Home

»

Latest News

ఆ పిల్లల పెంపకం తల్లిదండ్రులిద్దరి బాధ్యత: ఎవరి గురించి ఉపాసన చెప్పిందో ఈజీగా అర్థమైపోతుంది!

Nov 16, 2026 10:49AM


మెగా కోడలు ఉపాసన కొణిదెల ఈ మధ్య కాలంలో సోషల్ యాక్టీవిటీస్ లో చాలా చురుగ్గా పాల్గొంటు అభిమానులు, నెటిజెన్స్ కి లైఫ్ లో ఉపయోగపడే సలహాలు ఇస్తూ సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ గా ఉంటూ వస్తుంది. ఈ కోవలోనే తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు మరో సారి వైరల్ గా మారాయి. 

 విశాఖపట్నంలో జరిగిన ప్రతిష్టాత్మక సీఐఐ పార్ట్‌నర్‌షిప్ సమ్మిట్  2026 వేదికగా ఉపాసన పంచుకున్న ఆసక్తికరమైన ఆలోచనలు అందరి దృష్టిని ఆకర్షించాయి. పిల్లల పెంపకం అనేది కేవలం తల్లుల బాధ్యత మాత్రమే కాదని, అది తల్లిదండ్రులిద్దరి సమానమైన బాధ్యత అని ఆమె స్పష్టం చేశారు.

ఒక తండ్రి తన బిడ్డకి ఆహారం తినిపించినా లేదా డైపర్ మార్చినా చుట్టూ ఉన్నవారందరూ ఎంతో అద్భుతంగా చూస్తూ "ఓహ్, మీరెంతో మంచి తండ్రి" అంటూ ప్రశంసల వర్షం కురిపిస్తారని, కానీ అదే పనిని ప్రతిరోజూ వందలాది సార్లు నిస్వార్థంగా చేసే తను లేదా ఏ తల్లి అయినా చేస్తే మాత్రం ఎవరూ కనీసం అభినందించరని ఆమె ప్రశ్నించారు.

ఈ చిన్న విషయాల్లోనే సమాజంలో లింగ వివక్ష వేళ్ళూనుకుపోయిందని ఉపాసన అభిప్రాయపడ్డారు. భర్త రామ్ చరణ్ తమ పిల్లలకు తినిపిస్తున్నప్పుడు మొదట్లో తాను కూడా ఎంతో క్యూట్‌గా భావించేదానినని, కానీ కాలక్రమేణా అది ఏ ఒక్కరికో చేసే ఉపకారం కాదని, కేవలం ఒక తల్లిదండ్రులుగా సాధారణంగా చేయాల్సిన విధి మాత్రమేనని తనకు అర్థమైందని ఆమె పంచుకున్నారు.

ఇది కూడా చదవండి:ఆ డైరెక్టర్ నాతో అలా ప్రవర్తించాడు.. అప్పుడు అర్ధం కాలేదు.. తర్వాత తెలిసి షాక్ అయ్యా!

తండ్రి తన సొంత బిడ్డను చూసుకోవడంలో ఎలాంటి గొప్ప ఉపకారం చేయడం లేదని, అది కేవలం తన బాధ్యత మాత్రమేనని కుండబద్దలు కొట్టినట్టు చెప్పింది.ఇటువంటి ఆలోచనా విధానంలో మార్పు ముందుగా మన ఇళ్ల నుంచే ప్రారంభం కావాలని ఉపాసన పిలుపునిచ్చారు.

ఇళ్లలో ఈ సమానత్వం రాకపోతే, ఆఫీసులు మరియు బోర్డురూమ్‌లలో కూడా మహిళలకు నిజమైన సమాన అవకాశాలు రావడం అసాధ్యమని ఆమె బలంగా నొక్కిచెప్పారు. ఈ విలువలు కేవలం మాటలకే పరిమితం కాకుండా పాఠ్యపుస్తకాల్లోనూ, విద్యా విధానంలోనూ ఒక భాగం కావాలని ఆమె ఆకాంక్షించారు. అబ్బాయిలు చిన్న చిన్న గృహకృత్యాలు చేసినప్పుడు తల్లులు కూడా దాన్ని పెద్ద విషయంగా మార్చి విపరీతంగా అభినందించడం ఆపాలని, పిల్లల పెంపకం అనేది ఒక సహజమైన పద్ధతిగా మారినప్పుడే సమాజంలో నిజమైన ప్రగతి సాధ్యమవుతుందని ఉపాసన పేర్కొన్నారు. 

 

మీకు నచ్చవచ్చు :ప్రీతీ ముకుందన్ మీ ఇంటికొచ్చేస్తుంది: జస్ట్ ఇది చేయండి అంతే!
మీకు నచ్చవచ్చు:అల్లు అర్జున్ ఏం చెప్పాడు భయ్యా!

 

[Upasana Konidela, Parenting Equality, Ram Charan, Tollywood,CII Partnership Summit 2026]

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com