Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...పుదుచ్చేరి సీఎం రంగస్వామి విజయం
posted on: May 4, 2026 12:16PM

కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల ఫలితాలలో ఎన్డీఏ కూటమి ప్రభంజనం సృష్టిస్తోంది. ఈ ఎన్నికల్లో వెలువడిన తొలి ఫలితంతో సీఎం ఎన్.రంగస్వామి విజయకేతనం ఎగురవేశారు. తట్టంచావడి నియోజకవర్గం నుంచి ఆయన భారీ మెజారిటీతో విజయం సాధించారు. ఆయన పోటీ చేసిన మరో స్థానమైన మంగళంలోనూ భారీ ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
మొత్తం 30 అసెంబ్లీ స్థానాలు ఉన్న పుదుచ్చేరిలో ఓట్ల లెక్కింపు ప్రారంభం నుంచి బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి ఏకపక్ష ఆధిక్యాన్ని ప్రదర్శిస్తోంది. ఎన్డీయే కూటమి 22 స్థానాలలో, కాంగ్రెస్ కూటమి ఆరు స్థానాలలో ఇతరులు ఒక స్థానంలో కొనసాగుతున్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ 16 కాగా, బీజేపీ కూటమి 22 స్థానాల్లో ముందంజలో ఉంది.



.webp)


