooting is set to begin on the 8th of next month, with filming in the areas surrounding Hyderabad and Warangal. The cast includes Vikranth, Chandini Chowdary, Vennela Kishore, Abhinav Gomatam, Muralidhar Goud, Jeevan Kumar, Thagubothu Ramesh, and Rachcha Ravi.
The anticipation surrounding the magnum opus, Kalki 2898 AD, has reached a fever pitch among movie enthusiasts worldwide. With the announcement of the revelation of the fifth superstar and Bhairava’s best friend, Bujji, on 22nd May, 2024, excitement knows no bounds. In a fascinating behind-the-scenes glimpse titled ‘From Skratch EP4: Building A Superstar,’ the creators take us on an enthralling journey, starting from director Nag Ashwin's visionary inception back in June 2020. Described as a "superhero," "Bhairava’s best friend," and "Best Companion," Bujji build up has left netizens guessing and eager to know more about this much-talked-about 5th Superstar of the film. The 2-minute 22-second video even offers teasing glimpses, including a mysterious encounter with Prabhas in what appears to be a garage setting, heightening the eagerness for Bujji's grand debut on May 22nd. Moreover, a recent revelation into the realm of Kalki 2898 AD through Amitabh Bachchan's portrayal of Ashwatthama has left fans spellbound. The character reveal, celebrated as a true pan-Indian teaser, seamlessly weaves together languages such as Tamil, Telugu, Malayalam, Kannada, and English. Directed by the visionary Nag Ashwin, Kalki 2898 AD stands tall as the cinematic event of the year. With an ensemble cast featuring luminaries like Amitabh Bachchan, Kamal Haasan, Prabhas, Deepika Padukone, and Disha Patani, and supported by the esteemed Vyjayanthi Movies banner, the stage is set for a monumental release on 27th June , 2024.
నటీనటులు: యువ రాజ్ కుమార్, సప్తమి గౌడ, అచ్యుత్ కుమార్, సుధారాణి, హిత చంద్రశేఖర్, గోపాల్ కృష్ణ దేశ్ పాండే తదితరులు ఎడిటింగ్: ఆశిష్ కుసుగొల్లి మ్యూజిక్: బి. అజనీష్ లోక్ నాథ్ సినిమాటోగ్రఫీ: శ్రీషా కుడువల్లి నిర్మాతలు: విజయ్ కిరగందుర్ రచన, దర్శకత్వం: సంతోష్ ఆనంద్ రామ్ ఓటీటీ : అమెజాన్ ప్రైమ్ వీడియో కథ:  ఓ ఇంజనీరింగ్ కాలేజీలో యువ(యువ రాజ్ కుమార్) ఫైనల్ ఇయర్ చదువుతుంటాడు. అదే కాలేజిలో చదువుతున్న సిరి(సప్తమి గౌడ), యువ ప్రేమించుకుంటారు. వీళ్ళు చదివే కాలేజీలో రెండు గ్యాంగ్ ల మధ్య నిత్యం గొడవలు జరుగుతుంటాయి. అయితే అందులో ఈ గ్యాంగ్ ల వెనక పెద్ద పెద్దోళ్ళు ఉండటంతో కాలేజీ యాజమాన్యం కూడా వారిపై ఏ యాక్షన్ తీసుకోలేకపోతుంది. దాంతో యువ వారికి ఎదురెళ్తాడు. అయితే యువ ఓ రెజ్లర్. రెజ్లింగ్ లో అతని కోచ్ నేరం చేశాడని, గేమ్ గెలిచేందుకు తప్పు చేశాడని ఆధారాలు దొరుకుతాయి. దాంతో యువని రెజ్లింగ్ కాంపిటీషన్ నుండి తీసేస్తారు. అంతేకాకుండా అతనిపై రెండు సంవత్సరాలు నిషేధం విధిస్తారు. మరోవైపు యువ వాళ్ళ నాన్న శంకర్ (అచ్యుత్ కుమార్) అప్పులు చేస్తాడు. యువ వాళ్ళ నాన్న శంకర్.. తన కూతురు శ్వేత వివాహాన్ని అప్పులు చేసి జరిపిస్తాడు. ఆ తర్వాత అప్పులిచ్చిన వాళ్ళు ఇంటికి వచ్చి గొడవలు చేస్తుంటే భరించలేక ఇల్లు వదిలి వెళ్ళిపోతాడు. యువ కాలేజీ గొడవల్లో ఉంటూ వాళ్ళ నాన్న కోసం ఎదురుచూస్తుంటాడు‌. యువ రెజ్లింగ్ లో పాల్గొన్నాడా? అతని నాన్న కల నెరవేర్చాడా? కాలేజీ గొడవల్లో యువ లైఫ్ ఎలా మారిపోయిందనేది మిగతా కథ.. విశ్లేషణ: ఇంజనీరింగ్ కాలేజీలో‌ జరిగే గొడవలతో కథ ఆసక్తిగా మొదలవుతుంది. ‌యువ చుట్టూ సాగే కథాంశం కావడంతో అతడికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడు దర్శకుడు. రెజ్లింగ్ కాంపిటీషన్, కాలేజీలో‌ రెండు గ్యాంగ్ ల‌ మధ్య తరచూ జరిగే గొడవ.. మధ్య మధ్యలో హీరో-హీరోయిన్ మధ్య లవ్ ట్రాక్.. పాటలు అంతే. ఇంతకు మించిన కథ ఏం ఉంటుందని దర్శకుడు అనుకున్నాడు.. అందుకే తెలుగు ఆడియన్స్ కి అంతగా కనెక్ట్ కాలేదు. మన తెలుగు సినిమాలలో ఈ తరహా సినిమాలు చాలానే వచ్చాయి. మనం ఈ యువ చూస్తుంటే.. జగడం, జోష్ మూవీలు రెండు కలిపి చూస్తున్నామా అనే ఫీలింగ్ కలుగుతుంది. అయితే యూత్ ని ఆకట్టుకోవడానికి కాలేజీని ఎంచుకున్నట్టుగా.. మాస్ ఆడియన్స్ కి నచ్చేలా సీన్లని రాసుకున్నట్టుగా ఉంటుంది. ఇక అందరు అమ్మ సెంటిమెంట్, చెల్లి లేదా అక్క సెంటిమెంట్ వాడుకుంటే  దర్శకుడు సంతోష్ ఆనంద్ రామ్.. నాన్న సెంటిమెంట్ ని వాడుకు‌న్నాడు. ఇక సప్తమి గౌడతో సాగే లవ్ జర్నీ పెద్దగా కనెక్ట్ కాలేదు. ఏదో ఉందా అంటే ఉందా అని అనుకు‌నేలా ఆమె పాత్ర ఉంటుంది. భీమిలి కబడ్డీ జట్టులో కోచ్ కిషోర్ కుమార్ ని చూసి.. ఈ సినిమాలో యువకి రెజ్లింగ్ కోచ్ గా తీసుకున్నట్టు అనిపిస్తుంటుంది. సినిమా మొత్తం కాలేజీ ఫైట్స్‌.. నాన్న కోసం హీరో వెతకడం.. రెజ్లింగ్ పోటీ అంటూ లాగుతూ లాగుతూ చివరి పది నిమిషాల్లో ఆ పోటీ పెట్టేశారు. దర్శకుడు సంతోష్ ఆనంద్ రామ్ మన తెలుగు సినిమాలన్నింటిని చూసి ఇన్ స్పైర్ అయినట్టుగా ఉంటుంది. ఫ్యామిలీ ఎమోషన్స్ కాస్త వర్కవుట్ అయ్యాయి. హాస్యం పూర్తిగా లోపించింది. సినిమా మొత్తం హీరో ఓ సీరియస్ ఎమోషన్ ని క్యారీ చేస్తుంటాడు. వీడోసారీ నవ్వితే చూడాలని ఉందిరా అని అన్నట్టుగా హీరో క్యారెక్టర్ ఉంటుంది. ఇంజనీరింగ్ పూర్తి చేసిన హీరో ఫుడ్ డెలివరీ బాయ్ గా చేస్తూ.. ఓవైపు గొడవలు.. మరోవైపు ఫ్యామిలీని చూసుకోవడం.. ఇలా అన్నింటిని తనొక్కడే చేసుకోవడంతో సినిమా మొత్తం అతనే కన్పిస్తుంటాడు. అడల్ట్ సీన్లు ఏమీ లేవు.