LATEST NEWS
  భారత రాజకీయ యవనికపై భారతీయ జనతా పార్టీ తన ఉనికిని మరింత శక్తివంతం చేస్తోంది. దేశవ్యాప్తంగా కమలదళం సాగిస్తున్న విజయయాత్రను ప్రతిబింబించేలా పార్టీ తాజాగా విడుదల చేసిన ఒక రాజకీయ మ్యాప్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. గుజరాత్ వంటి కంచుకోటల నుంచి మొదలై, తాజాగా పశ్చిమ బెంగాల్ మరియు ఈశాన్య రాష్ట్రాల వరకు పార్టీ విస్తరించిన తీరును ఈ 'కాషాయ మ్యాప్' కళ్లకు కడుతోంది. కేవలం అధికారం మాత్రమే కాకుండా, ప్రజల హృదయాల్లోనూ చోటు సంపాదించుకున్నామన్న ఆత్మవిశ్వాసాన్ని బీజేపీ ఈ సందర్భంగా వ్యక్తం చేస్తోంది. ఈ మ్యాప్ విశ్లేషిస్తే, హిందీ హృదయ భూమిగా పిలిచే ఉత్తర భారతం మాత్రమే కాకుండా, ఒకప్పుడు అందని ద్రాక్షగా భావించిన ఈశాన్య ప్రాంతంలోనూ బీజేపీ పాగా వేయడం స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్‌కు గట్టి సవాల్ విసురుతూ, ఓటు బ్యాంకును గణనీయంగా పెంచుకోవడాన్ని పార్టీ ఒక కీలక విజయంగా భావిస్తోంది. గత ఎన్నికల ఫలితాలు మరియు తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో, దేశంలోని మెజారిటీ ప్రాంతం కాషాయమయం కావడాన్ని ఈ గ్రాఫికల్ మ్యాప్ ద్వారా పార్టీ శ్రేణులు ప్రజల్లోకి తీసుకెళ్తున్నాయి. మరోవైపు, ఈ అభివృద్ధి వెనుక ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వం మరియు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు (లబ్ధిదారుల రాజకీయం) ప్రధాన పాత్ర పోషించాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా గుజరాత్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో బీజేపీ తన పట్టును నిలబెట్టుకోవడమే కాకుండా, కొత్త ప్రాంతాల్లో ప్రాంతీయ పార్టీల ఆధిపత్యానికి గండి కొడుతూ ముందుకు సాగుతోంది. ఈశాన్య రాష్ట్రాల్లో వరుస విజయాలు పార్టీకి మరింత నైతిక బలాన్ని చేకూర్చాయి. అయితే, ఈ మ్యాప్‌పై విపక్షాల నుంచి భిన్నమైన స్పందనలు వస్తున్నాయి. కేవలం మ్యాప్‌లకు రంగులు వేయడం ద్వారా వాస్తవ పరిస్థితిని మరుగున పరచలేరని, నిరుద్యోగం, ద్రవ్యోల్బణం వంటి సమస్యలే ఓటర్ల ప్రధాన ప్రాధాన్యతని ప్రతిపక్ష నేతలు విమర్శిస్తున్నారు. అయినప్పటికీ, క్షేత్రస్థాయిలో పార్టీ కేడర్ మాత్రం ఈ సరికొత్త రాజకీయ మ్యాప్‌తో ఫుల్ జోష్‌లో ఉంది. రాబోయే ఎన్నికల్లో దక్షిణాది రాష్ట్రాల్లోనూ ఇదే స్థాయి ప్రభావాన్ని చూపాలని బీజేపీ వ్యూహరచన చేస్తోంది. మున్ముందు ఈ కాషాయ విస్తరణ ఏ మేరకు కొనసాగుతుందో చూడాలి. ముఖ్యంగా ఒడిశా, పశ్చిమ బెంగాల్ మరియు దక్షిణాది రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో బీజేపీ వేస్తున్న అడుగులు భారత రాజకీయ భవిష్యత్తును నిర్ణయించనున్నాయి. ప్రజల ఆశీర్వాదంతో పూర్తి స్థాయి భారతాన్ని కాషాయమయం చేయడమే లక్ష్యమని పార్టీ వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. నటుడు విజయ్ స్థాపించిన  తమిళగ వెట్రి కళగం టీవీకే పార్టీ సంచలన విజయానికి చేరువలో ఉంది. తాజా ట్రెండ్స్ ప్రకారం.. తమిళనాట దశాబ్దాల ద్రవిడ రాజకీయాలకు గండి కొడుతూ విజయ్ పార్టీ మ్యాజిక్ ఫిగర్‌కు చేరువ అవుతోంది. ఒక వేళ మ్యాజిక్ ఫిగర్ చేరకపోయినా.. రాష్ట్రంలో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించడం ఖాయం.    చారిత్రాత్మక విజయం ఖాయమని తేలడంతో.. విజయం  అభిమానుల సంబరాలు మిన్నంటాయి. అయితే.. ఈ నేపథ్యంలో  సినీ నటి త్రిష పేరు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది. విజయ్,  త్రిషల మధ్య ఉన్న స్నేహం..  వారి ఆన్-స్క్రీన్ కెమిస్ట్రీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. విజయ్ రాజకీయాల్లోకి వస్తున్నట్లు ప్రకటించినప్పటి నుండి త్రిష ఆయనకు మద్దతుగా నిలుస్తూ వచ్చారు.  ఇప్పుడు  టీవీకే పార్టీ ఘనవిజయాన్ని  త్రిష ఎలా సెలబ్రేట్ చేసుకుంటారనే ఆసక్తి నెటిజన్లలో పెరిగింది. వీరిద్దరూ కలిసి నటించిన  గిల్లి ,  లియో'చిత్రాల క్లిప్పింగ్స్‌ను విజయ్ ఫ్యాన్స్ షేర్ చేస్తూ,  రియల్ లైఫ్ విజయానికి రీల్ లైఫ్ జోడీ మద్దతు  అంటూ పోస్టులు పెడుతున్నారు. త్రిష కూడా విజయ్ విజయానికి సంబంధించి ఏదైనా పోస్ట్ పెడతారేమోనని నెటిజన్లు ఆతృతగా గాలిస్తున్నారు. 
కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలోని ఏకైక తెలుగు నియోజకవర్గం యానాం పలితం వెలువడింది. ఈ నియోజకవర్గం నుంచిఎన్డీయూ కూటమి అభ్యర్థి మల్లాడి కృష్ణారావు విజయం సాధించారు.  తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి గొల్లపల్లి అశోక్ పై నాలుగువేల ఐదు వందల ఓట్ల పైచిలుకు మెజారిటీతో గెలుపొందారు. ఈ ఎన్నికలో మొత్తం 35 వేల 840 ఓట్లు పోలయ్యాయి. వీటిలో మల్లాడి కృష్ణారావుకు 19 వేల 853 ఓట్లు వచ్చాయి. గత ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్న మల్లాడి కృష్ణారావు, ఈసారి తిరిగి బరిలోకి దిగి తన పట్టును నిరూపించుకున్నారు. యానాం నియోజకవర్గంలో ఆయనకు ఇది ఆరో విజయం కావడం విశేషం.
