
ఆది సాయికుమార్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా "అరుంధతి నక్షత్రం". ఈ సినిమాలో మేఘ శెట్టి, మధు దామరాజు హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న నిర్మాణ సంస్థ 7 పి.ఎం. ప్రొడక్షన్స్, శ్రీ చక్ర మూవీస్ బ్యానర్స్ ఈ సినిమాను నిర్మిస్తున్నాయి.
ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో చిత్ర దర్శకుడు రాహుల్ శ్రీనివాస్ రూరల్ ఫ్యామిలీ డ్రామా కథతో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఈ చిత్రాన్ని సందీప్ అగరం, అష్మిత రెడ్డి బాసాని, డా.సూర్యకాంతి కూచిభొట్ల నిర్మిస్తున్నారు.
ఈ రోజు హైదరాబాద్ లో "అరుంధతి నక్షత్రం" సినిమా పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి యాక్టర్ సాయి కుమార్ క్లాప్ ఇచ్చారు. ప్రొడ్యూసర్స్ రమేష్ పుప్పాల, సూర్యకాంతి కూచిభొట్ల కెమెరా స్విచ్ఛాన్ చేశారు. చిత్ర నిర్మాతలు స్క్రిప్ట్ అందించారు.

"అరుంధతి నక్షత్రం" సినిమా అనౌన్స్ మెంట్ సందర్బంగా మేకర్స్ స్పెషల్ వీడియో గ్లింప్స్ రిలీజ్ చేశారు. ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో సినిమాను గుర్తుచేసేలా మెమొరీ కార్డ్ లోని ఫొటోస్ ను పోస్టర్స్ గా ప్రింట్ చేసి "అరుంధతి నక్షత్రం" సినిమా రూపొందిస్తున్నట్లు తెలియజేశారు. ఈ అనౌన్స్ మెంట్ వీడియో ద్వారా ఇది ఒక మంచి రూరల్ ఫ్యామిలీ డ్రామా అని అర్థమవుతోంది.
ఈ నెలలోనే "అరుంధతి నక్షత్రం" సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించబోతున్నామని, తమ బ్యానర్ కు మరింత పేరు తెచ్చేలా ఈ సినిమా ఉంటుందని ప్రొడ్యూసర్స్ తెలిపారు.
ఇది కూడా చదవండి: రియల్ స్టార్ శ్రీహరి ఇంట పెళ్లి సందడి.. పెళ్లి పీటలెక్కనున్న పెద్ద కుమారుడు.!
[Arundhati Nakshatram Launch, Aadi Saikumar, The Great Pre Wedding Show, Rahul Srinivas]




.webp)