‌ అసభ్య పదజాలం వాడలేదు. ఆశిష్ ఎడిటింగ్ బాగుంది. అజనీష్ సంగీతం పర్వాలేదు. శ్రీషా సినిమాటోగ్రఫీ ఆకట్టుకుంటుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి. నటీనటుల పనితీరు: యువగా యువ రాజ్ కుమార్ సినిమాకి ప్రధాన బలంగా నిలిచారు. కాదు సినిమా మొత్తం అతనే కనిపించాడు. సిరిగా సప్తమి గౌడ, శంకర్ గా అచ్యుత్ కుమార్, గిరిజగా సుధారాణి ఆకట్టుకున్నారు. మిగతావారు వారి పాత్రల పరిధి మేర నటించారు. ఫైనల్ గా.. కాలక్షేపం కోసం ఓసారి ట్రై చేయొచ్చు. రేటింగ్: 2.25/5 ✍️. దాసరి మల్లేశ్
అత‌ని పేరులో సూర్యుడుంటాడు! అందుకే, ఆయ‌న కార‌ణంగా ఎంద‌రి జీవితాల్లోనో... చీక‌ట్లు తొలిగి వెలుగులు విర‌జిమ్మాయి! ఎంద‌రెంద‌రో చిన్నారుల గుండెలు నేటికీ ఆగ‌కుండా, అలిసిపోకుండా కొట్టుకుంటున్నాయి అంటే... ఆ సూరీడీ క‌రుణ కిర‌ణాలే కార‌ణం! అంతే కాదు, ఆయ‌న ర‌వియే కాక శంక‌రుడు కూడా! శంక‌ర అంటే... సంతోష‌మూ, ఆనంద‌మ‌ని అర్థం! అందుకేనేమో... ఆయ‌న‌తో అనుబంధం పొందిన ఎవ్వ‌రూ ఆనందం పొంద‌కుండా ఉండ‌లేరు! అందుకు సాక్ష్యం... ఎన్నెన్నో కుటుంబాల్లో నిత్యం త‌డుస్తోన్న గొంతుక‌లు! మ‌న ర‌విశంక‌ర్ స‌ర్ అందించిన త్రాగునీరే వాళ్ల క‌ళ్ల‌లోని ఆనంద‌పు క‌న్నీరు! కంఠంనేని ర‌విశంక‌ర్... ఇదొక పేరు కాదు...  నేడు ఆర్దికంగా ఎటువంటి స‌మ‌స్య‌లు, స‌వాళ్లు లేకుండా చ‌దువుకుంటోన్న వంద‌లాది మంది పేద విద్యార్థుల... నాలిక మీద నాట్యమాడే... మంత్రం! ప్ర‌జా సేవ‌కు... మాన‌వ సేవ రూపంలో.... మాధ‌వ సేవ‌కు... ప‌దివి, అధికారం త‌ప్ప‌క కావాలా? అస్స‌లు అక్క‌ర్లేదు అని నిరూపించారు ర‌విశంక‌ర్! ఆయ‌న ప‌ద‌వి కోస‌మో, ప‌ద‌వితోనో సేవ చేయ‌లేదు! ఆయ‌న‌కు సేవే ప‌ద‌వి! ఆప్తుల క‌ళ్ల‌లో కృత‌జ్ఞ‌తే... అధికారం! అందుకే, మ‌న ర‌విశంక‌రుడు... ఎల్ల‌లు లేని రాజు! ఎల‌క్ష‌న్లతో నిమిత్తం లేని.... రేడు!  కంఠంనేని అన్న ఇంటి పేరు సార్థ‌క‌మ‌య్యేలా... ఆయ‌న ఎన్నెన్నో కంఠాల్లో మార్మోగే... ఆప్త వాఖ్యం!  అయితే, జ‌న సేవ‌... ఆయ‌న హృద‌యం మాత్ర‌మే! ఆయ‌న మ‌స్తిష్కం పూర్తిగా భిన్నం! వ్యాపారం ఆయ‌న స‌హ‌జ విశేషం! దూర‌దృష్టి ఆయ‌న ప్ర‌త్యేక విజ‌య కార‌ణం! వాటి వ‌ల్లే ర‌విశంక‌ర్... ఇండియా న‌ట్టింట్లోకి ఇంకా ఇంట‌ర్నెట్ సాంకేతిక ల‌క్ష్మి సంపూర్ణంగా కుడి కాలుమోప‌క ముందే... ఎదురెళ్లి స్వాగ‌తించారు! ఒక విజ‌న్ తో... విజ‌య‌ల‌క్ష్మిని... ఆయ‌న తెలుగువ‌న్ రూపంలో పాతికేళ్ల కిందే ప్ర‌తిష్ఠాపించారు! ఇంట‌ర్నెట్, యూట్యూబ్, వీడియో కంటెంట్, డిజిట‌ల్ ప్లాట్ ఫామ్ వంటి ప‌దాలు వింటే... అత్య‌ధిక శాతం భార‌తీయులు... డిక్ష‌న‌రీలు తిర‌గేసే రోజుల్లోనే... ర‌విశంక‌ర్ తొలి భార‌తీయ అంత‌ర్జాల వేదిక‌కి పురుడు పోశారు! అందుకే, ఇప్ప‌టి వ‌ర‌కూ ఆయ‌న ఎన్నో వేల మందికి నేరుగా, పరోక్షంగా... ఉపాధినీయ‌గ‌లిగారు! కంఠంనేని ర‌విశంక‌ర్ ఒక క‌లువ అనుకుంటే.... ఆయ‌న‌కు ఎన్నో విధాల ప్రేర‌ణ‌నిచ్చి...వ్య‌క్తిగా, శ‌క్తిగా విర‌బూసేలా చేసిన వారు... తెలుగు దేశ‌పు చంద్రుడు! తెలుగు రాష్ట్రాల తేజ‌మైన మ‌న‌... చంద్ర‌బాబు నాయుడు! ఆయ‌న ప‌ట్ల త‌న‌కున్న అభిమానాన్ని, ఆరాధ‌నా భావాన్ని కంఠంనేని ర‌విశంక‌ర్... సీబీఎన్‌ గ్రాటిట్యూడ్‌ కాన్సర్ట్‌... సాక్షిగా చాటుకున్నారు! అస‌లు నిన్న‌టి త‌రాన్ని తిరుగులేని విధంగా ప్ర‌భావితం చేసిన ఆ మ‌హోన్న‌త నాయ‌కుడ్ని... ఈ త‌రానికి మ‌న ర‌విశంక‌ర్ మ‌హోత్కృష్టంగా ప‌రిచ‌యం చేసిన తీరు... మ‌హాద్భుతం! అయితే, బాబు నుంచీ విజ‌న‌రీ విల‌క్ష‌ణాన్ని, వ్యాపార చైత‌న్యాన్ని, సామాజిక బాధ్య‌త‌ని, పేద‌ల కోసం ఆరాటాన్ని... అన్నీ పుణికిపుచ్చుకున్న ర‌విశంక‌ర్... ఆయ‌న నుంచే పోరాట త‌త్వాన్ని కూడా ప్రోది చేసుకున్నారు! సైకోతో సై అంటే సై అని బ‌రి గీసి యుద్ధం చేశారు! జ‌గ‌న్ అక్ర‌మ కేసుల గ‌న్నుల ఎక్కుపెట్టినా... పాయింట్ బ్లాంక్ లో శ‌త్రువు క‌ళ్ల‌లోకి దీక్ష‌గా, తీక్ష‌ణంగా గురి చూశారు... మ‌న ర‌విశంక‌ర్! చివ‌ర‌కు జ‌గ‌న్నాట‌కాల క‌థలు కంచికి చేరాయి! కంఠంనేని వారి కంఠం మాత్రం... రైతుల ప‌క్షానా, రాజ‌ధాని అమ‌రావ‌తి ఆక్రంద‌న‌ల‌కు అండ‌గా... నిలుస్తూనే వ‌చ్చింది! ఆయ‌న సిల్వ‌ర్ స్క్రీన్ పై తెరిచిన‌... రాజ‌ధాని ఫైల్స్.... వైరి ప‌క్షాన్ని సిల్లీ ఫెలోస్ ని చేయ‌గ‌లిగాయి... జ‌నం ముందు! ద‌టీజ్... ర‌విశంక‌ర్!  తెలుగు వ‌న్ ఆయ‌న... సంస్థ‌! ఆయ‌నే... తెలుగులో నెంబ‌ర్ వ‌న్! ఎనీ డౌట్స్...
