Home

»

Latest News

పవన్ కళ్యాణ్, అన్నా లెజినోవా విడాకులపై శేఖర్ భాషా సంచలన వ్యాఖ్యలు!

Nov 16, 2026 11:11AM

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, అన్నా లెజినోవా విడాకుల న్యూస్ గురించి పలువురు చెప్పే మాటలకి ఇప్పట్లో ఎండ్ కార్డు పడే అవకాశం అయితే లేదు.  పవన్ కట్ అవుట్ కి ఉన్న వెయిట్  మరి. ఈ నేపథ్యంలో తాజాగా బిగ్‌బాస్ తెలుగు 8 కంటెస్టెంట్, ప్రముఖ రియాలిటీ స్టార్ శేఖర్ భాషా ఒక ఇంటర్వ్యూలో ఈ విడాకుల వెనుక ఉన్న అసలు కారణాలపై స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేసాడు  . 

పవన్ కళ్యాణ్ ఎలాంటి తప్పు చేయలేదని, ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడం వల్లే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది.ఒక వ్యక్తికి మరో వ్యక్తితో కలిసి ప్రయాణించడం ఇష్టం లేనప్పుడు, అక్కడ ప్రేమని  నటిస్తూ కాలం వెళ్లదీయడం కంటే విడిపోయి పరస్పరం గౌరవించుకోవడం చాలా ఉత్తమమని శేఖర్ భాషా అభిప్రాయపడ్డారు. అన్నా లెజినోవా విడిపోయి వెళ్లాలని భావించినప్పుడు, ఆమె నిర్ణయాన్ని గౌరవించి పవన్ కళ్యాణ్ ఆమె గౌరవానికి భంగం కలగకుండా చూసుకున్నారని తెలిపారు. 


అంతేకాకుండా, విడిపోయిన తర్వాత కూడా ఆమె పట్ల సముచిత గౌరవం ఉండాలనే ఉద్దేశంతోనే పవన్ ఈ విషయాన్ని గోప్యంగా ఉంచారని, బయట ఎక్కడా దీని గురించి పెద్దగా మాట్లాడలేదని వెల్లడించారు. వాస్తవానికి ఈ విడాకుల చర్చ గత మూడేళ్ల క్రితం నుంచే నలుగుతోందని, అయితే రాష్ట్రంలో కీలకమైన ఎన్నికల వాతావరణం ఉండటం, ఆ సమయంలో ఎన్నికల్లో భారీ మెజారిటీతో విజయం సాధించిన నేపథ్యంలో ఇలాంటి వ్యక్తిగత వార్తలు బయటికి వస్తే ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయాన్ని కొంతకాలం వాయిదా వేస్తూ వచ్చారని ఆయన స్పష్టం చేశారు.


విదేశీ వాతావరణం నుంచి మన దేశానికి వచ్చి ఇక్కడ స్థిరపడటం ఎంత కష్టమో ఆయన విశ్లేషించారు. రష్యా దేశానికి చెందిన అన్నా లెజినోవా మన దేశ సంస్కృతికి, ఇక్కడి జీవన శైలికి అలవాటు పడటం తొలినాళ్లలో బాగానే ఉన్నప్పటికీ, సుదీర్ఘ కాలం పాటు ఇక్కడ జీవించడం కొంచెం క్లిష్టంగా మారిందని తెలిపారు.

ఇది కూడా చదవండి: ఆ పిల్లల పెంపకం తల్లిదండ్రులిద్దరి బాధ్యత: ఎవరి గురించి ఉపాసన చెప్పిందో ఈజీగా అర్థమైపోతుంది!

అన్ని రకాల భౌతిక సౌకర్యాలను పవన్ కళ్యాణ్  కల్పించినప్పటికీ, రష్యా వాతావరణాన్ని లేదా ఆమె తండ్రిని ఇక్కడికి తీసుకురాలేము కదా. ఆమె మొదటి భర్త కూతురిని కూడా దత్తత తీసుకుని, పిల్లలందరికీ సమాన హోదా ఇచ్చి, ఏ లోటూ రాకుండా చూసుకుంటున్నారు.

 

 రాజకీయంగా ప్రత్యర్థులు పవన్ కళ్యాణ్‌పై ఎలాంటి అవినీతి ఆరోపణలు చేయలేక, వ్యక్తిగత జీవితాన్ని, మూడు పెళ్లిళ్ల అంశాన్ని మాత్రమే ప్రధాన అస్త్రంగా మలుచుకుంటున్నారని ఆయన మండిపడ్డారు. ఏది ఏమైనప్పటికీ, ఇరువర్గాల వ్యక్తిగత నిర్ణయాలను గౌరవించాల్సిన అవసరం ఉందని, అనవసరమైన రూమర్లను నమ్మవద్దని ఆయన అభిమానులకి, నెటిజన్లకి హితవు పలికారు.

 

మీకు నచ్చవచ్చు:ప్రముఖ డైరెక్టర్ పై హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు: ఆ రోజు ఏం చేసాడంటే! 
మీకు నచ్చవచ్చు:వాళ్ళ పిల్లలపై ఉపాసన వ్యాఖ్యలు వైరల్: ఆ ఇద్దరికి సరి సమానంగా!

 

 

[Pawan Kalyan, Anna Lezhneva, Shekhar Basha, Tollywood, Divorce Rumaros]


  

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com