Home

»

Latest News

ఆ డైరెక్టర్ నాతో అలా ప్రవర్తించాడు.. అప్పుడు అర్ధం కాలేదు.. తర్వాత తెలిసి షాక్ అయ్యా!

Nov 16, 2026 10:27AM


స్వరా భాస్కర్. బాలీవుడ్ లో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకుంది. ఇండస్ట్రీలో   అడుగుపెట్టిన కొత్తలో తాను ఎదుర్కొన్న చేదు అనుభవాలని , వర్క్‌ప్లేస్‌లో జరిగిన లైంగిక వేధింపుల గురించి తాజాగా చేసిన వ్యాఖ్యలు  దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టిస్తున్నాయి. 

2011లో విడుదలైన 'తను వెడ్స్ మను' చిత్రంతో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నప్పటికీ, ఆ సమయంలో ఇండస్ట్రీలో శాశ్వతంగా నిలదొక్కుకునేందుకు ఆమె ఎన్నో ఇబ్బందికర పరిణామాలను ఎదుర్కోవాల్సి వచ్చింది. అవకాశాల కోసం ఎదురుచూస్తున్న రోజుల్లో  ఓ ప్రతిష్టాత్మక చిత్రంలో అవకాశం వచ్చింది. ఆ సినిమా షూటింగ్ కోసం ఏకంగా 56 రోజుల పాటు సుదీర్ఘ షెడ్యూల్ కేటాయించగా, ప్రారంభమైన కొద్ది రోజులకే ఆ చిత్ర దర్శకుడి ప్రవర్తనలో ఊహించని మార్పులు వచ్చాయని స్వరా భాస్కర్ ఆవేదన వ్యక్తం చేశారు.

దర్శకుడి వింత పోకడలతో తనపై వేధింపులు మొదలయ్యాయని, ఆ సమయంలో తీవ్రమైన మానసిక సంఘర్షణను ఎదుర్కొన్నట్లు ఆమె గుర్తుచేసుకున్నారు. ఆనాడు తనకు ఎదురైన పరిస్థితి అసలు 'లైంగిక వేధింపుల' పరిధిలోకి వస్తుందనే ప్రాథమిక అవగాహన కూడా లేదని, ఎందుకంటే తనపై ఎలాంటి శారీరక స్పర్శ లేదా దాడి జరగకపోవడంతో దాన్ని పని ప్రదేశంలో జరిగే నేరంగా గుర్తించలేకపోయానని ఆమె చెప్పుకొచ్చారు.

అప్పట్లో ఇండస్ట్రీలో ఎవరితోనూ పెద్దగా పరిచయాలు లేకపోవడం, వెన్ను తట్టేందుకు ఎలాంటి సపోర్ట్ టీమ్ అందుబాటులో లేకపోవడంతో ఏం చేయాలో పాలుపోని నిస్సహాయ స్థితిలో కూరుకుపోయానని భావోద్వేగానికి గురయ్యారు. కెరీర్ ఇప్పుడిప్పుడే ప్రారంభమవుతున్న దశలో ఉన్నానని, మధ్యలోనే ప్రాజెక్ట్ వదిలేస్తే కొత్త అవకాశాలు కోల్పోతాననే భయంతో ఆ వేధింపులను సైలెంట్‌గా భరించాల్సి వచ్చిందని వెల్లడించారు.

ఇది కూడా చదవండి:ఓటిటిలోకి క్రేజీ బ్యూటీ ప్రీతి ముకుందన్ హిట్ మూవీ: పక్కా రొమాంటిక్ థ్రిల్లర్. డోంట్ మిస్! 

అయితే, కాలక్రమేణా దేశవ్యాప్తంగా కలకలం రేపిన 'మీటూ' (MeToo) ఉద్యమం సమయంలో ఇతర మహిళలు సోషల్ మీడియా వేదికగా పంచుకున్న భయానక అనుభవాలను చదివిన తర్వాతే నాలో  కనువిప్పు కలిగిందని, తోటి నటీమణులు చెప్పిన ఇన్‌సిడెంట్స్ చదివిన తదువతే.. అప్పట్లో తన కెరీర్ తొలినాళ్లలో ఆ దర్శకుడి ద్వారా తనకు జరిగింది కూడా అచ్చమైన లైంగిక వేధింపేనని స్పష్టమైన అవగాహనకు వచ్చానని ఆమె తెలిపారు.

సినీ పరిశ్రమలోకి కొత్తగా ప్రవేశించే యువ నటీమణులు ఎవరైనా సరే ఇలాంటి తప్పులని లేదా అనుచిత ప్రవర్తనను మొదట్లోనే గుర్తించి, గట్టిగా వ్యతిరేకించాలని, మౌనంగా భరించకుండా నమ్మకమైన వ్యక్తులను ఆశ్రయించాలని ఆమె ధైర్యంగా పిలుపునిచ్చారు. ప్రస్తుతం స్వరా భాస్కర్ వెల్లడించిన ఈ సంచలన విషయాలు నెట్టింట వైరల్ అవుతుండగా, సినీ లోకంలో మరోసారి కాస్టింగ్ కౌచ్ భూతం చర్చనీయాంశంగా మారింది.

 

మీకు నచ్చవచ్చు: ఇట్లు అర్జున్ షాకింగ్ రివ్యూ!
మీకు నచ్చవచ్చు:గిరిబాబు, చిరంజీవికి మధ్య అనుబంధానికి ఇదే గుర్తు!

 

[Swara Bhasker, Casting Couch,  Bollywood news, Director]

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com