నటన కోసమే పుట్టిన నటుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. నూనూగు మీసాల వయసులోనే  బూజు పట్టిన ఇండస్ట్రీ రికార్డు లన్నింటికీ విముక్తి కలిపించి సరికొత్త  రికార్డులని సృష్టించాడు. అందుకే   ఆయన్ని మాన్ ఆఫ్ మాసెస్ అని పిలుస్తారు. ఆన్ ది స్క్రీన్ శత్రువులకి చెమటలు పట్టించే ఎన్టీఆర్ ఆఫ్ ది స్క్రీన్ ఎంతో దయా హృదయంతో ఉంటాడు.  ఈ విషయం చాలాసార్లు నిరూపితమయ్యింది. తాజాగా అలాంటి  సంఘటనే మరొకటి  జరిగింది గత సంవత్సరం మే 20 న ఎన్టీఆర్ సూపర్ హిట్ మూవీ సింహాద్రి రీ రిలీజ్ అయ్యింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ ఎత్తున విడుదలయ్యి కలెక్షన్స్ ల సునామీని సృష్టించింది. 2003 లో మూవీని చూడటానికి అవకాశం లేని వాళ్ళు  రీ రిలీజ్ లో  సిల్వర్ స్క్రీన్ మీద  చూసి ఎన్టీఆర్ నటనకి, డాన్స్ కి ఫైట్స్ కి ఫిదా అయ్యారు. ఇక ఆ సమయంలో వచ్చిన అమౌంట్ ని అభిమానులు పేదవాళ్ళకి అందచేశారు. ఎన్టీఆర్ ఆదేశాల మేరకు అమౌంట్ ని ఇస్తున్నామని చెప్పారు . ఉత్తరాంధ్ర, రాయలసీమ  జిల్లాల్లోని పేద వారు ఆ అమౌంట్ ని అందుకున్నారు. ఈ సంఘటనతో ఎన్టీఆర్ కి ఆయన అభిమానులకి సమాజం పట్ల ఉన్న ప్రేమ ఏ పాటిదో మరోసారి అర్ధమయ్యింది.అందుకు సంబంధించిన వీడియో కూడా  సోషల్ మీడియా లో ఉండటంతో  దాన్ని  చూసిన వాళ్ళందరు ఎన్టీఆర్ ని ఫ్యాన్స్ ని పొగుడుతు కామెంట్స్ చేస్తున్నారు ఇక  ఎన్టీఆర్  బర్త్ డే కి  కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యింది.  రెండు తెలుగు రాష్ట్రాల్లోని అభిమానులు ఆ సెలబ్రేషన్ ని ఘనంగా జరిపించడానికి ప్లాన్ చేస్తున్నారు. అన్ని దేవాలయాల్లో, మసీదుల్లో, చర్చిల్లో ప్రార్థనలు జరగబోతున్నాయి. మే 20 న ఆయన బర్త్ డే డేట్..అలాగే రేపు దేవర నుంచి సాంగ్ కూడా రిలీజ్ కాబోతుంది. దీంతో ఫ్యాన్స్ ఆనందానికి  అవధులు లేవు. ప్రెజంట్ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక చర్చ నడుస్తుంది. రేపటి నుంచి అంటే మే 19 నుంచి అక్టోబర్ 10 దాకా ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫుల్ బిజీగా ఉంటారని.  అక్టోబర్ 10 న దేవర  విడుదల కాబోతుంది      
Recently, Action Star Adivi Sesh has released Lyrical of Song #3 from ‘Honeymoon Express,’ at the Annapurna Studios 7 Acres Campus. Meeting started with Bala & Sesh reminiscing their past association in the US, when teen Sesh approached Bala’s company, for distribution of his debut film. Then, Sesh was trying to make it in Hollywood. Bala has expressed his delight to see Sesh as a successful star in India, instead of US. He thanked Sesh for taking the time for the lyrical release, despite the hectic back-to-back schedules of Goodhachari-2 & Dacoit. Briefing to Sesh about ‘Honeymoon Express,’ Bala termed it as, “A futuristic romantic comedy with surreal twists and a message about marriage, relationships and society.” Bala also called, ‘Honeymoon Express,’ a ‘musical,’ with singable numbers, skillfully tuned by Kalyani Malik, Spoorthi Jitender, complemented by RP Patnaik’s background score. Adivi Sesh watched the Lyrical Song, “Cute gaa.. Sweetu gaa..” written by Kittu Vissapragada and sung by Baahubali fame Deepu. Sesh praised the sweet composition, nice poetry, and classy picturization.   Bala said, being a disciple of Sirivennela Seetarama Sastry garu, he asked Kittu Vissapragada to pen the lyrics with Sirivennela’s inspiration, at his standards. He felt, Kittu has lived up to his expectations. Launching the third Lyrical Song “Cute gaa..Sweetu gaa,” Sesh expressed, “I sincerely wish ‘Honeymoon Express,’ to be a great hit. I’m sure, with such beautiful songs, it will be like a cool breeze in hot summer.” Jointly produced by KKR & Bala Raj, under the banner of New Reel India Entertainments Pvt. Ltd. ‘Honeymoon Express,’ is a family entertainer. ‘Honeymoon Express,’ is slated for a summer 2024 release.
ఎవరయ్యా అల్లు అర్జున్ ఫ్యాన్స్ విషయంలో నాగ బాబు తగ్గిందని చెప్పింది.  అ క్కడుంది మెగా సెకండ్ లయన్. జస్ట్  గ్యాప్ ఇచ్చానంతే  టైమింగ్ లో మనల్ని మించిన వాళ్ళు ఉండరనే చిరు డైలాగ్ కి తగ్గట్టుగా రాయల్ ఎంట్రీ ఇచ్చాడు. అసలు మ్యాటర్ ఏంటో చూద్దాం    అల్లు అర్జున్ ఉరఫ్ బన్నీ ఫ్యాన్స్ కి నాగబాబు మధ్య రెండు రోజుల క్రితం ట్విట్టర్ వేదికగా వార్ నడిచింది. మొన్న జరిగిన ఎలక్షన్స్ లో బన్నీ తమ ప్రత్యర్థి పార్టీ అభ్యర్ధికి మద్దతుగా నిలిచాడని చెప్పి మాతో  ఉంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైన పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైన మా వాడే  అంటూ  ట్వీట్ చేసాడు. దీంతో   బన్నీ ఫ్యాన్స్ నాగబాబు కి రివర్స్ కౌంటర్లు వేస్తు ట్వీట్ ల మీద ట్వీట్లు చేస్తు వచ్చారు. దీంతో నాగ బాబు ట్విట్టర్ నుంచి వైదొలిగాడు. కానీ  ఇప్పుడు లయన్ ఈజ్ బ్యాక్ అనే  రీతిలో ట్విట్టర్ లో కి వచ్చాడు. కాకపోతే ఐ హావ్  డిలిటెడ్ మై ట్వీట్ అంటు ఎంట్రీ ఇచ్చాడు. నేను నా ట్వీట్ ని తొలగిస్తున్నాను అని