దేశవ్యాప్తంగా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు  వెలువడుతున్నాయి. ఈ ఐదు రాష్ట్రాలలో కేరళ, తమిళనాడు మినహా మిగిలిన మూడు రాష్ట్రాల్లో.. బీజేపీ నేతృత్వంలోని, ఎన్డీయే కూటమి  విజయం సాధించింది.  స్పష్టమైన ఆధిక్యతతో దూసుకెడుతూ మ్యాజిక్ ఫిగర్ దాటేసింది.   ఎన్నికల ఫలితాల్లో ఎన్డీయే కూటమి సాధించిన ఘన విజయంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు  హర్షం వ్యక్తం చేశారు. ఈ విజయం   ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంపై, ప్రజలకున్న  విశ్వాసానికి నిదర్శనమని   పేర్కొన్నారు.   సబ్ కా సాత్, సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్' స్ఫూర్తితో ప్రజల ఆకాంక్షలకు ప్రతిరూపంగా ఎన్డీయే నిలిచిందన్న ఆయన..  అభివృద్ధి పట్ల ఎన్డీయేకు ఉన్న నిబద్ధతకు  ప్రజలు పూర్తిస్థాయిలో మద్దతు ఇచ్చారని  పేర్కొన్నారు.    ఈ చారిత్రాత్మక విజయం సాధించినందుకు ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్, గెలుపొందిన అభ్యర్థులకు చంద్రబాబు ఈ సందర్భంగా అభినందనలు తెలిపారు. 
కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల  ఫలితాలలో ఎన్డీఏ  కూటమి ప్రభంజనం సృష్టిస్తోంది. ఈ ఎన్నికల్లో వెలువడిన  తొలి ఫలితంతో సీఎం ఎన్.రంగస్వామి  విజయకేతనం ఎగురవేశారు.   తట్టంచావడి నియోజకవర్గం నుంచి ఆయన భారీ మెజారిటీతో విజయం సాధించారు.  ఆయన పోటీ చేసిన మరో స్థానమైన మంగళంలోనూ భారీ ఆధిక్యంలో కొనసాగుతున్నారు.   మొత్తం 30 అసెంబ్లీ స్థానాలు ఉన్న పుదుచ్చేరిలో ఓట్ల లెక్కింపు ప్రారంభం నుంచి బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి ఏకపక్ష ఆధిక్యాన్ని ప్రదర్శిస్తోంది.  ఎన్డీయే  కూటమి 22 స్థానాలలో, కాంగ్రెస్ కూటమి ఆరు స్థానాలలో ఇతరులు ఒక స్థానంలో కొనసాగుతున్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ 16 కాగా, బీజేపీ కూటమి  22 స్థానాల్లో ముందంజలో ఉంది.  
ALSO ON TELUGUONE N E W S
  ఇళయ దళపతి విజయ్(Vijay)తమిళనాడు ఎన్నికల్లో విజయదుంధిబితో దూసుకుపోతున్నాడు. సిఎం అయ్యే ఛాన్స్ కూడా ఉండటంతో అభిమానుల ఆనందానికి అవధులు లేవు.  తాజాగా విజయ్ ఇంటికి త్రిష(Trisha)వెళ్లిన పిక్స్ సోషల్ మీడియాని బ్రేక్ డాన్స్ చేయిస్తున్నాయి. ఎన్నికలకి ముందు త్రిష, విజయ్ మధ్య ఇల్లీగల్ రిలేషన్ ఉందని ప్రత్యర్థి రాజకీయ పార్టీలు విమర్శలు చేసిన విషయం తెలిసిందే. స్వయంగా విజయ్ వైఫ్ కూడా ఇదే కారణాన్ని చూపిస్తూ విడాకుల కోసం కోర్టు మెట్లు ఎక్కింది. ఆ తర్వాత విజయ్ ఎంతో దైర్యంగా త్రిషని తీసుకొని ఒక మ్యారేజ్ ఫంక్షన్ కి హాజరయ్యాడు. పైగా ఒకే కలర్ కోడ్ డ్రెస్ తో. దీంతో ప్రత్యర్డులు విజయ్ పని  రాజకీయంగా అవుట్ అనుకున్నారు. కానీ తమిళ ఓటర్లు ఇవేం పట్టించుకోలేదు. విజయ్ ని ముఖ్యమంత్రి పీఠం దగ్గరకి దగ్గరుండి మరి తీసుకెళ్లే పనిలో బిజీగా ఉన్నారు.  Also read: Vijay: ఈ రోజు త్రిష పుట్టిన రోజు.. ఎన్నికల రిజల్ట్ విజయ్ ఇచ్చిన గిఫ్ట్ అనుకోవచ్చా!     పైగా ఈ రోజు త్రిష పుట్టిన రోజు కూడా కావడంతో విజయ్ కి త్రిష ఇచ్చిన గిఫ్ట్ అనే కామెంట్స్ కూడా చేస్తున్నారు. త్రిష ఈ రోజు ఉదయం తిరుమల తిరుపతి ఏడుకొండలవాడిని దర్శించుకొని డైరెక్ట్ గా విజయ్ ఇంటికి వెళ్లినట్టుగా తెలుస్తుంది.     
  ఏంటప్ప మీ సర్వేలు.. తమిళనాడు(Thamilandu)ని కొట్టబోయేది నేనే అంటూ ఇళయ దళపతి విజయ్(vijay)విజిల్ మోత మోగిస్తున్నాడు. మోత మోగించడమే కాదు మ్యాజిక్  ఫిగర్ కి దగ్గరగా ఉండటంతో సిఎం అవ్వాలని అభిమానులు గుళ్ళల్లో, మసీదుల్లో, చర్చిల్లో ప్రార్థనలు స్టార్ట్ చేసారు. ఈ క్రమంలోనే ఒక క్రేజీ న్యూస్ ఆ అందరి మధ్య చక్కర్లు కొడుతుంది. మరి ఆ న్యూస్ ఏంటో చూద్దాం  ఎన్నికలకి ముందు త్రిష(Trisha),విజయ్ మధ్య ఇల్లీగల్ రిలేషన్ ఉందని ప్రత్యర్థి రాజకీయ పార్టీలు విమర్శలు చేసిన విషయం తెలిసిందే. స్వయంగా విజయ్ వైఫ్ కూడా ఇదే కారణాన్ని చూపిస్తూ విడాకుల కోసం కోర్టు మెట్లు ఎక్కింది. ఆ తర్వాత విజయ్ ఎంతో దైర్యంగా త్రిషని తీసుకొని ఒక మ్యారేజ్ ఫంక్షన్ కి హాజరయ్యాడు. పైగా ఒకే కలర్ కోడ్ డ్రెస్ తో. దీంతో ప్రత్యర్డులు విజయ్ పని  రాజకీయంగా అవుట్ అనుకున్నారు. కానీ తమిళ ఓటర్లు ఇవేం పట్టించుకోలేదు. విజయ్ ని ముఖ్యమంత్రి పీఠం దగ్గరకి దగ్గరుండి మరి తీసుకెళ్లే పనిలో బిజీగా ఉన్నారు.  Also read: Jana nayagan: జన నాయగాన్ రిలీజ్ డేట్ వచ్చేసిందా.. పైగా కట్స్ లేకుండానే రాబోతోందా! పైగా ఈ రోజు త్రిష పుట్టిన రోజు కూడా కావడంతో విజయ్ కి త్రిష ఇచ్చిన గిఫ్ట్ అనే కామెంట్స్ కూడా చేస్తున్నారు. త్రిష ప్రస్తుతం తిరుమల తిరుపతి ఏడుకొండలవాడి సన్నిదిలో ఉంది.    
