Home

»

Latest News

ఓటిటిలోకి క్రేజీ బ్యూటీ ప్రీతి ముకుందన్ హిట్ మూవీ: పక్కా రొమాంటిక్ థ్రిల్లర్. డోంట్ మిస్! 

Nov 16, 2026 9:51AM

ఎనీ టైం అగ్ర హీరోయిన్ అయ్యే అవకాశాలు ఉన్నాయనే టాక్ తో దూసుకుపోతూ ఉంది ప్రీతి ముకుందన్. యాక్షన్ కింగ్ అర్జున్ కూతురుగా చేసిన 'బ్లాస్ట్' చిత్రమే అందుకు స్మాల్ ఎగ్జామ్ ఫుల్.. అందం,నటన పోటాపోటీగా మెరుస్తూ ఉంటాయి.     


హీరో అశోక్ సెల్వన్ తో కలిసి ప్రీతి ముకుందన్ చేసిన సరికొత్త రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం 'అన్‍బిళ్‌ ఆవన్‌' (Anbil Avan). ఈ మూవీకి సంబంధించిన డిజిటల్ స్ట్రీమింగ్ అప్‌డేట్ ప్రస్తుతం సినీ ప్రియులని  ఆకట్టుకుంటోంది. బాక్సాఫీస్ వద్ద అక్టోబర్ 2వ తేదీన థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం, ఇప్పుడు ఓటీటీ వేదికగా ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమైంది. 


ప్రముఖ ఓటీటీ దిగ్గజం సోనీలివ్ (SonyLIV) వేదికగా నవంబర్ 20వ తేదీనడిజిటల్ ప్రీమియర్ కానున్నట్లు అధికారిక ప్రకటన వెలువడింది. థియేట్రికల్ రన్ ముగిసిన సుమారు ఏడు వారాల తర్వాత ఓటీటీలోకి వస్తుండటం విశేషం.ప్రేమ కథా చిత్రాలకి  భిన్నమైన యాక్షన్, థ్రిల్లర్ కోణాన్ని జోడించి తెరకెక్కగా ఆర్. కార్తికేయన్  దర్శకత్వం వహించాడు. విఘ్నేష్ రాజా అందించిన కథ, స్క్రీన్‌ప్లే ప్రధాన హైలైట్‌గా నిలిచాయి. 

ముఖ్యంగా, కోలీవుడ్‌లో క్లాసిక్ లవ్ ట్రాక్ టైటిల్‌ను పోలి ఉన్న ఈ సినిమా టైటిల్ టీజర్ విడుదలైన సమయంలోనే సోషల్ మీడియాలో దాదాపు 1.5 మిలియన్లకు పైగా క్యుములేటివ్ వ్యూస్‌ను సాధించి రికార్డ్ సృష్టించింది. కేవలం జోడీ పరంగానే కాకుండా, వీరిద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులను ఒక సరికొత్త లోకంలోకి తీసుకెళ్తాయి.

ఇది కూడా చదవండి:ఆకాశంలో ఒక తార స్పెషల్ ఏంటి!

సాబు మోన్ అబ్దుసమద్, కదిర్‌బాలు, మహా ఢిల్లీ గణేష్ తదితరులు కీలక పాత్రల్లో నటించి మెప్పించారు. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే,  కేవలం తమిళ భాషకే పరిమితం కాకుండా తెలుగు, మలయాళం, కన్నడ మరియు హిందీ సహా మొత్తం ఐదు ప్రధాన భాషల్లో ఏకకాలంలో స్ట్రీమింగ్ కానుంది.

దీనివల్ల ఇతర భాషా ప్రేక్షకులు కూడా తమకు నచ్చిన భాషలో ఈ రొమాంటిక్ థ్రిల్లర్ మ్యాజిక్‌ను ఇంట్లోనే కూర్చుని ఆస్వాదించే అవకాశం లభిస్తోంది.సినిమా థియేట్రికల్ విడుదలై మిశ్రమ స్పందనను సొంతం చేసుకున్నప్పటికీ, దీని భావోద్వేగాలు మరియు కథాంశం చాలా మంది వ్యక్తిగత హృదయాలను తాకాయని హీరో అశోక్ సెల్వన్ స్వయంగా ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.

గోవింద్ వసంత అందించిన మ్యూజిక్, నేపథ్య సంగీతం ప్రాణం పోశాయి. మరి  నవంబర్ 20 న అందాల భామ ప్రీతీ ముకుందన్  మీ ఇంట్లోకే వస్తుంది. ఏం చెయ్యాలో తెలుసుగా..ఎంజాయ్ యువర్ సెల్ఫ్!

 

[Preity Mukhundhan, Anbil Avan, Ashok Selvan , sony live, ott]

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com