చెప్పాడు. అన్నట్టుగానే అల్లు అర్జున్ మీద చేసిన  పరాయి వాడు అనే ట్వీట్ ని తొలగించాడు. తగ్గాడా లేక చిరు నుంచి వచ్చిన ఆదేశంతోనే అలా చేశాడా అని మెగా ఫ్యాన్స్ మాట్లాడుకుంటున్నారు. ఏది ఏమైనా నాగబాబు ఒక్క రోజు వ్యవధిలోనే  ట్విట్టర్ కి రీ ఎంట్రీ ఇవ్వడం  ప్రాధాన్యత సంతరించుకుంది. మరి బన్నీ ఫ్యాన్స్ తమ ట్వీట్ లని మళ్ళీ కొనసాగిస్తారా లేదా అనేది చూడాలి. నాగ బాబు జనసేన పార్టీ జనరల్ సెక్రటరీ గా పని చేస్తున్నాడు. ఆ హోదాలోనే బన్నీ మీద ట్వీట్ చేసాడు. కానీ ఒక్కటి మాత్రం నిజం. మెగా ఫ్యాన్స్ చాలా మంది బన్నీ జనసేన తరుపున కాకుండా వేరే పార్టీ అభ్యర్థి ప్రచారానికి వెళ్లడం మీద కోపంగానే  ఉన్నారు. వాళ్ళ కోపం పుష్ప 2 కి ఎంత వరకు పని చేస్తుందో  చూడాలి. లేక సినిమా వేరు రాజకీయం వేరు అనే కాన్సెప్ట్ కి దాసోహం అవుతారో  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఆ ఒపీనియన్ పోల్ ఫలితాలు నిజంగా నిజం అయితే, కేరళలో మళ్ళీ సీపీఎం సారధ్యంలోని వామపక్ష కూటమి అధికారంలోకి వస్తుంది. ఇదే ఆ అద్భుతం. ఎందుకంటే, గత నాలుగు దశాబ్దాలలో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే కూటమి వరసగా రెండవసారి అధికారంలోకి వచ్చిన చరిత్ర లేనే లేదు. ఒక సారి ఎల్డీఎఫ్ అధికారంలోకి వస్తే ఐదేళ్ళ తర్వాత కాంగ్రెస్ సారధ్యంలోని ఐక్య ప్రజాస్వామ్య కూటమి(యూడీఎఫ్) అధికారంలోకి రావడం, దేవభుమిలో దైవ నిర్ణయమా అన్నట్లుగా ప్రతి ఎన్నికల్లోనూ అధికారం చేతులు మారుతూ వస్తోంది. అలాంటిది, ఈసారి ఒపీనియన్ పోల్స్ నిజమై వరసగా రెండవసారి వామపక్ష కూటమి అధికారంలోకి వస్తే, అది చరిత్రే అవుతుంది. ఇక ఒపీనియన్ పోల్స్ విషయానికి వస్తే, జాతీయ న్యూస్ ఛానెల్ ఏబీపీ, సీ ఓటర్ సంస్థలు సంయుక్తంగా ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఈ సర్వే ప్రకారం, 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో వామపక్ష కూటమికి 83 నుంచి  91 స్థానాలు, యూడీఎఫ్ కూటమికి 47 నుంచి 55 స్థానాలు మాత్రమే దక్కుతాయని తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో ఇలా జాతకాలు తిరగబడడంపై సోషల్ మీడియాలో,’లెగ్ మహిమ’ లాంటి జోక్స్  ట్రోలవుతున్నాయి. అయితే 2016లో జరిగిన ఎన్నికల్లో కేవలం 47 సీట్లకే పరిమితం అయిన కాంగ్రెస్’కు ఈసారి ఒకటీ అరా సీట్లు ఎక్కువస్తే, రావచ్చును. అదే కాంగ్రెస్’కు కాసింత ఊరట. అదలా ఉంటే, పశ్చిమ బెంగాల్లో సైతం పట్టు సాధించిన బీజేపే, కేరళలో మాత్రం పట్టు కాదు కదా, పట్టుమని పది సీట్లు తెచ్చుకునే స్థితిలో లేదు. నిజానికి, దేశంలో బీజేపీకి అసలు ఏ మాత్రం మింగుడు పడని రాష్ట్రాలు ఎవైన ఉన్నాయంటే కేరళ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల  పేర్లే ప్రముఖంగా వినిపిస్తాయి. ఈ సారి కూడా కమల దళం కేరళలో కాలు పెట్టె పరిస్తి లేదని సర్వే ఫలితాలు చెపుతున్నారు. ఎప్పటిలానే ఇప్పడు కూడా  బీజేపీకి సున్నా నుంచి రెండు సీట్లు వచ్చే అవకాశం ఉందని, సర్వేస్వరుల అభిప్రాయంగా ఉంది. కేరళలో మొత్తం 140 స్థానాలకు ఏప్రిల్ 6 తేదీన ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది. మే 2 తేదీన ఫలితాలు వెలువడతాయి. కేరళ ఎలక్షన్ పై యావత్ దేశం ఆసక్తి కనబరుస్తోంది.    
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఓటరు తీర్పుకు వెళుతున్నా, అందరి దృష్టి, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల ఏలుబడిలో ఉన్న ఉభయ తెలుగు రాష్ట్రాలు, మరీ ముఖ్యంగా ఇప్పటికే బీజేపీ కన్నుపడిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీల దుష్టి  మాత్రం పశ్చిమ బెంగాల్ పైనే వుంది.  పశ్చిమ బెంగాల్లో ‘అద్భుతం’ జరిగి బీజేపీ విజయం సాధిస్తే, ఇక  కమల దళం ఫోకస్, తెలంగాణకు షిఫ్ట్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఈ నేపధ్యంలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయంలో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. బెంగాల్లో బీజేపీ గెలిస్తే, ఇప్పటికే అంతర్గత కుటుంబ కలహాలతో సతమతవుతున్న తెరాస నాయకత్వానికి మరిన్నితిప్పలు తప్పవన్న మాట అంతఃపుర వర్గాలలో సైతం వినవస్తోంది.  పశ్చిమ బెంగాల్’లో ఎలాగైతే కమలదళం ఓ వంక తమ ట్రేడ్ మార్క్, హిందుత్వ రాజకీయాలు సాగిస్తూ, మరో వైపు నుంచి ‘ఆకర్ష్’ అస్త్రంతో అధికార పార్టీని నిర్వీర్యం చేసిన విధంగానే, ఇక్కడ కూడా ఫిరాయింపులను ప్రోత్సహింఛి పార్టీని నిట్టనిలువునా చీల్చే ప్రమాదాన్ని కొట్టివేయలేమని పార్టీ వర్గాలు కూడా అనుమానం వ్యక్త పరుస్తున్నాయి.  ఇప్పటికే తెలంగాణ  బీజేపీ నాయకులు 30 మంది తెరాస ఎమ్మెల్యేలు తమ టచ్ లో ఉన్నారని బెదిరిస్తున్నారు.అది నిజం అయినా కాకపోయినా..తెరాసలో అసంతృప్తి అగ్గి రగులుతోందనేది మాత్రం ఎవరూ కాదనలేని నిజం. అంతే కాకుండా రాష్ట్రానికి వచ్చిన కేంద్రనాయకులు ఎవరిని పలకరించినా, నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని ఎలాంటి సషబిషలు లేకుండా కుండబద్దలు కొడుతున్నారు.అందుకే, బెంగాల్లో బీజేపీ గెలిస్తే.. అనే ఊహా కూడా  గులాబీ గూటిలో గుబులు పుట్టిస్తోంది. అయితే, బెగాల్’లో బీజేపీ గెలిస్తే ఒక్క తెలంగాణలోనే కాదు, దేశ రాజకీయ వాతావరణంలోనే పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  అలాగే,  దేశ ముఖ చిత్రంలో కూడా పెను మార్పులు తప్పవని అంటున్నారు. అయితే రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరూహించెదరు..