  'అప్పడి పోడు పోడు... అసతి పోడు పోడు కన్నాలే' అనే తన మాస్ సాంగ్  రీతిలోనే  ఇళయ దళపతి విజయ్(Vijay)తమిళనాడు ఎలక్షన్స్ లో మెజారిటీ సీట్స్ తో దూసుకుపోతున్నాడు. సిఎం అయ్యే ఛాన్స్  కూడా ఉండటంతో విజయ్ అభిమానుల ఆనందానికైతే అవధులు లేవు. తమిళనాడు మొత్తాన్ని బాణా సంచాలతో మోత మోగిస్తున్నారు. ఈ నేపథ్యంలో జన నాయగాన్ మూవీకి సంబంధించిన తాజా న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ డీటెయిల్స్ ఏంటో చూద్దాం. జన నాయగాన్ రిలీజ్ కి సెన్సార్ అభ్యంతరం వ్యక్తం చెయ్యడంతో పొంగల్ కానుకగా రిలీజ్ కావాల్సి ఉండగా వాయిదాపడిన విషయం తెలిసిందే. మరి ఇప్పుడు విజయ్ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించడం గాని అధికారాన్ని గుప్పిట్లో ఉంచుకునే  కింగ్ మేకర్ గా నిలబడటం ఖాయమని తెలుస్తుంది. దీంతో వారం రోజుల్లోనే జన నాయగన్ థియేటర్స్ లోకి రాబోతుందనే  న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. కొసమెరుపు ఏంటంటే ఎలాంటి సెన్సార్ కట్స్ లేకుండానే రిలీజ్ కాబోతుందనే న్యూస్ కూడా స్ప్రెడ్ అవుతుంది. అధికారం అనేది గాడ్ కంటే పవర్ ఫుల్ అనే విషయం తెలిసిందే. Also read:  Peddi vs jailer 2: వామ్మో మరి అంత రేటా.. వర్క్ అవుట్ అవుతుందా!  
సూపర్ స్టార్ రజినీకాంత్(Rajinikanth)కి ఉన్న స్టార్ డమ్ ఇంచు కూడా తగ్గలేదంటూ నిరూపించిన చిత్రం జైలర్(Jailer). రజినీ వరుస పరాజయాలకి కూడా భారీ సైజులోనే గుమ్మడి కాయ కొట్టింది. అలాంటి ఈ చిత్రానికి సీక్వెల్ గా తెరకెక్కిన జైలర్ 2 పై అంచనాలు ఏ రేంజ్ లో ఉంటాయో చెప్పక్కర్లేదు. తెలుగునాట కూడా అదే క్రేజ్. ఇప్పుడు తెలుగు బిజినెస్ కి సంబంధించిన ఆసక్తికర న్యూస్ సోషల్ మీడియాకి నూతనోత్సాహాన్ని తీసుకొస్తుంది. ఆ న్యూస్ ఏంటో చూద్దాం. రజినీ కాంత్ సినిమాలకి తెలుగులో మంచి మార్కెట్ ఉంటుంది. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల డబ్బింగ్ మరియు పంపిణీ హక్కుల కోసం టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్స్ మరియు డిస్ట్రిబ్యూటర్స్ మధ్య గట్టి పోటీ నెలకొంది. మేకర్స్ జైలర్  సీక్వెల్ తెలుగు  హక్కులని 60 కోట్లుగా నిర్ణయించారు. పార్ట్ 1  రెండు తెలుగు రాష్ట్రాల్లో 70 కోట్ల గ్రాస్ సాధించడంతోనే 60 కోట్లుగా నిర్ణయించారు. కానీ ఇక్కడ ఆసక్తికర విషయం ఏంటంటే జైలర్ తర్వాత వచ్చిన రజినీ సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద ఫెయిల్యూర్ గా నిలిచాయి. కూలీ తెలుగు రైట్స్ మాత్రం  52 కోట్లకి అమ్మగా సుమారు 50 కోట్ల కలెక్షన్స్ దగ్గరే ఆగింది.  also read: Janhvi Kapoor: అచ్చాయమ్మా ఇచ్చిపడేసింది.. వ్యూస్ కోసం అలాంటివి రాస్తారా మరి ఇప్పుడు జైలర్ 2 తెలుగు హక్కులని 60 కోట్లకి తీసుకుంటే అంత వసూలు చేస్తుందా అనే చర్చలు మొదలైనట్టుగా టాక్ . పైగా  జూన్ 12 న థియేటర్స్ లోకి వచ్చే వారం ముందే చరణ్ జూన్ 4 న 'పెద్ది'తో వస్తున్నాడు. మరి పెద్దికి హిట్ టాక్ వస్తే జైలర్ 2 కి థియేటర్స్ దొరుకుతాయా అనే చర్చ కూడా మొదలైంది. సన్ పిక్చర్స్ పై కళానిధి మారన్ నిర్మిస్తుండగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకుడు అనే విషయం తెలిసిందే.   
  అతిలోక సుందరి తనయ జాన్వీకపూర్(Janhvi kapoor)జూన్ 4 న అచ్చాయమ్మాగా 'పెద్ది'(Peddi)ని ఎన్ని ముప్ప తిప్పలకి గురి చేసిందో తెలియబోతుంది. అభిమానులు అయితే పెద్దితో జాన్వీ అగ్ర హీరోయిన్ గా ఎదగడం పక్కా అనే నమ్మకంతో ఉన్నారు. రీసెంట్ గా కొన్ని రోజుల క్రితం జాన్వీ కపూర్ మాట్లాడుతూ జీవితంలో జరిగిన ఒక బాధాకరమైన సంఘటన తర్వాత ఆల్కహాల్ కి బానిస అయ్యానని చెప్పిందనే మాటలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇప్పుడు ఈ విషయంపై జాన్వీ స్పందించింది. ఆ మాటలేంటో చూద్దాం. మద్యానికి సంబంధించిన వార్తలుని స్క్రీన్ షాట్ తీసి తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసి  'ఇలాంటి వార్తలు రాయడానికి మీకు సిగ్గుగా అనిపించడం లేదా. క్లిక్ బైట్స్ కోసం ఎంతటి అబద్ధాలనైనా ప్రచారం చేస్తారా. నేను ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటిస్తాను. ఫిట్‌నెస్ విషయంలో కూడా ఎంతో జాగ్రత్తగా ఉంటాను. కేవలం వ్యూస్ కోసం ఒకరి వ్యక్తిత్వాన్ని కించపరచడం సరైంది కాదు. కనీస వాస్తవాలని తెలుసుకోకుండా ఇలాంటి క్లిక్ బైట్ వార్తలు రాయడం మానుకోవాలని పేర్కొంది. Also Read: Varanasi: వారణాసికి షాక్ ఇచ్చిన హైదరాబాద్ వాటర్ బోర్డు అధికారులు.. రద్దు తప్పదా! సెలబ్రిటీల గురించి వార్తలు రాసేటప్పుడు బాధ్యతాయుతంగా ఉండాలని, కేవలం సంచలనం కోసం అబద్ధాలను ప్రచారం చేయకూడదని నెటిజన్లు కూడా జాన్వీకి మద్దతు తెలుపుతున్నారు.   
