జీవితంలో నిజమైన విజయం ప్రశాంతత కావాలా.. ఇదిగో ఈ సూత్రాలు పాటించండి.. !
Published on: Mon Nov 16, 2026 11:20AM
జీవితంలో నిజమైన విజయం ప్రశాంతత కావాలా.. ఇదిగో ఈ సూత్రాలు పాటించండి.. !
.webp)
జీవితంలో మనం ఎంచుకునే మార్గం, ఎదుర్కొనే సవాళ్లు మన భవిష్యత్తును పూర్తిగా మార్చేస్తాయి. ప్రతి రోజూ ఉదయం నిద్రలేచింది మొదలు రాత్రి పడుకునే వరకు మనం ఎన్నో నిర్ణయాలు తీసుకుంటాం. ఆ నిర్ణయాలు మన వ్యక్తిగత జీవితంపైనే కాకుండా మన చుట్టూ ఉన్న సమాజంపై కూడా ఎంతో కొంత ప్రభావాన్ని చూపుతాయి. అందుకే మనం ఏ పనిచేసినా కాస్త ఆలోచించి, సరైన దిశలో అడుగులు వేయడం చాలా ముఖ్యం. ప్రస్తుత టెక్నాలజీ పెరిగిపోయిన డిజిటల్ కాలంలో ఉరుకులు పరుగుల జీవితం వల్ల చాలామంది మానసిక ప్రశాంతతను కోల్పోతున్నారు. కెరీర్ ఒత్తిళ్లు, కుటుంబ బాధ్యతలు, వ్యక్తిగత ఆశయాలను చేరుకోవాలనే ఆతురతలో పడి తమ ఆరోగ్యాన్ని , మనశ్శాంతిని నిర్లక్ష్యం చేస్తున్నారు. అయితే జీవితంలో నిజమైన విజయం సాధించాలన్నా, ప్రశాంతత కావాలన్నా కొన్ని జీవన సూత్రాలు పాటించాలి. అప్పుడే హ్యాపీగా ఉండగలుగుతారు. ఆ జీవన సూత్రాలు ఏమిటో వివరంగా తెలుసుకుంటే..
మానసిక ఆరోగ్యం..
శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యం కూడా మనిషికి చాలా ప్రధానమైనది. రోజూ కొంత సమయాన్ని వ్యాయామం, యోగా లేదా ధ్యానం కోసం కేటాయించడం ద్వారా ఒత్తిడిని దూరంగా ఉంచుకోవచ్చు. అలాగే, మనకు నచ్చిన అలవాట్లను ఇంప్రూవ్ చేసుకోవచ్చు, పుస్తకాలు చదవడం లేదా క్రియేటివిటీ ఫ్రూవ్ చేసుకునే పనులలో నిమగ్నం కావడం వల్ల మెదడు చురుగ్గా ఉంటుంది. జీవితంలో ఎదురయ్యే చిన్న చిన్న సమస్యలకు కుంగిపోకుండా, వాటిని ఒక అనుభవంగా భావించి ముందుకు సాగడమే నిజమైన జీవన శైలి గా భావించాలి.
పాజిటివ్ దృక్పథం..
ఎప్పుడూ సానుకూల దృక్పథంతో ఉండటం, చుట్టూ ఉన్నవారితో మంచి సంబంధాలు కలిగి ఉండటం మనల్ని మానసికంగా బలంగా మారుస్తుంది. ప్రతి రోజూ కొత్త విషయాలను నేర్చుకోవడానికి ఆసక్తి చూపాలి. అప్పుడే జీవితంలో ఎదుగుదల సాధ్యమవుతుంది.
.webp)
ప్రవర్తన..
సమాజంలో మంచి గుర్తింపు తెచ్చుకోవాలన్నా, సంతృప్తికరమైన జీవితాన్ని గడపాలన్నా మన ప్రవర్తన , ఆలోచనా విధానం ఎంతో ముఖ్యం. ఎప్పుడూ అహంకారం, గర్వం, ఇతరుల పట్ల చిన్న చూపు చూడటం వంటివి అస్సలు చేయకూడదు.
ఇది కూడా చదవండి చేతికి డబ్బు రాగానే ఈ పనులు చేయండి.. లేకపోతే బాధపడతారు..!
ఆందోళన..
చాలామంది రేపు ఏమవుతుందో అనే భయంతో .. ఆందోళన చెందుతూ ఉంటారు. దీని వల్ల వర్తమానంలో చేతిలో ఉన్న కాలాన్ని భయపడుతూ, ఆందోళనగా గడిపేస్తారు. దీని వల్ల ఎలాంటి ప్రశాంతత, చేయాలనుకున్న పనుల పట్ల ఏకాగ్రత ఉండవు. అందుకే భవిష్యత్తును గురించి అతిగా ఆందోళన చెందకుండా వర్తమానంలో జీవిస్తూ ప్రతి క్షణాన్ని ఆస్వాదించడం నేర్చుకోవాలి.
*రూపశ్రీ.