పొగిడి చెడినవాడు లేడు. సమయోచితంగా పొగడలేని వారు అన్ని చోట్లా చెడిపోతారు. జీవితంలో కొందరికి జ్ఞానం ఒక దశలో వస్తుంది. అంతకు క్రితం నష్టమైపోయిన కాలాన్ని కూడదీసుకోవడానికి అన్నట్లుగా జ్ఞానోదయమైన మరుక్షణం నుండి అవతలివారిని అమితంగా, భరించలేనంతగా పొగడడం నేర్చుకుంటారు. ఇలాంటి వ్యక్తి తాను పొగిడేవాణ్ణి ఆకాశానికి ఎత్తేస్తాడు. 'ది స్కై ఈజ్ ది లిమిట్” అని రుజువు చేస్తాడు. అవతలి వ్యక్తి అలిసిపోయేంత వరకూ, లేక తాను అలిసేంత వరకూ పొగుడుతాడు.  ఒక్కొక్కసారి అక్కడ పొగడడానికి తగినంత విషయం లేనప్పుడు అతడి ఇంట్లో తనకు ఆతిథ్యమిచ్చిన ఆయన సతీమణి అమృతహస్తాన్ని, ఆవిడ వండి వడ్డించిన పదార్థాలు ఎంత రుచికరంగా వుంటాయో ఇలాంటి విషయాలను ఇరికించి మరీ చెప్తాడు. ఇలాంటి సబ్జక్టును గురించి ఎంతైనా చెప్పే వీలుంది. ఆ వంకాయ కూర, ఆ పాయసం, వారింటి నెయ్యి ఘుమఘుమలు, ఇట్లా చెప్పుకుపోతూ వుంటే దీనికి అంతుందా అనిపిస్తుంది. అక్కడ సన్మానంలో సన్మానితుడూ, ఉపన్యాసకుడూ అలసి పోయేలోగా శ్రోతలమైన మనం అలసిపోవడం ఖాయం. ఇలా ప్రసంగించేవాడికి సన్మానితుడు అసలెవరో తెలీని సందర్భాలు కూడా ఎదురావుతూ ఉంటాయి. అలాంటప్పుడు కూడా ఈ ప్రాసంగికుడు ఏ మాత్రం జంకడు. ఎవర్ని సన్మానిస్తున్నారో వారిని గురించి చీటిమీద మూడు ముక్కలు వ్రాసి ఇలా ఇవ్వండి. మూడునిమిషాల్లో ప్రసంగ పాఠంతో రెడీ అయిపోతాను. మీరు వేదికమీద ఆహ్వానితులు నలుగురికీ పూలమాలలు వేసేలోగా నా చెవిలో నాలుగుముక్కలు ఊదితే దంచి పారేస్తాను. ఎవరిని గురించి చెప్పే వాక్యాలైనా నాకు కంఠస్థమే, తడుము కోవలసిన అవసరముండదు. రాజకీయ, పారిశ్రామిక, విద్యావేత్తలెవరైనా సరే, కళాకారులు, సినిమా స్టారులైనా సరే. ఎవరికి తగిన సన్మాన వాక్యాలు వారికి వప్పజెప్పడానికి ఎప్పటికప్పుడు సిద్ధంగానే వుంటాను. గుటికెడు కాఫీ సేవించి గొంతు సవరించానంటే ఇక ఆ తర్వాత ఉపన్యాసం అనర్గళంగా సాగిపోతుంది" అని హామీ ఇస్తాడు. అన్ని రంగాల్లోనూ స్పెషలైజేషన్ చోటు చేసుకున్న నేటి కాలంలో పొగిడే కళలో కొందర్ని తర్ఫీదు చేసి, వారికి లైసెన్స్ మంజూరు చేయడంలో తప్పేమీ కనిపించదు అనిపిస్తుంది. ఈ లలితకళను శాస్త్రీయంగా ఎక్కడా అభ్యసించకపోయినా, అనేక సంవత్సరాల అలవాటు కొద్దీ దీనిని క్షుణ్ణంగా నేర్చినవారు మన రాష్ట్రంలో ఎందరో వున్నారు. ఇలాంటివి నేర్పటానికి  నెలకొల్పే సంస్థల్లో ప్రస్తుతానికి వీరిని అధ్యాపకులు గానూ, శిక్షకులుగానూ నియమించవచ్చు. ఒక బాచ్ విద్యార్థులు శిక్షణ పొందితే ఇక ఆ తర్వాత కావలసినంత మంది అధ్యాపకులు. సమోవా అనే చిన్న రాజ్యానికి ఒక రాజుండేవాడు. అతడి రాజ్యంలో డాక్టర్ విన్సెంట్ హైనర్ అనే పెద్దమనిషి కొన్నాళ్ళుండి కొంత ప్రజాసేవ చేశాడు. డాక్టరు మహాశయుడు ఆ రాజ్యాన్ని వదలి వెళ్ళే తరుణంలో ఆ రాజుగారు ఆయన గౌరవార్థం విందు ఏర్పాటు చేశాడు. ఆ సందర్భంగా రాజు డాక్టర్ను గురించి నాలుగు వాక్యాలు చెప్పాల్సిన సమయం ఆసన్నమైంది. కాని రాజు కుర్చీలో కదలకుండా కూచున్నాడు. రాజు లేచి నుంచోని ప్రసంగించకుండా అలానే కూచోనుండటం డాక్టర్ హైనర్కు ఆశ్చర్యం కలిగించింది. ఈలోగా పొగడ్తనే వృత్తిగా చేసుకున్న ఒక వక్త వచ్చి రాజు తరపున డాక్టర్ హైనర్ గురించి బ్రహ్మాండమైన వాక్యాలతో దంచి పారేశాడు. సుదీర్ఘమైన ఆ ప్రశంసా వాక్యాల తర్వాత హైనర్ కొంత కింధా మీదై. ఉచిత రీతిని సమాధానం చెప్పడానికి లేచి నుంచోబోయాడు. రాజుగారు హైనర్ను వారిస్తూ కూచోమంటూ సౌంజ్ఞ చేశాడు. "మీ తరపున ప్రసంగించటానికి కూడా ఒక వక్తను నియమించాను. ఇక్కడ మా రాజ్యంలో ఇలాంటి ప్రసంగాలు ఆ వృత్తి స్వీకరించిన వారే చేస్తారు. ఔత్సాహికుల్ని ప్రోత్సహించడం మా పద్ధతి కాదు" అని వివరించాడు. ఇది పొగడటానికి కూడా ఎంత ప్రతిభ ఉండాలో తెలియజేస్తుంది. వాక్చాతుర్యం మనిషికి ఎంత ముఖ్యమో స్పష్టపరుస్తుంది.                                    ◆నిశ్శబ్ద.
ఎవరైనా తమ వ్యక్తిగత ఎదుగుదలపై దృష్టి పెట్టాలి అనుకున్నప్పుడు మనల్ని మనం కొంత మెరుగుపరచుకోవాల్సి వుంటుంది. ఒక పద్ధతిలో ప్రయత్నిస్తే అది అసాధ్యమేమీ కాదు. ‘కష్టపడటం’ ఒక్కటే కాదు.. ఒక క్రమపద్ధతిలో ప్రయత్నించడం అవసరం. అందుకు నిపుణులు కొన్ని సూచనలు చేస్తున్నారు. ఆ సూచనల్లో మొట్టమొదటి సూచన... సమాచార సేకరణ. కేవలం చదువుకునే విద్యార్థులు, ఉద్యోగం కోసం ప్రయత్నించే వారికే ‘సమాచారాన్నిసేకరించే’ అవసరం వుంటుంది అనుకోవటం పొరపాటు అంటున్నారు నిపుణులు. పత్రికలు, ఇంటర్నెట్ వంటివి ‘విశ్వవ్యాప్త సమాచారాన్ని’ మన ముందు వుంచుతున్నాయి. ఎప్పటికప్పుడు ఆ సమాచారాన్ని తెలుసుకుంటూ అప్‌డేట్‌గా వుంటటం మనల్ని, మన వ్యక్తిత్వాన్ని, మన అవకాశాలని మెరుగుపరిచే మొట్టమొదటి అంశం అట. ‘అసాధ్యాలు’ అంటూ ప్రపంచం ముద్రవేసి వదిలేసిన వాటిని కూడా ఛాలెంజ్ చేసి సాధించినవారి కోసం వింటూంటాం. ఏంటి వాళ్ళ ధైర్యం అనిపిస్తుంది. వాళ్ళ ధైర్యమల్లా వారి బలాలని వారు  కరక్టుగా అంచనా వేయటమే. ఎప్పుడూ మన బలాలు, బలహీనతల గురించి సరైన అవగాహన కలిగి వుండాలన్నది నిపుణులు చేస్తున్న రెండో సూచన. ఓ పేపర్ పైన మన బలం, సామర్థ్యం వంటి వాటిని రాసిపెట్టుకోవాలి. అలాగే మన బలహీనతలు, భయాలు వంటి వాటిని ఇంకో కాగితం మీద రాసి పెట్టుకోవాలి. దగ్గరి వ్యక్తులకి ఈ రెండు కాగితాలనీ చూపించి వారి సూచనలు అడగండి. అప్పుడు బలాలు, బలహీనలతని సమీక్షించుకుని... ఏం చేయొచ్చో.. ఏం చేయగలమో నిర్ణయించుకోవడం సులువవుతుంది. మనల్ని మనం మెరుగుపరచుకోవటానికి పెద్ద అడ్డంకి మన ‘భయాలు’. కొత్త వ్యక్తులతో మాట్లాడటమన్నా, నలుగురిలో తిరగడమన్నా, కొత్తపని మొదలుపెట్టడమన్నా భయపడేవాళ్ళు వుంటారు. ఆ భయాలని వదిలించుకోవటం