  మహేష్, రాజమౌళిలు వారణాసి(Varanasi)షూట్ కి ఇప్పుడు కొంచం గ్యాప్ ఇచ్చినా తిరిగి ఈ నెల 18 నుంచి హైదరాబాద్ లో స్టార్ట్ చేయనున్నారు. కానీ ఇప్పుడు ఆ  షూట్ జరిగే అవకాశాలు చాలా  తక్కువగా ఉన్నాయనే న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ డీటెయిల్స్ ఏంటో చూద్దాం. మేకర్స్ ఈ నెల 18 న హైదరాబాద్ గగన్ పహాడ్ ఏరియాలో వేసిన సెట్ లో నీటి అడుగున సన్నివేశాలు తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నారు. సదరు సన్నివేశాలకి శుద్ధి చేసే నీరు చాలా అవసరం అవుతుంది. సుమారు పదివేల లీటర్ల కావాలనేది అంచనా. దీంతో పదివేల లీటర్ల కెపాసిటీ ఉన్న 150 ట్యాంకర్ల నీరు కావాలని టీం హైదరాబాద్ వాటర్ బోర్డుకి దరఖాస్తు చేసుకుంది. కానీ  నగరంలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో పాటు నీటి కొరత కూడా ఉండటంతో వాటర్ బోర్డు వారణాసి టీం రిక్వెస్ట్ ని రద్దు చేసినట్టుగా సమాచారం. మరి ఊహించని ఈ సంఘటనతో షూట్ ని పోస్ట్ పోన్ చేస్తారా లేక వేరే మార్గాలతో స్టార్ట్ చేస్తారా అనేది చూడాలి. also read: Vijay: సినిమాకి ఉన్న పవర్ చూపిస్తూ 100 స్థానాల్లో విజయ్.. తిరుమల కొండపై త్రిష  మహేష్ అయితే ప్రెజెంట్ జర్మనీలోని అడవుల్లో వారణాసి కోసమే ట్రెక్కింగ్ కి వెళ్ళాడు. మరో రెండు రోజుల్లో అక్కడనుంచి రానున్నట్టుగా సమాచారం. ఇప్పటికే  కొంత భాగం షూటింగ్ ని పూర్తి చేసుకున్న వారణాసి వచ్చే ఏడాది ఏప్రిల్ 7 న రిలీజ్ కానున్న విషయం తెలిసిందే      
సినిమా అనే మూడు అక్షరాల వర్డ్ కి ఉన్న కెపాసిటీని తెలియచేస్తు ఇళయ దళపతి విజయ్ తమిళనాడు ఎన్నికల్లో తన పేరుకి తగ్గట్టుగానే విజయ పరపంపరని కొనసాగిస్తున్నాడు. సుమారు 100 స్థానాల్లో తన సత్తా  చాటుతు ఎగ్జిట్ పోల్స్ చెప్పిన లెక్కలన్నీ తారుమారు అని పాలిటిక్స్ లో కూడా హీరోనే అంటూ సింగిల్ సింహం అని ఇచ్చిన మాటని నిలబెట్టుకున్నాడు  ఇక విజయ్ ఎన్నికల్లో దూసుకుపోతుండటంతో త్రిష తిరుమల తిరుపతి ఏడుకొండల వాడి దర్శనం చేసుకోవడానికి వెళ్ళింది. విజయ్ సిఎంగా గెలిచాకే తిరుపతి నుంచి త్రిష బయలు దేరుతుందని సమాచారం. ఇక విజయ్ ముందంజలో ఉండటంతో అభిమానులతో పాటు సినీ అభిమానులు సంబరాల్లో మునిగిపోయారు. మరి విజయ్ తమిళనాడు ముఖ్యమంత్రి పీఠాన్ని అందుకుంటాడేమో చూడాలి. Also read:  Chandrabose: చంద్రబోస్ ఇంట్లో విషాదం.. ప్రముఖుల నివాళి   
  -ఆస్కార్ విన్నర్ చంద్రబోస్ ఇంట్లో విషాదం  -టిఫిన్ చేస్తుండగా హఠాన్మరణం  -అన్నమయ్య జిల్లా కలికిరిలో ఘటన  గేయ రచయితగా తెలుగు సినిమా పాటని ఆస్కార్ వేదికపై ఉంచిన సాహిత్య చక్రవర్తి చంద్రబోస్(Chandrabose). నిత్యం పాటకి పట్టాభిషేకం కట్టే పనిలో ఉండే చంద్రబోస్ ఇప్పుడు విషాద వదనంతో మునిగిపోయారు. ఆయన సోదరుడు రాజేంద్ర నిన్న ఉదయం ఏపిలోని అన్నమయ్య జిల్లా కలికిరిలో గుండెపోటుతో మరణించారు. శనివారం రోజే  ఆయన కలికిరికి వచ్చి తన స్నేహితుడు శ్రీనివాస్ నివాసంలో బస చేశారు. ఆదివారం ఉదయం స్వల్ప అస్వస్థతకి గురవ్వడంతో  సమీపంలోని ఆసుపత్రికి వెళ్లి చికిత్స  కూడా తీసుకోవడం జరిగింది. అనంతరం సమీపంలోని హోటల్‌లో టిఫిన్ చేస్తుండగా ఒక్కసారిగా తీవ్రమైన గుండెపోటు రావడంతో అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి, కుటుంబ సభ్యులకి సమాచారం అందించారు. రాజేంద్ర మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు చంద్రబోస్‌కు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నారు.  ఇక ఈ ఘటనతో చంద్రబోస్ తో పాటు ఆయన కుటుంబ సభ్యులు, సన్నిహితులు దిగ్భ్రాంతికి లోనయ్యారు. వృత్తిరీత్యా  రాజేంద్ర బెంగళూరులో స్థిరపడ్డారు. పూర్తి పేరు కనుకుంట్ల రాజేంద్ర.    
స్టార్ హీరోయిన్ సమంత (Samantha), దర్శకురాలు నందిని రెడ్డి కాంబినేషన్‌లో వస్తున్న రెండో చిత్రం ‘మా ఇంటి బంగారం’ (Maa Inti Bangaram). ‘ఓ బేబీ’ వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత వీరిద్దరూ కలిసి చేస్తున్న సినిమా కావడంతో దీనిపై మంచి అంచనాలు ఉన్నాయి. అయితే, ఈ సినిమా విషయంలో సమంత ఫ్యాన్స్ కి ఒక బ్యాడ్ న్యూస్. ‘మా ఇంటి బంగారం’ విడుదల తేదీలో మార్పు చోటుచేసుకుంది. ముందుగా ప్రకటించినట్టుగా మే 15న ఈ చిత్రం థియేటర్లలోకి రావడం లేదు. తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమాను జూలై నెలకు వాయిదా వేసినట్లు తెలుస్తోంది. దానికి పరోక్షంగా రామ్ చరణ్ కారణమని చెప్పవచ్చు. ప్రస్తుతం ఐపీఎల్ సీజన్ నడుస్తుండటంతో, ఆడియన్స్ మూడ్‌ను దృష్టిలో పెట్టుకుని మే 15 నుంచి పోస్ట్ పోన్ చేయాలని మేకర్స్ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అయితే జూన్ 4న విడుదల ప్లాన్ చేస్తున్నట్లు ఇటీవల వార్తలు వినిపించాయి. కానీ, రీసెంట్ గా జూన్ 4 తేదీపై  రామ్ చరణ్ ‘పెద్ది’ కర్చీఫ్ వేసింది. అలాగే జూన్ లో 'సింగ్ గీతం', 'లెనిన్' వంటి సినిమాలు కూడా ఉన్నాయి.  జూన్ నెలలో పలు చిత్రాలు లైన్‌లో ఉండటంతో, సోలో రిలీజ్ కోసం జూలై నెలను ఎంచుకున్నట్లు టాక్. సినిమాకు మంచి ఓపెనింగ్స్ రావాలంటే సరైన సమయం కావాలని, అందుకే జూలైలో విడుదల చేయాలని చిత్ర బృందం భావిస్తోంది. ఈ సినిమాలో సమంత ఒక సాధారణ గృహిణిగా కనిపిస్తూనే, తన కుటుంబాన్ని రక్షించుకునే క్రమంలో పవర్‌ఫుల్ యాక్షన్ సీక్వెన్స్‌లు చేయబోతున్నారు. సామ్ తన సొంత బ్యానర్ 'ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్' పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నందిని రెడ్డి-సమంత కాంబో మ్యాజిక్ మరోసారి రిపీట్ అవుతుందని ఫ్యాన్స్ ధీమాగా ఉన్నారు. జూలైలో సామ్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.  
రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) హీరోగా, దర్శకుడు నాగ్ అశ్విన్ (Nag Ashwin) తెరకెక్కించిన 'కల్కి 2898 AD' చిత్రం బాక్సాఫీస్ వద్ద వెయ్యి కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి సరికొత్త రికార్డులు సృష్టించింది. పార్ట్-1 క్లైమాక్స్‌లో ప్రభాస్‌ను 'కర్ణుడు'గా చూపించి నాగ్ అశ్విన్ ఇచ్చిన ట్విస్ట్ సీక్వెల్‌పై అంచనాలను ఆకాశానికి తీసుకెళ్లింది. ఇప్పుడు 'కల్కి 2'కి సంబంధించి అదిరిపోయే అప్డేట్ వచ్చింది. రేపటి (మే 4) నుంచి ఈ సీక్వెల్ షూటింగ్ లో ప్రభాస్ పాల్గొనబోతున్నట్లు సమాచారం. (Kalki Part 2) హైదరాబాద్ లో వేసిన భారీ సెట్ లో 'కల్కి 2' కీలక సన్నివేశాలను తెరకెక్కించనున్నారు. రేపు జరగబోయే నైట్ షెడ్యూల్‌లో ప్రభాస్ పాల్గొనబోతున్నారు. అమితాబ్ బచ్చన్,  కమల్ హాసన్ లపై ఇప్పటికే కొన్ని సీన్స్ తెరకెక్కించగా.. ప్రభాస్ మొదటిసారి 'కల్కి 2' షూటింగ్ లో పాల్గొంటుండడం విశేషం. పార్ట్-1 క్లైమాక్స్‌లో ప్రభాస్‌ను 'కర్ణుడి' అవతారంలో చూసిన ప్రేక్షకులకు, పార్ట్-2 లో ఆయన పాత్ర ఎలా ఉండబోతుందనే ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో షూటింగ్ ప్రారంభం కావడం ఫ్యాన్స్‌లో జోష్ నింపుతోంది. 'కల్కి 2' నుంచి దీపికా పదుకొణెను తొలగించిన విషయం తెలిసిందే. ఆమె స్థానంలో సాయి పల్లవి నటించే అవకాశముంది. 'కల్కి 2'తో పాటు ప్రస్తుతం ప్రభాస్ చేతిలో 'ఫౌజీ', 'స్పిరిట్' ఉన్నాయి. ఈ మూడు సినిమాల షూటింగ్ ను వీలైనంత త్వరగా పూర్తి చేసే ఆలోచనలో ప్రభాస్ ఉన్నట్లు సమాచారం.  
వేసవి కాలం వచ్చిందంటే ప్రతి ఇంట్లో కూలర్ల దుమ్ము దులిపి వాడటానికి సిద్దం చేస్తుంటారు.  అయితే చాలా మంది ఇబ్బంది పడే సమస్య కూలర్ నుండి దుర్వాసన రావడం.  కూలర్ ను శుభ్రం చేసి వాడటానికి సిద్దం చేసినా సరే.. కూలర్ ఉపయోగించేటప్పుడు కూలర్ లో నీరు చేపల వాసన వస్తూ ఉంటుంది. కొందరు కూలర్ నుండి వాసన వస్తూ ఉందనే కారణంతో దాన్ని ఆఫ్ చేస్తారు. అయితే కూలర్ ను వాడకుండా ఉండటం పరిష్కారం కాదు.  కూలర్ ట్యాంక్ లోని పాత నీరు,  నాచు, తేమ కారణంగా కూలర్ లో చేపల వాసన లాగా వస్తూ ఉంటుంది. ఈ సమస్యకు చాలా సులువుగా చెక్ పెట్టవచ్చు.  అందుకోసం అనుసరించాల్సిన చిట్కాలు ఏంటో తెలుసుకుంటే.. కూలర్ నుండి చేపల వాసన ఎందుకు వస్తుంది? కూలర్‌లో చేపల వాసన రావడానికి అత్యంత సాధారణ కారణం ట్యాంక్‌లో పేరుకుపోయిన బయోఫిల్మ్ , బ్యాక్టీరియా. ట్యాంక్‌లో నీరు ఎక్కువ సేపు నిలిచి ఉన్నప్పుడు, సూక్ష్మజీవులు వృద్ధి చెందడం ప్రారంభిస్తాయి. నిలిచిపోయిన నీరు బయోఫిల్మ్‌ను ఏర్పరుస్తుంది, ఇది వాసనకు కారణమవుతుంది.  అది మాత్రమే కాకుండా కూలర్‌లోని మురికి, దుమ్ము , తేమ కూడా ఈ వాసనకు కారణం అవుతాయి. వాసన ఎలా తొలగించాలంటే.. కూలర్ నుండి దుర్వాసనను తొలగించడానికి  వైట్  వెనిగర్‌ను ఉపయోగించవచ్చు. వైట్  వెనిగర్‌ను ఉపయోగించడం వల్ల కూలర్ నీటి నుండి వచ్చే చేపల వాసనను తొలగిపోతుంది. ఒకవేళ వైట్ వెనిగర్ లేకపోతే దానికి  ప్రత్యామ్నాయంగా బేకింగ్ సోడాను కూడా ఉపయోగించవచ్చు. వెనిగర్ అనేది దుర్వాసనకు కారణమయ్యే బ్యాక్టీరియాను చంపే ఒక సహజ క్రిమిసంహారకం. మొదటగా  కూలర్ ట్యాంక్‌ను ఖాళీ చేయాలి. ఆ తర్వాత, ట్యాంక్‌లో వెనిగర్ పోసి కాసేపు అలానే ఉంచాలి. తర్వాత, ట్యాంక్‌ను శుభ్రంగా రుద్దాలి. ఆ తర్వాత 2 నుండి 3 టీస్పూన్ల బేకింగ్ సోడా కలపాలి. ట్యాంక్ శుభ్రం చేయాలి. దీని తర్వాత ట్యాంక్‌ను నీటితో నింపాలి. దీనివల్ల కూలర్‌లోని దుర్వాసన పోతుంది. ఎసెంటియల్ ఆయిల్స్.. ట్యాంక్‌ను శుభ్రం చేసిన తర్వాత నీటిని నింపి ఆ  నీటిలో ఎసెంటియల్ ఆయిల్స్  ఉపయోగించవచ్చు. కూలర్ నీటిలో 2 నుండి 3 చుక్కల టీ ట్రీ ఆయిల్ లేదా లెమన్‌గ్రాస్ ఆయిల్ కలపాలి. ఇది కూలర్ నుండి స్వచ్ఛమైన గాలి ప్రవహించడానికి సహాయపడుతుంది. కూలర్‌లోని నీటిని ప్రతి 2 నుండి 3 రోజులకు మార్చితే కూలర్ నుండి దుర్వాసన రాదు. చాలా మంది కూలర్ లో  నీటి మట్టం తగ్గగానే ప్రతిరోజూ నీటిని అయితే నింపుతూ ఉంటారు. కానీ.. పూర్తీగా కూలర్ ట్యాంక్ ను క్లీన్ చేసి కొత్త నీటిని నింపుతూ ఉంటే కూలర్ నుండి వాసన అనేది రాదు.                                 *రూపశ్రీ.
