Home

»

Latest News

‘ఆకాశంలో ఒక తార’ ట్రైలర్: ఆకాశాన్ని అందుకోవాలని అమ్మాయి ఆశ.. అండగా కృష్ణ.!

Nov 16, 2026 12:13PM

ప్రతి అమ్మాయికి కొన్ని కలలు ఉంటాయి. కానీ ఆ కలలను నిజం చేసుకునే అవకాశం అందరికీ దక్కదు. ముఖ్యంగా సంప్రదాయాలు, కుటుంబ ఆంక్షలు, సమాజం పెట్టే హద్దుల మధ్య తమ ఆశయాలను పక్కన పెట్టాల్సి వస్తుంది. అలాంటి ఓ అమ్మాయి తన కలను నెరవేర్చుకోవడానికి చేసే ప్రయత్నమే ‘ఆకాశంలో ఒక తార’ సినిమా ప్రధాన కథాంశంగా కనిపిస్తోంది.

దుల్కర్ సల్మాన్ హీరోగా, సాత్విక వీరవల్లి హీరోయిన్ గా నటించిన ఈ చిత్రానికి పవన్ సాధినేని దర్శకత్వం వహించారు. శ్రుతిహాసన్ కీలక పాత్ర పోషించారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ విడుదలైంది.

ఈ సినిమాలో సాత్విక వీరవల్లి అమ్ములు పాత్రలో కనిపించనున్నారు. ఓ మారుమూల గ్రామంలో పెరిగిన అమ్ములు చదువులో ప్రతిభ చూపించే అమ్మాయి. కానీ ఆమె ఉన్న కుటుంబ, సామాజిక పరిస్థితులు మాత్రం ఆమె ఆశయాలకు అడ్డుగా నిలుస్తాయి. ఉన్నత చదువులు చదివి ఆస్ట్రోనాట్ కావాలన్నది ఆమె కల. అయితే అమ్మాయికి పెళ్లి చేయడమే ముఖ్యమని భావించే సంప్రదాయ ఆలోచనల మధ్య తన లక్ష్యాన్ని ఎలా చేరుకుంటుంది? అనేదే కథలో ఆసక్తికరమైన అంశం.

దుల్కర్ సల్మాన్ ఈ సినిమాలో కృష్ణ పాత్రలో నటిస్తున్నారు. అమ్ములు జీవితంలోకి వచ్చిన తర్వాత ఆమె కలను అర్థం చేసుకుని, ఆ కలను నిజం చేసుకునేలా ప్రోత్సహించే వ్యక్తిగా ఆయన పాత్ర ఉండబోతోంది. సాధారణంగా ప్రేమకథల్లో కనిపించే రొమాన్స్‌కు భిన్నంగా, ఓ అమ్మాయి ఆశయాన్ని గౌరవించి ఆమె ప్రయాణంలో తోడుగా నిలిచే వ్యక్తి కథలో కీలకంగా కనిపిస్తున్నాడు. "నేనే తన కాలై.. తన కలను నడిపించాలని" అనే ఒక్క డైలాగ్ లోనే ఆ పాత్ర ఎలా ఉండబోతుందో చెప్పేశారు. 

ఇది కూడా చదవండి: అరుంధతి నక్షత్రం.. గ్రేట్ డైరెక్టర్‌తో ఆది సాయికుమార్ మూవీ.!

సినిమా కథలో ఆస్ట్రోనాట్ కావాలనే అమ్మాయి కలను ప్రధానంగా తీసుకోవడం ఆసక్తికరమైన విషయం. ఈ కథకు దుల్కర్ సల్మాన్ పాత్ర భావోద్వేగపరంగా బలాన్ని ఇచ్చేలా కనిపిస్తోంది. ‘మహానటి’, ‘సీతారామం’, ‘లక్కీ భాస్కర్’ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన దుల్కర్.. మరోసారి భిన్నమైన కథతో వస్తున్నారు.

మొత్తానికి ‘ఆకాశంలో ఒక తార’లో అమ్ములు ఆకాశాన్ని అందుకునే ప్రయాణం, కృష్ణ ఇచ్చే తోడు, వారి మధ్య ఏర్పడే అనుబంధం సినిమాకు ప్రధాన బలంగా నిలిచేలా ఉన్నాయి. మరి పవన్ సాధినేని ఈ స్ఫూర్తిదాయకమైన కథను ప్రేక్షకుల మనసులకు ఎంత దగ్గరగా తీసుకెళ్తారో నవంబర్ 20న తెలియనుంది.

మీకు నచ్చవచ్చు: 
ఒకే  ఫ్రేమ్‌లో చిరంజీవి, ప్రభాస్‌.. సందీప్‌ రెడ్డి అభిమానం చూపిస్తాడా.?
సెన్సార్ వాళ్లనే భయపెట్టిన మూవీ.. అప్పుడే ఓటీటీలోకి ఆ హారర్ థ్రిల్లర్‌.!

 

 

 

[Aakasamlo Oka Tara Trailer, Dulquer Salmaan, Satvika Veeravalli, Pavan Sadineni, Shruti Haasan]

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com