ఏమాత్రం ఇష్టంలేదన్నట్టు పట్టుకుంటారు. అయితే మనల్ని మనం గెలవలేనప్పుడు ప్రపంచాన్ని ఏం గెలవగలం చెప్పండి? అందుకే ముందు మీలోని ఒక భయాన్ని గుర్తించి దాన్ని ఎదుర్కోవటం మొదలుపెట్టండి. నలుగురిలో తిరగటం భయమనుకోండి.. కష్టంగా అనిపించినా నలుగురిలో కలవటం మొదలుపెట్టాలి. కొన్ని రోజులపాటు ఇబ్బంది అనిపిస్తుంది. పారిపోవాలనిపిస్తుంది. అయినా వెనక్కి తగ్గక ప్రయత్నిస్తే ఒకరోజున అది అలవాటుగా మారిపోతుంది. ఒక భయాన్ని దాటగలిగినా చాలు- ఆ అనుభం, దాని నుంచి లభించిన ఆత్మవిశ్వాసం మిగిలిన భయాలని సులువుగా దాటేలా చేస్తాయి. మన మాటలు సూటిగా, స్పష్టంగా వుండాలి. అవి సూటిగా, స్పష్టంగా వుండాలంటే మన ఆలోచనలు కూడా స్పష్టంగా వుండాలి. మన ఆలోచనలు గజిబిజిగా వున్నప్పుడు సూటిగా మాట్లాడలేం. సూటిగా మాట్లాడని వ్యక్తుల మాటలకు సమాజంలో గౌరవం వుండదు. అందుకే మన పరిసరాలని శుభ్రం చేసుకున్నట్టు మన ఆలోచనలనీ క్లియర్‌గా పెట్టుకోవాలి ఎప్పటికప్పుడు. అలాగే మన పనితీరు కూడా గజిబిజిగా కాకుండా ఒక పద్ధతిగా వుండాలి. అది మనల్ని రిలాక్స్‌గా వుంచుతుంది. అలాగే చూసేవారికీ మనపట్ల మంచి అభిప్రాయం ఏర్పడుతుంది. నమ్మకం కుదురుతుంది. ఒత్తిడిని దూరంగా ఉంచగలిగితే చాలు... మన సామర్థ్యం రెండురెట్లు పెరుగుతుందట. అలా ఒత్తిడికి దూరంగా వుండాలంటే పనితీరు, సమయపాలన, పని విభజన వంటి వాటి పట్ల దృష్టి పెట్టాలి. అప్పుడు మన సామర్థ్యాన్ని వందశాతం వినియోగించుకోగలుగుతాం. అలాగే ఏ సమయంలోనైనా ఆత్మవిశ్వాసంతో, చెరగని చిరునవ్వుతో కనిపించే వ్యక్తులని ఇష్టపడని వారుండరు. చుట్టూ మనల్ని ఇష్టపడేవారి సంఖ్య పెరిగినకొద్దీ మన జీవితం ఆనందంగా మారిపోతుంది. కాబట్టి మనల్ని మనం ‘సరికొత్తగా’ ఆవిష్కరించుకోవడం అసాధ్యమేమీ కాదు. దీనికోసం నిపుణులు చేసిన సూచనలని తెలుసుకున్నారుగా.. ఇక ప్రయత్నించడమే మిగిలి వుంది. .....రమ  
నిస్సహాయత ఏమీ చేయలేని, చేయాలనే ఆరాటం ఉన్నా చేయడానికి అవకాశం లేని ఒకానొక ఒంటరి స్థితి. మనిషిని నిలువునా ఒత్తిడిలోకి తోసి, ఆత్మన్యూనతా భావాన్ని పెంచే పరిస్థితి. ప్రపంచంలో ఇలాంటి నిస్సహాయులు ఎందరో ఉన్నారు. ఇలాంటి వాళ్ళందరూ తిండి కోసం, ఉండటానికి నీడ కోసం ఎవరిని అడగాలో తెలియక, తమకు ఏమీ చేసే అవకాశాలు లేక అలా శూన్యం నిండిపోయినట్టు ఉండే స్థితి నిస్సహాయత. ఎందుకీ నిస్సహాయత?? ప్రపంచంలో మనిషి చేసుకుంటే ఎన్ని పనులు ఉండవు అని అనుకుంటారంతా. కానీ కొన్ని సార్లు అన్ని వైపుల నుండి తలుపులు మూసుకుపోయి చీకటిలో పడిపోయినట్టు ఉంటుంది. అలాంటి వాళ్ళు ఏదో ఒక చెయ్యి కోసం ఎదురుచూస్తూ ఉంటారు. ఆ తలుపులు ఎక్కడున్నాయో కనబడక, ఎవరైనా ఆ తలుపులు తీస్తారేమో అనే ఆశతో ఉంటారు. అందుకే ఏమీ చేతకానితనంతో అట్లా ఉండిపోతారు.  ఎక్కడెక్కడ?? నిస్సహాయతకు చోటు లేని ప్రదేశమంటూ లేదు. చోటివ్వని మనిషంటూ లేడు. చిన్న పిల్లాడి నుండి పెద్దవాళ్ళ దాకా ఎంతోమంది ఉంటారు. అయితే చాలా వరకు యూత్ లోనూ, మహిళల్లోనూ ఈ నిస్సహాయత బాధితులు ఎక్కువగా ఉంటున్నారు అనేది నమ్మితీరాల్సిన నిజం. మరీ ముఖ్యంగా కట్టుబాట్ల కంచెల మధ్య నలిగిపోతున్న ఎంతో మంది మహిళలు ఏదో చెయ్యాలని, తమ జీవితాలను మార్చుకోవాలని ఉన్నా అందరికీ పైపైన కనబడే విషయాలు వీళ్ళకేం బాగున్నారులే అనిపించేలా చేస్తున్నాయి. కానీ పైకి కనిపించేది వేరు, లోపల వాళ్ళ సంఘర్షణ వేరు. చేయూత!! నిస్సహాయంగా ఉన్న ఇలాంటి వాళ్ళ సంఘర్షణను గుర్తించే కొన్ని మహిళా స్వచ్చంధ చేయూత సంస్థలు ఆవిర్భవిస్తున్నాయి. అయితే ఇలాంటివి అందరికీ అందుబాటులో ఉండటం లేదు. కొన్ని మహానగరాలకు పరిమితమైతే మరికొన్ని దూరప్రాంతాలలో ఉండటం వల్ల ఎంతోమంది ప్రయోజనాలను పొందలేకపోతున్నారు. నిజం చెప్పాలంటే దిగువ తరగతి  కులాల మహిళల కంటే, ఉన్నత కులాల మహిళలలో ఇలాంటి నిస్సహాయులు చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ పరువు, సమాజం, గౌరవం అనే గీతల వెనుక నిస్సహాయంగా నిలబడుకుని శూన్యపు చూపులు చూస్తుంటారు. మధ్యలోనే చదువు ఆగిపోయి, సంప్రదాయాలలో చిక్కుకుపోయి, గడప దాటి బయటకు వెళ్లే స్వేచ్ఛ లేని స్త్రీ సమాజం ఎంతో ఉంది. ఒక్క తలుపు తెరవండి!! ఇలాంటి సమస్యలో చిక్కుకుని మానసికంగా నలిగిపోయేవాళ్లకు సొంత ఆలోచన క్రమంగా తగ్గిపోతూ ఉంటుంది. ఏమి చేయలేకపోతున్నామనే చేతగాని తనమే అలాంటి అజ్ఞానపు వృత్తంలో పడిపోవడానికి కారణం అవుతుంది. అయితే నీ చుట్టూ బోలెడు ప్రపంచం ఉందని, అవకాశాలు ఉన్నాయని, దారి కూడా ఉందని చెబుతూ నువ్వున్నది ఓ చిన్న గది  మాత్రమే ఒక్కసారి మొత్తం తరచిచూస్తే ఎక్కడో ఒకచోట తలుపులు చేతికి దొరుకుతాయి అని మాటలతో భరోసా నింపితే ఆంజనేయుడికి  గుర్తుచేయగానే శరీరం పెరిగినట్టు వీళ్లకు కూడా ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అలా మెల్లిగా మీ మాటలతోనే ఒక తలుపు తెరిచి వాళ్లకు చూపించినట్టవుతుంది కూడా.  ప్రపంచం పెద్దది!! మనుషులే చిన్నతనంతో ఉన్నారు!! ఆలోచిస్తే ఇదే నిజమని అనిపిస్తుంది. నిజానికి ఒకమనిషి బాగుపడితే చూసి సంతోషించేవాళ్ళు ఎక్కువ లేరు ఈ ప్రపంచంలో. ఎప్పుడూ అవతలి వాడిని ఎలా ముంచుదామా, వాడిది ఎలా లాక్కుందామా అనే ఆలోచనే తప్ప  అయ్యో ఇలా చేస్తే దారి కనబడుతుంది కదా వెళ్లి చెబుదాం అనుకునేవాళ్ళు ఎవరూ ఉండటం లేదు. ఎక్కడో, ఎవరో నూటికి ఒక్కరు ఉన్నా వాళ్ళ సాయం అందుకునే వాళ్ళు ఏ కొద్దీ మందో అంతే. మిగిలినవాళ్లకు పైన చెప్పుకున్నట్టు సంఘర్షణే మిగుల్తోంది. అందుకే మనుషులు తమ మనసును కాసింత పెద్దగా చేసుకోవాలి. అందులో ఎన్నో హృదయాలకు ప్రేమను పంచాలి. ఆ ప్రేమను అందుకున్న వాళ్ళు నిస్సహాయత నుండి బయటకొస్తారు నేస్తాల్లారా!! ◆వెంకటేష్ పువ్వాడ.