భారతీయుల ఆహారంలో బెల్లం ప్రధాన పదార్థం. తీపి పదార్థాల తయారీ నుండి కూరలలో కూడా రుచి కోసం బెల్లం వాడుతూ ఉంటారు.  అయితే వేసవి కాలంలో బెల్లం విషయంలో పెద్ద సమస్య ఎదురవుతుంది. అదే బెల్లం జిగటగా మారడం.  గాలిలోని వేడి, తేమ కారణంగా బెల్లం తరచుగా కరిగి జిగటగా మారుతుంది. అంతేకాకుండా, కొన్నిసార్లు దానికి బూజు కూడా పడుతుంది. వేసవిలో ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. అయితే కొన్ని సింపుల్ చిట్కాలు పాటించడం వల్ల వేసవి కాలంలో కూడా బెల్లం తాజాగా, పొడిగా ఉండేలా చేయవచ్చు. ఆ చిట్కాలు ఏంటో తెలుసుకుంటే.. ఎయిర్ టైట్ కంటైనర్.. బెల్లానికి గాలి, తేమ అనేవి అతిపెద్ద శత్రువులు. అందువల్ల బెల్లాన్ని నిల్వ చేయడానికి ఎల్లప్పుడూ మంచి నాణ్యత గల ఎయిర్ టైట్ కంటైనర్ ను  ఉపయోగించాలి. వీలైతే గాజు లేదా స్టీల్‌తో చేసిన పాత్రను ఎంచుకోవాలి. ప్లాస్టిక్ పాత్రలలోకి తరచుగా తేమ చేరి, బెల్లం కరిగిపోతుంది. చిన్న ముక్కలు.. మార్కెట్  నుండి తెచ్చిన బెల్లం ముద్ద మొత్తాన్ని ఒకేసారి డబ్బాలో వేస్తుంటారు. అయితే ఈ పద్ధతిని మానుకోవాలి. బెల్లాన్ని నిల్వ చేసే ముందు చిన్న చిన్న ముక్కలుగా చేయాలి. దీనివల్ల  అవసరమైనంత మాత్రమే బయటకు తీయడం వీలవుతుంది. బెల్లం మొత్తం పదేపదే బయటి గాలికి గురికాకుండా సురక్షితంగా ఉంటుంది. అంతేకాదు.. అవసరైమనప్పుడల్లా  బెల్లాన్ని బయటకు తీసి దాన్ని ఏదైనా రాయి లేదా రాడ్ లాంటి దానితో కొట్టి చిన్న ముక్క తీసుకుని,  తిరిగి దాన్ని మళ్లీ కంటైనర్ లో పెట్టడం లాంటివి చేస్తుంటే బెల్లం తొందరగా మెత్తబడి జిగటగా మారుతుంది. నీరు, తడి చేతులకు దూరం.. ఇది చాలా చిన్న విషయమే అయినా చాలా ముఖ్యమైనది. హడావిడిలో బెల్లం తీయడానికి తడి చేతులను గానీ, తడి చెంచాను గానీ ఎప్పుడూ ఉపయోగించకూడదు. చిన్న నీటి చుక్క కూడా  బెల్లం డబ్బా మొత్తాన్ని జిగటగా మార్చి, దానిని పాడుచేస్తుంది. బెల్లం తీసేటప్పుడు ఎల్లప్పుడూ పూర్తిగా పొడి చెంచాను  లేదా పొడి చేతులను మాత్రమే వాడాలి. బియ్యం చిట్కా.. బియ్యం చిట్కా మన అమ్మమ్మల కాలం నుండి వస్తున్న ఒక పాత చిట్కా.. కానీ ఇది చాలా ప్రభావవంతమైన చిట్కా. కొద్దిగా  బియ్యాన్ని ఒక శుభ్రమైన పత్తి లేదా మస్లిన్ గుడ్డలో కట్టి,  బెల్లం నిల్వ చేసే పాత్ర అడుగున ఉంచాలి. ఆ బియ్యం పాత్రలోని అదనపు తేమను పీల్చుకుంటుంది, దీనివల్ల  బెల్లం పూర్తిగా పొడిగా ఉంటుంది. ఫ్రిజ్ లో నిల్వ.. వేసవిలో  విపరీతమైన వేడి, తేమ ఉంటే , బెల్లాన్ని బయట కాకుండా ఫ్రిజ్‌లో నిల్వ చేయవచ్చు. అయితే, దానిని నేరుగా డబ్బాలో ఉంచి నిల్వ చేయకూడదు. బెల్లం ముక్కలను జిప్-లాక్ బ్యాగ్‌లో లేదా శుభ్రమైన కాగితంలో గట్టిగా చుట్టి, ఆ తర్వాత వాటిని ఫ్రిజ్‌లోని ఎయిర్ టైట్ కంటైనర్ లో నిల్వ చేయాలి. ఇలా చేస్తే బెల్లం జిగటగా మారడం, కరగడం వంటివి జరగవు.                      *రూపశ్రీ.
