
ఎవరు ఎవరితో ట్రావెల్ అవ్వాలి, వివాహ బంధంతో ఒక్కటవ్వాలో పైనున్న డైరెక్టర్( గాడ్) ఫిక్స్ చేసే ఉంటాడనే మాట విశ్వంలో చాలా బలంగానే చెలామణి అవుతు ఉంటుంది. అందుకే కళ్ళ ముందు కోట్లు సంపాదించే వాళ్ళు ఉన్న ప్రేమ, మనసు చెప్పే ఆజ్ఞ ప్రకారం తనకంటే తక్కువ వాళ్ళతో ప్రేమ బంధంతో ఒక్కటవ్వుతారు. ఆ కోవలోనే ఒక హీరోయిన్ కి సంబంధించిన న్యూస్ వైరల్ గా మారింది.
రాశి.. హీరోయిన్ గా తన చరిష్మా కొనసాగుతున్న రోజుల్లో ఏ అబ్బాయి పెళ్లి సంబంధానికి వెళ్తున్నా నాకు అచ్చం రాశి లాగా ఉండే అమ్మాయి కావాలని కోరుకునే వాళ్ళు. దీన్ని బట్టి రాశి కట్ అవుట్ రేంజ్ అర్ధం చేసుకోవచ్చు. సెకండ్ ఇన్నింగ్స్ లో ఇప్పుడిప్పుడే తన జోరు సాగుతూ ఉంది రీర్లో ఫుల్ బిజీగా ఉన్న సమయంలోనే రాశి జీవితంలో ఓ ఆసక్తికరమైన ప్రేమకథ మొదలైంది.
రాశి నటించిన పలు సినిమాలకు శ్రీముని అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశారు. ఆ సమయంలో వీరిద్దరి మధ్య మంచి పరిచయం ఏర్పడి, అది కాస్తా గాఢమైన స్నేహంగా మారింది. అయితే, రాశి తండ్రి మరణించిన సమయంలో ఆమె తీవ్ర మానసిక వేదనకు గురయ్యారు. ఆ కష్టకాలంలో శ్రీముని ఆమెకు కొండంత అండగా, మోరల్ సపోర్ట్‌గా నిలిచారు.

ఆ తర్వాత రాశికి ఇంట్లో పెళ్లి సంబంధాలు చూడటం మొదలుపెట్టారు. అప్పటికే ఆమె స్టార్ హీరోయిన్ కావడంతో ఎంతోమంది బడా వ్యాపారవేత్తలు, కోటీశ్వరుల కుటుంబాల నుంచి సంబంధాలు వచ్చాయట. కానీ, రాశి మనసులో అప్పటికే శ్రీముని స్థానం సంపాదించుకున్నారు. కష్టసుఖాల్లో తోడుండే వ్యక్తి జీవిత భాగస్వామి అయితే బాగుంటుందని భావించిన రాశి, వచ్చిన కోటీశ్వరుల సంబంధాలన్నింటినీ వద్దని చెప్పేశారు.
ఇది కూడా చదవండి: పవన్ కళ్యాణ్, అన్నా లెజినోవా విడాకులపై శేఖర్ భాషా సంచలన వ్యాఖ్యలు!
అంతేకాదు, తన మనసులోని ప్రేమను నేరుగా శ్రీమునికే చెప్పి, పెద్దల అంగీకారంతో వివాహం చేసుకున్నారు. గతంలో ఓ ఇంటర్వ్యూలో రాశి స్వయంగా తన లవ్ స్టోరీ గురించి ఈ ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. పెళ్లి తర్వాత సినిమాలకు దూరమైన రాశి, ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ సినిమాతో తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు.

క్యారెక్టర్ ఆర్టిస్టుగా రాణిస్తూనే, బుల్లితెరపైనా తన సత్తా చాటారు. ముఖ్యంగా ‘జానకి కలగనలేదు’ సీరియల్‌తో తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువయ్యారు. ప్రస్తుతం ఒకవైపు సినిమాలు, మరోవైపు సీరియల్స్ చేస్తూ కెరీర్‌ను, ఫ్యామిలీ లైఫ్‌ను ఎంతో బ్యాలెన్స్డ్గా లీడ్ చేస్తూ వస్తుంది.
మీకు నచ్చవచ్చు:ఆ పిల్లలపై ఉపాసన వ్యాఖ్యలు వైరల్!
మీకు నచ్చవచ్చు:అల్లు అర్జున్ నయా వ్యాఖ్యలు వైరల్!
[Rashi,Tollywood news, Rashi Husband, gokulamlo Seetha, Tollywood]