ఎండుద్రాక్ష సాధారణంగా పాయసం, స్వీట్ల తయారీలో ఉపయోగిస్తారు. కొన్నిచోట్ల వంటకాలలోనూ, స్పైసీ స్నాక్స్ లో కూడా వీటిని జత చేస్తుంటారు. అయితే ఎండుద్రాక్షను నానబెట్టి తినమని అమ్మమ్మల మొదలు అమ్మలు కూడా చెబుతూనే ఉంటారు. ముఖ్యంగా మహిళలు ఎండుద్రాక్ష నానబెట్టుకుని తినడం వల్ల చాలా ఆరోగ్యమని అంటారు.  ఎండుద్రాక్షను నానబెట్టి ప్రతిరోజూ తింటే  కలిగే అద్భుత ఫలితాలు ఇవే.. కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది.. రాత్రంతా నీటిలో నానబెట్టిన ఎండుద్రాక్ష తినడం   గుండెకు చాలా మంచిది.  నానబెట్టన ఎండు ద్రాక్ష  శరీరంలో చెడు కొలెస్ట్రాల్ తగ్గించి  మంచి కొలెస్ట్రాల్ ను  ప్రోత్సహిస్తుంది . ఇది  ధమనులలో ఏర్పడే  ప్రమాదాన్ని తగ్గిస్తుంది. వీటిని తినడం వల్ల ట్రైగ్లిజరైడ్ స్థాయిలు తగ్గుతాయి ఇది స్ట్రోక్,  గుండె జబ్బుల నుండి  రక్షించడంలో సహాయపడుతుంది. యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.. యాంటీ ఆక్సిడెంట్లు  శరీరంలో ఫ్రీ రాడికల్స్ డ్యామేజీని తగ్గిస్తాయి. ఎండుద్రాక్షలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. వీటిని నీటిలో నానబెట్టి తినడం వల్ల అందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు త్వరగా విడుదలవుతాయి. యాంటీ-ఆక్సిడెంట్లు క్యాన్సర్ వంటి ప్రమాదకరమైన వ్యాధుల నుండి  రక్షించడంలో సహాయపడతాయి. బరువు తగ్గించడంలో సహాయపడుతుంది.. ఎండు ద్రాక్ష  బరువు తగ్గడానికి సహాయపడుతుంది. ఎండుద్రాక్ష తినడం వల్ల  చాలా శక్తి లభిస్తుంది, దీని వల్ల  పదే పదే ఆకలి అనిపించదు.   ఆహారం ఎక్కువగా తినాలనే  కోరికలు కూడా తగ్గుతాయి. ఆహారం నియంత్రణ కారణంగా  బరువు పెరిగే అవకాశాలు తగ్గుతాయి.  తద్వారా  బరువు తగ్గడంలో కూడా సహాయపడుతుంది. రక్తపోటును నిర్వహిస్తుంది.. ఎండుద్రాక్షలో డైటరీ ఫైబర్ ఉంటుంది. ఇది రక్త నాళాలు గట్టిపడకుండా నిరోధిస్తుంది. దీని కారణంగా రక్తపోటు ఎక్కువగా ఉండదు. ఒకవేళ రక్తపోటు ఎక్కవగా ఉంటే దాని ప్రభావం తగ్గిస్తుంది.  అంతేకాకుండా ఇందులో పొటాషియం కూడా ఉంటుంది, ఇది అధిక రక్తపోటును కూడా నివారిస్తుంది. కాబట్టి రాత్రంతా నీటిలో నానబెట్టిన ఎండుద్రాక్ష తినడం వల్ల  రక్తపోటు అదుపులో ఉంటుంది. జీర్ణక్రియకు ప్రయోజనకరం.. ఆహారం జీర్ణం కావడానికి,  మలబద్ధకం నుండి ఉపశమనం పొందడానికి ఫైబర్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఎండుద్రాక్షలో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది, ఇది జీర్ణక్రియకు సహాయపడుతుంది. నానబెట్టిన ఎండుద్రాక్ష తినడం వల్ల  పేగు ఆరోగ్యంగా ఉంటుంది. ఇది ప్రేగులలో ఆహారాన్ని తరలించడంలో సహాయపడుతుంది, ఇది ఉబ్బరం,  మలబద్ధకాన్ని నివారిస్తుంది. కాలేయానికి మంచిది.. బయోఫ్లావనాయిడ్స్ ఎండుద్రాక్షలో ఉంటాయి. ఇవి  రక్తం,  కాలేయాన్ని నిర్విషీకరణ చేయడంలో సహాయపడతాయి . యాంటీ-ఆక్సిడెంట్లు  కూడా ఎండుద్రాక్షలో పుష్కలంగా ఉంటాయి. యాంటీ ఆక్సిడెంట్లు కాలేయానికి మేలు చేస్తాయి. శరీరం నుండి విషాన్ని తొలగించడానికి ఆరోగ్యకరమైన కాలేయాన్ని కలిగి ఉండటం చాలా ముఖ్యం. అందువల్ల ప్రతిరోజూ రాత్రిపూట ఎండుద్రాక్షలను నీటిలో నానబెట్టి తినడం  కాలేయానికి ప్రయోజనకరంగా ఉంటుంది.                                                     *నిశ్శబ్ద.