ఒక్కసారి ఆలోచించండి.. ఉదయం నిద్రలేవగానే మీరు చూసే మొదటి ముఖం ఎవరిది? మీ భాగస్వామిదా లేక మీ మొబైల్ ఫోన్ స్క్రీనా? ఒకప్పుడు పక్కపక్కనే కూర్చుని మనసు విప్పి మాట్లాడుకునే వాళ్ళం, కానీ ఇప్పుడు పక్కనే ఉన్నా ఎవరి ఫోన్లలో వాళ్ళు బిజీగా ఉంటున్నాం. నేటి కాలంలో మొబైల్ ఫోన్ మన అందరికీ "మొదటి లైఫ్ పార్ట్నర్" (First Life Partner) గా మారిపోయింది. ఈ డిజిటల్ వ్యసనం వల్ల మన మధ్య ఉండాల్సిన క్వాలిటీ టైమ్ మాయమైపోతోంది. ఈ పరిస్థితిని మార్చుకుని, మళ్ళీ మన బంధాలను ఎలా చిగురింపజేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. మొబైల్ వాడకాన్ని ఎందుకు తగ్గించాలి? (Why Should We?) మొబైల్ పక్కన పెట్టి మనుషులతో గడపడం ఎందుకు ముఖ్యం అంటే: సరైన నిర్ణయాలు తీసుకోవడానికి: ముఖాముఖి మాట్లాడుకున్నప్పుడే ఒక విషయంపై చర్చించి సరైన నిర్ణయం (Decision making) తీసుకోగలం. గౌరవం ఇవ్వడం: ఎదుటి వ్యక్తి మాట్లాడుతున్నప్పుడు ఫోన్ చూసుకోకుండా ఉండటం కనీస గౌరవం. బంధం బలపడటానికి: వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య లేదా ఫ్యామిలీ మధ్య క్వాలిటీ టైమ్ గడపడం వల్ల అనుబంధం పెరుగుతుంది. ఏమి చేయకూడదు? (What Not To Do?) మనకు తెలియకుండానే చేసే ఈ తప్పులు బంధాలను దూరం చేస్తున్నాయి: మొదటి ప్రాధాన్యత ఇవ్వకండి: ఫోన్ కంటే ముందు మనిషికి ప్రాధాన్యత ఇవ్వాలి. ఫోన్ ఫస్ట్ లైఫ్ పార్ట్నర్ కాకూడదు. మధ్యలో మాట్లాడకండి: ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకుంటున్నప్పుడు మధ్యలో అకస్మాత్తుగా ఫోన్ కాల్ వస్తే అక్కడి నుండి వెళ్ళిపోవడం లేదా గట్టిగా మాట్లాడటం చేయకూడదు. దీనివల్ల అవతలి వాళ్ళు చిన్నబుచ్చుకుంటారు. ముఖ్యమైన సందర్భాల్లో వాడొద్దు: పెళ్లి చూపులు వంటి ముఖ్యమైన చర్చల్లో పాల్గొన్నప్పుడు మొబైల్స్ చూస్తూ కూర్చోవడం వల్ల వచ్చిన అసలు ఉద్దేశమే మర్చిపోయే ప్రమాదం ఉంది. ముందుకు వెళ్ళే మార్గం - చిట్కాలు (How-To Points): మొబైల్ వ్యసనం నుండి బయటపడటానికి ఈ చిన్న మార్పులు చేయండి: సెల్ఫ్ డిసిప్లిన్ (Self-discipline): మొబైల్ వాడకం విషయంలో మనకు మనమే ఒక క్రమశిక్షణ విధించుకోవాలి. సైలెంట్ మోడ్‌లో పెట్టండి: ఎవరితోనైనా క్వాలిటీ టైమ్ గడుపుతున్నప్పుడు లేదా రెస్టారెంట్లకు వెళ్ళినప్పుడు ఫోన్‌ను సైలెంట్ మోడ్‌లో పెట్టి దూరంగా ఉంచండి. ముందే చెప్పండి: ఎవరైనా ఇంపార్టెంట్ వ్యక్తులు ఉంటే, వారికి "నేను ఒక గంట పాటు బిజీగా ఉంటాను, తర్వాత కాల్ చేస్తాను" అని మెసేజ్ పెట్టి మీ క్వాలిటీ టైమ్‌ను ఆస్వాదించండి. పరస్పర అంగీకారం: భార్యాభర్తలు ఇద్దరూ కలిసి "మనం బయటికి వెళ్ళినప్పుడు మొబైల్స్ వాడొద్దు" అని ఒక రూల్ పెట్టుకోవాలి. ఎవరైనా వాడితే రెండో వ్యక్తి నిర్మొహమాటంగా గుర్తు చేయాలి. ప్రశ్నలు - సమాధానాలు (Q&A): ప్రశ్న: బోర్ కొట్టినప్పుడు మొబైల్ చూడటం తప్పా? సమాధానం: బోర్ కొట్టినప్పుడు ఫోన్ చూడటం సహజమే, కానీ ఎదురుగా ఒక మనిషి ఉన్నప్పుడు వారిని వదిలేసి ఫోన్ చూస్తూ కూర్చోవడం సరైన పద్ధతి కాదు. ఇది గౌరవం మరియు కామన్ సెన్స్ (Common sense) కి సంబంధించిన విషయం. ప్రశ్న: ఫోన్ వాడొద్దు అని చెబితే అవతలి వారు కోప్పడితే ఏం చేయాలి? సమాధానం: ఇది కోప్పడాల్సిన విషయం కాదు. "మనం ఈ సమయాన్ని సరదాగా గడపడానికి వచ్చాం, కాసేపు ఫోన్ పక్కన పెడదాం" అని సున్నితంగా చెప్పడం అలవాటు చేసుకోవాలి. మొబైల్ ఫోన్ అనేది మన అవసరానికి మాత్రమే, మన జీవితం అవ్వకూడదు. మన కళ్ళ ముందు ఉన్న మనుషుల కంటే, ఆ స్క్రీన్ లో కనిపించే ప్రపంచం ముఖ్యం కాదు. కాబట్టి, నేటి నుండే మీ మొబైల్‌ను కాసేపు పక్కన పెట్టి మీ ప్రియమైన వారితో ఆనందంగా గడపండి. అది మీ సెల్ఫ్ డిసిప్లిన్ మీద మాత్రమే ఆధారపడి ఉంటుంది. మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం మా Naveena Column యూట్యూబ్ ఛానెల్‌ని సందర్శించండి! సబ్స్క్రైబ్ చేసుకోండి.
సాధారణంగా తాంబూలం వేసుకోవడం అనేది మన సంప్రదాయంలో ఒక భాగం. కానీ, ఆ తాంబూలానికి కొన్ని ప్రత్యేకమైన ఆయుర్వేద మూలికలను జత చేస్తే, అది గుండెను రక్షించే ఒక అద్భుతమైన ఔషధంగా మారుతుందని మీకు తెలుసా? హార్ట్ ఎటాక్ ప్రమాదాన్ని తగ్గించడంలో ఈ 'ఆయుర్వేద పాన్' అద్భుతంగా పనిచేస్తుంది. గుండె రక్తనాళాల్లో అడ్డంకులను (Blockages) తొలగించి, గుండెపోటు రాకుండా కాపాడే ప్రత్యేక ఆయుర్వేద పాన్/తాంబూలం తయారీ విధానం మరియు దాని ప్రయోజనాలు ఈ వీడియోలో చూడండి. ఈ వీడియోలో గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరిచే హార్ట్ స్పెషల్ తాంబూలం తయారీని వివరించారు: ఈ ఆయుర్వేద తాంబూలానికి కావలసినవి: తమలపాకు: ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది మరియు ఔషధ గుణాలను రక్తంలోకి త్వరగా చేరుస్తుంది. అర్జున చెట్టు బెరడు చూర్ణం: గుండె పనితీరును మెరుగుపరచడంలో ఇది అగ్రగామి. వెల్లుల్లి: రక్త నాళాల్లో పేరుకుపోయిన కొవ్వును (Cholesterol) కరిగించి, అడ్డంకులను తొలగిస్తుంది. అల్లం లేదా సొంఠి: రక్త ప్రసరణను సాఫీగా చేస్తుంది. దాల్చిన చెక్క: రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. ఎలా తీసుకోవాలి? వీడియోలో చూపిన విధంగా, తమలపాకులో ఈ మూలికలను సరైన మోతాదులో ఉంచి, తాంబూలంలా చప్పరిస్తూ తీసుకోవాలి. ఇది రక్తాన్ని పల్చగా ఉంచి, గడ్డకట్టకుండా (Blood Clots) చేయడంలో సహాయపడుతుంది. ప్రయోజనాలు: గుండె రక్తనాళాల్లో బ్లాకేజీలు ఏర్పడకుండా నిరోధిస్తుంది. చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి, గుండె కండరాలను దృఢంగా మారుస్తుంది. అధిక రక్తపోటు (BP) సమస్యను అదుపులో ఉంచుతుంది. శరీరంలోని వ్యర్థాలను తొలగించి జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.   మరిన్ని ఆరోగ్య సూచనలు మరియు పరిష్కారాల కోసం మా యూట్యూబ్ ఛానెల్ "TeluguOne Health" ను సందర్శించి సబ్‌స్క్రైబ్ చేయండి! సూచన: ఇది కేవలం సమాచారం కోసం మాత్రమే. తీవ్రమైన గుండె సమస్యలు ఉన్నవారు వైద్యుల సలహా మేరకు మాత్రమే వీటిని ప్రయత్నించాలి.
వేసవి వాతావరణం శరీరాన్ని అలసటకు గురి చేయడమే కాకుండా, జీర్ణక్రియ , శక్తి పై కూడా ప్రభావం చూపుతుంది. ఆయుర్వేదం ప్రకారం, ఆరోగ్యకరమైన శరీరం , మనస్సును కాపాడుకోవడానికి వేసవి కాలంలో ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టడం చాలా ముఖ్యం. ఎందుకంటే వేసవిలో పిత్త తత్వం మరింత చురుకుగా ఉంటుంది, ఇది కడుపులో మంట, జీర్ణ సమస్యలు , అలసటకు దారితీస్తుంది. అందువల్ల, ఆయుర్వేదం కొన్ని రకాల ఆహారాలను తినమని , మరికొన్నింటిని తినకుండా ఉండమని సిఫార్సు చేస్తుంది. ఆయుర్వేదం చెప్పిన తినాల్సిన, తినకూడని ఆహారాలు ఏంటో తెలుసుకుంటే.. వేసవిలో ఏం తినాలి? వేసవిలో శరీరం బాగా వేడెక్కి, పిత్త దోషం పెరుగుతుంది. అందువల్ల, తేలికైన, చల్లని ఆహారాలు తినడం చాలా అవసరం. కర్బూజా, పుచ్చకాయ, మామిడి వంటి తాజా పండ్లు శరీరాన్ని చల్లబరిచి, కోల్పోయిన నీటిని తిరిగి అందిస్తాయి. చల్లని పాలు , పెరుగు శరీరాన్ని చల్లబరుస్తాయి. జీర్ణ వ్యవస్థను సమతుల్యం చేస్తాయి. పీచుపదార్థాలు అధికంగా ఉండే సలాడ్‌లు , తేలికపాటి కూరగాయలు జీర్ణక్రియను సులభతరం చేసి, కడుపులో వేడి అసమతుల్యతను నివారిస్తాయి. చల్లని జ్యూస్‌లు , కొబ్బరి నీరు సహజ ఎలక్ట్రోలైట్‌లను అందించి, శరీరాన్ని తేమగా ఉంచుతాయి. వేసవిలో ఏం తినకూడదు? వేసవిలో వేయించిన , బరువైన ఆహారాలకు దూరంగా ఉండాలి,  అవి జీర్ణక్రియను నెమ్మదింపజేసి, కడుపులో వేడిని పెంచుతాయి. అందుకే ఈ ఆహారాలకు దూరంగా ఉండాలి. అధిక మసాలాలు గల వంటకాలతో పాటు, కాఫీ , టీ వంటి కెఫిన్ పానీయాలు,  అధిక నూనె లేదా తీపి పదార్థాలు పిత్త దోషాన్ని పెంచి, శరీరాన్ని అసమతుల్యం చేస్తాయి. వేసవిలో కెఫిన్‌కు వీలైనంత దూరంగా ఉండాలి. ఇవి గుర్తుంచుకోవాలి.. రోజులో ఎక్కువసార్లు కొద్దికొద్దిగా ఆహారం తీసుకోవడం జీర్ణక్రియకు సహాయపడి, శక్తిని నిలుపుతుంది.   శరీరం చల్లగా, ఆరోగ్యంగా ఉండాలంటే, తేలికైన, నీరు అధికంగా ఉండే ఆహారానికి ప్రాధాన్యత ఇవ్వాలి.   చల్లని పదార్థాలను తీసుకోవడం వల్ల పైత్యరసం అదుపులో ఉండి, వేసవిలో అలసట , చికాకును నివారిస్తుంది.                                *రూపశ్రీ.  
మలబద్ధకం (Constipation) సమస్యకు ప్రధాన కారణాలు, లక్షణాలు మరియు సులభమైన ఆయుర్వేద గృహ చిట్కాల గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకోండి. నేటి కాలంలో మారుతున్న ఆహారపు అలవాట్లు, పని ఒత్తిడి మరియు జీవనశైలి కారణంగా చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్య మలబద్ధకం (Constipation). దీనినే తెలుగులో 'మలబద్ధకం' అని కూడా అంటారు. ఇది కేవలం ఒక సమస్య మాత్రమే కాదు, సకాలంలో దీనిని నివారించకపోతే ఇతర తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారితీసే అవకాశం ఉంది. ఈ వీడియోలో మలబద్ధకం గురించి పూర్తి సమాచారాన్ని నిపుణులు వివరించారు: మలబద్ధకం రావడానికి ప్రధాన కారణాలు: ఆహారంలో పీచు పదార్థం (Fiber) తక్కువగా ఉండటం. శరీరానికి సరిపడా నీరు తాగకపోవడం. సరైన సమయానికి ఆహారం తీసుకోకపోవడం.  శారీరక శ్రమ లేకపోవడం లేదా రోజంతా కూర్చుని పనిచేయడం. మానసిక ఒత్తిడి మరియు నిద్రలేమి. లక్షణాలు: వారానికి మూడు సార్లు కంటే తక్కువ మలవిసర్జన జరగడం. కడుపు ఉబ్బరంగా ఉండటం మరియు గ్యాస్ సమస్యలు. మల విసర్జన సమయంలో తీవ్రమైన నొప్పి లేదా ఇబ్బంది కలగడం. ఆకలి మందగించడం. ఆయుర్వేద గృహ చిట్కాలు (Home Remedies): మలబద్ధకాన్ని వదిలించుకోవడానికి ఆయుర్వేదంలో అద్భుతమైన మార్గాలు ఉన్నాయి. ఈ వీడియోలో సూచించిన కొన్ని ముఖ్యమైన చిట్కాలు: త్రిఫల చూర్ణం: ప్రతిరోజూ రాత్రి పడుకునే ముందు గోరువెచ్చని నీటిలో త్రిఫల చూర్ణం కలిపి తీసుకోవడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ఆముదం (Castor Oil): తక్కువ మోతాదులో ఆముదాన్ని పాలలో కలిపి తీసుకోవడం వల్ల విరేచనం సాఫీగా అవుతుంది.  పండ్లు మరియు కూరగాయలు: పీచు పదార్థం ఎక్కువగా ఉండే ఆకుకూరలు, బొప్పాయి మరియు అరటిపండ్లను ఆహారంలో భాగం చేసుకోవాలి.  నీరు: రోజుకు కనీసం 3-4 లీటర్ల నీరు తాగడం వల్ల శరీరం డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉంటుంది.  మలబద్ధకం సమస్య నుండి శాశ్వత ఉపశమనం పొందడానికి మరియు ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థను పెంపొందించుకోవడానికి ఈ వీడియోలో చెప్పిన సూచనలను తప్పక పాటించండి. మరిన్ని ఆరోగ్య సూచనలు మరియు పరిష్కారాల కోసం మా యూట్యూబ్ ఛానెల్ "TeluguOne Health" ను సందర్శించి సబ్‌స్క్రైబ్ చేయండి!