ఐస్ యాపిల్  అని ఇంగ్లీషులో అంటుంటారు.  వీటిని తెలుగు రాష్ట్రాలలో తాటిముంజలు అంటారు.  లేతగా ఉన్న తాటి ముంజలు తియ్యగా, మృదువుగా, లోపల కాసిన్ని తియ్యని నీళ్లలో తినడానికి ఎంతో బాగుంటాయి. వేసవి కాలంలో మాత్రమే అందుబాటులోకి రావడంతో అందరికీ వీటికి డిమాండ్ కూడా ఎక్కువే.. తాటిముంజలను ఈ వేసవి కాలంలో తప్పకుండా ఎందుకు తినాలో చెప్పే కారణాలు బోలెడు ఉన్నాయి. ఈ కారణాలు తెలిస్తే అస్సలు వదలకుండా తాటిముంజలను ఈ సీజన్ లో రుచి చూస్తారు. తాటిముంజలు తింటే శరీరానికి కలిగే లాభాలేంటో తెలుసుకుంటే.. హైడ్రేట్.. మండిపోతున్న ఎండల కారణంగా వేడి కూడా అధికంగా ఉంటుంది.  ఈ వేడి శరీరం మీద ప్రభావం చూపిస్తుంది.  దీని కారణంగా  శరీరంలో నీటి కొరత ఏర్పడుతుంది. దీన్నే శరీరం డీహైడ్రేట్ అవ్వడం అంటారు. తాటిముంజలు  తీసుకోవడం ద్వారా డీహైడ్రేషన్ నుండి బయటపడవచ్చు. తాటిముంజలు తింటే శరీరం కోల్పోయిన తేమ శాతం తిరిగి భర్తీ అవుతుంది. ఉదర సమస్యలు.. ఈ మండే వేసవి కాలంలో చాలామంది ఉదర సంబంధ సమస్యలు ఎదుర్కుంటారు. చాలామందికి కడుపులో వేడి పుట్టి అది కడుపు నొప్పి, విరేచనాలు, అజీర్తి వంటి సమస్యలకు దారితీస్తుంది.   అయితే తాటిముంజలు తింటే పొట్టకు చల్లదనాన్ని అందిస్తుంది. దీనిని తీసుకోవడం వల్ల  జీర్ణవ్యవస్థ బలపడుతుంది.  మలబద్ధకం, అజీర్ణం,  గ్యాస్ సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది.   రోగనిరోధక శక్తి.. చాలామందిలో రోగనిరోధక శక్తి బలహీనంగా ఉంటే వ్యాధులు, జబ్బులు తొందరగా వస్తాయి. అంతేకాదు ఇలా వచ్చిన జబ్బులు అంత తొందరగా తగ్గవు కూడా. కానీ తాటి ముంజలు తింటే  రోగనిరోధక శక్తి  బలపడుతుంది. తాటిముంజలలో ఉండే  విటమిన్ సి  రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. జీవక్రియను..   జీవక్రియ బలహీనంగా ఉంటే ఆహారం సరిగా జీర్ణం కాక శరీరంలో కొవ్వు పేరుకుపోతూ ఉంటుంది. దీని కారణంగా  బరువు పెరుగుతారు.   ఊబకాయం బాధితులుగా మారతారు. అయితే ఫైబర్ అధికంగా ఉండే తాటిముంజలను  తీసుకోవడం వల్ల జీవక్రియ వేగంగా పెరుగుతుంది.  ఇవి ఎక్కువసేపు కడుపు నిండుగా ఉన్న ఫీల్ ను ఇస్తాయి. తద్వారా అధికంగా తినకుండా కూడా నివారిస్తుంది. డయాబెటిస్‌.. తాటిముంజలు  మధుమేహ రోగులకు కూడా మేలు చేస్తుంది. ఇందులో తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్  ఉంటుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను  నియంత్రిస్తుంది.                                                                   *రూపశ్రీ.  
ఉల్లిపాయ బోలెడు వంటకాల్లో కనిపించే ఒక ముఖ్యమైన పదార్ధం. ఉల్లిపాయ పసుపు, తెలుపు, ఎరుపు వంటి రంగులలో లభిస్తుంది. ఉల్లిపాయ రుచి మాత్రమే కాకుండా, ఇందులో ఉన్న పోషకాల కంటెంట్ కారణంగా ఆహారంలో ప్రముఖంగా నిలిచింది. పచ్చి ఉల్లిపాయను తీసుకోవడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ఇది మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. పచ్చి ఉల్లిపాయ తినడం వల్ల కలిగే 10 ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే అలవాటు లేనివారు కూడా తినడం మొదలు పెడతారు. పచ్చి ఉల్లిపాయను తినడం వల్ల కలిగే 10 ప్రయోజనాలు.. రోగనిరోధక శక్తిని పెంచుతుంది.. పచ్చి ఉల్లిపాయలు విటమిన్ సి కి అద్భుతమైన మూలం, ఇది శరీరంలో రోగనిరోధక శక్తిని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. విటమిన్ సి బాక్టీరియా, వైరస్‌ల నుండి శరీరాన్ని రక్షించే తెల్ల రక్త కణాలను ఉత్పత్తి చేయడంలో సహాయపడుతుంది, జలుబు, ఫ్లూ వంటి సాధారణ వ్యాధులను నివారించడంలో పచ్చి ఉల్లిపాయలు ప్రముఖ పాత్ర పోషిస్తాయి. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.. ఉల్లిపాయలలో క్వెర్సెటిన్ వంటి యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి, ఇవి శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయి. ఇది హృదయనాళ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. పచ్చి ఉల్లిపాయల తీసుకోవడం వల్ల  రక్త ప్రసరణను మెరుగుపరచడంలో, అధిక రక్తపోటును తగ్గించడంలో, గుండె జబ్బుల ప్రమాదాన్ని నివారించడంలో కూడా సహాయపడుతుంది. జీర్ణక్రియలో సహాయపడుతుంది.. పచ్చి ఉల్లిపాయలలో డైటరీ ఫైబర్ ఉంటుంది, ఇది సరైన జీర్ణక్రియకు మరియు శరీరం నుండి వ్యర్థాలను తొలగించడానికి అవసరమైనది. ఫైబర్ పోషకాల శోషణను పెంచుతుంది. మలబద్ధకం, ప్రకోప ప్రేగు సిండ్రోమ్, హేమోరాయిడ్స్ వంటి వ్యాధులను నివారిస్తుంది. వాపును తగ్గిస్తుంది.. క్వెర్సెటిన్ అధికంగా ఉండే పచ్చి ఉల్లిపాయల్లో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి, ఇవి శరీరంలో మంట స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయి. ఇది ఆర్థరైటిస్, ఆస్తమా, బ్రోన్కైటిస్ వంటి పరిస్థితులను నియంత్రించడంలో సహాయపడుతుంది.  ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.. ఉల్లిపాయలు ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో దోహదపడే సల్ఫర్-రిచ్ కాంపౌండ్స్ యొక్క బాగా కలిగి ఉంటాయి. ఈ సమ్మేళనాలు కాల్షియం శోషణను ప్రోత్సహించడంలో, బోలు ఎముకల వ్యాధి ప్రమాదాన్ని నివారించడంలో సహాయపడతాయి. మెదడు పనితీరును పెంచుతుంది.. పచ్చి ఉల్లిపాయలు సల్ఫర్ సమ్మేళనాలను కలిగి ఉంటాయి, ఇవి మెదడులో న్యూరోట్రాన్స్మిటర్ల ఉత్పత్తిని పెంచుతాయి, ఇది మెరుగైన జ్ఞాపకశక్తి, శ్రద్ధ, ఏకాగ్రత స్థాయిలకు దారితీస్తుంది.  క్యాన్సర్ నివారిస్తుంది.. పచ్చి ఉల్లిపాయలో సల్ఫర్ అధికంగా ఉండే సమ్మేళనాలు, యాంటీఆక్సిడెంట్లు క్యాన్సర్‌ను నివారించడంలో సహాయపడతాయి. క్వెర్సెటిన్, ఫ్లేవనాయిడ్స్ మరియు అల్లిసిన్ వంటి సల్ఫర్ సమ్మేళనాలు శరీరంలో క్యాన్సర్ కణాల పెరుగుదలను అడ్డుకునే యాంటీ-కార్సినోజెనిక్ లక్షణాలను కలిగి ఉంటాయి. చర్మ ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది.. పచ్చి ఉల్లిపాయలు అధిక స్థాయిలో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ సి కలిగి ఉంటాయి, ఇవి చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు దోహదం చేస్తాయి. పచ్చి ఉల్లిపాయలను తీసుకోవడం వల్ల ముడతలు, వయస్సు మచ్చలు, పిగ్మెంటేషన్ స్థాయిలు తగ్గుతాయి.  ఆరోగ్యకరమైన, మెరిసే చర్మానికి ఇది దోహదపడుతుంది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది.. పచ్చి ఉల్లిపాయల్లో రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో కీలకమైన క్రోమియం అనే ఖనిజం ఉంటుంది. క్రోమియం ఇన్సులిన్ సామర్థ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది, ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి దారితీస్తుంది, తద్వారా మధుమేహం ప్రమాదాన్ని తగ్గిస్తుంది బరువు తగ్గడాన్ని ప్రోత్సహిస్తుంది పచ్చి ఉల్లిపాయలు తక్కువ కేలరీలు, అధిక ఫైబర్ కంటెంట్ కలిగి ఉంటాయి, ఇవి బరువు తగ్గడానికి దోహదం చేస్తాయి. అతిగా తినే పరిస్థితులను ఉల్లిపాయల్లో ఉండే ఫైబర్ తగ్గిస్తుంది. కేలరీలను భర్తీ చేస్తుంది.  చివరికి బరువు తగ్గడానికి. సహాయపడుతుంది.                                   ◆నిశ్శబ్ద.